హ్యాట్రిక్ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ వుమెన్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ వుమెన్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 15 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. యస్తికా బాటియా 41, హేలీ మాథ్యూస్ 32 పరుగులతో రాణించారు. ఇక నట్‌సివర్ బ్రంట్ 23 నాటౌట్, హర్మన్ 11 నాటౌట్ జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది.
తొలి వికెట్ డౌన్.. విజయం దిశగా ముంబై ఇండియన్స్
106 పరుగుల స్వల్ప చేధనలో భాగంగా ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులతో దాటిగా ఆడుతున్న యస్తికా బాటియా తారా నోరిస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 22 పరుగులతో ఆడుతుంది.
దూకుడు ప్రదర్శిస్తున్న ముంబై.. 4 ఓవర్లలో 33/0
106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దూకుడు ప్రదర్శిస్తుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. యస్తికా బాటియా 14, హేలీ మాథ్యూస్ 17 పరుగులతో ఆడుతున్నారు.
105 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 105 పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. జెమీమా రోడ్రిగ్స్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో సైకా ఇషాకీ, ఇసీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్ ఒక వికెట్ పడగొట్టింది.
కుప్పకూలిన ఢిల్లీ ఇన్నింగ్స్.. 85 పరుగులకే ఏడు వికెట్లు
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది.
4 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/1
4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 10 పరుగులు, కాప్సీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
షఫాలీ వర్మ క్లీన్‌బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 2 పరుగులు చేసిన షఫాలీ వర్మ సయికా ఇషాకీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగింది. 2 ఓవర్లలో జట్టు స్కోరు వికెట్ నష్టానికి 8 పరుగులుగా ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వుమెన్, ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇరుజట్ల మధ్య టఫ్‌ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టాప్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్
ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI): హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
Comments
Please login to add a commentAdd a comment