ఏంటి మోర్గాన్‌.. జట్టు మొత్తం ఓకే.. మరి నీ పరిస్థితి! | Fans Trolls KKR Captain Eoin Morgan Consecutive Failures As Batsman | Sakshi
Sakshi News home page

Eoin Morgan: ఏంటి మోర్గాన్‌.. జట్టు మొత్తం ఓకే.. మరి నీ పరిస్థితి!

Published Sat, Oct 2 2021 4:36 PM | Last Updated on Sat, Oct 2 2021 5:25 PM

Fans Trolls KKR Captain Eoin Morgan Consecutive Failures As Batsman - Sakshi

Courtesy: IPL Twitter

KKR Captain Eoin Morgan Failure As Batsman.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఐపీఎల్‌లో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా మోర్గాన్‌ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఐపీఎల్‌ తొలి అంచె పోటీల్లో అంతంతమాత్రమే ప్రదర్శన నమోదు చేసిన కేకేఆర్‌.. రెండో ఫేజ్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. సెకండ్‌ఫేజ్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన కేకేఆర్‌ ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఓడిపోయింది. ఇదే సమయంలో మోర్గాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తు‍న్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 7,8,0,2 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక గోల్డెన్‌ డక్‌ ఉండడం కూడా విశేషం.

చదవండి: IPL 2021: షమీ సూపర్‌ త్రో.. డెబ్యూ మ్యాచ్‌లోనే రనౌట్‌


Courtesy: IPL Twitter

అంతేగాక అశ్విన్‌తో మోర్గాన్‌ గొడవ ఐపీఎల్‌లో హైలెట్‌గా మారింది. తప్పు ఎవరిదన్నది పక్కనపెడితే.. వీరిద్దరి గొడవపై ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. కాగా మోర్గాన్‌ ఆటతీరుపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ విపరీతమైన ట్రోల్స్‌ చేశారు. ముందు గొడవల పడడం ఆపి నీ ఆటతీరుపై దృష్టి పెట్టు.. ఏంటిది మోర్గాన్‌.. జట్టుకు నాయకత్వం వరకు బాగానే ఉంది.. కానీ నీ ఆట పరిస్థితి ఏంటి.. అంటూ కామెంట్స్‌ చేశారు. కేకేఆర్‌ ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠిలు కేకేఆర్‌కు మెరుపు ఆరంభాలనిస్తూ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆఖరిలో ఓడిపోయింది. 

చదవండి: KL Rahul: అది క్లియర్‌గా ఔట్‌.. థర్డ్ అంపైర్‌పై మండిపడ్డ గంభీర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement