మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐర్లాండ్ క్రికెట్ టీమ్.. వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (జనవరి 18) జరుగుతున్న తొలి వన్డేలో భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (137 బంతుల్లో 121 రిటైర్డ్ హర్ట్; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టార్ (109 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
ఐరిష్ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ (13), స్టీఫెన్ డోహెనీ (3), జార్జ్ డాక్రెల్ (12), కర్టిస్ క్యాంఫర్ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టగా.. బల్బిర్నీ, హ్యారీ టెక్టార్ అన్నీ తామై వ్యవహరించారు. జింబాబ్వే బౌలర్లలో విక్టర్ న్యాయుచి 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగర్వా, సికందర్ రజా తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిధ్య జింబాబ్వే 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20లో జింబాబ్వే నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్, నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో జింబాబ్వే గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment