Spin bowling
-
‘మిస్టర్ మేధావి’
సాక్షి క్రీడా విభాగం : భారత్, ఆ్రస్టేలియా మధ్య అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుకు రెండు రోజుల ముందు అశ్విన్ మైదానానికి వెళ్లాడు. తనకు తెలిసిన ఒక మీడియా మిత్రుడిని పిలిచి అంతకుముందు అక్కడ జరిగిన షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ వీడియోలు ఎక్కడైనా దొరుకుతాయా అని అడిగాడు. స్పిన్నర్ లాయిడ్ పోప్ ఆ మ్యాచ్‌లో చెలరేగడాన్ని గుర్తు చేస్తూ పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని తెలుసుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఒక టెస్టు మ్యాచ్ కోసం అశ్విన్ చేసే సన్నద్ధత ఇది. ఇలా సిద్ధం కావడం అశ్విన్ కెరీర్లో ఇది మొదటిసారేమీ కాదు. తాను ఆటలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రతీ సిరీస్‌కు, ప్రతీ మ్యాచ్‌కు, ప్రతీ ఓవర్‌కు, ప్రతీ బంతికి కొత్త తరహాలో వ్యూహరచన చేయడం అతనికే చెల్లింది. ఆటపై అసాధారణ పరిజ్ఞానం, చురుకైన బుర్ర, భిన్నంగా ఆలోచించే తత్వం అతడిని అగ్ర స్థానానికి చేర్చాయి. సాంప్రదాయ ఆఫ్‌స్పిన్‌లో అత్యుత్తమ నైపుణ్యం మాత్రమే కాకుండా క్యారమ్ బాల్, ఆర్మ్ బాల్ అతని ఆయుధాలుగా ప్రత్యర్థి బ్యాటర్లను పడగొట్టాయి.స్పిన్ బౌలింగ్‌కు సైన్స్‌ను జోడిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇంజినీరింగ్ చదివిన అశ్విన్ నిరూపించాడు. అశ్విన్ చేతికి బంతి ఇస్తే చాలు... భారత కెపె్టన్‌కు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అతడికి నమ్మి బౌలింగ్ అప్పగిస్తే ఇక గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా ఉండవచ్చనేది వారి భావన. ఆరంభంలోనే బ్యాటర్లను కట్టడి చేయాలన్నా, భారీ భాగస్వామ్యాలను విడదీయాలన్నా, ఓటమి దిశగా వెళుతున్న సమయంలో కూడా రక్షించాలన్నా అశ్విన్ ఆపన్నహస్తం సిద్ధంగా ఉండేది! అశ్విన్ తెలివితేటలు టీమిండియాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. తన బౌలింగ్ విషయంలోనే కాదు నాయకుడికి ఒక మంత్రిలా అండగా నిలవడంలో అతనికి అతనే సాటి. ఎన్నో ప్రణాళికల్లో, వ్యూహాల్లో అశ్విన్ భాగస్వామి. ఆటపై అతని సునిశిత పరిశీలన, వైవిధ్యమైన ఆలోచనాశైలితో ఎన్నోసార్లు అతను మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు పతనానికి కారకుడయ్యాడు. దురదృష్టవశాత్తూ సుదీర్ఘ కెరీర్లో ఒక్కసారి కూడా భారత్‌కు సారథిగా వ్యవహరించే అవకాశం రాకపోవడం మాత్రం ఒక లోటుగా ఉండిపోయింది. పైగా ఇంత గొప్ప కెరీర్ తర్వాత ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండా, ఘనమైన ముగింపు లేకుండా అతను తన ఆఖరి ఆట ఆడేయడం కూడా కాస్త చివుక్కుమనిపించేదే. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్ అయిపోగా, కెరీర్ చివర్లో వరుస వైఫల్యాలతో హర్భజన్ సింగ్ ఇబ్బంది పడుతున్న దశలో అశ్విన్ కెరీర్ మొదలైంది. ముందుగా ఐపీఎల్, ఆపై వన్డే, టి20ల్లో ప్రదర్శనతో అందరి దృష్టిలో పడినా... తర్వాతి రోజుల్లో టెస్టు బౌలర్‌గా తన ముద్ర వేయగలిగి∙అరుదైన ఆటగాళ్లలో ఒకడిగా అతను నిలిచాడు. 2011లో ఆడిన తొలి టెస్టులోనే 9 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా మొదలైన అతని ఆట అద్భుత కెరీర్‌కు నాంది పలికింది. తొలి 16 టెస్టుల్లోనే 9సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం అశ్విన్ స్థానాన్ని సుస్థిరం చేసింది. 2016–17 సీజన్లో నాలుగు సిరీస్‌లలో కలిపి 13 టెస్టుల్లో ఏకంగా 82 వికెట్లు పడగొట్టడం అశ్విన్ కెరీర్లో ఉచ్ఛదశ. ఒకటా, రెండా... ఎన్నో గుర్తుంచుకోదగ్గ గొప్ప ప్రదర్శనలు అతని స్థాయిని పెంచాయి. అశ్విన్ బంతులను ఎదుర్కోలేక ఉత్తమ బ్యాటర్లు కూడా పూర్తిగా తడబడి చేతులెత్తేసిన రోజులు ఎన్నో! స్టీవ్ స్మిత్, విలియమ్సన్, రూట్, డివిలియర్స్, అలిస్టర్ కుక్, డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, మైకేల్ క్లార్క్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, బెన్ స్టోక్స్...అశ్విన్ ముందు తలవంచిన ఇలాంటి బ్యాటర్ల జాబితా చాలా పెద్దది. స్వదేశంలో అసాధారణ ఘనతల మధ్య అతడిని విమర్శించేందుకు కొందరు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ( ఉNఅ) దేశాల్లో అతని ప్రదర్శనను చూపిస్తుంటారు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన లేకపో యినా అతని బౌలింగ్ మరీ పేలవంగా ఏమీ లేదు. ఆయా పరిస్థితులను బట్టి తనకు తక్కువ అవకాశాలు వచ్చాయని (26 టెస్టులే ఆడాడు)... తన రికార్డును సవరించే అవకాశం కూడా ఎక్కువగా దక్కలేదని దీనిపై అశ్విన్ చెప్పుకున్నాడు. »ౌలింగ్కు తోడు అశ్విన్ బ్యాటింగ్ నైపుణ్యం అతడిని ఆల్‌రౌండర్ స్థాయికి చేర్చింది. ‘అండర్–17 స్థాయినుంచి నేను అశ్విన్‌తో కలిసి ఆడాను. అప్పట్లో అతను ఓపెనర్. కొన్నాళ్ల విరామం తర్వాత మేం తమిళనాడు జట్టు నుంచి అశ్విన్ అనే బౌలర్ అద్భుత గణాంకాలు చూసి అతను ఇతను వేరు అనుకున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన అశ్విన్ బ్యాటర్ మాత్రమే. టెస్టు ఆటగాడిగా మనం ఎన్నో మంచి బ్యాటింగ్ ప్రదర్శనలు చూశాం. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అని రోహిత్ బుధవారం గుర్తు చేసుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా ఎదగక ముందు ఉన్న ఆ అనుభవం భారత జట్టుకు కూడా కీలకంగా పనికొచి్చంది. టెస్టుల్లో ఎందరో బౌలర్లకు సాధ్యం కాని రీతిలో నమోదు చేసిన 6 సెంచరీలు అసాధారణ ప్రదర్శన. ఇటీవల బంగ్లాదేశ్‌తో చెన్నైతో జరిగిన టెస్టులో భారత్ 144/6 వద్ద ఉన్నప్పుడు చేసిన శతకం అతని బ్యాటింగ్ విలువను చూపించింది.2019 సిడ్నీ టెస్టులో తనను కాదని కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంతో పాటు విదేశాల్లో ఇతనే మా ప్రధాన స్పిన్నర్ అంటూ కోచ్ రవిశాస్త్రి చెప్పిన మాట అశ్విన్‌ను అప్పట్లో తీవ్రంగా బాధించింది. దానిని అతను ఆ తర్వాత చాలాసార్లు గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాదాపు అదే తరహా అనుభవాన్ని ఎదుర్కొంటూ మరొకరికి అవకాశం ఇవ్వకుండా తనంతట తానే రిటైర్మెంట్ను ప్రకటించాడు. -
India vs England: ఇంట్లోనే తలవంచారు
సొంతగడ్డపై మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ ఆధిక్యం... ప్రత్యర్థి జట్టులో పెద్దగా గుర్తింపు లేని స్పిన్నర్లు... 231 పరుగుల స్వల్ప లక్ష్యం... అయినా సరే... భారత జట్టు అనూహ్య రీతిలో ఓటమిని ఆహ్వానించింది... ఇంగ్లండ్ బౌలర్లకు తలవంచుతూ పేలవ బ్యాటింగ్‌తో కుప్పకూలింది. నాలుగో రోజు పిచ్‌పై స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తడబడుతూ మన బ్యాటర్లు డిఫెన్స్ ఆడటం గతంలో ఎన్నడూ చూడనిది. కానీ తొలి టెస్టులో అలాంటి దృశ్యమే కనిపించింది. చివరకు హైదరాబాద్‌లో పరాజయం పలకరించింది. రెండో ఇన్నింగ్స్ ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకునే లోపే ఐదుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు... ఎదురుగా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ బలగం... వీటన్నింటిని దాటి సాగిన ఒలీ పోప్ అత్యద్భుత ఇన్నింగ్స్ ఇంగ్లండ్‌కు ఆశలు రేపింది. ఆపై భారత్‌ను నిలువరించగలమా అనే సందేహాల మధ్య టామ్ హార్లీ నేనున్నానంటూ వచ్చాడు. తొలి బంతికి సిక్సర్ ఇచ్చి కెరీర్ మొదలు పెట్టిన అతను చివరి వికెట్ సహా 7 వికెట్లు తీసి సూపర్ అనిపించాడు. టెస్టులో రెండు రోజుల పాటు వెనుకబడి కూడా ఆఖరికి అసలైన ఆటతో ఇంగ్లండ్ జట్టు విదేశీ గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఊహించని విధంగా గట్టి దెబ్బ తగిలింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నాలుగో రోజే ముగిసిన తొలి టెస్టులో టీమిండియాకు ఓటమి ఎదురైంది. పలు మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 69.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ రోహిత్ శర్మ (58 బంతుల్లో 39; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి టెస్టు ఆడిన ఎడంచేతి వాటం స్పిన్నర్ టామ్ హార్లీ 62 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం విశేషం. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 316/6తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఒలీ పోప్ (278 బంతుల్లో 196; 21 ఫోర్లు) త్రుటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో జరుగుతుంది. చేజారిన డబుల్ సెంచరీ... నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సమయమే పట్టింది. రేహన్ అహ్మద్ (53 బంతుల్లో 28; 3 ఫోర్లు)ను బుమ్రా వెనక్కి పంపినా... పోప్ జోరు తగ్గలేదు. అతనికి టామ్ హార్లీ (52 బంతుల్లో 34; 4 ఫోర్లు) అండగా నిలవడంతో కీలక భాగస్వామ్యం నమోదైంది. ఈ దశలోనే వీరిద్దరిని నిలువరించడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. పోప్, హార్లీ ఎనిమిదో వికెట్‌కు 80 పరుగులు జోడించడం విశేషం. ఎట్టకేలకు ఒకే స్కోరు వద్ద హార్లీ, వుడ్ (0)లను భారత్ అవుట్ చేయగా... బుమ్రా బౌలింగ్‌లో ర్యాంప్షాట్కు ప్రయత్నించి పోప్ డబుల్ సెంచరీని చేజార్చుకోవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఆదివారం ఇంగ్లండ్ 25.1 ఓవర్లు ఆడి 104 పరుగులు చేసింది. పేలవ బ్యాటింగ్‌తో... ఛేదనను కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ (15) మెరుగ్గానే ఆరంభించారు. అయితే ఒకే ఓవర్లో యశస్వి, శుబ్‌మన్ గిల్ (0)లను అవుట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టిన హార్లీ... కొద్దిసేపటికే రోహిత్‌ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ కష్టాల్లో పడింది. టీ విరామం తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు మరింతగా పట్టు బిగించి టీమిండియా బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. ఫలితంగా 12 పరుగుల వ్యవధిలో అక్షర్ పటేల్ (17), కేఎల్ రాహుల్ (22) వెనుదిరగ్గా, ఒకే స్కోరు వద్ద రవీంద్ర జడేజా (2), శ్రేయస్ అయ్యర్ (13) అవుటయ్యారు. అనవసరపు సింగిల్‌కు ప్రయతి్నంచిన జడేజాను అద్భుతమైన త్రోతో స్టోక్స్ రనౌట్ చేయగా... శ్రేయస్ మళ్లీ చెత్త షాట్‌తో నిష్క్రమించాడు. ఈ దశలోనే భారత్ ఓటమి ఖాయమైనట్లుగా అనిపించింది. అయితే కోన శ్రీకర్ భరత్ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు), రవిచంద్రన్ అశి్వన్ (84 బంతుల్లో 28; 2 ఫోర్లు) పట్టుదలగా పోరాడి విజయంపై ఆశలు రేపారు. చివర్లో ఉత్కంఠ... భరత్, అశి్వన్ జత కలిసే సమయానికి భారత్ స్కోరు 119/7... విజయానికి మరో 112 పరుగులు కావాలి. ఈ సమయంలో వీరిద్దరు గట్టిగా నిలబడ్డారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఒత్తిడి పెరగడంతో ఇంగ్లండ్ బౌలర్లు, ఫీల్డర్లలో తడబాటు కనిపించింది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జత చేశారు. మరో 55 పరుగులు అవసరం. ఈ స్థితిలో హార్లీ చక్కటి బంతితో భరత్‌ను బౌల్డ్ చేసి భాగస్వామ్యాన్ని విడదీయగా... తప్పనిసరి పరిస్థితుల్లో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అశ్విన్ వెనుదిరిగాడు. ఈ వికెట్ పడిన తర్వాత ఫలితం కోసం నిబంధనల ప్రకారం అంపైర్లు అరగంట ఆటను పొడిగించారు. చివరి వికెట్‌కు కొన్ని షాట్లతో సిరాజ్ (12), బుమ్రా (6 నాటౌట్) కూడా 25 పరుగులు జోడించడంతో మరో 29 పరుగులే మిగిలాయి. ఆదివారం మరో ఓవర్ మిగిలి ఉండగా... దీనిని ఆడుకుంటే ఆట చివరి రోజుకు వెళ్లేది. కానీ రెండో బంతికి సిరాజ్ స్టంపౌట్ కావడంతో భారత్ కథ ముగిసింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 246 ఆలౌట్; భారత్ తొలి ఇన్నింగ్స్: 436 ఆలౌట్; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 420 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హార్లీ 39; యశస్వి (సి) పోప్ (బి) హార్లీ 15; గిల్ (సి) పోప్ (బి) హార్లీ 0; రాహుల్ (ఎల్బీ) (బి) రూట్ 22; అక్షర్ (సి అండ్ బి) హార్లీ 17; శ్రేయస్ (సి) రూట్ (బి) లీచ్ 13; జడేజా (రనౌట్) 2; భరత్ (బి) హార్లీ 28; అశి్వన్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 28; బుమ్రా (నాటౌట్) 6; సిరాజ్ (స్టంప్డ్) ఫోక్స్ (బి) హార్లీ 12; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1–42, 2–42, 3–63, 4–95, 5–107, 6–119, 7–119, 8–176, 9–177, 10–202. బౌలింగ్: రూట్ 19–3– 41–1, వుడ్ 8–1–15–0 హార్లీ 26.2–5–62–7 లీచ్ 10–1–33–1, రేహన్ 6–0–33–0. -
స్పిన్ మ్యాజిక్ అంటే ఇదేనేమో.. జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ స్పిన్ బౌలర్ చార్లీ నాట్ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్భేన్ హీట్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్‌కు చార్లీ నాట్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన నాట్ (రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్).. నాలుగో బంతికి సోఫియా డంక్లీను క్లీన్ బౌల్డ్ చేసి, బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులంతా అవాక్కయ్యేలా చేసింది. అక్కడెక్కడో ఆఫ్ వికెట్ అవతల పడ్డ బంతి గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటు వేయడంతో (మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌కు) ఆశ్చర్యపోవడం అందరివంతైంది. బ్యాటర్ అలాగే బంతిని చూస్తూ నిశ్చేష్టురాలిగా మిగిలిపోయింది. బంతి అంతలా మెలికలు తిరుగుతూ మాయ చేయడంతో బౌలర్ ముఖంలోనూ వింతహావభావాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు స్పిన్ మాయ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నాట్ వేసిన బంతిని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ద సెంచరీతో పోలుస్తున్నారు. మొత్తానికి స్పిన్ మ్యాజిక్కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Spin 🤯pic.twitter.com/AD2DRB3mYM — CricTracker (@Cricketracker) October 27, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్భేన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రిస్భేన్ ఇన్నింగ్స్‌లో జార్జియా వాల్ (48 నాటౌట్), చార్లీ నాట్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లు సదర్‌ల్యాండ్, క్యాప్సీ తలో 2 వికెట్లు.. కిమ్ గార్త్, ఇల్లింగ్‌వర్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 48 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది. అలైస్ క్యాప్సీ (44 నాటౌట్) పోరాడుతుంది. బ్రిస్భేన్ బౌలర్లలో చార్లీ నాట్, నికోలా హ్యాంకాక్, జెస్ జోనాస్సెన్, సారా గ్లెన్ తలో వికెట్ పడగొట్టారు. -
అశ్విన్-జడేజాల ముంగిట వరల్డ్ రికార్డు.. మరో 3 వికెట్లు తీస్తే..!
భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్ ద్వయం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్‌ల్లో 49 మ్యాచ్‌ల్లో 498 వికెట్లు పడగొట్టారు. వీరికి ముందు భారత మాజీ స్పిన్ ద్వయం అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్ 54 మ్యాచ్‌ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్‌తో నేటి మ్యాచ్‌లో అశ్విన్-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ పెయిర్ జేమ్స్ ఆండర్సన్-స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్‌ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్ వార్న్-గ్లెన్ మెక్‌గ్రాత్ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్‌ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (75), తేజ్‌నరైన్ చంద్రపాల్ (33), కిర్క్ మెక్కెంజీ (32), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20), జాషువ డిసిల్వ (10) ఔట్ కాగా.. అలిక్ అథనేజ్ (37), జేసన్ హోల్డర్ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్ కుమార్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్ (80), జడేజా (61), అశ్విన్ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, వార్రికన్ చెరో 3 వికెట్లు.. హోల్డర్ 2, గాబ్రియల్ ఓ వికెట్ పడగొట్టారు. -
'ఓవల్‌లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది'
జూన్ ఏడు నుంచి ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. 2019-21 డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో రచించనున్న ప్రణాళికలపై చర్చించాడు.'' ఓవల్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. వాస్తవానికి యూకేలోని బెస్ట్ బ్యాటింగ్ కండిషన్ పిచ్ అయిన ఓవల్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని అంటారు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భారత్‌లో ఉండే పిచ్ కండీషన్లా ఉంటుందేమోనని చిన్నపాటి భయం కూడా ఉంది. నాకు తెలిసి టీమిండియా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక అంచనాకు వచ్చాం. డబ్యూటీసీ(వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్) అనేది మంచి ఆలోచన. ఎంత సంప్రదాయ క్రికెట్ అయినా ఒక పోటీ ఉంటేనే మజా ఉంటుంది. డబ్ల్యూటీసీ టైటిల్ అందుకోవాలన్న కాంక్షతో ప్రతీ జట్టు తమ శాయాశక్తులా మ్యాచ్‌లను గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అటు టీమిండియా.. ఇటు మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాం. ఇక వచ్చే వారంలోపు టెస్టు ఛాంపియన్ ఎవరనేది తేలనుంది. ఇక మ్యాచ్‌కు వచ్చే అభిమానుల్లో ఆస్ట్రేలియన్ల కంటే టీమిండియా అభిమానులే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నా. మ్యాచ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా 1-2 తేడాతో టెస్టు సిరీస్‌ను టీమిండియాకు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం 2-1తో చేజెక్కించుకుంది. ఇక ఐపీఎల్లో పాల్గొనని స్టీవ్ స్మిత్ ఇటీవలే ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు. కౌంటీల్లో ఆడడం ద్వారా మంచి ప్రాక్టీస్ దొరికిందని.. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు యాషెస్ సిరీస్‌కు కూడా సన్నద్దమైనట్లు ఇటీవలే స్మిత్ ట్విటర్లో తెలిపాడు. చదవండి: త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి -
అంతా బాగానే ఉంది.. ఆ బలహీనతను అధిగమిస్తే తిరుగుండదు
ఐపీఎల్ 16వ సీజన్లో హ్యారీ బ్రూక్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయడంతో పాటు డెబ్యూ ఐపీఎల్ ఆడుతున్న బ్రూక్‌కు ఇదే తొలి సెంచరీ. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్న హ్యారీ బ్రూక్ ఆటపై అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సెంచరీ మాట అటుంచితే ఒక్క విషయంలో మాత్రం బ్రూక్ వెనుకబడ్డాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పిన్ ఆడడంలో తెగ ఇబ్బంది పడ్డాడు. పేస్ బౌలర్లను ఉతికారేసిన బ్రూక్ స్పిన్నర్ల బౌలింగ్‌లో మాత్రం కాస్త స్లోగా ఆడాడు. పేసర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 258 ఉంటే.. స్పిన్నర్ల బౌలింగ్‌లో అతని స్ట్రైక్‌రేట్ 117గా ఉండడం గమనార్హం. ఒకవేళ వచ్చే మ్యాచ్‌ల్లో బ్రూక్ స్పిన్ ఆడడంపై దృష్టి పెడితే అతనికి తిరుగుండదు. ఎలాగూ పేసర్ల బౌలింగ్‌ను చీల్చిచెండాడుతున్నాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. టెస్టు మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్నప్పటికి ఒక్కసారి కుదురుకున్నాడంటే ఔట్ చేయడం చాలా కష్టం. పరిస్థితులు అలవాటు పడేవరకు ఏ క్రికెటర్‌కైనా పరుగులు చేయడం కాస్త ఇబ్బందే. హ్యారీ బ్రూక్ ఆ ఫేజ్‌ను అనుభవించాడు. ప్రస్తుతం దాని నుంచి బయటపడ్డాడు. ఫలితం.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో మెరిసి విమర్శకుల నోళ్లు మూయించాడు. చదవండి: 'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Border-Gavaskar Trophy 2023: ‘మా వద్దా స్పిన్ అస్త్రాలు ఉన్నాయి’
బెంగళూరు: భారత గడ్డపై టెస్టు సిరీస్ అంటే స్పిన్ బౌలింగ్ ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలుసు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా ఎలా పరుగులు సాధిస్తుందనేది ఆసక్తికరం. అయితే మరోవైపు తమ స్పిన్ కూడా బలమైందేనని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నమ్ముతున్నాడు. ఈ నెల 9 నుంచి బోర్డర్–గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్ శనివారం మీడియాతో మాట్లాడాడు. తమ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని, భిన్నమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కమిన్స్ అన్నాడు. ఈ సిరీస్‌లో నాథన్ లయన్ ఆసీస్ ప్రధానాస్త్రం కాగా, ఇతర స్పిన్నర్లు అతనికి అండగా నిలవనున్నారు. ‘మా జట్టులోనూ ఆఫ్‌స్పిన్నర్, లెగ్‌స్పిన్నర్, లెఫ్టార్మ్ పేసర్... ఇలా భిన్నమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే పరిస్థితులను బట్టి 20 వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలింగ్ బృందాన్నే ఎంచుకుంటాం. నాగపూర్‌లో తొలి టెస్టు సమయానికే స్పష్టత వస్తుంది’ అని కమిన్స్ చెప్పాడు. తమ స్పిన్నర్లపై మేనేజ్మెంట్కు గట్టి నమ్మకం ఉందని అతను వెల్లడించాడు. ‘ఆస్టన్ అగర్ మంచి ప్రతిభావంతుడు. గత రెండు విదేశీ పర్యటనల్లో ఆడిన స్వెప్సన్కు అనుభవం వచ్చింది. మర్ఫీ కూడా గత సిరీస్ ఆడాడు. ట్రవిస్ హెడ్ కూడా మంచి ఆఫ్‌స్పిన్ వేయగలడు. కాబట్టి వీరంతా లయన్‌కు సహకరించగలరు’ అని ఆసీస్ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. అయితే స్పిన్‌పై చర్చలో తమ పేస్ బౌలర్ల పదును గురించి ఎవరూ చర్చించడం లేదని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ‘అన్ని పరిస్థితుల్లోనూ సత్తా చాటగల పేస్ బౌలర్లు మాకు ఉన్నారు. పేస్‌కు పెద్దగా సహకరించని సిడ్నీ పిచ్‌లపై కూడా వారు చెలరేగారు. గత భారత పర్యటనలో రాంచీ టెస్టులో నేను మంచి ప్రదర్శన కనబర్చడం మరచిపోలేను. ఈసారి నాపై మరింత బాధ్యత ఉంది’ అని కంగారూ టీమ్ సారథి పేర్కొన్నాడు. మరోవైపు వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తొలి టెస్టు ఆడే అవకాశాలు మెరుగవుతున్నాయి. తాజా సన్నాహక శిబిరంలో అతను బాగా బౌలింగ్ చేశాడని, బ్యాటింగ్‌లో కొంత అసౌకర్యంగా ఉన్నా... మ్యాచ్ సమయానికి కోలుకుంటే తుది జట్టులో స్థానం ఖాయమని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించాడు. గ్రీన్ టీమ్‌లోకి వస్తే అదనపు స్పిన్నర్‌ను ఆడించేందుకు ఆసీస్‌కు అవకాశం ఉంటుంది. ‘రివర్స్ స్వింగ్’ పని చేస్తుంది: క్యారీ భారత్‌లో స్పిన్ బౌలింగ్ ప్రభావం గురించే అంతా మాట్లాడుతున్నారని, అయితే రివర్స్ స్వింగ్ తమను ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ అభిప్రాయపడ్డాడు. 2018లో ఆసీస్ ‘ఎ’ తరఫున ఇక్కడ ఆడినప్పుడు స్పిన్ కోసం సిద్ధమైతే భారత పేసర్లు రివర్స్ స్వింగ్‌తో తమను పడగొట్టారని గుర్తు చేసుకున్నాడు. బుమ్రా, పంత్‌లాంటి ఆటగాళ్లు లేక ప్రస్తుత భారత జట్టు కొంత బలహీనంగా కనిపిస్తోందని, కొద్దిగా కష్టపడితే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ గెలిచే అవకాశం ఉందని మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ వ్యాఖ్యానించాడు. టీమిండియా కోహ్లిపై అతిగా ఆధారపడుతోందన్న చాపెల్... ఖాజా, లబుషేన్లాంటి ఆటగాళ్లకు ఇది అతి పెద్ద పరీక్షగా అభివర్ణించాడు. -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం
టీమిండియాతో టీ20 సిరీస్ ముందు క్రికెట్ ఐర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్-బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు నాథన్ హౌరిట్జ్ ఐర్లాండ్ నియమించింది. హౌరిట్జ్ ఆస్ట్రేలియా తరపున 17 టెస్టులు, 58 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హౌరిట్జ్ మూడు ఫార్మాట్లలో 128 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ జట్లకు హౌరిట్జ్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా అతడు బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల తరపున ఆడాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత హౌరిట్జ్ క్వీన్స్‌ల్యాండ్ ఫైర్, బ్రిస్బేన్ హీట్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూన్ 26న తొలి టీ20 జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్..! -
కోచ్ అనే పదానికి అర్థం మారుస్తున్న ద్రవిడ్.. వీడియో వైరల్
Head Coach Rahul Dravid Turns Spinner For Team India During Practice.. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా అవతారం ఎత్తినప్పటి నుంచి టీమిండియా ప్రాక్టీస్‌లో వైవిధ్యత కనిపిస్తుంది. ఇంతవరకు జట్టు హెడ్‌కోచ్ అంటే దగ్గరుండి పర్యవేక్షిస్తాడు అని మాత్రమే ఉండేది. ద్రవిడ్ మాత్రం ఆ మాటకు అర్థాన్ని మార్చేసి కోచ్‌గా తనదైన ముద్ర చూపిస్తున్నాడు. కోచ్‌గా కాస్త కఠినంగా కనిపించే ద్రవిడ్.. క్రమశిక్షణ విషయంలోనూ అంతే కచ్చితంగా ఉంటాడు. ఇక నవంబర్ 25 నుంచి న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు జరగనున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్‌లో స్పీడ్ పెంచింది. ప్రాక్టీస్‌లో భాగంగా స్పిన్నర్ అవతారమెత్తిన ద్రవిడ్ బ్యాట్స్‌మెన్‌కు బంతులు విసరడం వైరల్‌గా మారింది. చదవండి: T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన టీమిండియా దానికి బదులు తీర్చుకోవాలని చూస్తుంది. రహానే సారధ్యంలోని టీమిండియా జట్టు కొత్తగా కనిపిస్తుంది. కోహ్లి, రోహిత్, షమీ, బుమ్రా లాంటి సీనియర్లు గైర్హాజరీలో.. టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఇక కేఎల్ రాహుల్ గాయంతో సిరీస్ నుంచి వైదొలగడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం పూర్తిస్థాయి టెస్టు టీమ్‌తో బరిలోకి దిగనుంది. చదవండి: ICC T20 Rankings: విరాట్ కోహ్లి ఔట్.. కేఎల్ రాహుల్ ఒక్కడే View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
'వరల్డ్‌కప్ ఉంది.. ప్రతీ విషయాన్ని భూతద్దంలో చూడడం ఆపండి'
కొలంబొ: క్రికెట్లో మిస్టరీ స్పిన్నర్ అనే పదం చాలాసార్లు వింటుంటాం. ఒక స్పిన్ బౌలర్ బంతిని వేర్వేరు తన చేతితో వివిధ యాంగిల్స్‌లో విడుదల చేస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కన్ఫ్యూజ్ చేయడమే వీరి పని.. అందుకే ఇలాంటి వారిని మిస్టరీ స్పిన్నర్స్ అంటారు. అజంతా మెండిస్, సునీల్ నరైన్, సయీద్ అజ్మల్.. తాజగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్లుగా గుర్తింపు పొందారు. అన్‌ఆర్థడాక్స్ బౌలింగ్ వేరియేషన్‌తో క్యారమ్ బాల్, ఆఫ్ బ్రేక్ బంతులను వేస్తూ బ్యాట్స్మన్లను ముప్పతిప్పలు పెడుతుంటారు. మెండిస్(శ్రీలంక), నరైన్(వెస్టిండీస్) లాంటి ఆటగాళ్లు తమ బౌలింగ్‌తో రెండు మూడేళ్ల పాటు వారి జట్టులో కీలకపాత్ర పోషించారు. తాజాగా మెండిస్ తరహాలోనే శ్రీలంకకు మరో మిస్టరీ స్పిన్నర్ పుట్టుకొచ్చాడు. అతనే మహీష్ తీక్షణ. చదవండి: బీసీసీఐదే తప్పు.. ధోనిని మెంటార్ చేయడం నిరాశపరిచింది దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే ద్వారా శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేసిన తీక్షణ తన మిస్టరీ బౌలింగ్‌తో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో ఎక్కువగా క్యారమ్ బాల్స్, ఆఫ్ బ్రేక్ బంతులతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టిన తీక్షణ ఫలితాన్ని రాబట్టాడు. ఈ నేపథ్యంలో తీక్షణ బౌలింగ్ వేరియేషన్స్‌పై ఇంప్రెస్ అయిన ఒక అభిమాని అతని బౌలింగ్ యాక్షన్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ''తీక్షణ బౌలింగ్ చూస్తుంటే అతని చేతిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఒక క్యారమ్ బాల్ వేయడానికి మణికట్టును విభిన్న శైలిలో చూపించాడు. మన కాళ్లను ఎలా షేక్ చేస్తామో.. తీక్షణ తన చేతులను అలా చేస్తున్నాడు. అతని బౌలింగ్‌కు బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం ఖాయం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చూసిన శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్ అభిమానికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ''నీ అనాలిసిస్‌కు కృతజ్ఞతలు.. ముందు మాకు వరల్డ్ కప్ ఉంది.. దయచేసి ప్రతీ విషయాన్ని భూతద్ధంలో చూడడం ఆపండి'' అంటూ కామెంట్ చేశాడు. చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మహీష్ తీక్షణ శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించాడు. అయితే లంక మొదట క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న నుంచి ఒమన్ వేదికగా జరగనున్న క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో పాల్గొననుంది. -
స్పిన్ బౌలింగ్.. అందరూ హెల్మెట్లతోనే, కారణం అదే
లీడ్స్: ఇంగ్లండ్, టీమిండియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు సంబంధించి అభిమానులు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర అంశాన్ని చర్చించారు. స్పిన్ బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ హెల్మెట్ తీసేసి క్యాప్స్ ధరించడం గమనిస్తుంటాం. అయితే తాజాగా జరుగుతున్న మూడో టెస్టులో స్పిన్ బౌలింగ్ సమయంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరు కూడా క్యాప్ ధరించలేదు. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పిన్నర్లు వేసిన పది ఓవర్లు క్యాప్ ధరించే ఆడాడు. చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో అయితే ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ క్యాప్స్ ధరించకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందట. మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఫాస్ట్, స్పిన్ ఇలా ఏ బౌలింగ్ అయినా సరే.. కచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఆడాల్సిందే అంటూ సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సర్కులర్‌ను జారీ చేసింది. హెడ్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ కింద ఈసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాట్స్‌మెన్ తలకు గాయం కాకుండా ఉండేందుకు ఇలాంటి రెగ్యులేషన్‌ను అమలు చేస్తుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడోటెస్టులో టీమిండియా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. మొదటి రెండు రోజులు ఆటలో పూర్తి ఆధిపత్యం చూపెట్టిన ఇంగ్లండ్ మూడోరోజు మాత్రం బేజారిపోయింది. భారత టాపార్డర్ బాట్స్మెన్ రాణింపుతో ఇంగ్లండ్ బౌలింగ్ పస తగ్గింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ పొరపాటు చేయలేదు. రోహిత్ శర్మ, పుజారా, కోహ్లిల రాణింపుతో టీమిండియా నిలదొక్కుకుంది. ప్రస్తుతం మూడోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. చదవండి: ENG Vs IND: టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్‌లదే బాధ్యత -
భారత జట్టుకు ఆడడమే లక్ష్యం
మహబూబ్‌నగర్ క్రీడలు: తమ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు తదితర ప్రొఫెషనల్స్‌గా ఎదగాలని చదువు.. చదువు అంటూ వెంటపడే తల్లిదండ్రులున్న రోజులివి.. కానీ తమ కొడుకు క్రికెట్లో రాణించాలని, అంతర్జాతీయస్థాయికి ఎదగాలని, అందుకోసం ఎంత కష్టాన్నయినా భరిస్తానని పరితపిస్తున్నాడు జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన పోలీస్ ఉద్యోగి రమేష్‌యాదవ్. తన కుమారులు రాకేశ్‌యాదవ్, హృతిక్యాదవ్లను క్రికెట్ శిక్షణ కోసం ఇంటివద్దే రెండు నెట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడు. ఇంటి ఆవరణలో టర్ఫ్, సిమెంట్ పిచ్‌లను ఏర్పాటు చేశాడు. మూడేళ్ల క్రితం బెంగళూర్‌లోని ప్రసిద్ధ బ్రిజేష్పటేల్ క్రికెట్ అకాడమీలో రెండునెలలపాటు ఇద్దరు కుమారులకు శిక్షణ ఇప్పించాడు. అండర్ –14లో మెరిసిన హృతిక్యాదవ్ రాకేశ్‌యాదవ్ అండర్–19, అండర్–23 విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. హృతిక్యాదవ్ ఆల్‌రౌండర్‌గా సత్తాచాటుతున్నాడు. తన లెగ్‌స్పిన్ మాయాజాలంతో మ్యాచుల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. లెఫ్ట్‌హ్యాండర్ బ్యాటింగ్, లెగ్‌స్పిన్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. 2013 హైదరాబాద్‌లో జరిదిన అండర్–14 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి టోర్నీలో కరీంనగర్‌పై 13 పరుగులు ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిలో పడ్డాడు. వయస్సు తక్కువగా ఉన్న కారణంతో ఆ ఏడాది జాతీయస్థాయి పోటీలకు ఎంపికకాలేదు. 2015 హైదరాబాద్‌లో జరిగిన అండర్–14 క్రికెట్ టోర్నీలో స్పిన్నర్ హృతిక్యాదవ్ మెరిశాడు. టోర్నీలో 12 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. సెమీఫైనల్లో నిజామాబాద్‌పై, ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్‌పై ఐదేసి వికెట్లు తీసి రాణించాడు. 2015లో జిల్లా కేంద్రంలో జరిగిన అండర్–14 ఎస్జీఎఫ్ జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2016 ఎస్జీఎఫ్, హెచ్‌సీఏ టోర్నీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2015, 2017లో నిర్వహించిన (మహబూబ్‌నగర్ ప్రీమియర్ లీగ్) ఎంపీఎల్లో ఆడాడు. గత నెలలో సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో జరిగిన అండర్–17 రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచాడు. ఈ టోర్నీలో 43పరుగులు చేయడంతోపాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీశాడు. 2016లో బెంగళూర్‌లో అండర్–14 టోర్నీలో హెచ్‌సీఏ–బి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హెచ్‌సీఏ అండర్–16 టోర్నీలో హృతిక్ సంచలనం మూడురోజులుగా హైదరాబాద్‌లోని డానియల్ అకాడమీ మైదానంలో జరుగుతున్న హెచ్‌సీఏ అండర్–16 టోర్నీ సత్తాచాటాడు. కరీంనగర్ జట్టుపై తన స్పిన్బౌలింగ్తో ప్రతిభ కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లలో కేవలం 11 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీశాడు. జిల్లా తరపున అండర్–14, అండర్–16 హెచ్‌సీఏ క్రికెట్లో ఏడు వికెట్లు తీసి రికార్డ్‌గా నిలిచాడు. భారత జట్టుకు ఆడడమే లక్ష్యం క్రికెట్ కెరీర్లో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. ఎన్ని పనులు ఉన్నా క్రికెట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకుండా నావంతు ప్రతిభ కనబరుస్తున్నాను. నిత్యం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ క్రికెట్ మైదానంలో కోచ్‌ల వద్ద ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నాను. ఇంకా చాలా ప్రాక్టిస్ చేసి, కష్టపడి రంజీ, భారతజట్టుకు ఆడడమే నా లక్ష్యం. –హృతిక్యాదవ్ -
స్పిన్‌ను ఆడలేరా.. భారత్‌కు వెళ్లకండి!
స్పిన్ బౌలింగ్ ఎలా ఆడాలో త్వరగా నేర్చుకోవాలని... లేకుంటే భారత పర్యటనకు వెళ్లకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సలహా ఇచ్చాడు. భారత్‌కు వెళ్లి ఆడాలంటే స్పిన్‌ను ఎదుర్కొనేందుకు కఠినంగా ప్రాక్టీస్ చేయాల్సిందేనని హెచ్చరించాడు. బంతి బ్యాట్‌పైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని, ముందుకెళ్లి ఆడడం ఏమాత్రం మంచిది కాదని చెప్పాడు. గత 13 ఏళ్ల నుంచి ఉపఖండంలో ఆస్ట్రేలియా కేవలం 3 టెస్టులు మాత్రమే గెలవగలిగింది. ఇందులో రెండు బంగ్లాదేశ్‌పై వచ్చినవే. -
నాకు నేనే సమాధానమిచ్చుకుంటా!
విమర్శలను పట్టించుకోను ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆటతీరు మార్చుకుంటా అశ్విన్ అభిప్రాయాలు ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్ రవిచంద్రన్ అశ్విన్... తన స్పిన్ బౌలింగ్‌తో, క్యారమ్ బంతులతో ఎంత వేగంగా పేరు సంపాదించాడో... అంతే వేగంగా విమర్శకులనూ పెంచుకున్నాడు. వరుస వైఫల్యాలు, బౌలింగ్ యాక్షన్‌లో మార్పు... ఇలా ఇటీవల కాలంలో తనపై ఒత్తిడి బాగా పెరిగింది. అయితే తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు ఈ ఆఫ్ స్పిన్నర్. ఏం చేస్తే తన బౌలింగ్ మెరుగుపడుతుందో తెలుసని చెబుతున్నాడు. తనకు తాను సమాధానం చెప్పుకుంటే చాలని, విమర్శకుల కోసం తాను ఆడటం లేదని అంటున్న అశ్విన్ వివిధ అంశాలపై చెప్పిన విశేషాలు అతడి మాటల్లోనే.... ఈసారి స్పిన్నర్ల పాత్ర: ఉపఖండంలో ఎక్కడ క్రికెట్ ఆడినా స్పిన్నర్లు కీలకం కావడం సహజం. ఈసారి బంగ్లాదేశ్ వికెట్లపై స్పిన్నర్ల రాణింపే కీలకం. దీనికి మేం సన్నద్ధంగా ఉన్నాం. భారత పేసర్లలో అనుభవలేమి: ఇది పెద్ద సమస్య అని నేను అనుకోను. ధోని చెప్పినట్లు ఐపీఎల్ రూపంలో మేం కావలసినంత క్రికెట్ ఆడాం. కాబట్టి పేసర్లకూ అనుభవం ఉంది. ఐపీఎల్ వేరు, ప్రపంచకప్ వేరు. కానీ ప్రపంచవ్యాప్తంగా టి 20 ఎక్కడ ఆడినా, ఆ అనుభవం ఉపయోగపడుతుంది. బౌలింగ్ శైలిలో మార్పు: మూడు ఫార్మాట్లలో ఆడటం ఎవరికైనా సవాలే. బ్యాట్స్‌మెన్ ఫార్మాట్‌కు తగ్గట్లుగా ఆట మార్చుకుంటున్నారు. కాబట్టి బౌలర్లు కూడా దీనికి అనుగుణంగా శైలి మార్చుకోవాలి. మేం ఏం చేయాలనేది చాలామంది నిపుణులు చెబుతూ ఉంటారు. నా వరకైతే వాటిని వింటూ కూర్చోవడం కంటే మైదానంలోకి వెళ్లి కొత్త పద్దతులను ప్రాక్టీస్ చేయడం మంచిదని భావిస్తాను. అలా చేయడం వల్ల కొత్త శైలిలో బౌలింగ్, కొత్త రకాల బంతులు ఇలా అన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల ఫార్మాట్‌కు తగ్గట్లుగా బౌలింగ్ శైలిని మార్చుకోగలుగుతున్నా. మార్పులు చేసుకోవడం సులభమా..?: మేం చాలా ప్రాక్టీస్ సెషన్లకు వెళుతున్నాం. వెళ్లిన ప్రతిసారీ ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. లేకపోతే బోర్ కొడుతుంది. మ్యాచ్‌లో ఓ నిర్ధిష్ట స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి బంతులు వేయాలనే అంశంపై ప్రయోగాలు చేస్తాను. వాటినే ఆచరణలో పెడతాను. దీనివల్ల నాపై విమర్శలు వస్తాయి. కానీ వాటికి నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. నాకు నేను సమాధానం చెప్పుకుంటే చాలు. ఉపఖండం ఆవల ఓటములు: ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు అలవాటు పడటం కీలకం. ఉపఖండం బయట భారత జట్టుకు ఇది ప్రతికూలం. అయితే ప్రస్తుతం జట్టులోని యువ క్రికెటర్లు నేర్చుకునే దశలో ఉన్నారు. ఇప్పటి కష్టానికి ఫలితం భవిష్యత్తులో ఉంటుంది. దూకుడుగానే ఆడాలి: టి20 క్రికెట్లో దూకుడు అవసరం. బ్యాట్స్‌మెన్ ఎంత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారో... బౌలర్లు కూడా అంతే దూకుడు కనబరచాలి. ఇందులో ఎక్కువభాగం ఆటగాడి మైండ్‌సెట్‌పై ఆధారపడి ఉంటుంది.