రాజ్ కోట్:దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ ఆదివారం జరుగుతున్న మూడో వన్డే ఉత్కంఠగా మారింది. టీమిండియా విజయానికి చివరి ఐదు ఓవర్లలో 55 పరుగులు కావాలి. 45 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. 271 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోని సేన ఆదిలో కుదురుగా ఆడినప్పటికీ చివరి ఓవర్లలో ఒత్తిడిలో పడింది. 41.5 ఓవర్ల వద్ద ధోని(47) మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
ఆ సమయంలో బ్యాటింగ్ కు దిగిన సురేష్ రైనా (0) డకౌట్ గా నాలుగు వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దీంతో టీమిండియా ఆందోళనలో పడింది. విరాట్ కోహ్లి(77), అజింకా రహానే(4)క్రీజ్ లో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే ఓవర్ కు 11 పరుగుల చొప్పున చేయాల్సి ఉంది.