ఐపీఎల్ 16వ సీజన్‌లో మూడో స్థానం బ్యాటింగ్ ఆర్‌సీబీకి అచ్చి రావడం లేదు. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఆర్‌సీబీ ఆటగాడు డకౌట్ లేదా పది పరుగుల లోపే వెనుదిరగడం గమనార్హం. ఇప్పటివరకు సీజన్‌లో ఆర్‌సీబీ పది మ్యాచ్‌లు ఆడగా.. వరుసగా ఏడుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ప్లేయర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
ఆర్‌సీబీ తరపున మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ రెండుసార్లు సున్న పరుగుల వద్ద ఔట్ కాగా, మహిపాల్ లామ్రోర్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక షాబాజ్ అహ్మద్ రెండుసార్లు రెండు పరుగులు చేసి ఔటవ్వగా.. అనూజ్ రావత్ 9,6 పరుగులు చేసి వెనుదిరిగాడు.
అంతకముందు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఈ స్థానంలో కోహ్లి ఎక్కువగా వచ్చేవాడు. అయితే కొన్నేళ్లుగా కోహ్లి ఓపెనర్‌గా వస్తుండడంతో మూడో స్థానంలో వస్తున్న బ్యాటర్లు విఫలమవుతూ వస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు.. ''ఏం చేద్దామంటవ్ మరి''.. మూడో స్థానం బ్యాటింగ్‌ను లేపేద్దామా'' అంటూ సరదాగా కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment