WPL 2023: Mumbai Indians Women Vs UP Warriorz Eliminator Match - Sakshi
Sakshi News home page

WPL 2023: డబ్ల్యూపీఎల్‌ ఎలిమినేటర్‌.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?

Published Fri, Mar 24 2023 7:35 AM | Last Updated on Fri, Mar 24 2023 8:38 AM

WPL 2023: Mumbai Indians Women Vs UP Warriorz Eliminator Match - Sakshi

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ఈరోజు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ జట్టుతో అలీసా హీలీ కెప్టెన్సీలోని యూపీ వారియర్స్‌ జట్టు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడనుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఇటు బ్యాటింగ్‌, అటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. హర్మన్‌తో పాటు హీలీ మాథ్యూస్‌, యస్తిక భాటియా, స్కీవర్‌ బ్రంట్‌, అమేలియా కెర్ర్‌ , పూజా వస్త్రాకర్‌ రూపంలో టాప్‌ ఆటగాళ్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సైకా ఇషాఖ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అలీసా హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్‌ తహిలా మెక్‌గ్రాత్‌, సోఫియా ఎకెల్‌స్టోన్‌పై ఎక్కువ ఆధారపడుతోంది.

చదవండి: ఐపీఎల్‌పై రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు

అభిమానులను పిచ్చోళ్లను చేశారు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement