జూన్ ఏడు నుంచి ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. 2019-21 డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో రచించనున్న ప్రణాళికలపై చర్చించాడు.'' ఓవల్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. వాస్తవానికి యూకేలోని బెస్ట్ బ్యాటింగ్ కండిషన్ పిచ్ అయిన ఓవల్ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉంటుందని అంటారు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ భారత్‌లో ఉండే పిచ్ కండీషన్‌లా ఉంటుందేమోనని చిన్నపాటి భయం కూడా ఉంది. నాకు తెలిసి టీమిండియా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు ఫ్రంట్‌లైన్ స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక అంచనాకు వచ్చాం. డబ్యూటీసీ(వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్) అనేది మంచి ఆలోచన. ఎంత సంప్రదాయ క్రికెట్ అయినా ఒక పోటీ ఉంటేనే మజా ఉంటుంది.
డబ్ల్యూటీసీ టైటిల్ అందుకోవాలన్న కాంక్షతో ప్రతీ జట్టు తమ శాయాశక్తులా మ్యాచ్‌లను గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అటు టీమిండియా.. ఇటు మేము డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాం. ఇక వచ్చే వారంలోపు టెస్టు ఛాంపియన్ ఎవరనేది తేలనుంది. ఇక మ్యాచ్‌కు వచ్చే అభిమానుల్లో ఆస్ట్రేలియన్ల కంటే టీమిండియా అభిమానులే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నా. మ్యాచ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు.
ఈ ఏడాది భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా 1-2 తేడాతో టెస్టు సిరీస్‌ను టీమిండియాకు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మూడు వన్డేల సిరీస్‌ను మాత్రం 2-1తో చేజెక్కించుకుంది. ఇక ఐపీఎల్‌లో పాల్గొనని స్టీవ్ స్మిత్ ఇటీవలే ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాడు. కౌంటీల్లో ఆడడం ద్వారా మంచి ప్రాక్టీస్ దొరికిందని.. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు యాషెస్ సిరీస్‌కు కూడా సన్నద్దమైనట్లు ఇటీవలే స్మిత్ ట్విటర్‌లో తెలిపాడు.
చదవండి: త్రిపుర క్రికెట్‌లో ప్రొటీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి
Comments
Please login to add a commentAdd a comment