WPL 2023 MI Vs UPW: Mumbai Indians Beat UP Warriorz By 8 Wickets 4th Win, Check Details - Sakshi
Sakshi News home page

WPL 2023 MI Vs UPW: వారెవ్వా హర్మన్‌.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం

Published Mon, Mar 13 2023 10:01 AM | Last Updated on Mon, Mar 13 2023 11:47 AM

WPL 2023: Mumbai Indians Beat UP Warriorz By 8 Wickets 4th Win - Sakshi

ముంబైకి వరుసగా నాలుగో విజయం (PC: WPL)

UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం.

కాగా... టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్‌ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్‌), తాలియా మెక్‌గ్రాత్‌ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది.

యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్‌), నట్‌ సీవర్‌ (31 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (33 బంతుల్లో 53 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) యూపీ బౌలర్లను ధనాధన్‌ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది.   

చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్‌.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్‌
Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement