అమెరికా ఎన్నికలపై ‘హిప్పో’ జోస్యం.. వీడియో వైరల్‌ | Donald Trump Or Kamala Harris? Hippo Moo Deng Predicts Who Will Win US Presidential Elections In 2024, Video Viral | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికలపై ‘హిప్పో’ జోస్యం.. వీడియో వైరల్‌

Published Tue, Nov 5 2024 7:41 AM | Last Updated on Tue, Nov 5 2024 8:59 AM

Hippo Moo Deng Predicts Who Will Win US Elections

బ్యాంకాక్‌:ప్రపంచమంతా అమెరికా ఎన్నికల ఫీవర్‌ నడుస్తోంది. ట్రంప్‌, కమలాహారిస్‌లలో ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికపై థాయ్‌లాండ్‌లోని మూ డెంగ్‌ అనే పొట్టి నీటిగుర్రం(హిప్పో) ఆసక్తికర  జోస్యం చెప్పింది.

కాబోయే అమెరికా అధ్యక్షుడెవరన్నదానిపై పొట్టి నీటి గుర్రం జోస్యం చెప్పిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్‌లోని కావోక్యూ ఓపెన్‌ జూలో ఉన్న పొట్టి హిప్పోకు రెండు పుచ్చకాయ కేకులను ఆఫర్‌ చేశారు. వీటిలో ఒకదానిపై థాయ్‌భాషలో ట్రంప్‌ అని మరొకదానిపై కమల అని పేర్లు రాశారు. 

పొట్టిహిప్పో ట్రంప్‌ పుచ్చకాయ కేకును తినేసింది. అంటే ట్రంప్‌ గెలవనున్నారని జోస్యం చెప్పింది. అదే నీటి కొలనులో ఉన్న పెద్ద హిప్పో మాత్రం కమల పేరు ఉన్న పుచ్చకాయను తీసుకుంది. దీంతో ఇద్దరి మధ్య టఫ్‌ ఫైట్‌ ఉండబోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  

 ఇదీ చదవండి: రిపబ్లికన్లకు ఉడత సాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement