
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ లీగ్ మ్యాచ్‌లకు ఆఖరిరోజు. నేటితో లీగ్ మ్యాచ్‌లు ముగియనున్న వేళ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉపయోగం లేని మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఏంచుకుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్, యూపీ వారియర్జ్‌లు ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్‌సీబీ, గుజరాత్‌లు ఎలిమినేట్ అయ్యాయి.
ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్‌సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. గత మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆర్‌సీబీ ముంబైతో మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సోఫీ డివైన్‌పై మరోసారి దృష్టి నెలకొంది.
మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టాప్‌ప్లేస్‌తో లీగ్ దశను ముగియాలని చూస్తుంది. ఇక తొలి రౌండ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్ వుమెన్: యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నటాలీ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్.
ఆర్‌సీబీ వుమెన్: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, ఆశా శోభన, మేగన్ షుట్, ప్రీతి బోస్
🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @RCBTweets.
— Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023
Follow the match ▶️ https://t.co/BQoiFCRPhD#TATAWPL | #RCBvMI pic.twitter.com/AfbXXSf7la