Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఐదు పరుగులు మాత్రమే చేసి బెహండార్ఫ్ బౌలింగ్‌లో కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన హుడా 6.9 సగటుతో కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు.
ఇలా ఫామ్‌లో లేని ఆటగాడు అసలు జట్టులో ఆడడమే వ్యర్థం. అలాంటిది కైల్ మేయర్స్ లాంటి స్టార్ ఓపెనర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసి అతని స్థానంలో దీపక్ హుడాకు ఓపెనర్‌గా ప్రమోషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. అసలు కృనాల్ పాండ్యా ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది.
వాస్తవానికి కైల్ మేయర్స్ ఈ సీజన్‌లో మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేసిన మేయర్స్ ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. మేయర్స్ జోరుతో డికాక్ తుదిజట్టులోకి రాలేకపోయాడు. అయితే కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడంతో డికాక్‌కు అవకాశం వచ్చింది.
ఇద్దరు కలిసి లక్నోకు రెండు మ్యాచ్‌ల్లో మంచి శుభారంబాలు అందించారు.ప్లేఆఫ్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మేయర్స్‌ను పక్కనబెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతనికి గాయం అనుకున్నా.. మరి కృనాల్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేయడమేంటని వాపోయారు.
ఈ నేపథ్యంలో పలు చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. ఐపీఎల్‌లో 10 కంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడి అత్యంత చెత్త బ్యాటింగ్ యావరేజ్ మూటగట్టుకున్న ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఈ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 6.90 సగటు నమోదు చేశాడు. హుడా తర్వాత నికోలస్ పూరన్ 2021లో 7.73, 2016లో మళ్లీ దీపక్ హుడా 10.29, 2021లో ఇయాన్ మోర్గాన్ 11.08 సగటు నమోదు చేశారు.
ఇక ఐపీఎల్‌లో దీపక్ హుడా తను ఎదుర్కొన్న తొలి 10 బంతుల వ్యవధిలో ఓటవ్వడం ఇది ఏడోసారి.. ఈ క్రమంలో సాహాతో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆండ్రీ రసెల్, రోహిత్ శర్మ, సునీల్ నరైన్‌లు ఆరేసి సార్లు ఔటయ్యారు.
Two in two for Behrendorff 🔥
— OneCricket (@OneCricketApp) May 16, 2023
Deepak Hooda fails yet again!#LSGvMI #IPL2023 #LucknowSuperGiants pic.twitter.com/8bkggkEvTK
Ireland basher Deepak hooda in IPL 2023
— , (@AltofLeg) May 16, 2023
Inning - 11
Run - 69
Average - 6 🤢
Strike rate - 89 🤧
this fraud played ahead of Shreyas Iyer in T20 worldcup 😶 pic.twitter.com/JjZ8ONzaMD
Comments
Please login to add a commentAdd a comment