WPL 2023: Smriti Mandhana's one run cost RCB Rs 2.72 lakh - Sakshi
Sakshi News home page

Smriti Mandhana: డబ్ల్యూపీఎల్‌లో చేసిన ఒక్కో పరుగు విలువ 2.28 లక్షలు

Published Wed, Mar 22 2023 4:17 PM | Last Updated on Wed, Mar 22 2023 5:12 PM

WPL 2023: Smriti Mandhana Costed RCB 2 Lakh 72 Thousand Rupees Per Run - Sakshi

డబ్ల్యూపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా (రూ. 3.4 కోట్లు) రికార్డు నెలకొల్పిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మంధన.. ప్రస్తుత సీజన్‌లో చేసిన ఒక్కో పరుగు విలువ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. డబ్ల్యూపీఎల్‌-2023లో మంధన సాధించిన పరుగుల ప్రకారం​ ఆమె ఒక్కో పరుగు విలువ రూ. 2. 28 లక్షలవుతుంది.

ఈ సీజన్‌లో ఆమె ఆడిన 8 మ్యాచ్‌ల్లో 18.62 సగటున, 111.19 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఒక్కటంటే ఒక్క అర్ధసెంచరీ కూడా లేకపోగా ఓ సారి డకౌట్‌ కూడా అయ్యింది. మంధన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (37) గుజరాత్‌ జెయింట్స్‌పై నమోదు చేసింది. ఆమె ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు స్పిన్నర్ల చేతిలో ఔటై, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తానెంత పూరో నిరూపించుకుంది.  

కాగా, డబ్ల్యూపీఎల్‌-2023 సీజన్‌ తుది దశకు చేరింది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు, 1.856 రన్‌రేట్‌), ముంబై ఇండియన్స్‌ (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు, 1.711 రన్‌రేట్‌), యూపీ వారియర్జ్‌ (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు, -0.200 రన్‌రేట్‌) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు, -1.137 రన్‌రేట్‌), గుజరాత్‌ జెయింట్స్‌ (8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు, -2.220 రన్‌రేట్‌) ఫ్రాంచైజీలు లీగ్‌ను ఎలిమినేట్‌ అయ్యాయి.

మార్చి 24న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌.. ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా, ఈ మ్యాచ్‌లో విన్నర్‌ మార్చి 26న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement