ఐర్లాండ్‌పై భారత్ విజయం | India rally to beat Ireland in six-nation hockey tournament | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌పై భారత్ విజయం

Published Wed, Jun 29 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

India rally to beat Ireland in six-nation hockey tournament

వాలెన్సియా: ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 2-1తో నెగ్గింది. తొలి క్వార్టర్‌లో నెమ్మదైన ఆటను చూపిన భారత్‌కు ఐర్లాండ్ జట్టు నాలుగో నిమిషంలోనే షాక్ ఇచ్చింది. కైల్ గుడ్స్ ఆ జట్టు తరఫున గోల్ చేసి ఆధిక్యం అందించాడు. అనంతరం పుంజుకున్న భారత్.. తల్వీందర్ సింగ్ 22వ నిమిషంలో చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. మూడో క్వార్టర్‌లో కెప్టెన్ సర్దార్ సింగ్ (32) గోల్‌తో జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా వృధా అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement