
డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం రూ.1,091 కోట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆగస్టు నెలలో ఆమెకు 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల(రూ.3,030 కోట్లు) విరాళాలు లభించాయి. ఈ విషయం కమలా హారిస్ ప్రచార బృందం శుక్రవారం వెల్లడించింది.
తన ప్రత్యరి్థ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లకుపైగా ఎక్కువ విరాళాలు కమలా హారిస్ అందుకోవడం విశేషం. ట్రంప్‌కు గత నెలలో కేవలం 130 మిలియన్ డాలర్లు (రూ.1,091 కోట్లు) విరాళంగా లభించాయి. ఆగస్టు నెలాఖరు నాటికి కమలా హారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. ట్రంప్ వద్ద కేవలం 295 మిలియన్ డాలర్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment