నోటిదాకా అందివచ్చిన ఆహారాన్ని చేజేతులా పోగోట్టుకోవడం అంటే ఇదేనేమో.. తమలో తమకే ఐక్యత లేకపోవడం వల్ల సింహాల గుంపుకు నిరాశే ఎదురైంది. వాటికి ఆహారంగా దొరికిన ఓ దున్న తెలివిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ వింత ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ సింహాల గుంపు ఒంటరిగా ఉన్న దున్నను వేటాడింది. వాటికి చిక్కిన ఆ దున్నను ఎంచక్కా తినకుండా మాంసం కోసం వాటంతట అవే కొట్టుకోవటం ప్రారంభించాయి. ఇదే అదనుగా భావించిన ఆ దున్న అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కాగా, ఈ వీడియోనూ భారత్‌కు చెందిన పర్వీన్ కశ్వన్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారి ట్వీటర్‌లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తెలివితక్కువ సింహాలకు ఇది మంచి గుణపాఠమని, సింహాల నుంచి తెలివిగా తప్పించుకున్న దున్నను అందరూ మెచ్చుకుంటున్నారు.
These #lions have a lesson to teach. They were having their meal but decided to fight with each other. And food walked away. Credits in video. pic.twitter.com/e7PUaZYWnP
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 1, 2019
Comments
Please login to add a commentAdd a comment