
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఆర్‌సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ వుమెన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కనికా అహుజా 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా గెలవగా.. రిచా ఘోష్ 31 నాటౌట్, హెథర్‌నైట్ 24 పరుగులు చేశారు.
ఆఖర్లో కనికా అహుజా ఔట్ అయినప్పటికి రిచా ఘోష్ జట్టును గెలిపించింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హారిస్, దేవికా వైద్య తలా ఒక వికెట్ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. హారిస్ గ్రేస్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీప్తి శర్మ 22, కిరణ్ నవగిరె 22 పరుగులు చేశారు.
ఆర్‌సీబీ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా శోభన, సోఫీ డివైన్‌లు చెరొక రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్ ఫలితాలపై మాత్రమే ఆర్‌సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment