
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు.
అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో ప్రోటీస్ తలపడనుంది.
ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్‌తో మూడు టీ20 సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది.
ఐర్లాండ్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు
డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే
చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment