WPL 2023- Delhi Capitals In Finals- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించగా... ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై గెలిచింది.
పాపం ముంబై.. మరో మ్యాచ్‌లో
ఢిల్లీ, ముంబై 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ (1.856) ‘టాపర్’గా నిలిచి ఫైనల్ చేరింది. మరో ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే ఏకైక ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై తలపడుతుంది.
ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాలియా (58 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అలైస్ క్యాప్సీ (3/26) ఆకట్టుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ క్యాప్సీ
క్యాప్సీ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), మరిజాన్ కాప్ (34 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), లానింగ్ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై తో మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమె లియా కెర్ (3/22) రాణించింది. ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. అమెలియా కెర్ (31 నాటౌట్; 4 ఫోర్లు), యస్తిక (30; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు.
చదవండి: Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్, ఉమ్రాన్ మాలిక్‌కు ఛాన్స్!
SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు
The first-ever team to make it to the 𝗙𝗜𝗡𝗔𝗟 of #TATAWPL 🙌
— Women's Premier League (WPL) (@wplt20) March 22, 2023
The @DelhiCapitals are ready to roar 🔥🔥 pic.twitter.com/LZclWYNH8J
Comments
Please login to add a commentAdd a comment