వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఓటమిపాలైంది. శుక్రవారం యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటములకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది.
మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన స్మృతి మంధాన.. ''గత నాలుగు మ్యాచ్‌లుగా ఇదే జరుగుతుంది. ప్రతీ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికి.. ఆ తర్వాత వికెట్లు కోల్పోతున్నాం. ఇది మ్యాచ్‌లపై ప్రభావం చూపిస్తోంది. మా గేమ్ ప్లాన్ సరిగా లేకపోవడంతోనే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాం. ఈ ఓటములకు పూర్తి బాధ్యత నాదే.
ఒక బ్యాటర్‌గా నేను పూర్తిగా ఫెయిలవుతున్నా. టాపార్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. ఓటములతో గడిచిన వారం మాకు కఠినంగా అనిపించింది. నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్‌గా ఉంటుంది.. కానీ నా నమ్మకం ఏంటంటే ఒక్కరమే ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకోవడమే'' అని చెప్పుకొచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ వుమెన్స్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సోఫి డివైన్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో ఎసెల్‌స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హేలీ (47 బంతుల్లో 96 నాటౌట్, 18 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించగా.. దేవికా వైద్య 36 పరుగులతో సహకరించింది.
Stay strong, captain! Let’s turn it around. 🙌#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/LRvv9pXaAi
— Royal Challengers Bangalore (@RCBTweets) March 10, 2023
చదవండి: Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది..
41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు
Comments
Please login to add a commentAdd a comment