South Africa vs India, !st ODI: పార్ల్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో 2016 తర్వాత తొలి సెంచరీను బావుమా నమోదు చేశాడు. కాగా టీమిండియాపై సౌతాఫ్రికా ఇదే నాలుగో వికెట్ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. బావుమా(110), వండెర్ డస్సెన్ (129) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ధావన్(79),కోహ్లి(51),ఠాకూర్(50) పరుగులుతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్‌వాయో,షమ్సీ, ఎన్‌గిడి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, మార్క్‌రమ్, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: IND VS SA: డికాక్ మెరుపువేగంతో.. పంత్ తేరుకునేలోపే
Comments
Please login to add a commentAdd a comment