southafrica
-
సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ప్రకటించింది. కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్తో పాటు 12 మంది సభ్యులను సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.అదేవిధంగా ఏడుగురు ఆటగాళ్లను సన్‌రైజర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాతో పాటు డేవిడ్ మలన్, ఎం డేనియల్ వోరాల్, డమ్ రోసింగ్టన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, బ్రైడన్ కార్స్‌లు ఉన్నారు.మరోవైపు వచ్చే ఏడాది సీజన్ కోసం రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), క్రెయిగ్ ఓవర్టన్ (ఇంగ్లండ్), జాక్ క్రాలే (ఇంగ్లండ్)లతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్తగా ఒప్పందం కుదర్చుకుంది. అదేవిధంగా ప్రోటీస్ ఆటగాడు డేవిడ్ బెడింగ్హామ్ సన్‌రైజర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా లీగ్ మూడో సీజన్ వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనుంది. ఇక తొలి రెండు సీజన్లలోనూ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టునే ఛాంపియన్స్‌గా నిలిచింది.సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదేఐడైన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, టామ్ అబెల్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), జోర్డాన్ హెర్మన్, పాట్రిక్ క్రూగర్, బేయర్స్ స్వాన్‌పోయెల్, సైమన్ హార్మర్, లియామ్ డాసన్ (ఓవర్సీస్, ఇంగ్లండ్), కాలేబ్ సెలెకా, ఆండిల్ సిమెలన్. -
2024: ఎన్నికల ఏడాది
2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి! ఒక్క ఏడాదిలో ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. అలా 2024 రికార్డులకెక్కబోతోంది. పైగా అత్యధిక జనాభా ఉన్న టాప్ 10 దేశాల్లో ఏకంగా ఏడు ఈసారి ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండటం విశేషం. ఆ లెక్కన ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ ఏడు ఓటు హక్కును వినియోగించుకోనుండటం ఇంకో విశేషం! ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ మొదలుకుని అగ్ర రాజ్యం అమెరికా దాకా ఈ జాబితాలో ఉన్న ముఖ్యమైన దేశాలను ఓసారి చూద్దాం... బంగ్లాదేశ్ 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తొలి దేశం. జనవరి 7న అక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే విపక్షాలన్నింటినీ నిరీ్వర్యం చేసి ఏకపక్ష ఎన్నికల ప్రహసనానికి తెర తీశారంటూ ప్రధాని షేక్ హసీనా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అణచివేతను తట్టుకోలేక పలువురు విపక్ష నేతలు ప్రవాసంలో గడుపుతున్నారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్టతో పాటు విపక్షాలన్నీ బాయ్‌కాట్ చేసిన ఈ ఎన్నికల్లో హసీనా మరోసారి నెగ్గడం, వరుసగా ఐదోసారి అధికారంలోకి రావడం లాంఛనమే కానుంది. ప్రజాస్వామ్యానికి చెల్లుచీటీ పాడి చైనా మాదిరిగా దేశంలో హసీనా ఏక పార్టీ వ్యవస్థను నెలకొల్పేలా ఉన్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తైవాన్ చైనా పడగ నీడన తన స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్న తైవాన్‌లో జనవరి 13న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార డీపీపీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు బదులుగా లై చింగ్ టే బరిలో ఉన్నారు. ఆయనకు వెన్కు మించిన స్వాతంత్య్ర ప్రియునిగా పేరుంది. ఉదారవాద క్యోమింటాంగ్ నేత హో యూ యీ, తైవాన్ పీపుల్స్ పార్టీ తరఫున కో వెన్ జే ఆయనను సవాలు చేస్తున్నారు. డీపీపీ 2016 నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈసారి కూడా అది అధికారంలోకి వస్తే యుద్ధానికి దిగైనా తైవాన్ను విలీనం చేసుకుంటానంటూ చైనా ఇప్పటికే బెదిరిస్తోంది. దాంతో ఈ ఎన్నికలు తైవాన్‌కు ఒకరకంగా జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. పాకిస్తాన్ 24 కోట్ల జనాభా ఉన్న పాక్ అనిశి్చతికి మారుపేరు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగాలి. కానీ అవి వాయిదా పడే సూచనలే ఎక్కువగా కని్పస్తున్నాయి. సైన్యాన్ని ఎదిరించి ప్రధాని పదవి కోల్పోయి అవినీతి కేసుల్లో జైలు పాలైన పీటీఐ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ పోటీకి దారులు మూసుకుపోయినట్టు కని్పస్తున్నాయి. ఆయన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం అనుమానంగా మారింది. సైన్యం దన్నుతో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్) విజయం, ప్రవాసం నుంచి తిరిగొచి్చన ఆ పార్టీ నేత నవాజ్ షరీఫ్ మరోసారి ప్రధాని కావడం లాంఛనమేనని అక్కడి రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇండొనేసియా 27 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఇండొనేసియాలో కూడా ఫిబ్రవరిలో ఎన్నికలున్నాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షునితో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ పార్లమెంటు సభ్యులకు ఫిబ్రవరి 14న ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు టర్ములు పూర్తి చేసుకున్న అధ్యక్షుడు జొకో విడొడొ స్థానంలో రక్షణ మంత్రి 72 ఏళ్ల ప్రాబొవో సుబియంటో బరిలో ఉన్నారు. గంజర్ ప్రనోవో, అనీస్ బస్వేదన్ గట్టి పోటీ ఇస్తున్నారు. భారత్ 140 కోట్లకు పైగా జనాభా, 90 కోట్ల పై చిలుకు ఓటర్లతో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామ్యంగా అలరారుతున్న భారత్ ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. ఇన్ని కోట్ల మంది ఓటర్లు అత్యంత శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రపంచమంతా అబ్బురపాటుతో వీక్షించడం పరిపాటిగా మారింది. ఈ ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ఖాయమని అత్యధిక రాజకీయ అంచనాలు చెబుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని 2014లో ఆయన ఒంటి చేత్తో అధికారంలోకి తేవడం తెలిసిందే. 2019లోనూ మోదీ మేజిక్ రిపీటైంది. ఈసారి దానికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ సారథ్యంలో 28 విపక్ష పారీ్టలతో కూడిన విపక్ష ఇండియా కూటమి ప్రయతి్నస్తోంది. మెక్సికో జూన్ 2న ఎన్నికలకు మెక్సికో సిద్ధమవుతోంది. 13 కోట్ల జనాభా ఉన్న ఈ దేశ చరిత్రలోనే తొలిసారిగా అధ్యక్ష పదవితో పాటు మొత్తం 32 రాష్ట్రాల గవర్నర్లు, జాతీయ కాంగ్రెస్, స్థానిక సంస్థల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. క్లాడియా షేన్‌బామ్ రూపంలో ఈసారి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టే ఆస్కారం కనిపిస్తుండటంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సైంటిస్టు, మెక్సికో సిటీ మాజీ మేయర్ అయిన ఆమె అధికార మొరేనా పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్‌లోని మొత్తం 27 దేశాల ప్రజలూ కీలకమైన ప్రతి ఐదేళ్లకోసారి యూరప్ పార్లమెంటులో తమ ప్రతినిధులను ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. విద్య, వైద్యం మొదలుకుని ఉపాధి దాకా ఆ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసే పలు కీలక రంగాలకు సంబంధించి నిర్ణాయక చట్టాలు చేయడంలో పార్లమెంటుదే కీలక పాత్ర. దాంతో జూన్ 6 నుంచి 9 దాకా జరగనున్న ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 720 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికవుతారు. దక్షిణాఫ్రికా 6 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న ఈ దేశంలో మే–ఆగస్టు మధ్య సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 1994లో దేశంలో వర్ణ వివక్ష అంతమయ్యాక జరుగుతున్న ఏడో ఎన్నికలివి. అప్పటినుంచీ అధికారంలో కొనసాగుతున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ఈసారి విజయానికి కావాల్సిన 50 శాతం మార్కును దాటడం కష్టకాలమేనంటున్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సర్వేలో ఆ పారీ్టకి మద్దతు 45 శాతానికి పడిపోయింది. అవినీతి మకిలి అధ్యక్షుడు సిరిల్ రామాఫోసాకు ఈసారి ప్రధాన అడ్డంకిగా మారేలా కని్పస్తోంది. అధికారంలోకి వస్తూనే పూర్వ అధ్యక్షుడు జాకబ్ జుమా అవినీతిని క్షమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. అధికారుల్లో పెచ్చరిల్లిన అవినీతి పరిస్థితిని ఏఎన్‌సీకి మరింత ప్రతికూలంగా మార్చిందంటున్నారు. విపక్ష డెమొక్రటిక్ అలయెన్స్ దానికి గట్టిపోటీ ఇచ్చేలా కని్పస్తోంది. అమెరికా 33 కోట్ల పై చిలుకు జనాభా ఉన్న అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఆకర్షించేవే. అధ్యక్షున్ని ఎన్నుకోవడంతో పాటు ప్రతినిధుల సభలో మొత్తం స్థానాలతో పాటు సెనేట్‌లో మూడో వంతు సీట్లకు కూడా పోలింగ్ జరుగుతుంది. అయితే ఈసారి నవంబర్ 5న జరగనున్న ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొనేలా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనమే అందుకు ఏకైక కారణం! 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు ఆయన ససేమిరా అనడం, తననే విజేతగా ప్రకటించాలంటూ మొండికేయడం తెలిసిందే. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అధ్యక్షునిగా ప్రకటించకుండా అడ్డుకునేందుకు ఏకంగా క్యాపిటల్ భవనంపైకి తన మద్దతుదారులను దాడికి ఉసిగొల్పారు ట్రంప్. ఆ కేసులో ఆయన దోషిగా తేలడం, ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా మారే ప్రమాదంలో పడటం విశేషం! ఈ గండం గట్టెక్కితే ట్రంప్ మరోసారి బైడెన్‌తోనే తలపడతారు. ఘనా 3 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా రెండోసారి అధ్యక్షునిగా కొనసాగుతున్న ననా అకుఫో అడో స్థానంలో కొత్త నేతను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అధికార న్యూ పేట్రియాటిక్ పార్టీ, విపక్ష నేషనల్ డెమొక్రటిక్ కాంగ్రెస్ మధ్య ఈసారి హోరాహోరీ ఖాయమంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
BRICS 2023: జోహన్నెస్‌బెర్గ్‌కు పయనమైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: జోహన్నెస్‌బెర్గ్ వేదికగా జరగనున్న బ్రిక్స్-2023 సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా ప్రయాణమయ్యారు. అంతా సజావుగా సాగితే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించే అవకాశముందంటున్నాయి పీఎంవో కార్యాలయ వర్గాలు. జోహన్నెస్‌బెర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్ సమావేశాల్లో బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా దేశాలతో కలిసి పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా బయలుదేరారు. చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. ఈ సమావేశాల్లో భారత్ ప్రధాని నరేంద్రమోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశముందా అన్న ప్రశ్నకు విదేశీ కార్యదర్శి వినయ్ ఖ్వత్రా మేము కూడా ఆ విషయంపై సానుకూలంగానే ఉన్నాము. మా ప్రయత్నాలైతే మేము చేస్తున్నామని అన్నారు. అదే అజరిగితే మే 2020 తర్వాత చైనాతో భారత్ ముఖాముఖి వెళ్లడం ఇదే మొదటిసారి అవుతుంది. చివరిసారిగా వీరిద్దరూ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సమావేశాల్లో అందరి దృష్టి ఈ అంశంపైనే ఉంది. బ్రిక్స్ సమావేశాలకు ముందు సన్నాహకంగా భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజోత్ దోవల్ గత నెల చిన్నా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. అప్పుడే ఈ రెండు దేశాల మధ్య కొన్ని కీలక అంశాలపై సానుకూల, నిర్ణయాత్మక, లోతైన చర్చలు జరిగాయి. 2020లో గాల్వాన్ లోయలోనూ, పాంగాంగ్ నదీ తీరంలోనూ, గోగ్రా ప్రాంతంలోనూ చైనా సైన్యం దూకుడుగా వ్యవహారించి ఉద్రిక్తతకు తెరతీసింది. ఈ సమావేశాల్లో ఇరుదేశాల మధ్య సంధి కుదిరి సత్సంబంధాలు నెలకొంటాయని భారత విదేశాంగ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. బ్రిక్స్-2023 సమావేశాల్లో ప్రధానంగా దక్షిణదేశాల సంబంధాలపైనా భవిష్యత్తు కార్యాచరణపైనా దృష్టి సారించనున్నాయి ఈ ఐదు దేశాలు. ఇది కూడా చదవండి: డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్ -
అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు దక్షిణాఫ్రికా అర్హత సాధించింది. చెమ్స్‌ఫోర్డ్ వేదికగా బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో దక్షిణాఫ్రికా జట్టు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానం కోసం ఐర్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి ఉంటే ఐర్లాండ్ నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించేది. కానీ దురదృష్టవశాత్తూ తొలి వన్డే రద్దుకావడంతో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసివచ్చింది. దీంతో ఈ మెగా టోర్నీకు నేరుగా క్వాలిఫై అయిన ఎనిమిదవ జట్టుగా ప్రోటీస్ నిలిచింది. కాగా వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడతాయి. ఈ క్వాలిఫియర్ మ్యాచ్‌లు జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. చదవండి: #ManishPandey: 'నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్ జేస్తివి!' -
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తొలిసారి నిర్వహించనున్న ఎస్ఏ టి20 లీగ్‌లో మొత్తం ప్రైజ్‌మనీ వివరాలను ప్రకటించారు. టోర్నీలో 7 కోట్ల ర్యాండ్ లు (రూ. 33 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్, మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వెల్లడించారు. దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్లో ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద మొత్తం. జనవరి 10 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మొత్తం 6 జట్లు ఇందులో పాల్గొంటుండగా... ఆరు టీమ్‌లనూ ఐపీఎల్‌కు చెందిన యాజమాన్యాలే కొనుగోలు చేశాయి. ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్, పార్ల్ రా యల్స్, జొహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్, ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేర్లతో జట్లు బరిలోకి దిగుతాయి. చదవండి: AUS-W vs IND-W: ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి.. -
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు. అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో ప్రోటీస్ తలపడనుంది. ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్‌తో మూడు టీ20 సిరీస్‌ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఐర్లాండ్‌తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..! -
కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్..
Mondli Khumalo Health Condition: బ్రిడ్జ్‌వాటర్‌లో గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ఖుమాలో కోమా నుంచి బయట పడ్డాడు. ఈ విషయాన్ని అతడి సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ తెలిపాడు. మొండ్లీ ఖుమా యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా గత ఆదివారం తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు మూడు సర్జరీలు చేశారు. "మొండ్లీ శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు తన తల్లి కోసం అడుగుతున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌ను చూస్తున్నాడు. ఇక అతడి తదుపరి మ్యాచ్ ఎప్పుడు అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. గత 24 గంటల్లో అతడు బాగా కోలుకున్నాడు అని లాయిడ్ ఐరిష్ పేర్కొన్నాడు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి!
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. నిర్ణాయక మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తస్కిన్ అహ్మద్ (5/35) దెబ్బకు 37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జన్నెమాన్ మలన్ 39 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 5 వికెట్లు పడగొట్టగా, షకీబ్ అల్ హసన్ రెండు, మెహాది హాసన్,షారిఫుల్ ఇస్లాం చెరో వికెట్ సాధించారు. ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (87 నాటౌట్; 14 ఫోర్లు) మెరిశాడు. తస్కిన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్, అఫ్రిది -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేశాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరం అవుతాడు అనుకున్న ఢిల్లీ స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే వచ్చేశాడు. అయితే గాయం కారణంగా గత కొంత కాలంగా దక్షిణాఫ్రికా జట్టుకు నోర్జే దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్లో పాల్గొనడంపై సందేహాలు తలెత్తాయి. కానీ నోర్జే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు తన భార్యతో కలిసి ముంబైలో ఢిల్లీ జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకున్న అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించిక పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ అతడి ఫిట్‌నెస్‌పై బీసీసీఐకు కీలక సూచనలు చేసినట్లు సమచారం. ఢిల్లీ క్యాపిటల్స్ వైద్య బృందం అతడికి మరోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనుంది. నోర్జే ఫిట్ గా ఉన్నాడని ఢిల్లీ వైద్య బృందం తేల్చితేనే ఐపీఎల్లో ఆడనున్నాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. చదవండి: Suresh Raina: మెగావేలంలో అవమానం.. అక్కడ మాత్రం ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక -
పాకిస్తాన్‌కు మరో ఓటమి..సెమీస్ ఆశలు గల్లంతు!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా మూడో ఓటమి చూవి చూసింది. లీగ్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 217 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో నిధా ఖాన్(40), సోహెల్(65), నిధా ధార్(55) పరుగులతో రాణించినప్పటికీ పాక్‌కు ఓటమి తప్ప లేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. మారిజాన్ కాప్, ఖాకా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వోల్వార్డ్ట్(75), లూస్(62) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా, గులాం ఫాతిమా చెరో మూడు వికెట్లు సాధించారు. ఇక మూడు ఓటమిలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచిన పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో మార్చి14న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
ఐదేళ్ల తర్వాత సెంచరీతో మెరిశాడు... జట్టును గెలిపించాడు
South Africa vs India, !st ODI: పార్ల్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 2016 తర్వాత తొలి సెంచరీను బావుమా నమోదు చేశాడు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. బావుమా(110), వండెర్ డస్సెన్ (129) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ధావన్(79),కోహ్లి(51),ఠాకూర్(50) పరుగులుతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో,షమ్సీ, ఎన్గిడి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మార్క్రమ్, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ సాధించారు. చదవండి: IND VS SA: డికాక్ మెరుపువేగంతో.. పంత్ తేరుకునేలోపే -
సఫారీలకు కావాల్సింది 122 పరుగులే.. టీమిండియా అద్భుతం చేసేనా?
దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు తొలిసారి సిరీస్ గెలుచుకుంటుందా? ఆతిథ్య జట్టు సిరీస్‌ను సమం చేసి పోరును మూడో టెస్టు వరకు తీసుకెళుతుందా? జొహన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్ నాలుగో రోజే ఫలితం తేలనుంది. పలు మలుపులు తిరిగిన బుధవారం ఆటలో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడాయి. పుజారా, రహానే భాగస్వామ్యంతో పాటు హనుమ విహారి ఆట భారత్‌ను మెరుగైన స్థితికి నడిపించగా... రబడ స్పెల్ సఫారీలకు ఊపిరి పోసింది. ఛేదనలోనూ ఆ జట్టు జోరుగా మొదలు పెట్టినా, తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు తీసి టీమిండియా మళ్లీ ఆధిపత్యం ప్రదర్శించింది. పట్టుదలగా నిలబడి మూడో రోజును సంతృప్తికరంగా ముగించిన కెప్టెన్ ఎల్గర్ ఇదే పోరాటతత్వంతో తన జట్టును గెలిపిస్తాడా లేక భారత్ ఎనిమిది వికెట్లు తీస్తుందా అనేది చూడాలి. జొహన్నెస్‌బర్గ్: రెండో టెస్టులో భారత్ జట్టు దక్షిణాఫ్రికాకు 240 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని అందుకునే ప్రయత్నంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (121 బంతుల్లో 46 బ్యాటింగ్; 2 ఫోర్లు), డసెన్ (11 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే ఆ జట్టు మరో 122 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 85/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. రహానే (78 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్), పుజారా (86 బంతుల్లో 53; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, హనుమ విహారి (84 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాణించిన విహారి... కెరీర్ ప్రమాదంలో పడిన దశలో, మరోసారి విఫలమైతే జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉన్న స్థితిలో పుజారా, రహానే కీలక ఇన్నింగ్స్‌లతో సత్తా చాటారు. తమ సహజశైలికి భిన్నంగా వీరిద్దరు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు. దాంతో స్కోరు వేగంగా సాగిపోయింది. ఈ క్రమంలో 62 బంతుల్లోనే పుజారా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 67 బంతుల్లో రహానే కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 4.6 రన్‌రేట్‌తో 144 బంతుల్లోనే 111 పరుగులు జోడించడం విశేషం. అయితే వీరిద్దరిని ఎనిమిది పరుగుల వ్యవధిలోనే రబడ పెవిలియన్ పంపించగా... రిషభ్ పంత్ (0) విఫలమయ్యాడు. ఈ దశలో విహారి జట్టు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత తీసుకున్నాడు. అతనికి అశ్విన్ (16) కొంత సహకరించగా... శార్దుల్ ఠాకూర్ (24 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్ భారత్ స్కోరును 200 దాటించింది. జాన్సెన్ వేసిన ఓవర్లో 1 సిక్స్, 2 ఫోర్లు కొట్టిన శార్దుల్ అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. అనంతరం విహారి కొన్ని విలువైన పరుగులు జోడించాడు. భారత్ జోడించిన చివరి 41 పరుగుల్లో విహారినే 30 పరుగులు చేశాడు. ఎల్గర్ పట్టుదలగా... రెండో ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. మార్క్రమ్ (38 బంతుల్లో 31; 6 ఫోర్లు) దూకుడుతో జట్టు స్కోరు 10 ఓవర్లలోనే 47 పరుగులకు చేరింది. పదో ఓవర్ చివరి బంతికే మార్క్రమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని శార్దుల్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత పీటర్సన్ (28; 4 ఫోర్లు) కూడా రాణించాడు. దాంతో సఫారీ టీమ్ 93/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే అశ్విన్ చక్కటి బంతితో పీటర్సన్‌ను ఎల్బీగా అవుట్ చేయడంతో మళ్లీ భారత్‌దే పైచేయి అయింది. ఈ స్థితిలో ఎల్గర్, డసెన్ పట్టుదల కనబర్చారు. చేతికి, భుజానికి, మెడకు, ఛాతీకి... భారత పేసర్ల పదునైన బంతులకు ఇలా అన్ని శరీర భాగాలకు దెబ్బలు తగులుతున్నా ఎల్గర్ పిచ్‌పై దృఢంగా నిలబడ్డాడు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా మరో వికెట్ తీయలేకపోయారు. చదవండి: Shardul Thakur: శార్ధూల్ పేరు ముందు "ఆ ట్యాగ్" వెనుక రహస్యమిదే..! -
ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి
Omicron Boost Immunity Against Delta: ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి.. అనేది పాత సామెత! ముందునుంచి ఉన్న చెవులకు కొత్త కొమ్ముల వాడి తగలడం దీనికి కొనసాగింపు! ఈ కథలో ముందునుంచి ఉన్న చెవులు డెల్టా వేరియంట్ కాగా, వెనకొచ్చిన కొమ్ములు ఒమిక్రాన్ వేరియంట్. డెల్టాను మించిన వేగంతో ఆవతరించిన ఒమిక్రాన్ క్రమంగా డెల్టాకే పరోక్ష ప్రమాదకారిగా మారుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వివరాలేంటో చూద్దాం.. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీలు భవిష్యత్‌లో డెల్టా వేరియంట్ సోకితే అడ్డుకునేలా సదరు వ్యక్తి శరీరంలో రోగనిరోధకతను పెంచుతాయని దక్షిణాఫ్రికా పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్ స్పైక్ ప్రొటీన్‌లో జరిగిన పలు మ్యుటేషన్లతో ఒమిక్రాన్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే! డెల్టాతో పోలిస్తే దీనికి వేగం, వ్యాప్తి సామర్ధ్యం ఎక్కువని నిరూపితమైంది. అదేవిధంగా శరీరంలో టీకాల వల్ల, గత ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా ఒమిక్రాన్ అధిగమిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. అయితే డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల కలిగే వ్యాధి తీవ్రత తక్కువగా ఉండడం గమనార్హం. దీనివల్లనే ఒమిక్రాన్ ప్రపంచమంతా అత్యధిక వేగంతో వ్యాపించినా, డెల్టా తరహాలో మరణాలు సంభవించడం లేదు. అంటే డెల్టా సోకితే వచ్చిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకోలేకపోతున్నాయి. కానీ ఒమిక్రాన్ సోకితే వచ్చే యాంటీబాడీలు మాత్రం అటు డెల్టాను, ఇటు ఒమిక్రాన్‌ను అడ్డుకోగలుగుతున్నాయి. అందుకే కొందరు సైంటిస్టులు ఒమిక్రాన్ దేవుడు ఇచ్చిన ‘‘సహజ వ్యాక్సిన్’’గా అభివర్ణిస్తున్నారు. టీకా చేసే పనులను ( వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండడం, శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపించడం) ఈ వేరియంట్ చేస్తోందని భావిస్తున్నారు. ఈ భావనకు తాజా పరిశోధన బలం చేకూరుస్తోంది. ఏమిటీ పరిశోధన ఒమిక్రాన్ వేరియంట్‌ను మరింతగా అవగాహన చేసుకునేందుకు దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక అధ్యయనం జరిపారు. దీని వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. పరిశోధనలో భాగంగా 15మందిని అధ్యయనం చేశారు. వీరిలో టీకాలు తీసుకున్నవారు మరియు ఇంతవరకు టీకాలు తీసుకోకుండా ఒమిక్రాన్ వేరియంట్ సోకినవారు ఉన్నారు. ఈ రెండు గ్రూపులకు చెందిన వారి రక్తం, ప్లాస్మాల్లో యాంటీబాడీలను విశ్లేషించారు. వీరి శరీరంలో ఉత్పన్నమైన యాంటీబాడీల్లో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను అడ్డుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. ఇందుకోసం ‘‘న్యూట్రలైజేషన్’’పరీక్ష నిర్వహించారు. లక్షణాలు కనిపించినప్పుడు, తిరిగి రెండు వారాల తర్వాత మొత్తం రెండు దఫాలు ఈ పరీక్షలు చేశారు. ఒమిక్రాన్ సోకి యాంటీబాడీలు ఉత్పత్తైన వ్యక్తుల్లో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 14 రెట్లు అధికంగా పెరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా డెల్టాకు వ్యతిరేకంగా న్యూట్రలైజేషన్ 4.4 రెట్లు పెరిగినట్లు గమనించారు. అంటే ఒమిక్రాన్ సోకి వ్యాధి తగ్గిన వారిలో అటు ఒమిక్రాన్, ఇటు డెల్టాకు వ్యతిరేకంగా ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని తేల్చారు. అంటే ఒకసారి ఒమిక్రాన్ సోకి తగ్గితే సదరు వ్యక్తికి భవిష్యత్‌లో డెల్టా, ఒమిక్రాన్ సోకే అవకాశాలు బాగా తగ్గవచ్చని పరిశోధకుడు అలెక్స్ సైగల్ అభిప్రాయపడ్డారు. టీకా సైతం ఇదే పనిచేస్తున్నందున ఒమిక్రాన్‌ను కరోనాకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన టీకాగా భావించవచ్చన్నది నిపుణుల అంచనా. ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తే కరోనా ఒక సాధారణ జలుబుగా మారిపోయే అవకాశాలున్నాయనేది ప్రస్తుతానికి వినిపించే గుడ్ న్యూస్! విమర్శలు కూడా ఉన్నాయి... సైగల్ చేపట్టిన పరిశోధన వివరాలు ఆశాజనకంగా ఉన్నా, ఈ పరిశోధనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం 15మంది వాలంటీర్ల అధ్యయనంతో మొత్తం ప్రపంచ మానవాళి ఆరోగ్యాన్ని అంచనా వేయలేమన్నది విమర్శకుల వాదన. డెల్టా కన్నా ఒమిక్రాన్ మంచిదనేందుకు ఈ యాంటీబాడీల పరీక్ష కాకుండా మరే ఆధారాలు దొరకలేదు. ఇప్పటికే శరీరంలో ఉన్న ఇమ్యూనిటీని ఒమిక్రాన్ యాంటీబాడీలు పెంచిఉండొచ్చని కొందరి అంచనా. అలాగే డార్విన్ సిద్ధాంతం ప్రకారం డెల్టాను ఒమిక్రాన్ తరిమేస్తే భవిష్యత్‌లో మరో శక్తివంతమైన వేరియంట్ పుట్టుకురావచ్చు. అందువల్ల కేవలం ఒమిక్రాన్‌తో కరోనా ముగిసిపోకపోవచ్చని పరిశోధకుడు డాక్టర్ పియర్సన్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో మూడు పరిణామాలకు అవకాశం ఉందన్నారు. 1. ఫ్లూ వైరస్లాగా ప్రతి ఏటా ఒక సీజనల్ కరోనా వేరియంట్ పుట్టుకురావడం . 2. డెంగ్యూలాగా పలు కోవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తూ కొన్ని సంవత్సరాలకొకమారు ఒక వేరియంట్ విజృంభించడం. 3. తేలికగా నివారించగలిగే ఒకటే వేరియంట్ మిగిలడం.. అనేవి పియర్సన్ అంచనాలు. వీటిలో మూడోది మానవాళికి మంచిదని, కానీ దీనికి ఛాన్సులు తక్కువని ఆయన భావిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి -
"ధావన్‌ని భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం బెటర్"
దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు శిఖర్ ధావన్ ఎంపిక చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డేలకు శిఖర్ ధావన్‌ను భారత్ మినహాయించాలని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే టీమిండియా ఓపెనింగ్ స్ధానానికి తీవ్రమైన పోటీ నెలకొంది, ఈ నేపథ్యంలో ధావన్ జట్టుకు దూరం ఉండడం బెటర్ అని కరీమ్ తెలిపాడు. “ఒక వేళ ధావన్ జట్టులో ఉన్నప్పటికీ, అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దొరుకుతుందా ? కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల్లో ఓపెనర్లు కావడంతో వన్డేల్లోనూ ఓపెనింగ్ చేస్తారని నేను భావిస్తున్నాను. ధావన్‌ను జట్టులోకి తీసుకుంటే డగౌట్లో కూర్చుండబెట్టడం తప్ప మరో ఉపయోగం లేదు. అతడిని దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయరని నేను భావిస్తున్నాను" అని కరీమ్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. "ధావన్‌కి మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం రావడం చాలా కష్టం. కానీ ఇటువంటి సీనియర్ ఆటగాడికి మరో అవకాశం ఇవ్వాలని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. మరి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హాజారే ట్రోఫిలో కూడా ధావన్ వరుసగా విఫలం అవుతున్నాడు. అతడికి ఇంకా ఈ టోర్నీలో ఒక మ్యాచ్ మాత్రమే ఉంది అని " అతడు పేర్కొన్నాడు. ఇక శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుతం రోహిత్-రాహుల్ ఓపెనింగ్ జోడి అద్బుతంగా రాణిస్తున్నారు. అంతే కాకుండా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్,పృథ్వీ షా, వెంకటేష్ అయ్యర్లు దేశవాలీ క్రికెట్లో అద్బుతంగా రాణిస్తున్నారు. దీంతో శిఖర్ దావన్ అంతర్జాతీయ కెరీర్ సందిగ్ధంలో పడింది. చదవండి: David Warner: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్.. డేవిడ్ వార్నర్‌కు గాయం -
దక్షిణాఫ్రికా సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్
Rohit Sharma is back in nets, playing lovely strokes: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు డిసెంబర్ 16న పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఇప్పటికే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సౌత్ఆఫ్రికా పిచ్‌లు ఎక్కువగా పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. ఈ నేపథ్యంలో త్రోడౌన్ స్పెషలిస్ట్‌లతో రోహిత్ శర్మ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను రోహిత్ శర్మ ఇనస్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. అదే విధంగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన హోమ్ సిరీస్ నుంచి షమీకి విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!
Omicron Variant Confirmed in 12 Countries: కొన్ని రోజులు క్రితం దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వైరస్ అప్పుడే పలు దేశాల్లో విరుచకుపడటానికి సన్నహాలు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్‌తో ప్రపంచదేశాలన్ని అతలాకుతలం అయ్యిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటికి దడ పుట్టించేలా విరుచకుపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించని కొద్ది రోజుల్లోనే జపాన్, ఐరోపా, యునైటెడ్ కింగ్డమ్తో సహా సుమారు 12 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసులు నమోదైనట్టు ధృవీకరించడం గమనార్హం. తాజాగా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ తొలి కేసులను గుర్తించినట్లు ధృవీకరించింది. (చదవండి: టిక్‌టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) అయితే ఈ కరోనా మహమ్మారీ కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలైన అమెరికా, భారత్, చైనాలో ఇంతవరకు కొత్త వేరియంట్‌కి సంబంధించిన కేసులు నమోదు కాలేదు. ఈ మేరకు భారత్ కొత్త వేరియంట్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా ఆంక్షలు కఠినతరం చేయడమే కాకా ముందుగానే పలు టెస్ట్‌లు నిర్వహించి హోం క్యారంటైన్లో ఉంటే గానీ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్‌లోని ఒక సీనియయర్ వైద్యుడు ఈ ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే దేశంలోకి వచ్చే ఉండవచ్చని, ఇది డెల్లా వేరియంట్ కంటే వేగంతగా వ్యాప్తి చెందే అటువ్యాధి అని అన్నారు. పైగా ఇది చాలా ప్రాణాంతకమైనదని వ్యాక్సిన్లు ఎంతవరకు రక్షణగా ఉంటాయి అనే అంశంపై పరిశోధనలను వేగవంతం చేయాలని చెప్పారు. అంతేకాదు డెల్టా వేరియంట్ వల్ల కలిగే నష్టాన్ని అరికట్టలేని ప్రస్తుత వైద్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న భారత్‌కి ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని వైద్యుల ఈ ఒమిక్రాన్ ప్రమాదకరమైన వైరస్ కావచ్చు కానీ డెల్టా కంటే తేలికపాటి లక్షణాలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారిపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో అనే అంశం పై నిపుణులు కచ్చితమైన అవగాహనకు రావడానికి నాలుగు వారాలు పట్టవచ్చని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యాక్టింగ్ హెడ్ అడ్రియన్ ప్యూరెన్ అన్నారు. ఏదీఏమైన డబ్ల్యూహెచ్ఓకి గతేడాది అల్పా వేరియంట్‌ని ప్రమాదకరమైన వేరియంట్‌గా గుర్తించడానికి కొద్ది నెలల సమయం పట్టింది. కానీ ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ని కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించడం గమనార్హం. (చదవండి: జపాన్‌లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) -
మరో మేలుకొలుపు!
ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా వైరస్ కొత్త రూపం ‘ఒమిక్రాన్’ వల్ల తీవ్ర పరిణామాలతో కరోనా మళ్ళీ విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఒ) సోమవారం నాటి హెచ్చరిక కలవరపెడుతోంది. శరవేగంగా విస్తరించే ఈ కొత్త వేరియంట్‌తో ప్రమాదమూ తీవ్రమేనట. పలు దేశాల్లో ఇప్పటికే ఈ కొత్త రూపం వైరస్ బయటపడడంతో మళ్ళీ షరతులు మొదలయ్యాయి. జపాన్ సహా కొన్ని దేశాలు అంతర్జాతీయ విమానాలను నిషేధించేశాయి. భారత్‌లో ఒమిక్రాన్ జాడ ఇంకా బయటపడనప్పటికీ, దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చినవారిలో పలువురు కోవిడ్ పాజిటివ్ అని తేలడం కలవరపెడుతోంది. వెరసి, కరోనా జాగ్రత్తలు, టీకాలపై నిర్లక్ష్యం ప్రబలుతున్న భారత్ ఇప్పుడు నిద్ర మేల్కొనక తప్పదు. ఇప్పటి వరకు డబ్లు్యహెచ్‌ఒ 5 వేరియంట్ (ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్)లను ఆందోళనకరమైనవిగా, 2 వేరియంట్లను (లాంబ్డా, మ్యూ) ఆసక్తికరమైనవిగా పేర్కొంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో కేవలం 7 నుంచి 10 రోజుల్లో డెల్టా వేరియంట్‌ను కనిపించకుండా చేసి, సర్వత్రా తానే అయింది ఒమిక్రాన్. కోవిడ్ చికిత్సలో యాంటీ బాడీస్ పనిచేసేది వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్పైన. ఏడాది క్రితం మహారాష్ట్రలో బయటపడ్డ మునుపటి వైరస్ రూపం డెల్టాలో డజను ఉత్పరివర్తనాలే. కానీ, ఏకంగా 50కి పైగా ఉత్పరివర్తనాలతో, ఒక్క స్పైక్ ప్రొటీన్లోనే 32 ఉత్పరివర్తనాలతో ఒమిక్రాన్ తయారైంది. అందువల్ల వేసుకున్న టీకాలను సైతం తప్పించుకొని, శరీరంపై దాడి చేసే సత్తా దానికుందని అనుమానం. అంటే, టీకాల్లో విజయం సాధించామంటున్న దేశాలు, రెండు డోసులూ వేసుకున్నవారు సైతం జాగ్రత్త పడక తప్పదు. కాలగతిలో యాంటీ బాడీస్ తగ్గే అవకాశం ఉంది గనక, అదనపు బూస్టర్ డోస్ అవసరమనే వాదన ఇప్పుడు భారత్‌లోనూ బలం పుంజుకుంది. అజాగ్రత్త వహిస్తే, టీకాలు వేసుకున్నవారికి సైతం మళ్ళీ కరోనా వచ్చే రిస్కు ఒమిక్రాన్‌లో ఎక్కువేనంటున్నారంటే ఎంతటి జాగ్రత్త అవసరమో అర్థం చేసుకోవచ్చు. శతకోటి టీకా డోసుల సంబరం తర్వాత పాలకుల్లోనూ, కేసులు తగ్గాయి లెమ్మని ప్రజల్లోనూ అలక్ష్యం పెరిగినమాట నిజం. గత మూడు నెలల్ని పోలిస్తే, దేశంలో పదుల శాతంలో తగ్గిన టీకా డోసుల గణాంకాలే అందుకు నిదర్శనం. 80 శాతం మందికి పైగా వయోజనులకు ఒక డోసైనా అందింది కానీ, మళ్ళీ రెండో డోసుకు వస్తున్నవాళ్ళు తక్కువే. ఒక్క యూపీలోనే కోటి మందికి పైగా రెండో డోసు తీసుకోలేదు. అందుకే, కొత్త కోవిడ్ వేరియంట్ వల్ల సమీప భవిష్యత్తులో భారత్ సహా ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై దుష్ప్రభావం తప్పకపోవచ్చు. మోర్గాన్ స్టాన్లీ తాజా పరిశోధన ఆ మాటే చెప్పింది. పరిస్థితి తీవ్రమైతే లాక్డౌన్ల బెడదా లేకపోలేదంది. ఇక, దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు పర్యటన సహా చైనా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రపంచ శ్రేణి క్రీడోత్సవాలకూ ఇక్కట్లు తప్పేలా లేవు. వైరస్ జన్యునిర్మాణాన్ని కనిపెట్టే జన్యు అనుక్రమణం కీలకమని ఒమిక్రాన్ మరోసారి గుర్తు చేసింది. జన్యు అనుక్రమణ శోధనలపై దక్షిణాఫ్రికా భారీగా పెట్టుబడి పెట్టడం వల్లే ఒమిక్రాన్‌ను కనిపెట్టడం, తక్షణమే ప్రపంచాన్ని అప్రమత్తం చేసి, చర్యలు చేపట్టడం సాధ్యమైంది. అవసరమైతే కొత్త వైరస్ రూపానికి తగ్గట్టు టీకాల్ని ఆధునికీకరించడానికీ ఈ శోధనలు కీలకం. కానీ ఇలా శోధించి, ఫలితాలను పారదర్శకంగా బయటపెట్టినందుకు ప్రయాణాలపై నిషేధం లాంటి ఇక్కట్లకు అవి గురి అవుతున్నాయి. అందుకే, ఆర్థికంగా తమను దెబ్బతీసే ప్రయాణ నిషేధాలు ఎత్తివేయాలనీ, తమ లాంటి దేశాలకు ప్రపంచస్థాయిలో పరిహారం చెల్లించాలన్న దక్షిణాఫ్రికా వాదన సబబే అనిపిస్తుంది. మరోపక్క అందరికీ టీకాలందితే తప్ప, ఏ ఒక్కరమూ సురక్షితం కాదనేది ప్రాథమిక సూత్రం. కానీ, సంపన్న దేశాలు ఖర్చు కాని టీకాలను తమ దగ్గర పోగేసుకుంటున్నాయే తప్ప, అల్పాదాయ దేశాలకు అందించడం లేదు. సంపన్నదేశాల్లో 60 శాతం మందికి టీకా పూర్తయితే, అల్పాదాయ దేశాల్లో కేవలం 3 శాతానికే టీకాలు అందడం శోచనీయం. మూడో డోసుకు ఆరాటపడుతున్న సంపన్న దేశాలు, ఆఫ్రికా లాంటి వాటికి అవసరమైన టీకాలే అందించలేదు. ఇది నైతికంగా తప్పే కాక, టీకాను సైతం తట్టుకొనే వైరస్ రూపొందే ముప్పుంది. అందుకే, వాడని టీకాలను వర్ధమాన దేశాలకు ముందుగా పంపే సమర్థ వ్యవస్థను సంపన్న దేశాలు అభివృద్ధి చేసుకోవడం అవసరం. భారత్ సైతం టీకా మైత్రి కింద అంతర్జాతీయ వేదిక కోవాక్స్‌కు మరిన్ని టీకాలను సరఫరా చేయాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఆలస్యంగా మొదలుపెట్టి దీర్ఘకాలం కఠినమైన షరతులు విధించే బదులు, ముందే కళ్లు తెరవడం మేలు. కరోనా జాగ్రత్తల్లో తాజా నిర్లక్ష్య వైఖరిని ప్రజలు తక్షణమే మార్చుకోక తప్పదు. టీకాలపై నిరాసక్తతనూ, తటపటాయింపునూ వదిలించుకోక తప్పదు. ఐరోపాలో 60 ఏళ్లు పైబడినవారిలో 4.7 లక్షల మంది ప్రాణాలు దక్కాయంటే, అది టీకాల వల్లనే అని డబ్లు్యహెచ్‌ఒ తాజా అధ్యయనం. టీకా తప్పనిసరి అని చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. గుమిగూడడంపై షరతులు, భౌతికదూరం, మాస్కు ధారణ, టెస్టింగు లాంటి ప్రాథమిక జాగ్రత్తలే మళ్ళీ శరణ్యం. వెల్లువెత్తుతున్న భయాలకు విరుద్ధంగా ఒమిక్రాన్ పెద్దగా ప్రభావం చూపకూడదనే ఆశిద్దాం. గతంలో పలు ఉత్పరివర్తనాల బీటా వేరియంట్ పెద్దగా ప్రభావం చూపనట్టే, ఇదీ అయితే అదృష్టమే. కానీ, ఇప్పటికీ మహమ్మారి పీడ ముగిసిపోలేదని గ్రహించాలి. అందుకే, ప్రపంచానికి మరోసారి పారాహుషార్ – తాజా వేరియంట్ ఒమిక్రాన్! -
మహారాష్ట్రలో "ఒమిక్రాన్" వేరియంట్ కలకలం!!
థానే: మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా నుండి థానేకి తిరిగి వచ్చిన 32 ఏళ్ల ఇంజనీర్‌కి చేసిన కోవిడ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు కొత్త వైరస్ వేరియంట్ దృష్ట్య కోవిడ్-19 ఐసోలేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు వ్యక్తిని ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడంతో అతను కరోనా బారిన పడినట్లు గుర్తించామని కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అంటువ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రతిభా పాన్ పాటిల్ తెలిపారు. పైగా ఏడు రోజుల తర్వాతే ఫలితాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఆ ఇంజనీర్ కాస్త తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పాటిల్ వెల్లడించారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అంతేకాదు కేడీఎంసీ కమీషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ కళ్యాణ్ డోంబివిలి టౌన్షిప్ పౌరులను ఈ కొత్త వేరియంట్ దృష్ట్యా ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని అన్నారు. పైగా కోవిడ్ ప్రోటోకాల్‌ని కచ్చితంగా పాటించాలంటూ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు ఎనిమిది మందికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించడమే కాక ఆ ఇంజనీర్‌తో ప్రయాణించిన వారి గురించి కూడా విచారిస్తున్నాం అని అధికారులు అన్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. (చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!) -
ఆ వైరస్‌ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!
దక్షిణాఫ్రికాలో గుర్తించబడిన ఓమిక్రాన్ అనే ప్రాణాంతక కరోనావైరస్కి సంబంధించిన కొత్త వేరియంట్ గురించి అందరూ వినే ఉన్నాం. పైగా ఈ కొత్త రూపాంతరం శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగించే సమస్యగా మారింది. అంతేకాదు ప్రస్తుత వ్యాక్సిన్లు లక్ష్యంగా చేసుకునే వైరస్‌లో 30కి పైగా ఉత్పరివర్తనలు ఉన్నాయి. ఈ మేరకు ఇది దక్షిణాఫ్రికాలో కొత్త ఇన్ఫెక్షన్ల పెరుగుదలపై ప్రపంచ దేశాలన్ని ఆందోళన వ్యక్తం చేశాయి. (చదవండి: సిగరెట్ కాల్చే అలవాటే ఆమె ప్రాణాల్ని కాపాడింది) అంతేకాదు ఈ కొత్త రూపాంతరానికి సంబంధించిన కొన్ని కేసులు యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే గుర్తించారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచదేశాలన్నింటిని అప్రమత్తం చేసింది. అసలే ఇప్పటికే రెండు సంవత్సరాల పాటు అందరూ ఇళ్లలోనే జైలు మాదిరిగా స్వచ్ఛంద నిర్బంధంలో ఉంటున్నారు. అంతేకాక దాదాపు ఎవరికి సంబంధం లేకుండానే గడుపుతున్నాం. పైగా ఈ కొత్త వేరియంట్‌తో ప్రజలంతా నిరుత్సాహనికి గురవుతున్నట్లు అందరీ ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వేరియంట్‌ని ధైర్యంగా ఎదుర్కొంద్దాం అంటూ ప్రజలను ఉత్సహాపరిచేలా కొంతమంది నెటిజన్లు సామాజిక మాధ్యామాల్లో రకరకాల మీమ్లతో పోస్టులు పెడుతున్నారు. పైగా అవి మానసికంగా మనల్ని ధృడంగా చేయడమే కాక నూతన ఉత్సహాన్ని ఇచ్చేలా ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!) #Omicron has entered the chat. pic.twitter.com/IBbVGhAwu4 — Blake (@BlakesWort) November 27, 2021 #Omicron and me vaccinated pic.twitter.com/RhMJCjZ5oZ — 💜Jano 🇵🇪 #NoScienceNoFuture (@jano_onaj2020) November 27, 2021 The #Omicron variant and the war on COVID explained: pic.twitter.com/wg3WUuSkCm — D Alex (@D_Alex_connect) November 27, 2021 -
SA Vs ENG: ఇంగ్లండ్‌ను 131 పరుగులలోపు ఆలౌట్ చేయలేకపోయింది...
update: ఇంగ్లండ్‌ను దక్షిణాఫ్రికా 131 పరుగులలోపు ఆలౌట్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ సెమిస్కు చేరలేకపోయింది. T20 World Cup 2021 ENG Vs SA: టీ20 ప్రపంచకప్-2021లో గ్రూపు-1లో ఇంగ్లండ్ ఇది వరకే సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నవంబర్6 న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా నాలుగు విజయాలతో గ్రూపు-1లో రెండో స్ధానంలో నిలిచింది. దీంతో సెమిస్కు ఒక్క అడుగు దూరంలో ఆస్ట్రేలియా నిలిచింది. అయితే గ్రూపు-2లో మూడు విజయాలతో దక్షిణాఫ్రికా మూడో స్ధానంలో ఉంది. అయితే నవంబర్6న ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా సెమిస్కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 189 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ను 131 పరుగులలోపు ఆలౌట్ చేస్తే దక్షిణాఫ్రికా రన్‌రేట్ ఆధారంగా సెమిస్కు చేరుతుంది. చదవండి: Harbhajan Singh: 'చెత్త వాగుడు ఆపండి'.. భజ్జీ వార్నింగ్ -
భారత్‌లో క్రికెట్ పండుగ.. కివీస్‌తో మొదలై దక్షిణాఫ్రికాతో ముగింపు
Teamindia 2021-2022 Home Season Schedule: 2021-22 సీజన్‌కు సంబంధించిన టీమిండియా హోమ్ సీజన్ షెడ్యూల్‌కు బీసీసీఐ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020-21 సీజన్ నవంబర్ 14న జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో ముగియనుండగా.. నవంబర్ 17 నుంచి కివీస్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో స్వదేశంలో క్రికెట్ పండుగ సీజన్ ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది జూన్ 19న దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్‌తో ఈ ఏడాది టీమిండియా హోమ్ సీజన్ ముగుస్తుంది. షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7 వరకు టీమిండియా కివీస్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టీ20 జైపూర్ వేదికగా నవంబర్ 17న జరగనుండగా.. రాంచీ, కోల్‌కతాల్లో నవంబర్ 19, 21వ తేదీల్లో రెండు, మూడు టీ20లు జరుగుతాయి. అనంతరం కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్(నవంబర్ 25 నుంచి 29 వరకు), ముంబైలో రెండో టెస్ట్(డిసెంబర్ 3 నుంచి 7 వరకు) జరుగుతుంది. ఆతర్వాత 2022 ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే అహ్మదాబాద్ వేదకగా ఫిబ్రవరి 6న జరగనుండగా.. 9, 12 తేదీల్లో జైపూర్, కోల్‌కతాల్లో మిగితా రెండు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 15న కటక్‌లో తొలి టీ20.. 18, 19 తేదీల్లో వైజాగ్, త్రివేండ్రం వేదికగా మిగితా రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ వెంటనే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు టీమిండియా శ్రీలంకతో 2 టెస్ట్‌లు, 3 టీ20ల సిరీస్ జరుగుతుంది. బెంగుళూరులో తొలి టెస్ట్(ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు), మొహాలీలో రెండో టెస్ట్(మార్చి 5 నుంచి 9 వరకు) జరుగుతుంది. మొహాలీ, ధర్మశాల, లక్నోల్లో మూడు టీ20లు వరుసగా 13, 15, 18 తేదీల్లో జరుగుతాయి. ఇక జూన్ 9న భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో సఫారీలు టీమిండియాతో 5 టీ20లు ఆడతారు. ఈ మ్యాచ్‌లు జూన్ 9, 12, 14, 17, 19 తేదీల్లో చెన్నై, బెంగుళూరు, నాగపూర్, రాజ్‌కోట్, ఢిల్లీల్లో జరుగుతాయి. చదవండి: ఏ ఇతర భారత క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు.. కేవలం 71 పరుగుల దూరంలో -
డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు
జొహన్నెస్‌బర్గ్: విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడే అవకాశం ఉందంటూ గత కొంత కాలంగా వినిపిస్తున్న వార్తలకు తెర పడింది. అతను అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) అధికారికంగా ప్రకటించింది. రిటైర్మెంట్ను వదిలి మళ్లీ బరిలోకి దిగే విషయంలో అతనితో ఇటీవల బోర్డు అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం. తాజాగా వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు సఫారీ జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఏబీ గురించి ప్రకటన వెలువడింది. ‘రిటైర్మెంట్పై తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని, దానికే కట్టుబడి ఉన్నట్లు డివిలియర్స్ చెప్పాడు’ అని సీఎస్ఏ స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. నిజానికి 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలని అతను ఆశించినా... చివరి నిమిషంలో ఈ విషయం చెప్పడంతో బోర్డు ఏబీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా లీగ్ క్రికెట్లో డివిలియర్స్ చెలరేగుతుండటంతో జాతీయ జట్టు గురించి మళ్లీ ప్రస్తావన వచ్చింది. అతని మాజీ సహచరులు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. ఫామ్, ఫిట్నెస్ బాగుంటే వస్తానంటూ ఇటీవల ఐపీఎల్లో కూడా అతను తన ఉద్దేశాన్ని బయట పెట్టాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత పునరాగమనం విషయంలో బౌచర్‌తో చర్చించాల్సి ఉందని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు తాజా ప్రకటనతో అతని దక్షిణాఫ్రికా కెరీర్ ముగిసినట్లు స్పష్టమైపోయింది. -
ఈ ఏడాది ఐపీఎల్లో వీరి మెరుపులు లేనట్టేనా..?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పలువురు విదేశీ ఆటగాళ్ల మెరుపులను అభిమానులు మిస్ కానున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంకానున్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. అందులో అందరూ దక్షిణఫ్రికా క్రికెటర్లే ఉన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడాల్సి ఉండటంతో ఆ స్టార్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌కు దూరంకానున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వింటన్ డికాక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రబాడ, అన్రిచ్ నోర్జ్, చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు లుంగి ఎంగిడి, ఫాఫ్ డుప్లెసిస్‌లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా క్వింటన్ డికాక్, రబాడ, ఫాఫ్ డుప్లెసిస్‌లు తమతమ ఫ్రాంఛైజీల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. డికాక్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు తరుపుముక్కగా నిలిచాడు. అతను ఆడిని 16 మ్యాచ్‌ల్లో 140.5 స్ట్రెక్‌రేట్‌తో 503 పరుగులు చేసి, ముంబై టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన ఆయన గత సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ.. గత రెండు సీజన్లలో 29 మ్యాచ్‌లాడి 55 వికెట్లు తీశాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లాడిన ఆయన 8.34 ఎకానమీతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిలు సైతం వారివారి ఫ్రాంఛైజీల జయాపజయాలను ప్రభావితం చేయగల ఆటగాళ్లే. -
బోణి కొట్టిన భారత్
లక్నో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు జులన్ గోస్వామి (4/42), గైక్వాడ్ (3/37), మాన్సీ జోషి (2/23) ధాటికి 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా గుడాల్(49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేవలం 28.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేమిమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 9) విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్ మంధన ( 64 బంతుల్లో 80 పరుగులు;10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్‌లు ( 89 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. 4 వికెట్లతో రాణించిన జులన్ గోస్వామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. -
పాకిస్తాన్‌దే తొలి టెస్టు
కరాచీ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 187/4తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌటైంది. తెంబా బవుమా (40; 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా... శుక్రవారం కేవలం 58 పరుగులే జోడించిన సఫారీ జట్టు మిగిలిన ఆరు వికెట్లు చేజార్చుకుంది. తొలి టెస్టు ఆడిన లెఫ్టార్మ్ స్పిన్నర్ నౌమాన్ అలీ (5/35) చెలరేగగా, లెగ్ స్పిన్నర్ యాసిర్ షాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం 88 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 90 పరుగులు చేసి గెలిచింది. అజహర్ అలీ (31 నాటౌట్; 4 ఫోర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (30; 6 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా జట్టుకు ఉపఖండంలో ఇది వరుసగా ఎనిమిదో పరాజయం కాగా... తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఫవాద్ ఆలమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. తాజా ప్రదర్శనతో టెస్టు క్రికెట్లో అందరికంటే ఎక్కువ వయసులో (34 ఏళ్ల 114 రోజులు) తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా నౌమాన్ అలీ నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి రావల్పిండిలో జరుగుతుంది.