సింహాన్ని చూస్తే ఏ జంతువైన పరుగు లంఘించాల్సిందే. అలాంటి సింహమే గజగజలాడుతూ ప్రాణాల కోసం పరుగులు పెట్టింది. అదీ కూడా మూడు పెద్ద సింహాలు కలిసి ఉండగా...వాటినే హడలెత్తించి మరీ పరుగులు పెట్టించింది హిప్పో అనే జీవి. పాపం ఆ సింహాలు మాములుగా భయపడలేదు. ఈ ఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది.
హిప్పొపొటామస్ ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పెద్ద క్షీరదంగా చెబుతారు. ఇది ఆఫ్రికాలో ఒక్క ఏడాదిలోనే సుమారు 500 మందిని దాక చంపేయగలదు. మూడు సింహాలు బోట్స్వానాలోని సెలిండా రిజర్వ్ స్పిల్ వద్ద నదిని దాటడానికి ప్రయత్నించినప్పుడు కోపంతో ఉన్న హిప్పో వాటిని అడ్డగించింది. అందులో ఒక సింహా పై దాడి చేసేందుకు యత్నిచింది.
ఆ సింహాన్ని హిప్పో మాములుగా పరిగెట్టించలేదు. దెబ్బకు ఒడ్డునున్న మిగతా రెండు సింహాలు అది బతకుతుందో లేదో అన్నంత టెన్షన్‌గా చూస్తున్నాయి. ఐతే కొద్దిలో ఆ సింహం ఆ హిప్పో భారి నుంచి తప్పించుకుంది. ఈ మేరకు ఈ ఘటకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్ తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు నీటిలో ఉంటే సింహం పిల్లి అయిపోతుంది, అందుకే పరుగు లంఘించింది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: జస్ట్ మిస్.. చిన్నారికి తప్పిన ఘోర ప్రమాదం.. ‘స్టుపిడ్ ఫెల్ అంటూ’.. )
Comments
Please login to add a commentAdd a comment