Andrew Balbirnie
-
ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్‌లలోనూ గెలుపు
అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఐరిష్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాల్ స్టిర్లింగ్ బృందం జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఐరిష్ పేసర్లు గ్రాహం హ్యూమ్, కర్టిస్ కాంఫర్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ జాయ్‌లార్డ్ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్‌డౌన్ బ్యాటర్ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగారు. అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ టార్గెట్‌ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్ కాంఫర్ 40, హ్యారీ టెక్టార్ 33 పరుగులు సాధించారు. బల్బిర్నీతో కలిసి లోర్కాన్ టకర్ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. కర్టిస్ కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్? -
వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కాకపోవడంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు..!
ఐర్లాండ్ వన్డే వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించలేకపోవడంతో ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఏడో స్థానం కోసం నిన్న (జులై 4) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించిన అనంతరం బల్బిర్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. బల్బిర్నీ తప్పుకోవడంతో క్రికెట్ ఐర్లాండ్ (సీఐ) పాల్ స్టిర్లింగ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. 32 ఏళ్ల బల్బిర్నీ మూడు ఫార్మాట్లలో కలిపి 89 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. బల్బిర్నీ 2019లో ఈ బాధ్యతలు చేపట్టాడు. బల్బిర్నీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గెలుపుతో ముగింపు పలకడం విశేషం. కాగా, జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో ఐర్లాండ్ కనీసం సూపర్ సిక్స్ దశకు కూడా చేరలేకపోయింది. ఆ జట్టు గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. ఈ టోర్నీలో అజేయంగా ఉన్న శ్రీలంక ఇదివరకే వన్డే వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించగా.. మరో బెర్త్ కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య పోటీ నెలకొంది. నిన్న జరిగిన కీలక సూపర్ సిక్స్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓటమితో జింబాబ్వే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. -
ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్ కొట్టేశాడు
ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్ 1) మొదలైన ఏకైక టెస్ట్ ద్వారా 25 ఏళ్ల జాషువ టంగ్ అనే ఇంగ్లండ్ పేసర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో, అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు జాక్‌పాట్ కొట్టి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. టంగ్ 11 ఏళ్ల వయసులో ఉండగా, టిమ్ పైపర్ అనే అతని ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు, టంగ్‌పై ఓ పందెం కాసాడు. టంగ్ భవిష్యత్తులో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని టిమ్ అప్పట్లో కొంత మొత్తం పందెం కాసాడు. ఇవాళ టంగ్ ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో టిమ్ పందెం గెలిచి, 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) జాక్‌పాట్ కొట్టేశాడు. టంగ్.. చిన్నతనం నుంచి క్రికెట్ ఆడటాన్ని గమినిస్తూ వచ్చిన టిమ్, అతను ఏదో ఒక రోజు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడట. 14 ఏళ్ల తర్వాత టిమ్ జోస్యం నిజమై, టంగ్ ఇంగ్లండ్ 711వ ప్లేయర్‌గా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. కాగా, ఐర్లాండ్‌తో టెస్ట్‌కు తొలుత ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో టంగ్‌కు చోటుదక్కలేదు. నలుగురు పేసర్లు వివిధ కారణాల చేత అందుబాటులోకి రాకపోవడంతో.. ఆఖరి నిమిషంలో టంగ్‌కు జట్టులో చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్షైర్ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. టంగ్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. స్టువర్ట్ బ్రాడ్ (5/51), జాక్ లీచ్ (3/35), మాథ్యూ పాట్స్ (2/36) సత్తా చాటడంతో ఐర్లాండ్ 172 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. చదవండి: WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
ఐర్లాండ్ బ్యాటర్ల ఆధిపత్యం.. తేలిపోయిన లంక బౌలర్లు, మరో 20 పరుగులు చేస్తే రికార్డు
గాలె: శ్రీలంకతో సోమవారం మొదలైన రెండో టెస్టులో ఐర్లాండ్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (163 బంతుల్లో 95; 14 ఫోర్లు) ఐదు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. పాల్ స్టిర్లింగ్ (133 బంతుల్లో 74 రిటైర్డ్‌హర్ట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లొర్కాన్ టకర్ (102 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) కూడా అర్ధ సెంచరీలు చేశారు. బాల్బిర్నీ, స్టిర్లింగ్ నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. టెస్టుల్లో ఐర్లాండ్ జట్టుకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మరో 20 పరుగులు సాధిస్తే ఐర్లాండ్ టెస్టుల్లో తమ అత్యధిక స్కోరును నమోదు చేస్తుంది. టకర్‌కు జతగా ప్రస్తుతం కాంఫెర్ (27 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టాడు. -
సరిపోని ఐర్లాండ్ పోరాటం.. బంగ్లాదేశ్ ఖాతాలో మరో సిరీస్
ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్‌ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్‌ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్) బంగ్లా టైగర్స్.. తాజాగా పసికూన ఐర్లాండ్‌పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది. బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (51 నాటౌట్) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొమినుల్ హాక్ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్ ఇక్బాల్ (31), లిటన్ దాస్ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ వికెట్‌కీపర్ టకెర్ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది. స్కోర్ వివరాలు.. ఐర్లాండ్: 214 & 292 బంగ్లాదేశ్: 369 & 138/3 -
శతకాలతో విరుచుకుపడిన ఐర్లాండ్ ఆటగాళ్లు
మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐర్లాండ్ క్రికెట్ టీమ్.. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (137 బంతుల్లో 121 రిటైర్డ్ హర్ట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఐరిష్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (13), స్టీఫెన్ డోహెనీ (3), జార్జ్ డాక్రెల్ (12), కర్టిస్ క్యాంఫర్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టగా.. బల్బిర్నీ, హ్యారీ టెక్టార్ అన్నీ తామై వ్యవహరించారు. జింబాబ్వే బౌలర్లలో విక్టర్ న్యాయుచి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగర్వా, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిధ్య జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20లో జింబాబ్వే నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్, నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో జింబాబ్వే గెలిచాయి. -
చెలరేగిన జింబాబ్వే బౌలర్లు.. పటిష్ట జట్లపై ఆడిన బ్యాటర్లకు చుక్కలు! గెలుపుతో
Zimbabwe vs Ireland, 1st T20I: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో జింబాబ్వే శుభారంభం చేసింది. హరారే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం ఐర్లాండ్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్లో గురువారం మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ టాస్ ఛాయిస్‌కు సార్థకత చేకూరేలా ఆతిథ్య జట్టు బౌలర్లు.. ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ర్యాన్ బర్ల్ మూడు వికెట్లు కూల్చగా.. చటారా, నగరవ, మసకద్జ రెండేసి వికెట్లు తీశారు. బ్రాడ్ ఎవాన్స్‌కు ఒక వికెట్ దక్కింది. టీమిండియా వంటి పటిష్ట జట్లపై మెరుగ్గా ఆడగలిగిన ఐరిష్ కెప్టెన్ బల్బిర్నీ(5), హ్యారీ టెక్టార్(5) వంటి కీలక బ్యాటర్లు విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో 24 పరుగులతో డెలని టాప్ స్కోరర్ అనిపించుకున్నాడు. ఇలా జింబాబ్వే బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి ఐర్లాండ్ 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగినప్పటికీ జింబాబ్వే విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఓపెనింగ్ జోడీ ఎర్విన్, మరునణి చెరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో మధెవెరె 16 పరుగులకు అవుటయ్యాడు. టాపార్డర్ విఫలమైన వేళ నాలుగో స్థానంలో వచ్చిన గ్యారీ బ్యాలన్స్ 30 పరుగులు చేయగా , సీన్ విలియమ్స్(34) పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన జింబాబ్వే జయకేతనం ఎగురవేసింది. చదవండి: దంచికొట్టిన సాల్ట్! సన్‌రైజర్స్‌కు తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం Rashid Khan: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
కుశాల్ మెండిస్ మెరుపులు.. ఐర్లాండ్‌పై లంక ఘన విజయం
సూపర్-12లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్లతో ఘన విజయాన్ని సాధించింది.129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 15 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు నాటౌట్ చెలరేగగా.. ధనుంజయ డిసిల్వా 31, చరిత్ అసలంక 31 పరుగులు నాటౌట్ రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డిలానీ ఒక వికెట్ తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ, వనిందు హసరంగాలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లాహిరు కుమార, చమీర కరుణరత్నే, ధనంజయ డిసిల్వాలు తలా ఒక వికెట్ తీశారు. 10 ఓవర్లలో లంక స్కోరు 75/1 ►10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 38, చరిత్ అసలంక 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 31 పరుగులు చేసిన డిసిల్వా డిలానే బౌలింగ్‌లో టక్కర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లంక విజయానికి 60 బంతుల్లో 54 పరుగులు కావాలి. ధాటిగా ఆడుతున్న లంక.. విజయం దిశగా ►129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు జట్టు ఓపెనర్లు కుషాల్ మెండిస్, ధనుంజయ డిసిల్వాలు శుభారంభం అందించారు. 8 ఓవర్లు ముగిసేసరికి లంక జట్టు వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. కుషాల్ 31, డిసిల్వాల 31 పరుగులతో అజేయంగా ఆడుతున్నారు. శ్రీలంక టార్గెట్ 129 ►సూపర్-12లో భాగంగా ఐర్లాండ్ జట్టు లంక ముందు 129 పరుగుల లక్ష్యాeన్ని నిర్దేశించింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో తీక్షణ, వనిందు హసరంగాలు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లాహిరు కుమార, చమీర కరుణరత్నే, ధనంజయ డిసిల్వాలు తలా ఒక వికెట్ తీశారు. 10 ఓవర్లలో ఐర్లాండ్ 60/4 ►10 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. డాక్రెల్ 0, టెక్టర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రెండు పరుగులు చేసిన కాంఫెర్ కరుణరత్నే బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(35) రూపంలో ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. మూడో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్.. ►ఓపెనర్ పాల్ స్టిర్లింగ్(35) రూపంలో ఐర్లాండ్ మూడో వికెట్ కోల్పోయింది. ధనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన స్టిర్లింగ్ రాజపక్సకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఐర్లాండ్ 9 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. 4 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు 24/1 ► శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 13, లోర్కాన్ టక్కర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఒక్క పరుగు మాత్రమే చేసిన ఆండ్రూ బాల్బర్నీ లాహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ► టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో ఇవాళ గ్రూఫ్-1లో శ్రీలంక, ఐర్లాండ్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. క్వాలిఫయింగ్ పోరులో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో టాపర్‌గా నిలిచి ఏ1గా అడుగుపెట్టిన శ్రీలంక అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని సాధించింది. ఇరుజట్లు టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు తలపడగా(2009, 2021).. రెండుమార్లు విజయం లంకనే వరించింది. ఇక లంక తాను చివరగా ఆడిన ఎనిమిది టి20ల్లో ఏడు విజయాలు నమోదు చేయడం విశేషం. శ్రీలంక: దాసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, అషెన్ బండార, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్ -
WI Vs IRE: విండీస్ విలాపం
రెండుసార్లు ప్రపంచ చాంపియన్, విధ్వంసక ఆటగాళ్లకు పెట్టింది పేరు, టి20 ఫార్మాట్‌కే కొత్త వినోదాన్ని అందించిన జట్టు చివరకు ఇలా మారిపోయింది! ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించకపోవడమే ఒక వైఫల్యం కాగా, ఇప్పటి ప్రదర్శన వెస్టిండీస్ క్రికెట్‌కు మరో విషాదం! అర్హత పోరులో తమకంటే కూనలైన జట్లపై రెండు మ్యాచ్‌లలో కూడా నెగ్గలేని కరీబియన్ బృందం వేదనతో నిష్క్రమించింది. స్కాట్లాండ్ చేతిలో తొలి రోజే ఓడినా... 2016లో అఫ్గానిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకొని విశ్వవిజేతగా నిలిచినట్లుగా మళ్లీ చెలరేగి తమ స్థాయిని ప్రదర్శిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అద్భుతాలు జరగలేదు. ఐర్లాండ్ స్ఫూర్తిదాయక ఆట ముందు తలవంచిన మాజీ చాంపియన్ ఆట క్వాలిఫయింగ్ దశలోనే ముగిసింది. 90ల్లో టెస్టు క్రికెట్ చచ్చిపోయి ...2000ల్లో వన్డే క్రికెట్లో పూర్తి ఓవర్లు కూడా ఆడలేని స్థాయికి దిగజారి... ఈ రెండూ లేకపోయినా, 2010 తర్వాత టి20 దూకుడుకు చిరునామాగా మారి అద్భుతాలు చూపించిన వెస్టిండీస్ ఇప్పుడు ఈ ఫార్మాట్లో కూడా దిగజారడం క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయం. హోబర్ట్: టి20 ప్రపంచకప్‌లో రెండుసార్లు (2012, 2016) చాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ ఈసారి క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరిగింది. ‘సూపర్ 12’ దశకు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ పోరులో ఐర్లాండ్ 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితం కాగా... ఐర్లాండ్ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 150 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌లలో రెండు గెలిచిన ఐర్లాండ్ ముందంజ వేయగా, ఒక విజయం సాధించిన వెస్టిండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కింగ్ మినహా... విండీస్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. పవర్‌ప్లేలో మేయర్స్ (1), చార్లెస్ (18 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్లు కోల్పోయిన జట్టు 41 పరుగులు చేయగలిగింది. ఈ దశలో బ్రెండన్ కింగ్ (48 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నాడు. అతను ఇచ్చిన రిట ర్న్ క్యాచ్‌ను సిమీ సింగ్ వదిలేయడం కూడా కొంత కలిసొచ్చింది. అయితే లెగ్ స్పిన్నర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గారెత్ డెలానీ (3/16) విండీస్‌ను దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను లూయిస్ (13), పూరన్ (13), పావెల్ (6)లను అవుట్ చేయడంతో జట్టు కోలుకోలేకపోయింది. ఆరో వికెట్‌కు కింగ్, ఒడెన్ స్మిత్ (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి 21 బంతుల్లో 34 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దినా భారీ స్కోరు మాత్రం సాధ్యం కాలేదు. స్టిర్లింగ్ జోరు... ఛేదనలో ఐర్లాండ్ ఎక్కడా తడబడలేదు. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండీ బల్బర్నీ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడుతూ శుభారంభం అందించారు. పవర్‌ప్లేలో 64 పరుగులు రాబట్టిన వీరిద్దరు తొలి వికెట్‌కు 45 బంతుల్లో 73 పరుగులు జత చేశారు. వీరిద్దరిని నిలువరించడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. 32 బంతుల్లో స్టిర్లింగ్ అర్ధ సెంచరీ పూర్తయింది. స్టిర్లింగ్, లార్కన్ టకర్ (35 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 61 బంతుల్లో అభేద్యంగా 77 పరుగులు జత చేశారు. విజయానికి ఐర్లాండ్ మరో 40 పరుగుల దూరంలో ఉన్న దశలో టకర్‌ను స్మిత్ అవుట్ చేసినా అది నోబాల్‌గా తేలింది. మెకాయ్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా టకర్ ఫోర్ కొట్టడంతో ఐర్లాండ్ సంబరాల్లో, వెస్టిండీస్ విషాదంలో మునిగిపోయాయి. 2009 వరల్డ్‌కప్ తర్వాత ప్రధాన గ్రూప్‌కు ఐర్లాండ్ అర్హత సాధించడం ఇదే తొలిసారి. సూపర్-12లో ఐర్లాండ్ ఏకంగా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించి సగర్వంగా సూపర్-12లో అడుగుపెట్టింది. డిలానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక క్వాలిఫైయర్ దశలోనే విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ‘‘పేరుకే రెండుసార్లు చాంపియన్. మరీ ఇంత ఘోరంగా విఫలమవుతారనుకోలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022: పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు -
T20 World Cup 2022: జట్టును ప్రకటించిన ఐర్లాండ్.. యువ ఆటగాడు ఎంట్రీ!
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2022కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్లో ఐర్లాండ్ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. కాగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గోన్న జట్టునే ఐర్లాండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. అదే విధంగా ఐర్లాండ్ యువ ఆటగాడు స్టీఫెన్ డోహెనీకి తొలి సారి టీ20ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. అదే విధంగా స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో షేన్ గెట్‌కేట్, గ్రాహం కెన్నెడీ, బారీ మెక్క్రాతికి అవకాశం దక్కింది. కాగా ఈ ఐసీసీ మెగా ఈవెంట్లో ఐర్లాండ్ తొలుత జింబాబ్వే, స్కాట్లాండ్, వెస్టిండీస్ వంటి జట్లతో క్వాలిఫియర్ మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్ జట్టు: ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్ (వైస్ కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, కోనర్ ఓల్ఫెర్ట్, సిమి సింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రెయిగ్ యంగ్ స్టాండ్‌బై: షేన్ గెట్‌కేట్, గ్రాహం కెన్నెడీ, బారీ మెక్క్రాతి చదవండి: IND vs AuS: ఆస్ట్రేలియాతో మూడో టీ20.. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో రగడ! -
ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం
Ireland vs Afghanistan, 5th T20I: సీమర్లు మార్క్ అడైర్ (3/16), జాషువ లిటిల్ (2/14) రెచ్చిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుని పర్యాటక జట్టుకు భారీ షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 15 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా భారీ వర్షం కురువడంతో ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపేసిన అంపైర్లు.. ఆ తర్వాత వర్షం కాస్త ఎడతెరిపినివ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఐర్లాండ్‌కు 7 ఓవర్లలో 56 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించారు. ఐర్లాండ్ 3 వికెట్లు కోల్పోయి మరో 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఘని (40 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా తడబడినప్పటికీ లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించారు. పాల్ స్టిర్లింగ్ (10 బంతులో 16), లోర్కన్ టక్కర్ (12 బంతుల్లో 14) రెండంకెల స్కోర్లు సాధించగా.. హ్యారీ టెక్టార్ (5 బంతుల్లో 9), జార్జ్ డాక్రెల్ (4 బంతుల్లో 7) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ 2, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ గెలుపొందగా.. ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను డిసైడర్ దాకా తీసుకువచ్చింది. చదవండి: రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ -
Ire Vs Afg: వరుసగా రెండు ఓటముల తర్వాత ఎట్టకేలకు..
Ireland vs Afghanistan, 3rd T20I : ఐర్లాండ్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన అఫ్గనిస్తాన్‌కు ఎట్టకేలకు విజయం దక్కింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మూడో టీ20లో మహ్మద్ నబీ బృందం 22 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. అర్ధ శతకంతో రాణించిన అఫ్గన్ వికెట్ కీపర్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్(35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం అఫ్గనిస్తాన్.. ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి రెండు మ్యాచ్‌లలో ఐర్లాండ్ వరుసగా 7 వికెట్లు, ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది పర్యాటక జట్టుకు గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో మూడో టీ20లో విజయం సాధించిన అఫ్గనిస్తాన్ సిరీస్ గెలుపు రేసులో నిలిచింది. మ్యాచ్ సాగిందిలా! బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ శుక్రవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అందరూ అదరగొట్టారు.. కెప్టెన్ మాత్రం ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ 39, గుర్బాజ్ 53 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ఇబ్రహీం 36, ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన నజీబుల్లా 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ మహ్మద్ నబీ(6) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. ఆదిలోనే ఎదురుదెబ్బ! ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ డకౌట్‌గా వెనుదిరగగా.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ ఒకే ఒక్క పరుగు తీసి పెవిలియన్ చేరాడు. ఓపెనింగ్ జోడీ విఫలం కావడం సహా మిడిలార్డర్ కుప్పకూలడంతో ఐర్లాండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. అయితే, జార్జ్ డాక్రెల్ 58 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేసినా వృథానే అయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరగడంతో 22 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిపాలైంది. Keep going, George! SCORE: https://t.co/iHiY0U5y7J STREAM UK & ROI: https://t.co/er67plljbH#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/jFAgBgjQOO — Cricket Ireland (@cricketireland) August 12, 2022 చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే! NZ vs WI: మారని ఆటతీరు.. మరో వైట్‌వాష్ దిశగా వెస్టిండీస్ -
Ire Vs Afg: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఐర్లాండ్.. ఏడు వికెట్లతో చిత్తు చేసి..
Afghanistan tour of Ireland, 2022- Ireland Vs Afghanistan 1st T20: ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తూ క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్న ఐర్లాండ్ జట్టు.. అఫ్గనిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ టూర్‌కు వెళ్లింది. శుభారంభమే అయినా.. ఈ క్రమంలో బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది అఫ్గనిస్తాన్. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్(26), ఉస్మాన్ ఘని(59) శుభారంభం అందించారు. కానీ ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మిడిలార్డర్ చేతులెత్తేసింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ మహ్మద్ నబీ(5) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ఇబ్రహీం జద్రాన్ 29 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్ 168 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో జోషువా లిటిల్‌కు ఒకటి, బ్యారీ మెకార్తీకి మూడు, గరెత్ డెలనీకి ఒకటి, జార్జ్ డాక్రెల్కు రెండు వికెట్లు దక్కాయి. కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ బ్యాటర్లు ఆది నుంచి దంచికొట్టారు. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 31 పరుగులు చేయగా.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(38 బంతుల్లో 51 పరుగులు)తో మెరిశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్ సైతం హాఫ్ సెంచరీ(32 బంతుల్లో 50 పరుగులు) చేశాడు. 50 partnership up between the two openers! SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/6oVMBS8LU3 — Cricket Ireland (@cricketireland) August 9, 2022 హ్యారీ టెక్టర్ 15 బంతుల్లో 25, జార్జ్ డాక్రెల్ 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించిన ఐర్లాండ్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. Two half-centuries in three T20I innings for Lorcan Tucker 👏 SCORE: https://t.co/iHiY0U5y7J#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/qcF2DXbses — Cricket Ireland (@cricketireland) August 9, 2022 హాఫ్ సెంచరీ హీరో, కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో టీమిండియా, న్యూజిలాండ్ జట్లకు ఐర్లాండ్ గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా సేనతో రెండో టీ20లో.. కివీస్‌తో మూడో వన్డేలో ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది. చదవండి: Nitu Ghanghas: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘బంగారం’తో మెరిసి.. Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
మొన్న టీమిండియా.. ఇప్పుడు కివీస్‌ను వణికించారు! అట్లుంటది మాతోటి!
Ireland Vs New Zealand ODI Series 2022: ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియాకే చెమటలు పట్టించింది ఐర్లాండ్. ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి నాలుగు పరుగుల తేడాతో హార్దిక్ పాండ్యా సేన చేతిలో ఓడింది. అయినా.. ప్రత్యర్థి జట్టుతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకుంది. అదే తరహాలో శుక్రవారం నాటి మూడో వన్డేలోనూ చివరి వరకు ఐర్లాండ్ జట్టు పోరాడిన తీరు అద్భుతం. అట్లుంటది మాతోని ఇప్పటికే కివీస్‌కు సిరీస్ సమర్పించుకున్న ఐర్లాండ్.. డబ్లిన్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 361 పరుగుల భారీ స్కోరు ఛేదించే దిశగా పయనించి న్యూజిలాండ్ ఆటగాళ్లను వణికించింది. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 120 పరుగులతో అదరగొడితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హ్యారీ టెక్టార్ 108 పరుగులు సాధించాడు.కానీ ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సి ఉండగా.. బై రూపంలో ఒక పరుగు మాత్రమే లభించడంతో ఆండ్రూ బృందం పర్యాటక కివీస్ ముందు తలవంచక తప్పలేదు. పసికూన కాదు! ఈ నేపథ్యంలో ఐర్లాండ్ ఓడినా అసాధారణ ఆట తీరుతో మనసులు మాత్రం గెలుచుకుందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా, కివీస్ వంటి మేటి జట్లకే వణుకు పుట్టించింది ఇకపై ఐర్లాండ్ పసికూన కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ సైతం ఐర్లాండ్ పోరాట పటిమను కొనియాడాడు. A special moment for Paul Stirling. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/Tyg4ykcTcW — Cricket Ireland (@cricketireland) July 15, 2022 మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మ్యాచ్ అద్భుతంగా సాగింది. ముఖ్యంగా ఇలాంటి పిచ్ రూపొందించినందుకు గ్రౌండ్స్‌మెన్‌కు క్రెడిట్ ఇవ్వాలి. మేము బ్యాటింగ్ చేసే సమయంలో హార్డ్‌గా ఉంది. ఐర్లాండ్ బ్యాటర్లు సైతం ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అయితే, వారు ఆడిన విధానం అమోఘం. మేము ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వారు పోరాడిన తీరు అద్భుతం. ఐర్లాండ్ జట్టు రోజురోజుకీ తమ ఆటను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న తీరు ఆకట్టుకుంటోంది’’ అని కొనియాడాడు. ఇక ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ.. ‘‘ఇదొక అద్భుతమైన మ్యాచ్. మేము చాలా బాగా ఆడాము. కానీ ఓటమి పాలయ్యాం. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఐరిష్ జెర్సీలోని ఆటగాళ్లు రెండు సెంచరీలు నమోదు చేయడం సూపర్. టెక్టర్ ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. రెండు వారాల వ్యవధిలో రెండు శతకాలు బాదాడు. ఈ ఏడాది మాకు ఇదే ఆఖరి వన్డే అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అయితే, మరిన్ని టీ20 మ్యాచ్‌లు ఆడతాం’’ అని పేర్కొన్నాడు. కాగా కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఐర్లాండ్ వరుసగా ఒక వికెట్, మూడు వికెట్లు, ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. Harry Tector has only been dismissed once before reaching 50 in his last nine ODI innings. What a talent. SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/LlFUkf0Xe3 — Cricket Ireland (@cricketireland) July 15, 2022 ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే వేదిక: ది విలేజ్, డబ్లిన్ టాస్: న్యూజిలాండ్- బ్యాటింగ్ న్యూజిలాండ్ స్కోరు: 360/6 (50) ఐర్లాండ్ స్కోరు: 359/9 (50) విజేత: ఒక పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ గప్టిల్(126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 115 పరుగులు)