హర్మన్‌ ప్రీత్‌ డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ సాధిస్తుందని ముందే ఊహించాడు..! | Harmanpreet Winning First WPL Title For MI Was Predicted Thrice | Sakshi
Sakshi News home page

WPL 2023: హర్మన్‌ ప్రీత్‌ గ్రేట్‌నెస్‌ను ముందే ఊహించాడు..!

Published Tue, Mar 28 2023 8:31 PM | Last Updated on Tue, Mar 28 2023 8:31 PM

Harmanpreet Winning First WPL Title For MI Was Predicted Thrice - Sakshi

ప్రిడిక్షన్స్‌ అనేవి క్రికెట్‌లో సర్వసాధారణం. ఆటగాళ్లు, జట్ల ఫామ్‌ను బట్టి ఏ ఆటగాడు రాణిస్తాడో, ఏ జట్టు గెలుస్తుందో ముందే ఊహించడం పరిపాటిగా మారింది. కొందరేమో వారి అనుభవం వల్ల ఏ ఆటగాడు సెంచరీ కొడతాడో, ఏ ఆటగాడు ఎక్కువ వికెట్లు పడగొడతాడో పక్కాగా చెప్పేస్తుంటారు. ఇటీవలకాలంలో కొందరు ఆటగాళ్లు గతంలో సోషల్‌మీడియా వేదికగా చేసిన కొన్ని పోస్ట్‌లు వైరలయ్యాయి. ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ గతంలో ఎప్పుడో చేసిన ట్వీట్లు, ప్రస్తుతం ఆటగాళ్ల గణాంకాలతో మ్యాచ్‌ అవుతుండటం ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది.

తాజాగా ఇలాంటి ప్రిడిక్షనే ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతోంది. భారత మహిళా క్రికెట్‌ జట్టు సారధి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మహిళల ఐపీఎల్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌కు అందిస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు గ్రీన్‌ స్టోన్‌ చాలారోజుల ముందే పసిగట్టాడు. హౌజ్జాట్‌ అనే పుస్తకంలో గ్రీన్‌స్టోన్‌ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొద్దిరోజుల కిందట హర్మన్‌.. ముంబై ఇండియన్స్‌కు డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ అందించడంతో ఈ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

గ్రీన్‌స్టోన్‌ వెర్షన్‌పై క్రికెట్‌ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఐ ముందే వ్యవస్థలను మేనేజ్‌ చేసిందని కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటే, మరికొందరేమో హర్మన్‌కు ఆ టాలెంట్‌ ఉండింది కాబట్టి ముంబైను ఛాంపియన్‌గా నిలబెట్టగలిగిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, డబ్ల్యూపీఎల్‌-2023 ఫైనల్లో ముంబై ఇండియన్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించి తొట్టతొలి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement