Ireland team
-
దక్షిణాఫ్రికా ఓపెనర్ శుభారంభం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. అబుదాబి వేదికగా జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రొటియేస్ జట్టు ఊదిపడేసింది.కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య ఛేదనలో సఫారీ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్ విధ్వంసం సృష్టించారు. ఐరీష్ బౌలర్లను ఊచకోత కోశాడు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 13 ఓవర్లలో 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. రికెల్టన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులు చేయగా.. హెండ్రిక్స్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో కర్టిస్ కాంఫర్(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో పాట్రిక్ కుర్గర్ 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 అబుదాబి వేదికగా సెప్టెంబర్ 29న జరగనుంది.చదవండి: SL vs NZ: జయసూర్య 'సిక్సర్'.. 88 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ -
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ.. ఐర్లాండ్‌పై ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 95 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు ఐర్లాండ్‌ను పతనాన్ని శాసించగా.. నిదా ధార్, ఇక్భాల్ చెరో రెండు వికెట్లు, ఫాతిమా సానా, హసన్ తలా వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సెంచరీతో చెలరేగిన మునీబా అలీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ మునీబా అలీ అద్భుతమైన సెంచరీ సాధించింది. 68 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు చేసింది. కాగా టీ20ల్లో సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఇక మునీబాతో పాటు ధార్ కూడా 33 పరుగుల తేడాతో రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లీన్ కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. పాల్, డెన్లీ తలా వికెట్ సాధించారు. చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్‌తో.. -
సంజూ శాంసన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పరాయి దేశం
Sanju Samson: టాలెంట్ ఉన్నప్పటికీ అవకాశాలు లేక బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్న టీమిండియా యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు పరాయి దేశం ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తమ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని శాంసన్‌కు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆహ్వానం పలికినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ, భారత క్రికెట్‌తో తెగదెంపులు చేసుకుని తమ దేశానికి వస్తే, తమ జట్టు ఆడే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను సంజూ తిరస్కరించాడని తెలుస్తోంది. తాను భారత్ తరఫున తప్ప మరే దేశం తరఫున క్రికెట్ ఆడేది లేదని ఖరాకండిగా తెలిపినట్లు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ ఆడితే టీమిండియాకు మాత్రమే ఆడాలని కోరుకుంటానని, ఇతర దేశం తరఫున క్రికెట్ ఆడటాన్ని కలలో కూడా ఊహించలేనని తనను సంప్రదించిన ఐరిష్ ప్రతినిధులకు సంజూ తెలిపాడని వార్తలు వస్తున్నాయి. కాగా, అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్, హిట్టింగ్ అన్నింటికీ మించి మంచి ఫామ్‌లో ఉన్నా, సంజూకు సరైన ఛాన్స్‌లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని అతని అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయినా స్పందించని బీసీసీఐ.. సంజూ మినహా చాలామందికి అవకాశాలు ఇస్తూ పోతుంది. ఇలాంటి ఓ అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్.. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఏకంగా డబుల్ సెంచరీ బాది సంజూకు పోటీగా నిలిచాడు. 28 ఏళ్ల సంజూ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 27 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. -
ఇంగ్లాండ్ కు షాకిచ్చిన ఐర్లాండ్
-
Womens T20 World Cup 2023: అర్హత సాధించిన ఐర్లాండ్, బంగ్లాదేశ్
దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్-2023కు ఐర్లాండ్ అర్హత సాధించింది. జింబాబ్వే మహిళలలో హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్-1లో ఐర్లాండ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఓర్లా ప్రెండర్‌గాస్ట్(28), రెబెక్కా స్టోకెల్(26) పరుగులతో రాణించారు. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 133 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్ బౌలర్లలో కెల్లీ, జేన్ మాగైర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్సన్, ముర్రీ తలా వికెట్ సాధించారు. మరోవైపు సెమీఫైనల్-2లో థాయిలాండ్ మహిళలలపై విజయం సాధించిన బంగ్లాదేశ్ కూడా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఆర్హత సాధించింది. ఇక ఆదివారం అబూ దాబీ వేదికగా జరగనున్న ఫైనల్లో ఐర్లాండ్- బంగ్లాదేశ్ తలపడనున్నాయి. కాగా ఫైనల్‌కు చేరిన రెండు జట్లు కూడా టీ20 ప్రపంచకప్-2023లో అడుగుపెట్టనున్నాయి. చదవండి: IND VS AUS: రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్ -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన ఐర్లాండ్.. యువ ఆటగాడు ఎంట్రీ!
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్లో ఐర్లాండ్ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గోన్న జట్టునే ఐర్లాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా ఐర్లాండ్ యువ ఆటగాడు స్టీఫెన్ డోహెనీకి తొలి సారి టీ20ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో షేన్ గెట్‌కేట్, గ్రాహం కెన్నెడీ, బారీ మెక్క్రాతికి అవకాశం దక్కింది. కాగా ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో ఐర్లాండ్ తొలుత జింబాబ్వే, స్కాట్లాండ్, వెస్టిండీస్ వంటి జట్లతో క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్ జట్టు: ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్ (వైస్ కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, కోనర్ ఓల్ఫెర్ట్, సిమి సింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రెయిగ్ యంగ్ స్టాండ్‌బై: షేన్ గెట్‌కేట్, గ్రాహం కెన్నెడీ, బారీ మెక్క్రాతి చదవండి: IND vs AuS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ! -
ఆఫ్ఘనిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐర్లాండ్.. వరుసగా రెండో విజయం!
బెల్ఫాస్ట్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఐర్లాండ్ అధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐరీష్ బౌలర్లలో జోష్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 123 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్..19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ 46 పరుగులతో రాణించగా, అఖరిలో డాకెరల్ 25 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో కెప్టెన్ నబీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ముజీబ్ తలా వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఐర్లాండ్ బౌలర్ జోష్ లిటిల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరిచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టీ20 బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్ దూరం! -
ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్... ఓడినా ఆకట్టుకుంది
ఇటీవలి కాలంలో ఐర్లాండ్ జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నా ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యాలను విధిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా ఐర్లాండ్ బ్యాటర్లు లక్ష్య ఛేదనకు ప్రయత్నించడమే అందుకు కారణం. ఐర్లాండ్ పోరాట పటిమ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఐర్లాండ్ 21 పరుగులతో ఓడినా సౌతాఫ్రికాకు మాత్రం చుక్కలు చూపించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కన్ టక్కర్ (38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు) రాణించగా.. చివర్లో జార్జ్ డాక్రెల్ (28 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒక దశలో ఐర్లాండ్ విజయానికి చేరువగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాటర్లు ఒకేసారి వెనుదిరగడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 21 పరుగులతో ఓటమి పాలైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్(53 బంతుల్లో 74, 10 ఫోర్లు, ఒక సిక్స్), మార్ర్కమ్ (27 బంతుల్లో 56 పరుగులు, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. చివర్లో ప్రిటోరియస్ 7 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ప్రొటిస్ 200 పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టి20 ఆగస్టు 5న(శుక్రవారం) జరగనుంది. చదవండి: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు. అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో ప్రోటీస్ తలపడనుంది. ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్‌తో మూడు టీ20 సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..! -
Ireland vs New Zealand: ఐర్లాండ్ ఓడినా... వణికించింది!
డబ్లిన్: అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్‌వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది. కివీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 360 పరుగుల భారీస్కోరు చేసింది. గప్టిల్ (126 బంతుల్లో 115; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా, నికోల్స్ (54 బంతుల్లో 79; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గట్టి ప్రత్యర్థి తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం బెదిరిపోని ఐర్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 359 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (103 బంతుల్లో 120; 14 ఫోర్లు, 5 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (106 బంతుల్లో 108; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల సెంచరీలతో ఓ దశలో న్యూజిలాండ్‌ను ఓడించినంత పని చేశారు. చివరి బంతికి 3 పరుగుల కావాల్సి వుండగా, ‘బై’ రూపంలో పరుగు మాత్రమే వచ్చింది. -
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
ఐర్లాండ్ పర్యటనకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలలో అతడికి పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సాంట్నర్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూలై 10న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో.. వన్డే సిరీస్‌కు టామ్ లాథమ్,టీ20 సిరీస్‌లకు సాంట్నర్‌ను కెప్టెన్లుగా న్యూజిలాండ్ క్రికెట్ నియమించింది. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్‌వెల్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), జాకోబ్ డాఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్, విల్ యంగ్. ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రిప్పన్, బెన్ సీర్స్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్. చదవండి: New Zealand Squads: విలియమ్సన్ లేకుండానే వరుస సిరీస్‌లు.. జట్లు ఇవే! కెప్టెన్లు ఎవరంటే! -
ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ మూలస్థంభం
ఐర్లండ్ జట్టు నుంచి మరో స్టార్ క్రికెటర్ విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు విజయాల్లో మూలస్థంభంలా నిలిచిన అతను ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. కాగా పోర్టర్ ఫీల్డ్ 148 వన్డేల్లో 11 సెంచరీలు సహా 4343 పరుగులు చేశాడు. 2007 వరల్డ్‌కప్‌లో పాక్‌పై గెలుపు, 2009 టి20 వరల్డ్‌కప్‌కు క్వాలిఫై, 2011 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై సంచలన విజయాల్లో పోర్టర్‌ఫీల్డ్ భాగంగా ఉన్నాడు. అంతేకాదు ఐర్లండ్‌కు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత పోర్టర్‌ఫీల్డ్ సొంతం. ఆటకు గుడ్‌బై చెప్పిన పోర్టర్‌ఫీల్డ్ ఇక నుంచి కోచ్ పాత్రలో మెరవనున్నట్లు స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఐర్లాండ్ పోర్టర్ఫీల్డ్తో తమ అనుబంధాన్ని ట్విటర్లో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 🎥: GREAT MEMORIES As we say farewell to a legend of Irish cricket, let’s look back at some great memories of @purdy34 in action.#ThankYouPorty #BackingGreen ☘️🏏 pic.twitter.com/tUomTYQcgN — Cricket Ireland (@cricketireland) June 16, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్ కీలక నిర్ణయం
టీమిండియాతో టీ20 సిరీస్ ముందు క్రికెట్ ఐర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు స్పిన్-బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు నాథన్ హౌరిట్జ్ ఐర్లాండ్ నియమించింది. హౌరిట్జ్ ఆస్ట్రేలియా తరపున 17 టెస్టులు, 58 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హౌరిట్జ్ మూడు ఫార్మాట్లలో 128 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో క్వీన్స్‌ల్యాండ్, న్యూ సౌత్ వేల్స్ జట్లకు హౌరిట్జ్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో కూడా అతడు బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్ల తరపున ఆడాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత హౌరిట్జ్ క్వీన్స్‌ల్యాండ్ ఫైర్, బ్రిస్బేన్ హీట్ జట్లకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూన్ 26న తొలి టీ20 జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్..! -
మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లకు కరోనా..
న్యూయార్క్: కరోనా మహామ్మారి క్రికెట్ ప్రపంచంపై మరోసారి పంజా విసురుతుంది. కొద్ది గంటల క్రితమే ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా.. తాజాగా మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలింది. కీలకమైన విండీస్ పర్యటనకు ముందు అమెరికాలో బస చేస్తున్న ఐర్లాండ్ ఆటగాళ్లు పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్ కరోనా బారిన పడ్డారు. వచ్చే ఏడాది జనవరి 8 నుంచి 23 వరకు విండీస్‌తో మూడు వన్డేలు, టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లు మహమ్మారి బారిన పడడంతో ఐర్లాండ్ జట్టులో కలవరం మొదలైంది. స్టిర్లింగ్, గెట్కేట్లు ఇద్దరు వేర్వేరుగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నట్లు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వీరిద్దరు జనవరి 9న తిరిగి(రెండోసారి పరీక్షల అనంతరం) జట్టులో చేరే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం పేర్కొంది. కాగా, పాల్ స్టిర్లింగ్ ఐర్లాండ్ తరఫున 134 వన్డేల్లో 38.09 సగటుతో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 4982 పరుగులు, 94 టీ20ల్లో 30.06 సగటుతో ఓ సెంచరీ, 19 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 43 వన్డే వికెట్లు, 20 టీ20 వికెట్లు ఉన్నాయి. ఇక, షేన్ గెట్‌కేట్ విషయానికొస్తే.. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఐర్లాండ్ తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. చదవండి: IND Vs SL Final: భారత బౌలర్ల ధాటికి లంక జట్టు విలవిల.. -
థ్రిల్లర్‌ను తలపించిన టీ20; 3 పరుగులతో జింబాబ్వే విజయం
డుబ్లిన్: జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 3 పరుగులతో విజయాన్ని అందుకుంది. లోస్కోరింగ్గా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసిది. వికెట్ కీపర్ చకాబ్వా 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 17 పరుగులు, మసకద్జ 19* పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలింగ్‌లో క్రెయిగ్ యంగ్, సిమీ సింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. బారీ మెక్‌కార్తీ, గెట్‌కటే తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. చదవండి: ENG Vs IND: స్పిన్ బౌలింగ్.. అయినా క్యాప్స్ ధరించలేదు ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ 25, కెవిన్ ఒబ్రియాన్ 25 పరుగులతో శుభారంభం అందించినప్పటికీ మిగతావారు విఫలమయ్యారు. అయితే చివర్లో సిమీ సింగ్ 28 పరుగులతో నాటౌట్ నిలిచి ఐర్లాండ్ విజయంపై ఆశలు రేకెత్తించినప్పటికి గరవ వేసిన ఆఖరి ఓవర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సిమీ సింగ్‌కు బ్యాటింగ్ రాకుండా చేయడంలో జింబాబ్వే సఫలమయింది. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను ఒత్తిడికి గురిచేసింది. ఆఖరి బంతికి నాలుగు పరుగుల అవసరమైన దశలో సిమీ సింగ్ ఒక పరుగు మాత్రమే చేయడంతో ఐర్లాండ్ మూడు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. జింబాబ్వే బౌలర్లలో రియాన్ బర్ల్ 3, మసకద్జ 2, లూక్ జోంగ్వే 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ విజయంతో జింబాబ్వే ఐదు టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇంగ్లండ్ తరపున మూడో బ్యాట్స్‌మన్‌గా.. ఓవరాల్‌గా ఐదో ఆటగాడు -
దక్షిణాఫ్రికాకు షాకిచ్చిన ఐర్లాండ్
డబ్లిన్: ఐర్లాండ్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. వన్డేల్లో తొలిసారి దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. డబ్లిన్‌లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 43 పరుగుల తేడాతో నెగ్గింది. కెప్టెన్ బాల్బిర్నీ సెంచరీ (102; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. దాంతో తొలుత ఐర్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 48.3 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. జానెమన్ మలాన్ (84; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుసెన్ (49; 2 ఫోర్లు) పోరాడినా చివరి వరుస బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో సఫారీ జట్టుకు ఓటమి తప్పలేదు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్ రౌండర్..
డబ్లిన్: ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రెయిన్(37) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐర్లాండ్‌కు 15ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. వన్డే ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పి, టెస్టు, టీ20 ఫార్మాట్లలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. వన్డే క్రికెట్‌పై ఆసక్తి తగ్గిందని, అందుకే ఆ ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాని ఆయన పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను అని ఒబ్రెయిన్ వివరించాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులతో పాటు 114 వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్ల రికార్డు అతని పేరిటే ఉంది. భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 వన్డే ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన కెవిన్.. అనంతరం స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఆ వరల్డ్‌కప్‌లో బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెవిన్.. పెను విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 50 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ చేరుకుని, రికార్డు శతకాన్ని నమోదు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 327 పరుగులు చేయగా, అనంతరం ఛేదనలో ఒబ్రెయిన్(113 రన్స్) మెరుపు సెంచరీ సాధించడంతో పసికూన ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. నాటికి వన్డే ప్రపంచకప్‌లో కెవిన్‌దే అత్యంత వేగవంతమైన శతకంగా నిలిచింది. చదవండి: క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు.. -
క్రికెట్ చరిత్రలో ఈ రోజు: వన్డేల్లో అత్యధిక స్కోర్ నమోదు
వన్డే క్రికెట్ చరిత్రలో జూన్ 8కి ఓ ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇవాల్టి రోజున న్యూజిలాండ్ మహిళల జట్టు వన్డేల్లో అత్యధిక స్కోర్(490/4) నమోదు చేసి చరిత్ర సృష్టించింది. సహజంగా అత్యధిక స్కోర్ అనగానే పురుషుల క్రికెట్లోనే నమోదైవుంటుందని సగటు క్రికెట్ అభిమాని ఊహిస్తాడు. కానీ, పురుష క్రికెటర్లకు సైతం సాధ్యం కాని ఈ అద్భుతమైన రికార్డును కివీస్ మహిళా జట్టు ఆవిష్కరించింది. ఇప్పటివరకు పురుషుల క్రికెట్లో(ఆస్ట్రేలియాపై 2018లో 481/6) కాని మహిళా క్రికెట్లో కాని ఇదే అత్యుత్తమ స్కోర్‌గా కొనసాగుతుండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. 2018 జూన్ 8న న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య డబ్లిన్ వేదికగా జరిగిన వన్డే పోరులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. కివీస్ జట్టులో ఓపెనర్ సుజీ బేట్స్(94 బంతుల్లో 151; 24 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్ డౌన్ ప్లేయర్ మ్యాడీ గ్రీన్(77 బంతుల్లో 121; 15 ఫోర్లు, సిక్స్) అద్భుత శతకాలతో చెలరేగగా ఆఖర్లో అమేలియా కెర్(45 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేసింది. మరో ఓపెనర్ జెస్ వాట్కిన్ (59 బంతుల్లో 62; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీతో రాణించింది. దీంతో న్యూజిలాండ్ జట్టు వన్డేల్లో చారిత్రక స్కోర్ నమోదు చేసింది. అనంతరం 491 పరుగుల అతి భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో ఆతిధ్య ఐర్లాండ్ జట్టు 35.3 ఓవర్లలో 144 పరుగలకే చాపచుట్టేసింది. ఐర్లాండ్ జట్టులో కెప్టెన్ లారా డెలానీ అత్యధికంగా 37 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ 347 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. చదవండి: పొట్టి క్రికెట్లో పెను విధ్వంసం.. 28 బంతుల్లోనే శతకం -
విండీస్ క్లీన్‌స్వీప్
గ్రెనడా: ఛేదనలో వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ స్ఫూర్తిదాయక (97 బంతుల్లో 102; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)సెంచరీకి చివర్లో నికోలస్ పూరన్ (44 బంతుల్లో 43; 5 ఫోర్లు, సిక్స్) ఫినిషింగ్ తోడవ్వడంతో... ఐర్లాండ్‌తో ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మూడో వన్డేలో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 49.1 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. ఆండీ బాల్బిర్నీ (93 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హెడెన్ వాల్‡్ష జూనియర్ 4 వికెట్లతో రాణించగా... థామస్ 3 వికెట్లు తీశాడు. అనంతరం వర్షం రావడంతో విండీస్ విజయ లక్ష్యాన్ని 47 ఓవర్లకు 197 పరుగులుగా అంపైర్లు కుదించారు. విండీస్ 36.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి గెలుపొందింది. లూయిస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులను అందుకున్నాడు. మరోవైపు ఐర్లాండ్‌తో బుధవారం మొదలయ్యే టి20 సిరీస్‌లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో డ్వేన్ బ్రేవో పునరాగమనం చేశాడు. మూడేళ్ల తర్వాత అతను టి20 జట్టులోకి రావడం విశేషం. బ్రేవో సభ్యుడిగా ఉన్న విండీస్ జట్టు 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు సాధించింది. -
మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి..
గ్రెనడా: ఇటీవల తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు బ్రేవోను ఎంపిక చేస్తూ విండీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. 2016లో విండీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన బ్రేవో.. ఆపై బోర్డుతో విభేదించి వీడ్కోలు చెప్పాడు. కాగా, కొంతకాలం క్రితం నూతన బోర్డు ఏర్పాటు కావడంతో తన వీడ్కోలు నిర్ణయాన్ని బ్రేవో ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలోనే తన పునరాగమనంపై ఆశలు పెట్టుకున్న బ్రేవోకు ఊహించినట్లుగానే చోటు కల్పించింది విండీస్ మేనేజ్మెంట్. 2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ బ్రేవోకు అంతర్జాతీయ స్థాయిలో చివరిది. కాగా, మూడేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ కోసం సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌కు టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు విశ్రాంతి కల్పించారు. ఇక ఫాబియన్ అలెన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోవడంతో అతను అందుబాటులోకి రాలేదు. దాంతోనే బ్రేవో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. -
ఐర్లాండ్‌కు సువర్ణావకాశం
లండన్: వన్డేల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న ఐర్లాండ్‌కు... సంప్రదాయ టెస్టు క్రికెట్లోనూ ఉనికి చాటుకునే అవకాశం. ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా ఆ జట్టు బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో నాలుగు రోజుల టెస్టులో తలపడనుంది. గతేడాది టెస్టు అరంగేట్రం చేసిన ఐర్లాండ్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. తొలి టెస్టులోనే పెద్ద జట్టయిన పాకిస్తాన్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడింది. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులోనూ పరాజయం పాలైనా ఫర్వాలేదనే ప్రదర్శన చేసింది. తాజాగా వన్డే ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. పోర్టర్‌ఫీల్డ్ నేతృత్వంలోని ఐర్లాండ్ జట్టులో కౌంటీల్లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లున్నారు. వీరిలో పేసర్ టిమ్ ముర్టాగ్ ఒకడు. ఇటీవలే అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 800 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్, పేసర్ స్టోన్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అడుగు పెట్టనున్నారు. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ అండర్సన్ గాయంతో దూరమయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో తొలిసారి ఆటగాళ్లు నంబర్లతో కూడిన జెర్సీలు ధరించి బరిలోకి దిగనున్నారు. -
వావ్ రషీద్.. 4 బంతుల్లో 4 వికెట్లు
డెహ్రాడూన్: అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (5/27) టి20 క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ‘హ్యాట్రిక్ ప్లస్’ ప్రదర్శనతో ఔరా అనిపించాడు. ఆదివారం జరిగిన మూడో టి20లో 32 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందిన అఫ్గాన్ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేయగా... ఐర్లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసి ఓడిపోయింది. అఫ్గానిస్తాన్ జట్టులో మొహమ్మద్ నబీ (36 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగాడు. హజ్రతుల్లా (17 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో రాన్కిన్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 15.5 ఓవర్లలో 153/3 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. కానీ ఆ మరుసటి బంతి నుంచి ఐర్లాండ్ రాత మారింది. 16వ ఓవర్ వేసిన రషీద్ చివరి బంతికి కెవిన్ ఓబ్రియన్ (47 బంతుల్లో 74; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాటానికి తెరదించాడు. తర్వాత 18వ ఓవర్ తొలి మూడు వరుస బంతులకు డాక్రెల్ (18), గెట్కెట్ (2), సిమి సింగ్ (0)లను పెవిలియన్ చేర్చాడు. ►7 అంతర్జాతీయ టి20ల్లో ‘హ్యాట్రిక్’ తీసిన ఏడో బౌలర్‌గా, తొలి స్పిన్నర్‌గా రషీద్‌ఖాన్ నిలిచాడు. గతంలో ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఆరుగురూ పేస్ బౌలర్లు (బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టిమ్ సౌతీ,తిసారా పెరీరా, లసిత్ మలింగ, ఫహీమ్ అష్రఫ్) కావడం గమనార్హం. ► 2అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. గతంలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ మాత్రమే (2007 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై) ఈ ఘనత సాధించాడు. -
సెమీస్‌కు..ఒక్క అడుగు
వరుసగా రెండు విజయాల ఊపు. సమష్టిగా రాణిస్తున్న జట్టు. మరొక్క గెలుపు చాలు... సెమీఫైనల్స్ చేరినట్లే! ప్రత్యర్థి బలహీన ఐర్లాండ్! పరాజ యాలతో ఇప్పటికే ఇంటి బాటలో ఉంది! టీమిండియా చేయాల్సిందల్లా మరోసారి చెలరేగడమే. గయానా: పటిష్ట న్యూజిలాండ్‌ను మట్టికరిపించి... దాయాది పాకిస్తాన్‌ను చిత్తుచేసిన టీమిండియా మహిళల టి20 ప్రపంచ కప్ మూడో లీగ్ మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో తలపడనుంది. దీంట్లోనూ ప్రత్యర్థిని ఓడిస్తే వరుసగా మూడో గెలుపుతో టీమిండియా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. అన్ని రంగాల్లో అదరగొడుతూ, దూకుడు మీదున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ఇదేమంత పెద్ద పనేం కాదు. అయితే, పోరాటపటిమ చూపే ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకపోవడం మంచిది. ఆ ఇద్దరూ రాణిస్తే... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎంతటి విధ్వంసకరంగా ఆడుతుందో, యువ జెమీమా రోడ్రిగ్స్ ధాటి ఏమిటో కివీస్‌పై వారి ఇన్నింగ్స్‌లు చాటాయి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగని వెటరన్ మిథాలీ రాజ్... పాక్‌పై చక్కటి అర్ధ శతకంతో ఫామ్‌ను చూపింది. మిగిలింది స్మృతి మంధాన, వేద కృష్ణమూర్తి. వీరిద్దరూ ఐర్లాండ్‌పై చెలరేగితే భారత్ బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. తద్వారా గ్రూప్ ‘బి’ టాపర్ స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు సంసిద్ధం అయినట్లుంటుంది. నెమ్మదైన విండీస్ పిచ్‌లను టీమిండియా స్పిన్ చతుష్టయం హేమలత, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ సమర్థంగా ఉపయోగించుకుంటూ, పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. హేమలత, పూనమ్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్‌పైనా ఏకైక పేసర్‌గా తెలుగమ్మాయి అరుంధతి రెడ్డినే కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్‌లో తేలిపోయింది. వంద పరుగులైనా చేయలేకపోతోంది. ఛేదనలోనూ చేతులెత్తేస్తోంది. ఒకరిద్దరు తప్ప బౌలర్లూ ప్రభావవంతంగా లేరు. భారత్‌తో మ్యాచ్ వారికి చావోరేవోలాంటిది. గెలిస్తేనే ప్రపంచ కప్ ప్రయాణంపై ఎంతోకొంత ఆశలుంటాయి. హ్యాట్రిక్ గెలుపుతో సెమీస్‌లో ఆసీస్ వరుసగా మూడో విజయంతో మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరింది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 33 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 53; 8 ఫోర్లు) వరుసగా రెండో అర్ధశతకంతో చెలరేగింది. ఓపెనర్ బెథాని మూనీ (26; 4 ఫోర్లు)తో పాటు రాచెల్ హేన్స్ (29; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మేఘన్ (3/25) మూడు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో మెగాన్ షట్ (3/12), సోఫీ (2/20), డెలిస్సా కిమ్మిన్స్ (2/24) ధాటికి న్యూజిలాండ్ 17.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. ఐర్లాండ్‌ను ఓడించిన పాక్ మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్తాన్ 38 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ జవేరియా ఖాన్ (52 బంతుల్లో 74; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకం, ఓపెనర్ అయేషా జాఫర్ (22) తోడ్పాటుతో పాక్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లూసీ ఓరియల్ (3/19) కట్టడి చేసింది. అయితే, ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ స్వల్ప లక్ష్యాన్నీ ఛేదించలేకపోయారు. పాక్ బౌలర్లు సనా మిర్ (2/20), ఐమన్ అన్వర్ (2/25), నష్రా సంధు (2/8), అలియా రియాజ్ (2/16) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేసే అవకాశమివ్వలేదు. ఓపెనర్ క్లేర్ షిల్లింగ్టన్ (25 బంతుల్లో 27; 5 ఫోర్లు), ఇసొబెల్ జాయ్సె (31 బంతుల్లో 30; 4 ఫోర్లు) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
ఐర్లాండ్ టి20 జట్టులో భారత సంతతి ఆటగాడు
డబ్లిన్: భారత్‌తో జరిగే రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొనే 14 మంది సభ్యులతో కూడిన ఐర్లాండ్ జట్టును ప్రకటించారు. పంజాబ్‌లో జన్మించి ఐర్లాండ్‌లో స్థిరపడిన భారత సంతతి ఆటగాడు సిమ్రాన్‌జిత్ సింగ్ (సిమీ సింగ్) ఈ జట్టులో చోటు లభించింది. 31 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సిమీ సింగ్ ఇప్పటికే ఐర్లాండ్ తరఫున ఏడు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. -
ఐర్లాండ్‌పై భారత్ విజయం
వాలెన్సియా: ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2-1తో నెగ్గింది. తొలి క్వార్టర్లో నెమ్మదైన ఆటను చూపిన భారత్‌కు ఐర్లాండ్ జట్టు నాలుగో నిమిషంలోనే షాక్ ఇచ్చింది. కైల్ గుడ్స్ ఆ జట్టు తరఫున గోల్ చేసి ఆధిక్యం అందించాడు. అనంతరం పుంజుకున్న భారత్.. తల్వీందర్ సింగ్ 22వ నిమిషంలో చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్లో కెప్టెన్ సర్దార్ సింగ్ (32) గోల్‌తో జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు పెనాల్టీ కార్నర్లు వచ్చినా వృధా అయ్యాయి.