Kruger National Park
-
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్‌గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్‌లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్‌కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా
జోహన్నెస్‌బర్గ్ : మనం ఏ పనైనా సరే ఓపికతో ఎదురుచూస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. అయితే అన్నిసార్లు ఈ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. అయితే ఒక జిరాఫి మాత్రం 5గంటల సేపు ఓపికగా నిలబడి తన ప్రాణాలను దక్కించుకొంది. ఇంతకీ 5 గంటల సేపు అది ఏం చేసిందో తెలుసా.. ఒక సింహాల గుంపు దాని దాడి చేసి పీక్కుతుంటున్నా ఏమి అనకుండా అలాగే ఓపికగా నిల్చుండిపోయింది. ఎంతసేపటికి ఆ జిరాఫి సింహాలకు తలొగ్గకపోవడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో చోటుచేసుకుంది. ఈ వీడియోనూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి నవీద్ ట్రంబూ తన ట్విటర్లో షేర్ చేశారు.(గ్రహాంతరవాసులపై మరోసారి చర్చ లేపిన వీడియో) 'ఈ వీడియో మనందరికి ఒక పాఠంగా నిలుస్తుంది. తనపై క్రూరంగా దాడికి పాల్పడుతున్న సింహాలకు జిరాఫి ఏ మాత్రం బెదరకుండా 5 గంటల పాటు ఓపికగా నిల్చుంది. చివరకు ఎంతకీ లొంగకపోవడంతో సింహాలు జిరాఫిని వదిలేసి వెళ్లిపోయాయి.అందుకే మనం ఏదైనా సాధించాలంటే ఓపిక ఎంత అవసరమో జిరాఫి చూపించిందంటూ' పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ 11వేలకు పైగా వీక్షించగా, వేల కొద్ది లైక్స్ వస్తున్నాయి. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు' .. 'ప్రాణం మీదకు వస్తున్న జిరాఫి ఓపికగా నిలబడినందుకు ఇదే మా సలాం' అంటూ తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (ఫోన్‌కు మూడుముళ్లు వేసిన వరుడు) -
సింహం పిల్లను ఎత్తుకుపోయిన కొండముచ్చు
-
సింహం పిల్లను ఎత్తుకుపోయిన కొండముచ్చు
జోహన్నెస్‌బర్గ్ : ఈ ఫోటోల్లో సింహం పిల్లను ఎత్తుకుపోతున్న కొండముచ్చును చూశారు కదా! అది ఆ కూనను చెట్టుపైకి తీసుకెళ్లి అటూ ఇటూ తిప్పింది. తన సొంత బిడ్డతో ఆడుకున్నట్లే దానితోనూ సరదాగా ఆడుకుంది. అరుదైన ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో ఈ నెల 1న చోటుచేసుకుంది. ఇలాంటి అసాధారణ ఘటనను తన 20 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని పార్క్రేంజర్కుర్ట్ షుల్జ్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ కొండముచ్చు ...ఆ సింహం పిల్లను ఏం చేసిందో తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
వైరల్ : దున్న భలే తప్పించుకుంది
నోటిదాకా అందివచ్చిన ఆహారాన్ని చేజేతులా పోగోట్టుకోవడం అంటే ఇదేనేమో.. తమలో తమకే ఐక్యత లేకపోవడం వల్ల సింహాల గుంపుకు నిరాశే ఎదురైంది. వాటికి ఆహారంగా దొరికిన ఓ దున్న తెలివిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ వింత ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ సింహాల గుంపు ఒంటరిగా ఉన్న దున్నను వేటాడింది. వాటికి చిక్కిన ఆ దున్నను ఎంచక్కా తినకుండా మాంసం కోసం వాటంతట అవే కొట్టుకోవటం ప్రారంభించాయి. ఇదే అదనుగా భావించిన ఆ దున్న అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. కాగా, ఈ వీడియోనూ భారత్‌కు చెందిన పర్వీన్ కశ్వన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి ట్వీటర్లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తెలివితక్కువ సింహాలకు ఇది మంచి గుణపాఠమని, సింహాల నుంచి తెలివిగా తప్పించుకున్న దున్నను అందరూ మెచ్చుకుంటున్నారు. These #lions have a lesson to teach. They were having their meal but decided to fight with each other. And food walked away. Credits in video. pic.twitter.com/e7PUaZYWnP — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 1, 2019 -
అడవైనా.. రోడ్డైనా నేనే రారాజు
-
అడవైనా.. రోడ్డైనా రాజు మాత్రం నేనే..!
సింహాన్ని జూలో చూడాలంటేనే చాలా మందికి వణుకోస్తుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సింహాలు అలా రోడ్డు మీద కార్ల మధ్యలోంచి దర్జగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ వీడియోలో ఉన్నట్లు ఉంటుంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది ఈ సంఘటన. దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నాలుగు సింహాలు దర్జాగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్లాయి. ఆ సమయంలో అక్కడ రోడ్డు మీద దాదాపు పదుల సంఖ్యలో కార్లున్నాయి. కానీ వారంతా మృగరాజులు వెళ్లే వరకూ ఆగి ఆ తర్వాత ముందుకు సాగారు. సింహన్ని జూలో చూడటం కన్నా ఇలా నడిరోడ్డు మీద నడిచి వెళ్తూంటే చూడటం నిజంగా చాలా థ్రిల్‌ని కలిగించిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 20 లక్షల మంది చూశారు. -
హృదయాలను కలిచివేస్తున్న ఫోటో.. తల్లి కోసం..
తల్లి బిడ్డల బంధం విడదీయలేనిది. అది మనుషులకైనా, పశుపక్ష్యాదులకైనా ఒక్కటే. తన బిడ్డకు చిన్న గాయం అయినా తల్లి గుండె తల్లడిల్లిపోతుంది. అలాగే తల్లికి ఏ చిన్న హానీ కలిగినా బిడ్డ అంతే బాధపడుతుంది. తన తల్లిని చంపేందుకు వచ్చిన వేటగాళ్లను ఎదిరించే దమ్ములేకపోయినా.. తల్లిని రక్షించడం కోసం చివరిదాక ప్రయత్నం చేసింది ఓ పిల్ల ఖడ్గమృగం(రైనో). కానీ తల్లిని రక్షించేకోలేక గాయాలతో తల్లి శవం వద్దే పడిఉంది. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ హృదయ విచారక ఘటన అఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో జరిగింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరి హృదయం చలించిపోతుంది. ఖడ్గమృగాల కొమ్ముల కోసం వేటగాళ్లు వాటిని చంపేస్తుంటారు. సాధారణంగా ఖడ్గ మృగం కొమ్ములు తీసుకొని వెళ్ళడానికి వేటగాళ్ళు వచ్చినప్పుడు.. వాటి పిల్లలను కూడా చంపేయడమో.. లేదా వాటికి మత్తుపదార్థాలు పెట్టడమో చేస్తూ ఉంటారు. పిల్ల రైనోలు వారి పనికి అడ్డు తగిలే అవకాశం ఉంటుందని అలా చేస్తారు. వేటగాళ్లకు చిక్కిన ఓ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు ఓ బుల్లి రైనో తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఒక్క నెల వయస్తున్న ఆ రైనో తన తల్లికి హానీ కలిగించడానికి వచ్చిన వేటగాళ్లను ఎదురించించింది. ఇంకా కొమ్ములు కూడా రాని ఆ బుల్లి రైనో తన తల్లిని రక్షించేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. చివరకూ వేటగాళ్ల చేతిలో గాయాలపాలై తల్లి శవం వద్దే పడిపోయింది. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. నెల వయస్సు ఉన్న రైనో తన తల్లికోసం అంత సాహసం చేయడం.. చివరకి వేటగాళ్ల చేతిలో ఓడిపోయి తల్లి శవం వద్ద దీనస్థితిలో పడిఉండడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కాగా ఆ బుల్లి రైనోని సఫారీ జూ సిబ్బంది తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తోంది. దానికి ఆర్థర్ అని పేరు పెట్టి ట్రీట్మెంట్కోసం విరాళాలను కూడా సేకరిస్తోంది. దానికి గాయాలు ఎక్కడెక్కడ అయ్యాయో.. తల్లికోసం అది చేసిన సాహసం ఏంటో తెలుపుతూ విరాళాలు సేకరిస్తున్నారు. జంతూ ప్రేమికులు కూడా బుల్లి రైనో ఆర్థర్‌కు పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నారు. ఆ విరాళాలతో ఇలా గాయపడిన ఎన్నో ఖడ్గమృగాలను రక్షిస్తున్నారు. -
గజరాజు ఫన్నీ ఫీట్.. వైరల్
సఫారీలో సంచరించే ఓ ఏనుగు చేసిన ఫీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. జిరాఫీలను ఆదర్శంగా తీసుకుని రెండు కాళ్లపై నిల్చుని చెట్ల కొమ్మలను అందిపుచ్చుకుని ఆహారాన్ని ఆరగించింది. డంకెన్ టేలర్ అనే ఫోటోగ్రాఫర్ తన కుటుంబంతో క్రూగర్ నేషనల్ పార్క్(సౌతాఫ్రికా)కు వెళ్లగా.. అక్కడ ఓ ఏనుగు ఆయన కెమెరా కంటికి చిక్కింది. ‘సాధారణంగా సర్కస్ ఏనుగుల్లో ఇలాంటి ప్రవర్తన సహజం. కానీ, ఓ అడవి ఏనుగు ఇలా ప్రవర్తించటం మాత్రం చాలా అరుదు. ప్రతీ రోజూ జిరాఫీలను చూసి చూసి దానికి అలా చేయాలన్న ఆలోచన కలిగింది. వారంపైగానే అది యత్నించింది. ఏదైతేనేం చివరకు సాధించింది’ అని సఫారీ పర్యవేక్షకుడు డెన్ని బోనియెల్ వెల్లడించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. -
గేదె కొమ్ములతో సింహాన్ని ఎత్తి కొట్టింది
-
ఎత్తి కొడితే.. ఎగిరి పడింది..
దక్షిణాఫ్రికా: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం అనిపించుకుంటుంది. కానీ నేటి కాలంలో మానవత్వం మాట దేవుడెరుగు..! కనీసం ఇతరులకు కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఈ విషయంలో పశుపక్ష్యాదులు మినహాయింపు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అవి స్పందిస్తాయి. సహాయం కోసం అర్థిస్తున్న వాళ్లకు చేయూతనందిస్తాయి. తక్షణం స్పందించి వాటికి తోచిన రీతిలో ఇతర మూగ జీవాలకు తోడుగా నిలుస్తాయి. సింహాల బారిన పడి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఓ భారీ సైజు బల్లిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ గేదె కాపాడింది. తుపాను వేగంతో అక్కడికి చేరుకుని ఆ సింహాల గుంపుని చెండాడింది. ఈ సంఘటన క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల చోటుచేసుకుంది. సింహాల గుంపు ఆ బల్లిని పీక్కు తినేందుకు సిద్ధమౌతున్న వేళ ఆ గేదె చాకచక్యంగా దాన్ని రక్షించింది. క్షణం ఆలస్యమైనా ఆ బల్లి ప్రాణాలు హరీమనేవే. అందుకనే కోపం పట్టలేని గేదె ఒక్క ఉదుటున బల్లిని తన కాలికింద తొక్కిపట్టిన సింహం మీదకి దుమికింది. అపాయం నుంచి బల్లి బయటపడగానే తన రెండు కొమ్ములతో ఆ సింహాన్ని ఎత్తి కొట్టింది. గాల్లో గింగిరాలు తిరుగుతూ కింద పడిన ఆ సింహం కుయ్యో, ముర్రో అంటూ అక్కడ్నుంచి జారుకోగా, మిగతా సింహాలు కూడా దాన్ని అనుసరించాయి. పార్కుని సందర్శిస్తున్న స్యూన్ ఎలోఫ్ అనే వ్యక్తి ఈ సాహస కృత్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
సివంగి వేటకు బలైంది!
మాటు వేసిన మృత్యువు.. తమ మానాన తాము చెట్ల ఆకులను తింటున్న పిల్ల జిరాఫీలు.. వాటికి రక్షణగా తల్లి జిరాఫీ.. మృత్యువు తమ ముంగిట్లోనే ఉందన్న విషయాన్ని అవి గమనించలేదు.. అంతే.. మాటు వేసిన మృత్యువు ఒక్కసారిగా విరుచుకుపడింది. పిల్ల జిరాఫీని బలిగొంది. ఓ సివంగి జిరాఫీని వేటాడిన ఈ దృశ్యాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ఫొటోగ్రాఫర్ అంజా క్రూగర్ క్లిక్‌మనిపించారు. అనుకోకుండా తన కెమెరాకు ఈ చిత్రం చిక్కిందని.. చాలా అరుదుగా ఇలాంటి ఫొటోలు తీయగలుగుతామని అంజా తెలిపారు. ‘అప్పటివరకూ ఎలాంటి అలజడి లేదు. జంతువులంతా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఓ సివంగి పొదల చాటున మాటువేసి ఉందన్న విషయాన్ని మేము కూడా గమనించలేదు. ఆ జిరాఫీలు ఆహారం కోసం అక్కడికి వెళ్లాయి. సివంగికి ఆహారమైపోయాయి. అరుదైన చిత్రమైనా.. చాలా బాధాకరమైనది’ అని అంజా అన్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. -
పళ్లను ముఖంలోకి దించి.. ఈడ్చుకెళ్లింది..
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ క్రూగర్ జాతీయ పార్కులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు విహారయాత్రకు వచ్చిన ఓ బాలుడిపై హైనా దాడి చేసింది. దీంతో అతని ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం ఓ కుటుంబం విహారయాత్రకు పార్కుకు వచ్చింది. మధ్యహ్న సమయంలో యాత్రికుల విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాటు చేసిన టెంట్లలోకి అందరూ వెళ్లారు. ఎండకు అలసిపోయిన బాలుడు తన టెంటును మూసివేయకుండా ఆదమరచి నిద్రపోయాడు. జంతువులు ప్రవేశించడానికి లేకుండా ఏర్పాటు చేసిన కంచెలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా ఓ హైనా క్యాంప్ స్థలంలోకి ప్రవేశించింది. బాలుడు నిద్రిస్తున్న గుడారం పూర్తిగా మూసి ఉండకపోవడంతో లోపలికి ప్రవేశించింది. అతనిపై దాడి చేసిన హైనా, దాని ముందరి పళ్లతో బాలుడి ముఖంపై తీవ్రంగా దాడి చేసి బయటకు ఈడ్చుక్కెళ్లసాగింది. ఈ సమయంలో బాలుడు బాధతో పెద్దగా కేకలు వేయడంతో ఉలిక్కిపడిన అతని కుటుంబసభ్యులు హైనా బారి నుంచి అతన్ని కాపాడారు. పార్కు గైడ్, నర్సు ఘటనాస్థలంలో అందుబాటులో ఉండటంతో ప్రాధమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. కాగా, గత ఏడాది జులైలో టూరిస్ట్ గైడ్ పై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. -
చిరుత ఎక్కడుందో చెప్పగలరా ?
ఆకులో ఆకునై.. పూవులో పువ్వునై.. అన్న సినీకవి గీతానికి కొనసాగింపుగా ప్రకృతి రంగులో పూర్తిగా కలిసిపోయిన చిరుత ఒకటి ఈ ఫొటోలో దాగుంది. గలగలా తనముందే తిరిగి చటుక్కున చెట్టెక్కిన ఉడతను వేటాడేందుకు చెట్టుకింద నిల్చున్న చిరుతను కనిపెట్టడానికి కాస్త కష్టపడాల్సిందే. అందుకే ఈ చిత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సౌతాఫ్రికాలోని లిపాప్ ప్రావిన్స్ లో గల క్రూగెర్ జాతీయ పార్కులో గైడ్ గా పనిచేస్తోన్న ఫ్రాంకోయిస్ కొల్లిన్స్.. టూరిస్టులతో మాట్లాడుతూ యాదృశ్చికంగా.. సాధారణ ఐఫోన్ తో తీశాడీ ఫొటో. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేలకొద్దీ షేర్లు సాధించింది. కాస్త కంటిచూపుకు పదును పెట్టి చిరుతను ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం! -
హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే!
తనపై దాడి చేసేందుకు వచ్చిన మొసలిని నీటి గుర్రం నోటితో కరిచి చంపేస్తోందని అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తుంటే. కానీ కాదు.. మొసలి వల్ల తన బిడ్డకు ముప్పు కలుగవచ్చన్న భయంతోనే ఈ హిప్పో ఇలా ఉగ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో లేక్ పానిక్ అనే సరస్సులో ఈ హిప్పోపొటామస్ తన బుల్లి హిప్పోతో హాయిగా విహరిస్తోంది. ఇంతలో ఆ పరిసరాల్లో ఈ మొసలి కంటపడింది. అంతే.. హిప్పో కొరకొరా చూసింది. తన బిడ్డ కోసమే వచ్చిందనుకుని ఒక్క ఉదుటున దూసుకొచ్చింది. దీంతో మొసలి భయంతో నీటిలో మునిగి నేలకు కరుచుకుని ఉండిపోయింది. అయినా.. శాంతించని హిప్పో ఇలా దాన్ని నోట కరుచుకుని ఒడ్డున పడేసి కొరుకుతూ చితక్కొట్టింది! ఇదంతా చూసిన కెన్ హాలీ అనే ఫొటోగ్రాఫర్ హిప్పో ఏకపక్ష దాడిని ఇలా కెమెరాలో బంధించేశాడు! -
సాహసం చేయరా డింభకా..
దక్షిణాఫ్రికాలోని కృగర్ నేషనల్ పార్క్ గుండా రోడ్డుపై వెళ్లాలంటే సాహసం చేయక తప్పదు. ఎప్పుడు ఏ క్రూర మృగం మంద అడ్డం వచ్చి రోడ్డుపై భైఠాయిస్తుందో చెప్పలేం. అలాంటి సమయాల్లో పైప్రాణాలు పైనేపోతాయనే భయం పట్టుకున్నప్పటికీ సంయమనం పాటిస్తూ అడ్డం వచ్చిన జంతువులను చాకచక్యంగా తప్పించుకోవాల్సిందే. వాటికి చిర్రెత్తేలా హారన్ మోగించడం, స్పీడ్‌గా తప్పించుకుపోదామనే తొందరలో ఇంజన్ సౌండ్ మోతెక్కేలా కారును నడపకూడదు. మన మానాన మనం ఏ జంతువుకు భంగం వాటిల్ల కుండా వెళితే వాటి మానాన అవి పోతాయని ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. నీలిరంగు కారులో వస్తున్న ఓ కుర్రాడికి హఠాత్తుగా ఓ డజను సింహాలు ఎదురయ్యాయి. అవి రోడ్డు దాటి వెళ్లిపోతాయని ఆ కుర్రాడు కారాపితే అవికాస్త కారు ముందే భైఠాయించాయి. అవి సరిపోనట్టు ఓ ఏనుగు నింపాదిగా కారు వేనకగా వచ్చి కాసేపు అక్కడే తచ్చాడింది. కారును వెనక్కి తిప్పలేని, ముందుకు పోనివ్యలేని పరిస్థితి. ధైర్యంగా కాసేపు అలాగే ఉండడంతో వెనకున్న ఏనుగు వెళ్లిపోయింది. ముందున్న సింహాలు కొంత దారిచ్చాయి. ఆ కుర్రాడు నీలిరంగు కారును మెల్లగా సింహాలను దాటించి బతుకుజీవుడా అనుకుంటూ తుర్రుమన్నాడు. ఈ చిత్రాన్ని ముందున్న కారులోని స్టెల్లా స్టీవర్ట్ అనే టూరిస్టు తీసింది. ఆమె ఎప్పుడో తీసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు బయటపెట్టింది. అంతటి సాహసం చేసిన ఆ కుర్రాడు ఎవరనేదిమాత్రం తెలియరాలేదు. -
ఓ మై ఫ్రెండ్..
మన స్నేహితులతో ఎలా భుజంపై చేయి వేసి మాట్లాడుతామో.. ఇక్కడ కూడా దాదాపు అదే సీన్ కనిపిస్తోంది కదూ.. అయితే.. ఇది కాస్త అరుదైన సన్నివేశం. చిరుతపులి, జింక స్నేహం గురించి మనం వినలేదు.. కనలేదు.. దక్షిణాఫ్రికాకు చెందిన ఎస్టియాన్ కూడా అలాగే అనుకున్నాడు ఈ సీన్ చూసేదాకా.. అక్కడి క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల ఈ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ పిల్ల జింక, పిల్ల చిరుతలు ఒకదానితో ఒకటి ఆడుకోవడాన్ని ఇతడు క్లిక్‌మనిపించాడు. తాను గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని.. ఇకముందు కూడా చూస్తానని అనుకోవడం లేదని అన్నాడు. దాదాపు గంటపాటు ఈ స్నేహం కొనసాగిందట. తర్వాత చిరుతపులులు ఓ పొద వెనక్కు వెళ్లాయని.. జింక కూడా అదే వైపు వెళ్లిందని చెప్పాడు. ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని.. పర్యాటకులతోపాటు తానూ అక్కడి నుంచి వచ్చేశానని చెప్పాడు.