
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
రాజ్ కోట్ :దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా లక్ష్యం దిశగా సాగుతోంది. దక్షిణాఫ్రికా విసిరిన 271 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 22 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(54 నాటౌట్; 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) మరోసారి ఆకట్టుకున్నాడు. ఇది రోహిత్ కు వన్డే కెరీయర్ లో 27వ హాఫ్ సెంచరీ.
అతనికి జతగా విరాట్ కోహ్లీ(27)క్రీజ్ లో ఉన్నాడు. అంతకుముందు శిఖర్ ధవన్(13) పెవిలియన్ కు చేరాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లనష్టానికి 270 పరుగులు చేసింది.