
టీమిండియాతో టీ20 సిరీస్ ముందు క్రికెట్ ఐర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్-బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు నాథన్ హౌరిట్జ్ ఐర్లాండ్ నియమించింది. హౌరిట్జ్ ఆస్ట్రేలియా తరపున 17 టెస్టులు, 58 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హౌరిట్జ్ మూడు ఫార్మాట్లలో 128 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ జట్లకు హౌరిట్జ్ ప్రాతినిధ్యం వహించాడు.
ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా అతడు బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల తరపున ఆడాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత హౌరిట్జ్ క్వీన్స్‌ల్యాండ్ ఫైర్, బ్రిస్బేన్ హీట్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూన్ 26న తొలి టీ20 జరగనుంది.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్..!
Comments
Please login to add a commentAdd a comment