Ashish Nehra Not Happy Even Gill Century, GT Enters Play-Offs - Sakshi
Sakshi News home page

#AshishNehra: గిల్‌ సెంచరీ చేసినా.. గుజరాత్‌ గెలిచినా; నెహ్రాలో కనిపించని సంతోషం

Published Tue, May 16 2023 7:00 PM | Last Updated on Tue, May 16 2023 7:23 PM

Ashish Nehra Not Happy Even Gill Century-GT Enters Play-Offs Reason Here - Sakshi

Photo: IPL Twitter

గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా సోమవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్‌ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో గిల్‌ సెంచరీ చేసినప్పటికి.. గుజరాత్‌ గెలిచినప్పటికి నెహ్రా మొహంలో మాత్రం సంతోషం కనిపించలేదు. అందుకు కారణం గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ ఆఖర్లో కుప్పకూలడమేనంట. తొలి ఇన్నింగ్స్‌ అనంతరం కెప్టెన్‌ పాం‍డ్యాతో ఆశిష్‌ నెహ్రా  డగౌట్‌లో నిలబడి సీరియస్‌గా చర్చించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వాస్తవానికి ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. సాహా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్‌-సాయికిషోర్‌లు వేగంగా ఆడుతూ రెండో వికెట్‌కు 14 ఓవర్లలోనే 147 పరుగులు జోడించారు. వీరి దూకుడు చూసి గుజరాత్‌ స్కోరు ఈజీగా 220-240 మధ్య ఉంటుందని భావించారు.

కానీ సీన్‌ మొత్తం రివర్స్‌ అయిపోయింది. సెంచరీ కోసం గిల్‌ మెళ్లగా ఆడడం.. అదే సమయంలో చివరి ఆరు ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. అందులో నాలుగు వికెట్లు చివరి ఓవర్లో పోగొట్టుకోవడం గుజరాత్‌ బ్యాటింగ్‌ వీక్‌నెస్‌ను బయటపెట్టింది. 

ఇదే నెహ్రా కోపానికి కారణమయింది. గిల్‌ 58 బంతుల్లో సెంచరీ మార్క్‌ చేసి ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించినప్పటికి నెహ్రా అభినందించకపోవడం కెమెరాలకు చిక్కింది. అంతేకాదు సాయికిషోర్‌, పాండ్యాలు ఔటయ్యాకా గుజరాత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలడంపై నెహ్రా సీరియస్‌ అయ్యాడు.  

బ్యాటింగ్‌ విఫలంపై పాండ్యాతో చాలాసేపు చర్చించాడు. ఎందుకంటే నెహ్రా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు. ప్లేఆఫ్‌ చేరే క్రమంలో ప్రతీ మ్యాచ్‌ ముఖ్యం.. అందునా ఎస్‌ఆర్‌హెచ్‌ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు కాబట్టే నెహ్రా అంత ఆగ్రహానికి లోనయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ సీజన్‌లో ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది. అయితే ఇలాంటి బ్యాటింగ్‌తో టైటిల్‌ కొట్టలేమని పాండ్యాతో నెహ్రా అన్నట్లు తెలిసింది. అయితే పాండ్యా కూడా తమ బ్యాటింగ్‌ ఫెయిల్యూర్‌పై దృష్టి పెడుతామని నెహ్రాకు వివరించినట్లు తెలుస్తోంది.

చదవండి: 'చెప్పి మరి సిక్సర్‌ కొట్టడం సంతోషంగా అనిపించింది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement