మద్దతుదారులకు ట్రంప్ విజ్ఞప్తి
సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్ట్
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్‌రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు.
BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.
“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024
ట్రంప్‌కు బైడెన్ ఆతిథ్యం
ట్రంప్‌తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్‌హౌస్‌కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు.
ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్‌తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్ ఆనవాయితీగా వస్తోంది.
చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment