
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్‌సీబీ వుమెన్ ఆటతీరు ఏమాత్రం మారడం లేదు. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడిన ఆర్‌సీబీ వుమెన్ తమ బ్యాటింగ్ మెరుపులు ఒక్కదానికే పరిమితం అన్నట్లుగా తయారయ్యింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.
గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు. మిగతావారు బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ వుమెన్ బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీయగా.. నట్-సివర్ బ్రంట్, ఇసీ వాంగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సయికా ఇషాకీ ఒక వికెట్ తీసింది.
Comments
Please login to add a commentAdd a comment