హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే! | Photos show mother hippopotamus taking a chunk out of crocodile in South Africa | Sakshi
Sakshi News home page

హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే!

Published Mon, Jun 22 2015 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే!

హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే!

తనపై దాడి చేసేందుకు వచ్చిన మొసలిని నీటి గుర్రం నోటితో కరిచి చంపేస్తోందని అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తుంటే. కానీ కాదు.. మొసలి వల్ల తన బిడ్డకు ముప్పు కలుగవచ్చన్న భయంతోనే ఈ హిప్పో ఇలా ఉగ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో లేక్ పానిక్ అనే సరస్సులో ఈ హిప్పోపొటామస్ తన బుల్లి హిప్పోతో హాయిగా విహరిస్తోంది. ఇంతలో ఆ పరిసరాల్లో ఈ మొసలి కంటపడింది. అంతే.. హిప్పో కొరకొరా చూసింది.

తన బిడ్డ కోసమే వచ్చిందనుకుని ఒక్క ఉదుటున దూసుకొచ్చింది. దీంతో మొసలి భయంతో నీటిలో మునిగి నేలకు కరుచుకుని ఉండిపోయింది. అయినా.. శాంతించని హిప్పో ఇలా దాన్ని నోట కరుచుకుని ఒడ్డున పడేసి కొరుకుతూ చితక్కొట్టింది! ఇదంతా చూసిన కెన్ హాలీ అనే ఫొటోగ్రాఫర్ హిప్పో ఏకపక్ష దాడిని ఇలా కెమెరాలో బంధించేశాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement