రాజ్ కోట్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ ఆదివారం జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 271 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఇన్నింగ్స్ ను శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు ఆరంభించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. డీ కాక్ (103 ; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) , డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) , బెహర్దియన్ (33 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది.