కుశాల్‌ మెండిస్‌ మెరుపులు.. ఐర్లాండ్‌పై లంక ఘన విజయం | T20 WC 2022: Sri Lanka Vs Ireland Match Live Updates-Highlights | Sakshi
Sakshi News home page

T20 WC IRE Vs SL: కుశాల్‌ మెండిస్‌ మెరుపులు.. ఐర్లాండ్‌పై లంక ఘన విజయం

Published Sun, Oct 23 2022 9:03 AM | Last Updated on Tue, Oct 25 2022 5:35 PM

T20 WC 2022: Sri Lanka Vs Ireland Match Live Updates-Highlights - Sakshi

సూపర్‌-12లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది.129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 15 ఓవర్లలోనే ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కుశాల్‌ మెండిస్‌ 43 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు నాటౌట్‌ చెలరేగగా.. ధనుంజయ డిసిల్వా 31, చరిత్‌ అసలంక 31 పరుగులు నాటౌట్‌ రాణించారు. ఐర్లాండ్‌ బౌలర్లలో గారెత్‌ డిలానీ ఒక వికెట్‌ తీశాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌  లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ, వనిందు హసరంగాలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లాహిరు కుమార, చమీర కరుణరత్నే, ధనంజయ డిసిల్వాలు తలా ఒక వికెట్‌ తీశారు.

10 ఓవర్లలో లంక స్కోరు 75/1
►10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్‌ నష్టానికి 75 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ 38, చరిత్‌ అసలంక 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 31 పరుగులు చేసిన డిసిల్వా డిలానే బౌలింగ్‌లో టక్కర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. లంక విజయానికి 60 బంతుల్లో 54 పరుగులు కావాలి.

ధాటిగా ఆడుతున్న లంక.. విజయం దిశగా
►129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు జట్టు ఓపెనర్లు కుషాల్‌ మెండిస్‌, ధనుంజయ డిసిల్వాలు శుభారంభం అందించారు. 8 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు వికెట్‌ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కుషాల్‌ 31, డిసిల్వాల 31 పరుగులతో అజేయంగా ఆడుతున్నారు.

శ్రీలంక టార్గెట్‌ 129
►సూపర్‌-12లో భాగంగా ఐర్లాండ్‌ జట్టు లంక ముందు 129 పరుగుల లక్ష్యాeన్ని నిర్దేశించింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్‌ 45 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ, వనిందు హసరంగాలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లాహిరు కుమార, చమీర కరుణరత్నే, ధనంజయ డిసిల్వాలు తలా ఒక వికెట్‌ తీశారు.

10 ఓవర్లలో ఐర్లాండ్‌ 60/4
►10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్‌ 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. డాక్రెల్‌ 0, టెక్టర్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రెండు పరుగులు చేసిన కాంఫెర్‌ కరుణరత్నే బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌(35) రూపంలో ఐర్లాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌..
►ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌(35) రూపంలో ఐర్లాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్టిర్లింగ్‌ రాజపక్సకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌ 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. 

4 ఓవర్లలో ఐర్లాండ్‌ స్కోరు 24/1
► శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది. పాల్‌ స్టిర్లింగ్‌ 13, లోర్కాన్‌ టక్కర్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన ఆండ్రూ బాల్బర్నీ లాహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌
► టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12లో ఇవాళ గ్రూఫ్‌-1లో శ్రీలంక, ఐర్లాండ్‌ మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. క్వాలిఫయింగ్‌ పోరులో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో టాపర్‌గా నిలిచి ఏ1గా అడుగుపెట్టిన శ్రీలంక అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది.

మరోవైపు ఐర్లాండ్‌ కూడా తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని సాధించింది. ఇరుజట్లు టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు తలపడగా(2009, 2021).. రెండుమార్లు విజయం లంకనే వరించింది. ఇక లంక తాను చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో ఏడు విజయాలు నమోదు చేయడం విశేషం. 

శ్రీలంక: దాసున్ షనక(కెప్టెన్‌), కుశాల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, అషెన్ బండార, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్‌), పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement