దక్షిణాఫ్రికా ఓపెనర్‌ శుభారంభం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్‌ | Reeza Hendricks And Ryan Rickelton Power South Africa To A Convincing Win | Sakshi
Sakshi News home page

SA vs IRE: దక్షిణాఫ్రికా ఓపెనర్‌ శుభారంభం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్‌

Published Sat, Sep 28 2024 3:46 PM | Last Updated on Sat, Oct 5 2024 1:47 PM

Reeza Hendricks And Ryan Rickelton Power South Africa To A Convincing Win

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో ద‌క్షిణాఫ్రికా శుభారంభం చేసింది. అబుదాబి వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రొటియేస్ జట్టు ఊదిప‌డేసింది.

కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 17.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ల‌క్ష్య ఛేదనలో స‌ఫారీ ఓపెన‌ర్లు ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్ విధ్వంసం సృష్టించారు. ఐరీష్ బౌలర్లను ఊచకోత కోశాడు.

వీరిద్దరూ తొలి వికెట్‌కు 13 ఓవర్లలో 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. రికెల్టన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులు చేయగా.. హెండ్రిక్స్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. 

కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో కర్టిస్ కాంఫర్(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో పాట్రిక్ కుర్గర్ 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 అబుదాబి వేదిక‌గా సెప్టెంబర్ 29న జరగనుంది.
చదవండి: SL vs NZ: జ‌య‌సూర్య 'సిక్స‌ర్‌'.. 88 ప‌రుగుల‌కే న్యూజిలాండ్ ఆలౌట్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement