Hippopotamus
-
అమెరికా ఎన్నికలపై ‘హిప్పో’ జోస్యం.. వీడియో వైరల్
బ్యాంకాక్:ప్రపంచమంతా అమెరికా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ట్రంప్, కమలాహారిస్లలో ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికపై థాయ్‌లాండ్‌లోని మూ డెంగ్ అనే పొట్టి నీటిగుర్రం(హిప్పో) ఆసక్తికర జోస్యం చెప్పింది.కాబోయే అమెరికా అధ్యక్షుడెవరన్నదానిపై పొట్టి నీటి గుర్రం జోస్యం చెప్పిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్‌లోని కావోక్యూ ఓపెన్ జూలో ఉన్న పొట్టి హిప్పోకు రెండు పుచ్చకాయ కేకులను ఆఫర్ చేశారు. వీటిలో ఒకదానిపై థాయ్భాషలో ట్రంప్ అని మరొకదానిపై కమల అని పేర్లు రాశారు. పొట్టిహిప్పో ట్రంప్ పుచ్చకాయ కేకును తినేసింది. అంటే ట్రంప్ గెలవనున్నారని జోస్యం చెప్పింది. అదే నీటి కొలనులో ఉన్న పెద్ద హిప్పో మాత్రం కమల పేరు ఉన్న పుచ్చకాయను తీసుకుంది. దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. Im not saying this is good omen but i would take anything... 😆 Moo Deng, the famous baby hippo, predicts Donald Trump will win the #Election2024 . The hippo must be a true #patriot pic.twitter.com/nrw4Q28G7v— motivate 4 life 🇺🇲 (@imotivate4life) November 4, 2024 ఇదీ చదవండి: రిపబ్లికన్లకు ఉడత సాయం -
కంపు చేస్తున్నాయని.. భారత్‌కు తరలిస్తున్నారు
ఒకప్పుడు వాటి సంఖ్య నాలుగు మాత్రమే. ఇప్పడు ఆ కౌంట్ 130కి చేరింది. పెరిగితే పెరిగాయ్. కానీ, ఆ ప్రాంతమంతా కంపు కంపు చేస్తున్నాయి. అందుకే వాటిని వదిలించుకునేందుకు అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించాయి. ఇక చివరి ప్రయత్నంగా వాటిని భారత్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యాయి. కొలంబియా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డెబ్భై హిప్పోపోటమస్లను పట్టుకుని వాటిని భారత్‌తో పాటు మెక్సికోకు తరలించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇవి డ్రగ్ లార్డ్‌గా పేరుగాంచిన పాబ్లో ఎస్కోబార్‌కు చెందినవి కావడం. 1980లో ఎస్కోబార్ నాలుగు హిప్పోపోటమస్(నీటి ఏనుగులను) ఆఫ్రికా నుంచి అక్రమంగా తెప్పించుకున్నాడు. ఆ టైంలో అతని దగ్గర ఏనుగులు, జిరాఫీలు.. ఇలా జంతువుల కలెక్షన్స్‌తో ఒక పెద్ద జూ ఉండేది. పశ్చిమ ప్రాంతంలోని తన ఎస్టేట్‌లో వీటిని ఉంచాడు. అయితే.. 1991లో ఎస్కోబార్ లొంగిపోయాక.. అక్కడి ప్రభుత్వం వాటికి స్వేచ్ఛ కల్పించింది. అటుపై.. ఆ ఈ ముప్పై ఏళ్లలో ఆ నాలుగు నీటి ఏనుగుల సంఖ్య కాస్త 130కి చేరుకుంది. ప్రస్తుతం అవి మాగ్డలీనా నది ప్రాంతంలో ఉంటున్నాయి. అయితే.. అక్కడి నేల సారవంతాన్ని పాడు చేయడంతో పాటు, అక్కడి నీటిని కలుషితం చేస్తున్నాయి. మొక్కలను పాడు చేస్తున్నాయి. పైగా స్థానికులు సైతం వాటి వల్ల ప్రాణపాయం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో.. వాటి జనాభాను నియంత్రించేందుకు కొలంబియా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఆ చర్యలు ఫలించలేదు. చేసేది లేక వాటిని చంపేందుకు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఇక చివరి ప్రయత్నంగా వాటిని దూరంగా తరలించడమే మార్గమని కొలంబియా ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌కు 60, మెక్సికోకు పది హిప్పోలను తరలించాలని నిర్ణయించుకుంది కొలంబియా ప్రభుత్వం. అయితే.. ఈ కొలంబియా ప్రతిపాదనపై భారత్ స్పందన తెలియాల్సి ఉంది. -
రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్! -
భయంతో పరుగు లంఘించిన మూడు సింహాలు: వీడియో వైరల్
సింహాన్ని చూస్తే ఏ జంతువైన పరుగు లంఘించాల్సిందే. అలాంటి సింహమే గజగజలాడుతూ ప్రాణాల కోసం పరుగులు పెట్టింది. అదీ కూడా మూడు పెద్ద సింహాలు కలిసి ఉండగా...వాటినే హడలెత్తించి మరీ పరుగులు పెట్టించింది హిప్పో అనే జీవి. పాపం ఆ సింహాలు మాములుగా భయపడలేదు. ఈ ఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది. హిప్పొపొటామస్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పెద్ద క్షీరదంగా చెబుతారు. ఇది ఆఫ్రికాలో ఒక్క ఏడాదిలోనే సుమారు 500 మందిని దాక చంపేయగలదు. మూడు సింహాలు బోట్స్వానాలోని సెలిండా రిజర్వ్ స్పిల్ వద్ద నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఉన్న హిప్పో వాటిని అడ్డగించింది. అందులో ఒక సింహా పై దాడి చేసేందుకు యత్నిచింది. ఆ సింహాన్ని హిప్పో మాములుగా పరిగెట్టించలేదు. దెబ్బకు ఒడ్డునున్న మిగతా రెండు సింహాలు అది బతకుతుందో లేదో అన్నంత టెన్షన్‌గా చూస్తున్నాయి. ఐతే కొద్దిలో ఆ సింహం ఆ హిప్పో భారి నుంచి తప్పించుకుంది. ఈ మేరకు ఈ ఘటకు సంబంధించిన వీడియో ఆన్లైన్ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు నీటిలో ఉంటే సింహం పిల్లి అయిపోతుంది, అందుకే పరుగు లంఘించింది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. ) -
చిన్నపిట్టకు పెద్ద సవాల్..
బొత్స్వానాలోని మోరెమి గేమ్ రిజర్వులో తీసిన చిత్రమిది. ఓ పక్షి నీటిపై పేరుకున్న గుర్రపు డెక్కలాంటి దానిపై నడుస్తూ కీటకాలను ఏరుకు తింటోంది. ఇంతలో నీటి అడుగు నుంచి ఓ హిప్పోపోటమస్ మెల్లిగా ఇలా తల బయటపెట్టింది. బిత్తరపోయిన పక్షి ఒకటే పరుగు. దగ్గర్లోనే ఉన్నతను దీన్ని ఇలా చిత్రంలో బంధించారు. -
హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే!
తనపై దాడి చేసేందుకు వచ్చిన మొసలిని నీటి గుర్రం నోటితో కరిచి చంపేస్తోందని అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తుంటే. కానీ కాదు.. మొసలి వల్ల తన బిడ్డకు ముప్పు కలుగవచ్చన్న భయంతోనే ఈ హిప్పో ఇలా ఉగ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో లేక్ పానిక్ అనే సరస్సులో ఈ హిప్పోపొటామస్ తన బుల్లి హిప్పోతో హాయిగా విహరిస్తోంది. ఇంతలో ఆ పరిసరాల్లో ఈ మొసలి కంటపడింది. అంతే.. హిప్పో కొరకొరా చూసింది. తన బిడ్డ కోసమే వచ్చిందనుకుని ఒక్క ఉదుటున దూసుకొచ్చింది. దీంతో మొసలి భయంతో నీటిలో మునిగి నేలకు కరుచుకుని ఉండిపోయింది. అయినా.. శాంతించని హిప్పో ఇలా దాన్ని నోట కరుచుకుని ఒడ్డున పడేసి కొరుకుతూ చితక్కొట్టింది! ఇదంతా చూసిన కెన్ హాలీ అనే ఫొటోగ్రాఫర్ హిప్పో ఏకపక్ష దాడిని ఇలా కెమెరాలో బంధించేశాడు! -
నోరు తెరు... ఆ...
‘పొద్దున మనమూ లేవాలి... పళ్లను బాగా తోమాలి’ అని పిల్లలకు మనం నేర్పిస్తుంటాం. అయితే ఈ నీటి ఏనుగుకి ఎవరు చెప్పారో కాని తనకూ పళ్లు తోమమంటూ ఎలా బుద్ధిగా కూర్చుందో చూడండి! జూన్ 4న జపాన్‌లో జాతీయ పళ్ల సంరక్షణ దినం సందర్భంగా అక్కడి తెన్నోజి పార్క్‌లో ఇలా హిప్పోపోటమస్కు పళ్లు తోముతున్నాడు.