T20 World Cup 2022: జట్టును ప్రకటించిన ఐర్లాండ్‌.. యువ ఆటగాడు ఎంట్రీ! | Ireland announce 15 member squad for T20 World Cup 2022 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: జట్టును ప్రకటించిన ఐర్లాండ్‌.. యువ ఆటగాడు ఎంట్రీ!

Sep 20 2022 5:43 PM | Updated on Sep 20 2022 9:39 PM

Ireland announce 15 member squad for T20 World Cup 2022 - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్‌లో ఐర్లాండ్‌ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గోన్న జట్టునే ఐర్లాండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు.

అదే విధంగా ఐర్లాండ్‌ యువ ఆటగాడు స్టీఫెన్ డోహెనీకి తొలి సారి టీ20ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో షేన్ గెట్‌కేట్, గ్రాహం కెన్నెడీ, బారీ మెక్‌క్రాతికి అవకాశం దక్కింది. కాగా ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో ఐర్లాండ్‌ తొలుత జింబాబ్వే, స్కాట్‌లాండ్‌, వెస్టిండీస్‌ వంటి జట్లతో క్వాలిఫియర్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

టీ20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్‌ జట్టు: ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్‌), పాల్ స్టిర్లింగ్ (వైస్ కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, కోనర్ ఓల్ఫెర్ట్, సిమి సింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రెయిగ్ యంగ్
స్టాండ్‌బై: షేన్ గెట్‌కేట్, గ్రాహం కెన్నెడీ, బారీ మెక్‌క్రాతి
చదవండి:
 IND vs AuS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్‌ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement