Democratic Party
-
చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.లేకెన్ రిలే యాక్ట్ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు. జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్ ప్రకటించింది.అయితే.. లేకెన్ రిలే యాక్ట్ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్‌లో డెమోక్రటిక్ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.అమెరికా జార్జియా స్టేట్ ఏథెన్లో కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన లేకెన్ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు -
‘అతడు ఏనాటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు!’
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతేకాదు.. రాబోయే కాలంలో ఆయన పాలనలో మస్క్ కీలక పాత్ర సైతం పోషించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే.. అలాంటి వ్యక్తిపై ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ.. ప్రత్యర్థుల విమర్శల నేపథ్యంలో..ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న ఎలాన్ మస్క్‌ను.. అమెరికాకు షాడో ప్రెసిడెంట్‌గా పేర్కొంటూ ఓ ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ ఈ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తోంది. ప్రజలచేత ఎన్నుకోబడని ఓ వ్యక్తి(ఎలాన్ మస్క్).. అధికారం చెలాయించేందుకు సిద్ధమైపోతున్నాడు. రాబోయే రోజుల్లో అమెరికా ఆదాయ వ్యవహారాలన్నింటిని ప్రెసిడెంట్ మస్క్ చేతుల మీదుగానే నడుస్తాయి అంటూ ఎద్దేవా ప్రకటనలు చేస్తోంది. ఈ తరుణంలో..ఆదివారం అరిజోనా ఫీనిక్స్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ట్రంప్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘‘ఎలాన్ మస్క్ ఏదో ఒకనాటికి అమెరికా అధ్యక్షుడు కాకపోతాడా?’’ అని ప్రశ్నించింది. దానికి ఆయన ‘నో’ అనే సమాధానం ఇస్తూ కారణం వివరించారు.‘‘అతడు అధ్యక్షుడు కాలేడు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నా. ఎందుకంటే.. అతను ఈ దేశంలో పుట్టలేదు. కాబట్టి అది ఏనాటికి జరగదు’’ అని చెప్పారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశ గడ్డపై పుట్టిన వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు కాగలడు. ఎలాన్ మస్క్ సౌతాఫ్రికాలో పుట్టాడు.ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ పార్టీలోనూ మస్క్‌కు వ్యతిరేక వర్గం తయారవుతున్నట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఫండింగ్ ప్రతిపాదనను తిట్టిపోస్తూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీటే అందుకు కారణం. -
డెమొక్రాట్లను ఆదుకోండి
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్‌కు బైడెన్ ఆతిథ్యం ట్రంప్‌తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్‌హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్‌హౌస్ ప్రెస్‌సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్‌హౌస్‌కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్‌తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్‌కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్‌హౌస్ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
USA Elections Results 2024: ఆ నాలుగు వద్దు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్‌కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్‌గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్‌లు, షేరింగ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్ ఫెమినిస్ట్ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది. ఏమిటీ 4బీ ఉద్యమం?ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్ క్లాస్‌లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజకీయాలకు కమలా హారిస్ గుడ్‌బై?!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఏం చేయబోతున్నారు?. అమెరికా కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని.. కొనసాగిస్తానని చెప్పిన మాట మీద ఆమె నిలబడతారా?. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారా?.ట్రంప్ చేతిలో ఓటమి తర్వాత హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హారిస్ గంభీరంగానే ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. అయితే.. మరో 72 రోజుల్లో ఆమె ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత ఆమె ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.సాధారణంగా.. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు.. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు దక్కుతుంటాయి. లేదంటే ఏదో ఒక కీలక పదవుల్లో వాళ్లకు అవకాశాలు దక్కవచ్చు. 2004లో జార్జి బుష్ చేతిలో ఓటమిపాలైన జాన్ కెర్రీ.. బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అంటే.. ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట.అయితే జాన్ కెర్రీలా తిరిగి రాజకీయాల్లో రాణించేందుకు ఛాన్స్ కమలకు ఉంది . 2017 నుంచి 2021 మధ్య కాలిఫోర్నియా నుంచి సెనేట్‌కు ఆమె ప్రాతినిధ్యం వహించారు. అయితే మళ్లీ సెనేట్‌కు వెళ్లేందుకు ‘ఇంటిపోరు’ ఆమెకు ఆటంకంగా మారే అవకాశం లేకపోలేదు. సొంత రాష్ట్రంలో.. డెమోక్రటిక్ మద్దతుదారుల నుంచే ఆమెకు వ్యతిరేక గళం వినిపిస్తోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలిచ్చినవాళ్లూ ఆమె పట్ల అసంతృప్తితోనే ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. పోటీ డెమోక్రటిక్ ప్రతినిధిగా కొనసాగుదామన్నా.. అందుకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లెక్కన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిత్వం కోసం ఆమె తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుంది. అలాకాకుంటే..రాజకీయాలకు దూరం జరిగి హిల్లరీ క్లింటన్, ఏఐ గోర్ మాదిరి సాహిత్య రచన, ఇతర వ్యాపకాల్లో మునిగిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. తన పోరాటం కొనసాగుతుందని కమలా హారిస్ ప్రకటించినప్పటికీ.. అందుకు అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవేవీకాకుండా ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించవచ్చనే అభిప్రాయమూ ఒకటి వినిపిస్తోంది. కమలా హారిస్ వయసు 60 ఏళ్లు. కాబట్టి, అధ్యక్ష ఎన్నికల రేసులో ఆమెకు బోలెడు అవకాశం ఉందని ఆమెకు దగ్గరి వ్యక్తులు చెబుతున్నారు. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది 2025 జనవరి 20 తర్వాత తేలిపోనుంది. -
ట్రంప్‌కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్‌లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్‌కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్‌నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్‌కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్‌కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్‌లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్‌కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్‌పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్‌కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్‌కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
US Elections: కొనసాగుతున్న పోలింగ్.. రిజల్ట్ ఎప్పుడంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చరిత్ర సృష్టించేందుకు సర్వశక్తులొడ్డుతుండగా.. దేశాన్ని మరోసారి గొప్పగా మార్చుదామన్న నినాదంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడిగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
అగ్రరాజ్యంలో ఎన్నికలపై మనోళ్ల ఉత్కంఠ
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకు మనదేశం నుంచి ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వేలాది మంది వెళ్తుంటారు. ఇప్పటికే చాలామంది అక్కడి వెళ్లి స్థిరపడ్డారు.ఆ దేశంలో ఈనెల 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్ బరిలో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు వారి మాటల్లో..కమలా హారిస్‌కే విజయావకాశాలు ఎక్కువ కోదాడ: మాది కోదాడ. మేము ఉద్యోగ రీత్యా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కే ఎక్కువ విజయావకాలున్నాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడ స్థిరపడిన వారిలో 80 శాతం మంది కమలకే మద్దతుగా నిలుస్తున్నారు. భారతీయులు దాదాపు కమలాహారిస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వారి అంచనాల ప్రకారం 2శాతం మెజార్టీతో కమల గెలుపొంది అమెరికా అధ్యక్షురాలు అవుతుంది. – కందిబండ ప్రియాంక, నార్త్ కరోలినాట్రంప్ గెలవకూడదని కోరుకుంటున్నారుకోదాడ: మా స్వస్థలం కోదాడ పట్టణం. అమెరికాలోని నార్త్ కరోలినాలో స్థిరపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతుంది. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ట్రంప్‌కు మద్దతిచ్చేవారు తగ్గిపోయారు. ట్రంప్ గెలవకూడదని ఎక్కువ శాతం ప్రజలు కోరుతున్నారు. నార్త్ కరోలినాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కమలా హారిస్‌కే మద్దతు ఎక్కువగా ఉంది. – శరాబు కృష్ణకాంత్, నార్త్ కరోలినాడెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గుకోదాడ: మాది కోదాడ పట్టణం. అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడ్డాం. అధ్యక్ష్య ఎన్నికల్లో ఈ సారి ఇండియన్స్ డెమోక్రాట్స్ అభ్యర్థి కమలాహారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. స్వల్ప మెజార్టీతోనైనా కమల గెలుస్తుందనే చర్చ జరుగుతుంది. వలస చట్టాలపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారు భయపడుతున్నారు. ట్రంప్ కూడా తన ప్రసంగాలలో ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ప్రచారం చేసూ్తన్నారు. – బొగ్గారపు మణిదీప్, గుడుగుంట్ల నాగలక్ష్మి, చికాగోబలమైన నాయకత్వం అవసరంఆత్మకూర్ (ఎస్): మాది ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. అమెరికాలోని నార్త్ కేరోలినాలో కెమికల్ ఎనావిుస్ట్గా స్థిరపడ్డాను. అమెరికా దేశం ముందు ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కొంటోంది. ధరలు పెరగడం, పెరుగుతున్న నేరాలు, సరిహద్దు భద్రత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన నాయకత్వం అవసరం. వైఫల్యంతో నిండిన బైడెన్ ఆర్థిక, వలస, విదేశీ విధానాల నుంచి పునరుద్ధరించడానికి ట్రంప్ గెలుపు చాలా అవసరం. – దండ నీరజ, కెమికల్ ఎనావిుస్ట్, నార్త్ కేరోలినాడోనాల్డ్ ట్రంపే గెలుస్తారు సూర్యాపేట: మాది సూర్యాపేట పట్టణం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సిన్సినాటి, ఒహాయో రాష్ట్రంలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కే విజయావకాశాలు ఉన్నాయి. నేను కూడా అదే పార్టీకి ఓటేయాలనుకుంటున్నా. ఈ సారి ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్, ఇజ్రాయిల్ యుద్ధాలు ఆగిపోతాయని భావిస్తున్నాం. ట్రంప్ గెలిస్తే వ్యాపార వర్గాలకు పన్నుల్లో రాయితీ ఇస్తారని, దీంతో ద్రవ్యోల్భణం నియంత్రణ అవుతుంది. – విజయశంకర్ కోణం, సిన్సినాటి, ఒహాయోట్రంప్ గెలిస్తేనే బాగుంటుందిఆత్మకూర్(ఎం) : మాది ఆత్మకూర్(ఎం) మండలం సిద్ధాపురం. మేము 27 సంవత్సరాల నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్నాం. మంగళవారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఉంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రటికన్ పార్టీ నుంచి కమల హారిష్ పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ట్రంప్ ముక్కుసూటి మనిషి అయినా ఆయన గెలిస్తేనే భద్రత అనే ఉంటుందని నా అభిప్రాయం. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్నా పాలన పరంగా పెద్దగా అనుభవం లేదు. ఆమె విధి విధానాలు ట్రంప్‌కు లాభం కలిగేలా ఉన్నాయి. – ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి, న్యూయార్క్హోరాహోరీగా ఎన్నికల ప్రచారంఅర్వపల్లి: మాస్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అమెరికాలోని టెన్నెసి రాష్ట్రంలో ఉంటున్నాం. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఈసారి అక్కడి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నాను. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. కమలాహారిస్, ట్రంప్ మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా ఉంది. భారతదేశ అభివృద్ధికి కృషిచేసే వారికే ఓటేయాలి. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. – జన్నపు శ్రీదేవి, టెన్నెసిట్రంప్ గెలిస్తేనే భారతీయులకు భద్రతతిరుమలగిరి(నాగార్జునసాగర్): మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం కొంపల్లి గ్రామం. నేను, నా భర్త బొలిగోర్ల శ్రీనివాస్, ఆలియాస్ కొంపల్లి శ్రీనివాస్ 2010లోనే ఆమెరికాలోని కొలంబస్కు వచ్చాం. అప్పటి నుంచి కొలంబస్లో ఉంటున్నాం. భారతీయుల భద్రత విషయంలో ట్రంప్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రంప్ గెలుస్తేనే భారతదేశానికి గానీ, అమెరికాలో ఉంటున్న భారతీయులకు గానీ లాభం చేకూరుతుంది. కమలాహారిస్భారత సంతతికి చెందినప్పటికీ ఎక్కువ మంది భారతీయులు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారు. – దివ్య, కొలంబస్ట్రంప్ గెలిచే అవకాశం ఉందిభువనగిరి: మాది భువనగిరి పట్టణం. అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డాం. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. గతంలో దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ట్రంప్ మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకురాగలరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే అమెరికా–ఇండియా మధ్య సత్సంబంధా లు మెరుగుపడతాయి. రిపబ్లిక్ పార్టీకి చెందిన అభ్యర్థి కమలాహ్యారీస్ భారత సంతితికి చెందిన వారు అయినప్పుటికీ ఇండియాకు చెందిన వారు ఆమెకు మద్దతు తెలపడం లేదు. – జి.సంతోష్, కాలిఫోరి్నయాప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ గెలవాలి భువనగిరి: మాది వలిగొండ మండలం టేకులసోమారం గ్రామం. అమెరికాలోని నార్త్ కరోలినాలో 23 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఆరు నుంచి 7 వరకు స్వింగ్ స్టేట్స్ వీరి గెలుపును నిర్థారిస్తాయి. ఎవరు గెలిచిన స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ఇండియన్స్ ఎక్కువ శాతం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేడు మాత్రం ట్రంప్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. – పడమటి శ్యాంసుందర్‌రెడ్డి, నార్త్ కరోలినాభారతదేశ అభివృద్ధికి సహకరించే వారికే ఓటేయాలిఅర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామం. అమెరికాలోని అట్లాంటా ఉంటున్నాం. ఇప్పటికే రెండు సార్లు అమెరికా ఎన్నికల్లో ఓటు వేశాను. భారతదేశ అభివృద్ధికి సహకరించే వారికి అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఓటేయాలి. సాఫ్ట్వేర్ పరిశ్రమకు, భారత విదేశాంగ విధానం, ఎగుమతి, దిగుమతికి మద్దతు తెలిపే వాళ్లకే మా ఓటు. కులాలను చూసి ఓటు వేయవద్దు. – జూలకంటి లక్ష్మారెడ్డి, అట్లాంటాభారతీయులు ట్రంప్ వైపే.. అర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం. అమెరికాలోని హూస్టన్‌లో స్థిరపడ్డాం. 30 ఏళ్ల పైనుంచి అక్కడే ఉంటున్నాం. ఇప్పటికే 20 సార్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాను. అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ట్రంప్‌వైపే ఉన్నారు. నాది రిపబ్లికన్ పార్టీ. నేను ఎన్నికల్లో ట్రంప్‌కే ఓటేస్తాను. – ఆలూరి బంగార్రెడ్డి, హూస్టన్ట్రంప్ గెలవాలనుకుంటున్నారునల్లగొండ: మాది నల్లగొండ. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కమలా హ్యారిస్‌కు అంతగా అనుభవం లేదని ప్రజల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ట్రంప్ వైపే అమెరికన్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్, కమలాహారిస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నా అమెరికా ప్రజలు ట్రంప్ గెలవాలనుకుంటున్నారు. – కంచరకుంట్ల వెంకటరాంరెడ్డి, లాస్ ఏంజెల్స్ట్రంప్తోనే ఉద్యోగావకాశాలునేరేడుచర్ల: మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేడు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రంఫ్ గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సురక్షితంగా ఉంటాయి. మేము ఉన్న ప్రాంతంలో మాతో పాటుగా చాలా మంది ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయి. – దొంతిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, బేబికాన్ నా మద్దతు కమలాహారిస్‌కే..శాలిగౌరారం: మాది శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామం. అమెరికాలోని మిజోరి స్టేట్‌లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబంలో ముగ్గురం ఓటు హక్కును వినియోగించుకోనున్నాం. నేను ఓటు వేయడం ఇది మూడవసారి. నా మద్ధతు కమలాహారిస్‌కే. – పాదూరి రామమోహన్‌రెడ్డి, మిజోరి స్టేట్ -
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్‌డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్‌లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్‌కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
మొదటి అధ్యక్షురాలి అవకాశం మీకే!
న్యూయార్క్: అమెరికా సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్తోపాటు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన అల్ స్మిత్ మెమోరియల్ డిన్నర్‌కు హాజరైన ట్రంప్..కమలా హ్యారిస్ నెగ్గకుంటే మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం మీకే వస్తుందంటూ షుమర్‌ను ఆటపట్టించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు వచ్చి సరదాగా పట్టించుకుంటారు. ఇలా అందే విరాళాలు కేథలిక్ చారిటీలకు వెళ్తుంటాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారిస్ రాలేదు. బదులుగా చుక్ షుమర్ వచ్చారు. వేదికపై ట్రంప్‌కు సమీపంలోనే ఆయన కూడా ఉన్నారు. ‘షుమర్ చాలా డల్‌గా కనిపిస్తున్నారు. మరో కోణం కూడా చూడాలి. వాళ్ల పార్టీ చాలా చురుగ్గా తయారైంది. కమల అవకాశం కోల్పోతే, మొదటి అధ్యక్షురాలయ్యే అవకాశం మీకే వచ్చే అవకాశముంది’అని షుమర్నుద్దేశించి ట్రంప్ బిగ్గరగా అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.ఈసారి కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్.. ‘నా ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి రావల్సిన అవసరం లేదని భావించినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తీవ్రంగా అవమానించారు. గతంలో 1984లో వాల్టర్ మొండెల్ మాత్రమే ఇలా చేశారు. అప్పట్లో ఆయన రొనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు’అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై అనంతరం కమల తనదైన శైలిలో స్పందించారు. ‘సహాయకుడు రాసిచ్చిన జోకుల్ని చదివేందుకే అవస్థలు పడ్డ ట్రంప్.. టెలీ ప్రాంప్టర్‌ను లోపలికి అనుమతించలేదంటూ ప్రశ్నించారు. తను అనుకుంటున్న జోకులకు ప్రేక్షకులు నవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ జోకులు ఎవరికైనా అర్థమవుతాయా? ట్రంప్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాదు’అంటూ చురకలు అంటించారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రంప్ జోకులపై మిశ్రమ స్పందన వచ్చింది. -
ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన.‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్‌పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్‌పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ట్రంప్ అంతలా ద్వేషించినా.. ఆమె లాభపడింది!ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్‌కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్లో బైడెన్‌పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్లో కమలా హారిస్‌పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్‌కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్‌కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్‌ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. -
Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
కమలా హారిస్‌కు ఒక్క నెలలో రూ.3,030 కోట్ల విరాళాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఆగస్టు నెలలో ఆమెకు 30 లక్షల మంది దాతల నుంచి 361 మిలియన్ డాలర్ల(రూ.3,030 కోట్లు) విరాళాలు లభించాయి. ఈ విషయం కమలా హారిస్ ప్రచార బృందం శుక్రవారం వెల్లడించింది. తన ప్రత్యరి్థ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే రెండు రెట్లకుపైగా ఎక్కువ విరాళాలు కమలా హారిస్ అందుకోవడం విశేషం. ట్రంప్‌కు గత నెలలో కేవలం 130 మిలియన్ డాలర్లు (రూ.1,091 కోట్లు) విరాళంగా లభించాయి. ఆగస్టు నెలాఖరు నాటికి కమలా హారిస్ చేతిలో 404 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. ట్రంప్ వద్ద కేవలం 295 మిలియన్ డాలర్లు ఉన్నాయి. -
అమెరికన్లకు ఇదే నా హామీ.. కమల ఎమోషనల్ కామెంట్స్
చికాగో: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను కమలా హారీస్ అధికారికంగా ఆమోదించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.కాగా, కమలా హారీస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు. ఈ సమావేశం చికాగో యునైటెడ్ సెంటర్లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ..‘అమెరికన్ ప్రజల తరపున అధ్యక్షుడిగా మీ నామినేషన్‌ను నేను అంగీకరిస్తున్నాను. ఈ ఎన్నికలతో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. మన దేశంలో ద్వేషం, విభజన పోరాటాలను అధిగమించడానికి మంచి అవకాశం వచ్చింది. ఒక కొత్త మార్గంలో అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. దేశాన్ని పార్టీలకు, స్వయం ప్రతిపత్తికి అతీతంగా ఉంచుతాను. పవిత్రమైన అమెరికా ప్రాథమిక సూత్రాలను శాంతియుత బదిలీకి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఇదే సమయంలో తన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. My mother, Dr. Shyamala Gopalan Harris, came to the United States from India alone at 19. She was a force who had two goals in life: to cure breast cancer and to raise my sister Maya and me.Her dedication, determination, and courage shaped who I am today. pic.twitter.com/ZZWS1uUGMZ— Vice President Kamala Harris (@VP) August 22, 2024తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఆమె విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ తన స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తారు. ఆయనకు విశ్వసనీయత ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. Harris: In many ways Donald Trump is an unserious man, but the consequences of putting Donald Trump back in the White House are extremely serious...he tried to throw away your votes. When he failed, he sent an armed mob to the Capitol where they assaulted law enforcement officers pic.twitter.com/muKQlUGMfe— Aaron Rupar (@atrupar) August 23, 2024మన ప్రత్యర్థులు ప్రతీరోజూ అమెరికాను కించపరుస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. నాటోను విడిచిపెడతానని ట్రంప్ బెదిరించారు. అతను పుతిన్‌ను మా మిత్రదేశాలపై దాడి చేయమని ప్రోత్సహించాడు. రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ఐదు రోజుల ముందు నేను జెలెన్స్కీని కలిశాను. నాటో మిత్ర దేశాలకు నేను అండగా ఉంటాను. అలాగే, గాజా-ఇజ్రాయెల్ అంశంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ కలిగించిన భయానక స్థితిని ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ ఎదుర్కోకూడదు. తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కు కోసం ఎల్లప్పుడూ నిలబడుతాను. గాజాలో జరిగినది వినాశకరమైనది అని అన్నారు.ఇక, ప్రపంచంలోనే అత్యంత బలమైన పోరాట శక్తిని అమెరికా ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూస్తాను. దేశ దళాలను, వారి కుటుంబాలను సంరక్షించే మా పవిత్ర బాధ్యతను నేను నెరవేరుస్తాను. కమాండర్ ఇన్ చీఫ్‌గా వారిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారి సేవ మరియు త్యాగాన్ని ఎప్పుడూ కించపరచను అంటూ కామెంట్స్ చేశారు. Harris: As commander in chief, I will ensure America always has the strongest, most lethal fighting force in the world. And I will fulfill our sacred obligation to care for our troops and their families and I will always honor and never disparage their service and sacrifice pic.twitter.com/So07fNYX9e— Aaron Rupar (@atrupar) August 23, 2024 ఇక, నాలుగు రోజుల డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె అంగీకార ప్రసంగంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అధ్యక్షుడిగా ఆయన పాత్ర స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక, కమలా హరీస్ ప్రసంగం కొనసాగుతుండగా పార్టీ కార్యకర్తలు కమల.. కమల, అమెరికా.. అమెరికా అంటూ నినాదాలు చేశారు.BREAKING: Kamala Harris just slammed Donald Trump for being an unserious person. Retweet to make sure every American sees this takedown. pic.twitter.com/iY3wv10tFL— Kamala’s Wins (@harris_wins) August 23, 2024 మరోవైపు.. కమలా హారీస్‌కు జో బైడెన్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బైడెన్..‘ కమలా హారిస్ అధ్యక్ష పదవికి నామినేషన్‌ను అంగీకరించడం చూసి నేను గర్వపడుతున్నాను. ఆమె మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నందున ఆమె అత్యుత్తమ అధ్యక్షురాలు అవుతుంది అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Chicago, USA: Kamala Harris accepts the Democratic party nomination for US PresidentShe says, "I accept your nomination to be President of the United States of America. And with this election, our nation has a precious, fleeting opportunity to move past the bitterness,… pic.twitter.com/BWZgRWwVqO— ANI (@ANI) August 23, 2024 -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం!
వాషింగ్టన్: ఒక డిబేట్‌తో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచే వైదొలిగేలా చేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సెపె్టంబరు 10న ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య ఏబీసీ ఛానల్లో అధ్యక్ష చర్చ జరగనున్న విషయం తెలిసిందే. దీంట్లో కమలను ఏయే అంశాల్లో ఇరుకున పెట్టొచ్చనే అంశంలో తనకు మార్గనిర్దేశనం చేయడానికి మాజీ డెమొక్రాట్ (ప్రతినిధుల సభ మాజీ సభ్యురాలు), హిందూ– అమెరికన్ తులసి గబార్డ్ సహాయం తీసుకుంటున్నారు ట్రంప్. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ రిసార్ట్స్‌లో తులసి ఆయనకు సహాయపడుతున్నారు. ‘రాజకీయ చరిత్రలోనే మంచి డిబేటర్లలో ఒకరిగా ట్రంప్ పేరుగాంచారు. జో బైడెన్‌ను నాకౌట్ చేశారు. చర్చకు సన్నద్ధం కావాల్సిన అవసరం ట్రంప్‌కు లేదు. అయితే విధానపరమైన సలహాదారులను, తులసి గబార్డ్ లాంటి సమర్థులైన వక్తలను కలుస్తూనే ఉంటారు’ అని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే 2016, 2020ల కంటే ఈసారి డిబేట్లకు సిద్ధమవడానికి ట్రంప్ అధిక సమయం వెచి్చస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. 2020 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వానికి బైడెన్‌తో పోటీపడిన వాళ్లలో కమలా హారిస్, తులసి గబార్డ్లు కూడా ఉన్నారు. ప్రైమరీల్లో భాగంగా 2019 జూలైలో హారిస్, తులసిల మధ్య డిబేట్ జరిగింది. దీంట్లో కమలా హారిస్‌ను తులసి తీవ్రంగా ఇరుకునపెట్టి పైచేయి సాధించారు. -
కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. శుక్రవారం పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ‘‘పార్టీ నామినీగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. వచ్చే వారం నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తా. దేశంమీద ప్రేమతో ఏకమైన ప్రజల కోసం ఇకపై ప్రచారం చేస్తా’’ అన్నారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా, తొలి భారతీయ అమెరికన్‌గా కమల చరిత్ర సృష్టించారు. ఆగస్ట్ 22న షికాగో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమల తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తారు. అభ్యర్థిత్వం స్వీకరించాక కొద్దిరోజులకు ఆమె తన రన్నింగ్‌మేట్ పేరును ప్రకటిస్తారు. -
USA Presidential Elections 2024: 99 శాతం డెలిగేట్ల మద్దతు కమలకే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేసే దిశగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. కీలక ముందడుగు వేశారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల వర్చువల్ రోల్‌కాల్ ఓట్లు కోరే అర్హత సాధించారు. బరిలో ఆమె ఒక్కరే మిగలడంతో.. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా కమలా హారిస్ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థత్వాన్ని ఖాయం చేసుకునేందుకు కమలా హారిస్ నామినేషన్‌కు 3,923 మంది డెలిగేట్లు (99 శాతం) మద్దతు పలికారు. -
గెలిచినా, ఓడినా చరిత్రే!
భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరికాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. తండ్రి వైపు నుంచే కాకుండా, తల్లి పోరాటాల రీత్యా కూడా ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్ తోనూ ఆమె పోరాడుతారు. గెలిచినా ఓడినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలుస్తారు.‘నేను హిందువునెట్లయిత?’ అని 1996లో నేను రాసిన పుస్తకంలో, బ్రాహ్మణుడు తనను తాను దళితుడిగా మార్చుకున్నప్పుడే భారతదేశం మార్పు చెందుతుందని చెప్పాను. అలాంటిది జరుగుతుందని ఊహించలేమని కొంత మంది భారతీయ చరిత్ర, సంస్కృతి పండితులు విమర్శించారు.సంస్కృతీకరణ ప్రక్రియలో భాగంగా బ్రాహ్మణుల అన్ని జీవన విధా నాలను శూద్రులు, దళితులు అవలంబిస్తారనేది వారి వాదన. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్ పొందడానికి ‘కున్బీ’ సర్టిఫికెట్ అడగటం గురించి గానీ, చాలామంది శూద్ర ఓబీసీలు రిజర్వేషన్ కోటా కోసం ఆదివాసీ లేదా దళిత హోదా అడగటం గురించి గానీ వారు ఏం చెబుతారో నాకు తెలీదు. ఉత్తర భారత బనియాలు ఓబీసీ సర్టిఫికెట్లను తీసుకుంటూ రిజర్వేషన్ పొందడం గురించి వాళ్లేమంటారు? దీన్నిసంస్కృతీకరణ అనవచ్చా? నా దృష్టిలో అది దళితీకరణే కానీ సంస్కృతీకరణ కాదు. ఈ రోజుల్లో ఏ కులమైనా బ్రాహ్మణ సర్టిఫికెట్ కోసం అడగడం లేదు. భారతదేశంలో ఇలా జరుగుతుండగా, పాశ్చాత్య దేశా లలోని వలస భారతీయుల్లో ఏం జరుగుతోంది? భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరి కాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. ఆమె ఆఫ్రికన్–అమెరికన్ హోదాను పొందింది తన నల్లజాతి తండ్రి కారణంగానే కాదు... ఆమె తల్లి శ్యామల గోపాలన్ హ్యారిస్ తమిళ బ్రాహ్మణ వలసదారు. నల్లజాతి స్త్రీలా కనిపించేవారు. పైగా వివాహా నికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం యూసీ బర్కిలీ ప్రాంతంలోని నల్లజాతి పరిసరాల్లో జీవించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూని యర్ సాగించిన పౌర హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. డొనాల్డ్ హ్యారిస్‌తో ఆమె వివాహం జరిగిన తర్వాత కలిగిన ఇద్దరు కుమార్తెలు కమల, మాయ నల్లజాతీయుల పరిసరాల్లోనే పెరిగారు. వారు తమ ప్రారంభ జీవితంలో నల్లజాతి ఆధిపత్య పాఠశాలలో చదువుకున్నారు. ఆమె భర్త డొనాల్డ్ హ్యారిస్ జమైకన్ అమెరికన్ ఆర్థికవేత్త. శ్యామలకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు జమైకాలో నివసిస్తున్న ఆయన కూడా నవ్యభావాలు కలిగిన వ్యక్తి. ఏమైనప్పటికీ, కమల తన తల్లి వైపు పూర్వీకుల బ్రాహ్మణ గోధుమవర్ణ సంప్రదాయ వారసత్వాన్ని ప్రకటించుకోవచ్చు. లేదా తల్లి, తండ్రి మాదిరిగా నల్ల వారి జీవితాలూ విలువైనవే భావనతో కూడిన క్రైస్తవీకరణ ప్రక్రియను అనుసరించవచ్చు. ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. తన యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు.ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఆఫ్రికనీకరణచెందిన నల్ల–గోధుమ బ్రాహ్మణ మహిళ అయిన కమలా హ్యారిస్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్‌తోనూ పోరాడుతారు. ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి నల్లజాతి మహిళా అధ్యక్షురాలు అవుతారు. 250 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో అధ్యక్షురాలిగా వైట్‌హౌజ్‌లో ప్రవేశించడానికి శ్వేతజాతి లేదా నల్లజాతి మహిళను అమెరికా ఎప్పుడూ అనుమతించలేదు. వైట్‌హౌజ్‌లో నివసించిన మహిళలందరూ వారి అధ్యక్ష భర్తలకు సహాయక పాత్రను పోషించే ప్రథమ మహిళలు (ఫస్ట్ లేడీస్)గా ఉండేవారు. కమల గెలిస్తే తన భర్తను ప్రథమ పురుషుడి (ఫస్ట్ మ్యాన్)గా మార్చిన మహిళ అవుతారు. ఇకపై ఆయన భూమిపై ఉన్న తన అత్యంత శక్తిమంతమైన భార్యామణిని జాగ్రత్తగా చూసుకోవాలి.బరాక్ ఒబామా మొట్టమొదటి అమెరికన్ నల్లజాతి పురుష అధ్యక్షుడిగా ఎంపికైనప్పుడు, శ్వేతజాతి ఆధిపత్యవాదులు మినహా అందరూ ఆ విజయాన్ని పండుగలా జరుపుకొన్నారు. పైగా ఆయన ఎనిమిదేళ్లు విజయవంతమైన అధ్యక్షుడిగా నిరూపించుకున్నారు. అయినా అది అమెరికా ప్రాథమిక పితృస్వామ్య స్వభావాన్ని మార్చ లేదు.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది భార తీయ సంతతికి చెందిన పురుషులు, మహిళలు పాశ్చాత్య దేశాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రిషి సునాక్ ఇప్పటికే తనను తాను హిందువునని పదేపదే ప్రకటించుకుంటూ ఏడాదికి పైగా ప్రధానిగా బ్రిటన్ను పాలించారు. అయితే, కమల మత విశ్వాసం రీత్యా క్రైస్తవురాలు. ఆమె క్రిస్టియన్ కాకపోతే ఉపాధ్యక్ష పదవి వచ్చేది కాదు, అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కూడా వచ్చేది కాదు. హిందువుగా ఉంటూ వైట్‌హౌజ్‌లోకి వెళ్లాలనుకునేవారు కొందరు న్నారు. భారతీయ మూలాలకు చెందిన శాకాహార బ్రాహ్మణుడైన వివేక్ రామస్వామి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారుగానీ విఫలమ య్యారు. కమలను ‘పిల్లలు లేని పిల్లి’ అని పిలిచిన రిపబ్లికన్ల ఉపా ధ్యక్ష అభ్యర్థి జేడీ వా¯Œ ్స భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ మూలాలున్న మహిళ. ఆమె తన హిందూ శాకాహార సాంస్కృతిక విలువను బహిరంగంగా ప్రకటించుకున్నారు.విగ్రహాలను పూజించే సునాక్‌ను ప్రధానిగా అనుమతించిన బ్రిటన్‌లా కాకుండా, భారతదేశ ప్రధానిగా మరే విదేశీ వ్యక్తినీ అనుమ తించకూడదనే ఆరెస్సెస్/బీజేపీ నమూనాను అమెరికా కూడా అనుస రించవచ్చు. ఇతర మతవిశ్వాసం గల మరే వ్యక్తినీ అధ్యక్షుడిగా అమె రికా అనుమతించకపోవచ్చు. ఏదేమైనా, కమల వారి ఆధ్యాత్మిక భావాలకు సరిపోతారు.కమల తన ఆఫ్రికన్–అమెరికన్ ముద్రతో దేశాధ్యక్షురాలైతే, నల్లజాతి అమెరికన్లతో అంతగా సంబంధం లేని భారతీయ ప్రవా సులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. సంపన్న భారతీ యులు, ముఖ్యంగా మితవాద హిందూ భారతీయులు... ట్రంప్ దాత లుగా, ట్రంప్ ఓటర్లుగా ఉంటున్నారు. ట్రంప్ 2020లో మోదీ బల పరిచిన అభ్యర్థి. బహుశా ఇప్పటికీ ఆరెస్సెస్/బీజేపీ పంథా అదే కావచ్చు. వారు డెమోక్రటిక్ పార్టీని వామపక్ష ఉదారవాద పార్టీగా చూస్తారు. ఉపాధ్యక్షురాలిగా తన అధికారిక హోదాలో కమల భారత్‌ను సందర్శించలేదు. నలుపు, గోధుమరంగు స్త్రీ–పురుష సంబంధాలను నివారించ డానికీ, తెల్లవారితో కలిసి జీవించడానికీ భారతీయ అమెరికన్లు ప్రయత్నిస్తారు. శ్యామలా గోపాలన్, కమలాదేవిలా కాకుండా, వారు శ్వేతజాతీయుల పరిసరాల్లో లేదా వారి సొంత భారతీయ (దక్షిణా సియా కూడా కాదు) పరిసరాల్లో ఉంటూ, స్వచ్ఛమైన శాకాహార పార్టీలతో జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి పార్టీలలో మగవాళ్లు సూట్లు ధరిస్తారు, మహిళలు భారతీయ నారీమణుల్లాగా చీరలు కట్టు కుంటారు. కమలా హ్యారిస్ మాత్రం అమెరికన్ వ్యక్తిలా చక్కగా డిజైన్ చేసిన ఫుల్ సూట్లో కనిపిస్తారు. ఆమె దుస్తుల కోడ్ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, పురుషునిలాగా ఎలా ఉండాలని అమెరికన్ స్త్రీలు కూడా ఆమె నుండి నేర్చుకునేలా ఉంటుంది. అన్నిటికంటే మించి ఆమె జీవన శైలి సమానత్వంతో కూడుకున్నది.కమలా హ్యారిస్ అధ్యక్ష రేసులో గెలిచినా, ఓడినా మార్పు దోహద కారులలో ఒకరిగా మారారు. భారతీయ సంతతికి చెందిన మహిళగా ఆమె ఆఫ్రికనీకరణ, మార్పు దోహదకారి పాత్రను నేను ఎంతగానో ఆరాధిస్తున్నాను. ఆమె భవిష్యత్తులోనూ శతాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్ మోడల్‌గా ఉంటారు. ఆమె గెలిచి తన భర్తను వైట్‌హౌజ్‌లో ప్ర«థమ పురుషుడి (ఫస్ట్ మ్యాన్)గా చేస్తారని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.I will work hard to earn every vote.And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7— Kamala Harris (@KamalaHarris) July 27, 2024అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ పేరును డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు.నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. అటార్నీ జనరల్‌గా..హోవార్డ్‌లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్‌గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికయ్యారు. సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ!.. తెరపైకి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. పిల్లలు లేనివారు పాలించేందుకు తగదు అంటూ గతంలో మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కించపరిచినట్లు మాట్లాడారు. తాజాగా దీనిపై తాజాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా రిపబ్లిక్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కాగా, జేడీ వ్యాన్స్ 2021లో అమెరికాలో పిల్లలులేని తల్లుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లలందరికీ ఓట్లు వేసే అవకాశం ఇద్దాం. ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులకు ఆ ఓట్లపై నియంత్రణ ఉండేలా చూసుకుందాం. మీరు అమెరికాలో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఒక పేరెంట్‌గా మరింత శక్తిని కలిగి ఉండాలి. పిల్లలు లేని వారి కంటే పిల్లులు ఉన్న పేరెంట్స్‌కి ప్రజాస్వామ్యంపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే తమ వాయిస్ వినిపించగలరు. ఇదే సమయంలో పిల్లలు లేని వారు వాయిస్‌ను ఎక్కువ వినిపించలేరు(చైల్డ్ లెస్ క్యాట్ లేడీస్). పిల్లలు లేని వారు పాలించేందుకు పనికిరారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాన్స్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అయితే, అధ్యక్ష ఎన్నికల వేళ జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్‌గా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నేతలు వ్యాన్స్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.JD Vance calls for taking away voting power from “people who don’t have kids”: “Doesn't this mean that non-parents don't have as much of a voice as parents? Yes. Absolutely” pic.twitter.com/rXhzMoat47— Kamala HQ (@KamalaHQ) July 25, 2024ఇదిలా ఉండగా.. రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఒకప్పుడు తనను వ్యతిరేకించే వ్యక్తినే ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్ నేత, ఓహియో సెనేటర్ జేమ్స్ వ్యాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యాక్షుడవుతారు. ఒకానొక సమయంలో ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన వ్యాన్స్.. ప్రస్తుతం ఆయనకు బలమైన మద్దతుదారుల్లో ఒకరిగా మారిపోవడం గమనార్హం. -
USA Presidential Elections 2024: ఆ రికార్డుపై కమలా హారిస్ కన్ను
వారం పది రోజుల కిందటి దాకా ఏకపక్షంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును కమలా హారిస్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యరి్థగా అధ్యక్షుడు బైడెన్ ఉన్నంతకాలం ఆయనపై అన్ని విషయాల్లోనూ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడామె ముచ్చెమటలే పట్టిస్తున్నారు! బైడెన్ తప్పుకున్నాక తాజా సర్వేలన్నింటిలోనూ హారిస్ దూసుకుపోతున్నారు. కొన్నింటిలోనైతే ట్రంప్‌ను దాటేశారు కూడా. ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యరి్థత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకుంటారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్ 1836లో ఉపాధ్యక్షుడు మారి్టన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో బరాక్ ఒబా మా హయాంలో ఉపాధ్యక్షునిగా చేశారు! కానీ 2016లో ఒబామా తర్వాత డెమొక్రాట్ల తరఫున బైడెన్‌కు కాకుండా హిల్లరీ క్లింటన్‌కు అధ్యక్ష అభ్యరి్థత్వం దక్కింది. అయితే ఆమె ట్రంప్ చేతిలో ఓటమి చవి చూశారు. 2020లో ట్రంప్‌ను హోరాహోరీ పోరులో బైడెన్ ఓడించడం, అధ్యక్షుడు కావ డం తెలిసిందే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు.నేరుగా పదోన్నతి నలుగురికే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా 49 మంది ఉపాధ్యక్షులుగా పని చేశారు. వారిలో పదిహేను మంది ఆ తర్వాత కాలంలో అధ్యక్షులు కూడా అయ్యారు. అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే ఎన్నికల బరిలో నెగ్గి అధ్యక్షులు అయింది మాత్రం కేవలం నలుగురే. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆయన 1789 నుంచి1796 దాకా దేశ తొలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 1796లో ఆ పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో ఓటమి చవిచూసిన థామస్ జెఫర్సన్ అప్పటి నియమాల ప్రకారం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఎందుకంటే అప్పట్లో ఉపాధ్యక్ష అభ్యర్థి అంటూ విడిగా ఉండేవారు కాదు. అధ్యక్ష రేసులో రెండో స్థానంలో నిలిచిన నేతే ఉపాధ్యక్షుడు అయ్యేవారు. తర్వాత నాలుగేళ్లకు జెఫర్సన్ ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఓడించింది ఎవరినో తెలుసా? నాటి అధ్యక్షుడు ఆడమ్స్‌నే! ఒక్కోపార్టీ నుంచి ఆ రెండు పదవులకూ విడిగా అభ్యర్థులు నిలబడటం పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. → అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మారి్టన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్లు్య.బు‹Ù. → ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. → గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. → ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. ళీ హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! → థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. → జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అందుకోసమే అధ్యక్ష రేసు నుంచి వైదొలిగా: బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ, దేశాన్ని ఏకం చేయటం కోసమే తాను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్న అనంతరం తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడారు.‘‘ ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం. నేను అమెరికా అధ్యక్ష కార్యాలయాన్ని గౌరవిస్తాను. అంతకంటే ఎక్కువగా దేశాన్ని ప్రేమిస్తున్నాను. అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. .. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్షుడిగా, అమెరికా భవిష్యత్తు కోసం రెండోసారి ప్రెసిడెంట్‌గా పోటీ చేసే మెరిట్ నాకు ఉందని నమ్ముతున్నా. కానీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించటంలో కూడా ఏది అడ్డురాకూడదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నా’’అని బైడెన్ అన్నారు.ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆ సమయంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఉపధ్యక్షురాలు కమలా హారిస్‌కు అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ మద్దతు తెలిపారు. -
Kamala Harris: ‘మామ్’లా
‘లెట్స్ విన్ దిస్’ ఇది కమలా హ్యారిస్ నినాదం. గెలిచే శక్తి... గెలవగలిగే శక్తి తాను కాగలనని హ్యారిస్ ఆత్మవిశ్వాసం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవి అభ్యర్థిగా జో బైడెన్ తప్పుకున్నాక ఇప్పుడు అమెరికాయే కాదు, ప్రపంచమంతా కమలా హ్యారిస్ వైపు చూస్తోంది. అధ్యక్ష పదవి అభ్యర్థిగా ఆమె ఎంపికైతే అది ఒక చరిత్రాత్మక సందర్భం... గెలిచి ప్రెసిడెంట్ అయితే చరిత్రే! భారతీయ మూలాల్లో తల్లి శక్తిస్వరూపిణి. స్త్రీ శక్తి స్వరూపిణి. స్త్రీగా... తల్లిగా... రాజకీయవేత్తగా కమలా హ్యారిస్ తన శక్తి ఏమిటో ఇప్పటికే నిరూపించారు. ఆమెలోని భారతీయత శక్తిని ఇస్తూనే ఉంటుంది.కమలా హ్యారిస్ జీవితంలో ఆగస్టు 22కు ఒక ప్రత్యేకత ఉంది. 2014లో డగ్లస్ ఎంహాఫ్‌తో ఆమె పెళ్లి జరిగిన రోజు అది. సరిగ్గా పదేళ్ల తర్వాత అదే ఆగస్టు 22 మళ్లీ ఇప్పుడు ఆమె కోసం మరొక చిరస్మరణీమైన సందర్భాన్ని సిద్ధం చేసి ఉంచినట్లే అనిపిస్తోంది! 2024 ఆగస్టు 19 నుంచి 22 వరకు షికాగోలో జరిగే పార్టీ సమావేశంలో చివరి రోజున డెమోక్రాట్లు తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థి కమలా హ్యారిస్ అయుండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరో మూడు నెలలో అధ్యక్ష ఎన్నికలు ఉండగా పోటీ నుంచి విరమించుకున్న జో బైడెన్.. వెళుతూ వెళుతూ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచి వెళ్లారు. ఆయన మాటపై కమలా హ్యారిస్‌కు మద్ధతుగా ఉన్న డెమోక్రాట్లతో పాటుగా, పార్టీలోని ఆమె వ్యతిరేకులు కూడా.. ఇప్పుడు ‘ట్రంప్‌ను ఓడించగల శక్తి’గా కమలా హ్యారిస్‌ను గుర్తించటం మొదలైంది.→ ఎంతటి శక్తిమంతురాలు?కమలా హ్యారిస్‌ను ఆమె పిల్లలు ‘మామ్లా’ (మామ్ + కమల) అని పిలుస్తారు. పిల్లలకు ఆమె సొంత తల్లి కాదు. విడిపోయిన డగ్లస్ ఎంహాఫ్ మొదటి భార్య పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కమలా డగ్లస్‌ల పెళ్లయ్యే నాటికి అబ్బాయికి 19 ఏళ్లు. అమ్మాయికి 15. ఆ వయసులోని పిల్లలు ఒక బయటి మనిషి తల్లిలా వచ్చి తమను చేరదీస్తానంటే వెళ్లి ఒడిలో వాలిపోతారా? కానీ అలాగే జరిగింది. వాళ్లను చక్కగా కలుపుకుపోయారు కమల. కొత్తమ్మ అమ్మ అయింది. ఫ్రెండ్ అయింది. అమ్మ, ఫ్రెండ్ కలిసి ‘మామ్లా’ అయింది. తల్లి స్థానంలో తల్లిగా వచ్చి, పిల్లల మనసు గెలుచుకోటానికి శక్తి కావాలి. అంతటి శక్తిమంతురాలు అయిన కమలకు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవటం, ఆపైన అధ్యక్షురాలిగా నెగ్గటం ఎంత పని?‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు.→ వ్యక్తిగా ఎలాంటి మనిషి? నాలుగేళ్ల క్రితం బైడెన్ రన్నింగ్ మేట్‌గా (వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా) ఎంపికైనది మొదలు, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యే వరకు కమలా హ్యారిస్‌ను గురించిన ఏ చిన్న విషయాన్నీ వదలకుండా ప్రపంచం ఆసక్తిగా తెలుసుకుంది. ‘‘నా బిడ్డ’’ అని భారతదేశం గర్వించింది. అంతేకాదు, తన ఉపాధ్యక్ష ప్రమాణ స్వీకారానికి ఆమె భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తలపిస్తూ చీరకట్టులో వేదికపైకి రావాలని ఇండియా కోరుకుంది. అమెరికా ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పెద్ద పెద్ద డిబేట్లు జరిగిన విధంగానే.. ‘‘కమల చీర కట్టులో కనిపిస్తారా లేదా?’’ అని రెండు దేశాల్లోనూ డిబేట్లు జరిగాయి. చీర కట్టుకుంటే బావుంటుందన్న ఆకాంక్షలు వెల్లివిరిశాయి. ప్రమాణ స్వీకారానికి ఆమె చీర ధరిస్తే.. సంస్కృతుల సమైక్య భావనకు తనొక సంకేతం ఇచ్చినట్లు అవుతుంది’’ అని, ‘‘కమలా హ్యారిస్ చీర కట్టుకుని ప్రమాణం స్వీకారంలో కనిపిస్తే అమెరికాలోని దక్షిణాసియా సంతతి వారికి ఆమె తమ మనిషి అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది..’’ అని, ‘‘కమలా హ్యారిస్ కనుక చీరలో ప్రమాణ స్వీకారం చేస్తే అదొక దౌత్యపరమైన స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది’’ అని... ఇలా అనేక అభి్రపాయాలు వ్యక్తం అయ్యాయి.చివరికేం జరిగింది? అచ్చమైన అమెరికన్ ΄ûరురాలిగా ΄్యాంట్ సూట్, బౌ బ్లవుజ్లో వచ్చి ప్రమాణం స్వీకారం చేశారు కమలా హ్యారిస్. ఇది దేనికి సంకేతం? కొత్తగా తను సంస్కృతుల సమైక్య భావనను, దౌత్యపరమైన స్నేహభావనను ప్రదర్శించనవసరం లేదని ఆమె బలంగా నమ్మారని. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో వెల్లడించే ఒక చిన్న సందర్భం ఇది.→ ‘‘వాళ్లిద్దరు కూడా నాకు అమ్మలే’’తన తల్లి శ్యామలా గోపాలన్ కాకుండా, మరో ఇద్దరు మహిⶠలు కూడా తనకు తల్లి వంటి వారని.. ఆనాటి ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు కమల! ఆ ఇద్దరిలో ఒకరు: చిన్నప్పుడు తమ పక్కింట్లో ఉండే శ్రీమతి షెల్టన్. ఇంకొకరు : ఒకటో తరగతి టీచర్ శ్రీమతి విల్సన్. ‘‘సాయంత్రం అమ్మ డ్యూటీ నుండి రావటం లేటయితే నేను, చెల్లి మాయా నేరుగా షెల్టన్ వాళ్ల ఇంట్లోకి వెళ్లిపోయేవాళ్లం. అక్కడే తిని, అమ్మ వచ్చి మమ్మల్ని పిలుచుకెళ్లే వరకు అక్కడే పడుకునేవాళ్లం. షెల్టన్ మమ్మల్నెంతో ఆదరణగా చూశారు..’’ అని కమల గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీమతి విల్సన్ బర్కిలీలోని థౌజండ్ ఓక్స్ ఎలిమెంటరీ స్కూల్లో ఒకటో తరగతి టీచర్. ‘‘బాల్యంలో నాలో ఆశల్ని, ధైర్యాన్ని నింపింది ఆవిడే. నేను పై చదువులకు వెళ్లి, ‘లా’ డి΄÷్లమా చేసి, ఆ సర్టిఫికెట్‌ను అందుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లినప్పుడు కూడా విల్సన్ నా కోసం వచ్చి ఆడియెన్స్‌లో కూర్చొని ఉండటం దూరాన్నుంచి కనిపించింది! నన్ను సంతోష పెట్టటం కోసం ఆమె అలా చేయటం నాకెంతో అనందాన్నిచ్చింది’’ అని విల్సన్ గురించి రాశారు కమల. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలు అయ్యాక కూడా ఈ నాలుగేళ్లలో ఎక్కడా దర్పాన్ని ప్రదర్శించని కమల తన జీవితంలోని అమూల్యమైన వ్యక్తులను, ప్రదేశాలను, మరచిపోలేని సందర్భాలను తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. రేపు ఒకవేళ ఆమె అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైతే కనుక ఆమె షేర్ చేసే తొలి పోస్టు ఏదైనా గాని, తప్పకుండా ఆమె కన్నా కూడా అది అగ్రరాజ్యం అమెరికాకే చరిత్రాత్మక సందర్భం అవుతుంది. ‘‘అమెరికాను సకల జాతులకు సహజీవన యోగ్యమైన దేశంగా మార్చటమే నా ధ్యేయం’’ అని కమల అనడం ట్రంప్ వంటి కరడు గట్టిన జాతీయవాదులకు నచ్చకపోవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఆమె ఇప్పటికే అధికశాతం అమెరికన్లు, అమెరికాలోని ఇతర వలస దేశాల ప్రజల హృదయాలలో గొప్ప స్థానం సంపాదించారు. -
మలుపు తిప్పిన నిష్క్రమణ
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్‌హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్‌ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్‌తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్‌గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్‌కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్‌కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్‌ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది! -
ట్రంప్ ఓటమే నా లక్ష్యం: కమలా హారీస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు జో బైడెన్ ప్రకటించారు. అనంతరం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ను అధ్యక్ష అభ్యర్థితత్వానికి తాను మద్దతిస్తున్నట్టు బైడెన్ తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు బైడెన్ మద్దతివ్వడం గౌరవంగా భావిస్తున్నట్టు కమలా హారీస్ చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో కమలా హారీస్ మాట్లాడుతూ..‘అధ్యక్షుడు బైడెన్ మద్దతు పొందడం నాకు గౌరవంగా ఉంది. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలుపే నా లక్ష్యం. అలాగే, అధ్యక్షుడిగా జో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారు. ప్రజల తరఫున బైడెన్‌ను ధన్యవాదాలు తెలుపుతున్నాను.గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా పర్యటించాను. సమస్యలను అడిగి తెలుసుకున్నాను.. రాబోయే రోజుల్లో కూడా ఇదే కొనసాగిస్తాను. డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడమే ఇప్పుడు ప్రజల ముందున్న లక్ష్యం. ట్రంప్ 2025 ఎజెండాను ఓడించడానికి, డెమోక్రటిక్ పార్టీని, దేశాన్ని ఏకం చేయడానికి నా శక్తి మేరకు పని చేస్తాను. 107 రోజులు కలిసికట్టుగా పోరాడి ఎన్నికల్లో విజయం అందుకుందాం’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్‌కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘అందుకే తప్పుకుంటున్నా’.. బైడెన్ ఏం చెప్పారంటే.. -
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నానని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం) ‘ఎక్స్’ ఖాతాలో ఒక లేఖను పోస్టు చేశారు. దేశ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. గత మూడున్నరేళ్లలో ఒక దేశంగా మనం గొప్ప ముందడుగు వేశామని అమెరికా ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటిదాకా సేవలందించడం అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదని, అధ్యక్షుడిగా మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని, తన నిర్ణయాన్ని పూర్తిగా తెలియజేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణమైన భాగస్వామి అని ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ బలపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించటానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌పై సొంత పార్టీ నాయకులు ఒత్తిడి పెంచారు. అందుకే ఆయ న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంచిన డిబేట్ సీఎన్ఎన్ ఛానల్ వేదికగా జూన్ 27న డొనాల్డ్ ట్రంప్– జో బైడెన్ల మధ్య తొలి అధ్యక్ష చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్ పదేపదే తడబడటం, మాటల కోసం తడుముకోవడం, మతిమరుపుతో పేలవ ప్రదర్శన కనబరిచారు. దాంతో 81 ఏళ్ల బైడెన్ మానసిక ఆరోగ్యంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సొంత డెమొక్రాటిక్ పార్టీలోనూ ఆయన సామర్థ్యంపై సందేహాలు తీవ్రమయ్యాయి. ట్రంప్‌ను బైడెన్ ఓడించలేడనే బలమైన అభిప్రాయం పారీ్టలో నెలకొంది. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ... బైడెన్‌తో మాట్లాడుతూ డెమొక్రాటిక్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే మేలని కుండబద్ధలు కొట్టారు. ప్రతినిధుల సభ, సెనేట్లలోనూ డెమొక్రాట్లకు అపజయాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలువురు డెమొక్రాటిక్ కీలక నాయకులతో ప్రైవేటు సంభాషణల్లో బైడెన్ వైదొలిగితేనే ట్రంప్‌ను ఓడించే అవకాశాలుంటాయని చెప్పారు. ఐదుగురు చట్టసభ సభ్యులు బైడెన్ వైదొలగాలని బాహటంగానే డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా డెమొక్రాటిక్ పారీ్టకి విరాళాలు ఇస్తున్న దాతలు.. బైడెన్ తప్పుకోవాలని షరతు పెడుతూ విరాళాలను నిలిపివేశారు. దాంతో నాన్సీ పెలోసీ రంగంలోకి దిగి తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. బైడెన్ శిబిరానికి వాస్తవాన్ని తెలియజెప్పారు. అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో కోవిడ్‌తో డెలావెర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడేంటి? ఓపెన్ కన్వెన్షన్.. కమలకు ఛాన్స్ బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో నవంబరు 5 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీపడవచ్చు) జరుగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన ప్రైమరీల్లో బైడెన్ తిరుగులేని మెజారిటీని కూడగట్టుకున్నారు. 4,000 పైచిలుకు డెలిగేట్లలో 3,900 మంది డెలిగేట్లను బైడెన్ గెల్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్‌లో వీరిందరూ బైడెన్‌కు బద్ధులై ఉండాలి. ఇప్పుడాయనే స్వయంగా రేసు నుంచి వైదొలిగారు కాబట్టి.. డెమొక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడొచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమొక్రాటిక్ పార్టీలోని ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచి్చన అభ్యరి్థకి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగు వేల పైచిలుకు డెలిగేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలిరౌండ్లో ఫలితం తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమొక్రాటిక్ నామినీ ఎన్నికయ్యేదాకా ఓటింగ్ కొనసాగుతుంది. ముమ్మర లాబీయింగ్, తెరవెనుక మంత్రాంగాలు జరగడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
అమెరికా అధ్యక్ష్య ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రజల ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్‌గా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇటీవల ట్రంప్‌తో జరిగిన ముఖాముఖి చర్చలో బైడెన్ నిరాశపరిచారు. రానున్న ఎన్నికలకు తదుపరి డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను జో బైడెన్ ప్రతిపాదించారు.జో బైడెన్ సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సైతం బైడెన్ బాధపడుతున్నారు. -
ఎన్నికల్లో గెలుపు మనదే: కమలా హారీస్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డెమోక్రటికల్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారం రిపబ్లిక్ పార్టీదే అని చెప్పుకొచ్చారు.కాగా, అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పోటీ చేస్తే ప్రచారానికి నిధులు నిలిపివేస్తామని డెమోక్రటిక్ పార్టీ దాతలు బెదిరించడంతో కమలా హారీస్ రంగంలోకి దిగారు. తాజాగా ఆమె నిధుల సేకరణ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలా హారీస్.. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలవబోతుందన్నారు. బైడెన్ తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికా ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే, ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. తొమ్మిది మంది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కమలా హారీస్లో పోటీలో ఉండాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీసే కరెక్ట్ పోటీదారు అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో, ట్రంపే గెలుస్తారనే చర్చ నడుస్తోంది. -
USA Presidential Elections 2024: బైడెన్ కంటే కమల బెటర్
వాషింగ్టన్: అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని బైడెన్‌పై ఒత్తిళ్లు తీవ్రమవుతున్న వేళ ఆయన కంటే కమలా హారిస్ మంచి అధ్యక్షురాలు అవుతారని మెజారిటీ డెమొక్రాట్లు భావిస్తున్నారు. ప్రతి 10 మంది డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల్లో ఆరుగురు కమలా హారిస్ అగ్ర రాజ్యాధినేతగా రాణించగలరని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ఆమె సామర్థ్యంపై అపనమ్మకం వెలిబుచ్చగా, మరో ఇద్దరు ఎటూ చెప్పలేమని, తమకు అంతగా తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీ–ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఆఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన పోల్‌లో డెమొక్రాట్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్‌తో జూన్ 27న జరిగిన తొలి అధ్యక్ష చర్చలో బైడెన్ తడబడటం, మతిమరపుతో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ట్రంప్‌ను ఓడించాలంటే అది కమలకే సాధ్యమవుతుందని, బైడెన్ స్థానంలో ఆమె తమ అధ్యక్ష అభ్యర్థి కావాలని డెమొక్రాట్లు డిమాండ్లు వినిపిస్తున్నారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. బైడెన్‌తో ఫోన్లో మాట్లాడుతూ అధ్యక్ష అభ్యరి్థగా వైదొలగడమే పారీ్టకి మేలని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. బైడెన్ కొనసాగితే వైట్‌హౌస్‌ను కోల్పోవడమే కాకుండా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ డెమొక్రాటిక్ పారీ్టకి ఎదురుదెబ్బ తగులుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. వైదొలగడం లేదు: ప్రచార సారథి జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం లేదని ఆయన ప్రచారబృందం సారథి జెన్ ఒమాలీ డిల్లాన్ శుక్రవారం స్పష్టం చేశారు. అయితే బైడెన్‌కు మద్దతు తగ్గుతున్న విషయాన్ని అంగీకరించారు. ‘ఆయనకు 81 ఏళ్లనేది నిజమే.. కానీ ఆయన గెలవగలరని అమెరికా ప్రజల్లో తిరిగి నమ్మకాన్ని పాదుకొల్పడానికి మేము చేయాల్సింది ఎంతో ఉంది’ అని డిల్లాన్ అన్నారు. బైడెన్ ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ ఓటర్లు ట్రంప్‌కు ఓటు వేసేందుకు మొగ్గు చూపడం లేదని ఆమె పేర్కొన్నారు. -
బైడెన్ ఫ్యామిలీలో చర్చ.. అమెరికా అధ్యక్ష పోటీకి దూరం!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.కాగా, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంపై ఆయన కుటుంబంలో కూడా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. బైడెన్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, బైడెన్‌ను ఇలా సడెన్‌గా అధ్యక్ష ఎన్నికల నుంచి సొంత పార్టీ నేతలే తప్పుకోమనడం సరైన పద్దతి కాదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నట్టు ఎన్బీసీ న్యూస్ రాసుకొచ్చింది. అలాగే, తన రాజకీయ జీవితంలో బైడెన్ అమెరికన్లకు ఎంతో సేవ చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఇక, తాజాగా బైడెన్ కోవిడ్ బారినపడిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు పెరుగుతున్న వేళ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆయన అభ్యర్థిత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో కొనసాగడంపై బైడెన్ పరిశీలిస్తున్నట్టు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వారాంతంలోపే దీనిపై ఆయన కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు.. నవంబరులో జరిగే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశాలు లేవనే వాస్తవాన్ని బైడెన్ అంగీకరించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధ్యక్షుడి సన్నిహితులు వెల్లడించారు. సొంత పార్టీ నుంచి డిమాండ్లు వస్తున్న వేళ ఆయన రేసు నుంచి వైదొలిగే అవకాశాలున్నట్లు వారు చెప్పారు అని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.ఇక, ఇటీవల కొవిడ్ బారిన పడిన బైడెన్ ప్రస్తుతం డెలావర్‌లోని తన ఇంట్లో క్వారెంటైన్లో ఉన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైతే అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై ఆలోచిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె పోటీ కోసం సన్నద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్.. హింట్ ఇచ్చిన బైడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.. అధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్స్(NAACP) అన్వాల్ కన్వేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. కమలా హారీస్ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్ పార్టీకి భవిష్యత్ అని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ను ఓడిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో భేటీ సందర్భంగా బైడెన్ తేలిపోయాలి. దీంతో, బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్ చేశారు. బైడెన్ స్థానంలో కమలా హారీస్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీస్ బెటర్ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్ఎన్ సర్వేల్లో కమలా హారీస్‌కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు మాత్రం 47 శాతం ఓటింగ్ వచ్చింది. -
బైడెన్ కంటే కమలా హారీస్ బెటర్.. పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహార శైలే కారణమని పలువురు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారీస్‌ను బరిలో దింపాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలు సర్వేల పోల్స్ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో, అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా సీఎన్ఎన్ పోల్ ప్రకారం.. నమోదైన ఓటర్లలో ట్రంప్‌నకు 47 శాతం ఓట్లు రాగా.. కమలా హరీస్‌కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారీస్ 50 శాతం ఓట్లు రావడం విశేషం. ఇదే సమయంలో బైడెన్‌కు 44 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు.. మిచెల్లీ ఒబామాకు 37 శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో బైడెన్ డిబెట్ గురించే ప్రధానంగా చర్య జరుగుతోంది. ట్రంప్‌ను ఢీకొనడంతో బైడెన్ విఫలమయ్యారనే డెమోక్రటిక్ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో, ఆయన పోటీలో ఉంటారా? అనే చర్య మొదలైంది. మరోవైపు.. ట్రంప్‌తో డిబెట్ సందర్భంగా తాను ఎందుకు సరిగా మాట్లాడలేదో క్లారిటీ ఇచ్చారు. ఈ తడబాటుకు గల కారణాన్ని బైడెన్ చెప్పుకొచ్చారు.వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన..‘తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. ఈ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబెట్లో ట్రంప్‌తో సరిగా వాదించలేకపోయానన్నారు. చర్చలో తాను మరింత ధాటిగా మాట్లాడి ఉంటే బాగుండేదని చెప్పారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించవద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ అవుట్?.. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆమె!
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఆసక్తికర సమరం చోటు చేసుకోబోతోందా?. జో బైడెన్ స్థానంలో మరొకరిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలపనుందా?. అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు అక్కడ ఆసక్తికర చర్చకు దారి తీశాయి.బరాక్ ఒబామా భార్య, అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగస్టులో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో బైడెన్‌ను మార్చే అవకాశం ఉందని తెలిపారు.కాగా నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య జూన్ 27న జార్జియాలోని అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు సాగిన ఈ డిబెట్లో ఇరువురు పలు కీలక అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేశారు. అయితే ఈ చర్చలో బైడెన్ వెనుకంజవేశారని, ట్రంప్ పైచేయి సాధించారని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వ్యూహకర్తలు బిడెన్‌ను భర్తీ చేసే మార్గాలపై చర్చిస్టున్నట్లు తెలుస్తోంది.బైడెన్ మాట్లాడిన తీరుపై డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. ఆయన మాట్లలో బొంగురు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, సమాధానలు చెప్పడంలో, ఆలోచనలను వివరించడంలో తడబాటు.. వంటి పలు కారణాలతో బైడెన్‌ను రేసు నుంచి తప్పించాలని ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిడెన్‌ను మిచెల్ ఒబామాతో డెమొక్రాటిక్ పార్టీ భర్తీ చేయాలని చూస్తుందని చెప్పారు టెడ్ క్రూజ్. అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ను తొలగించి మిషెల్లీ ఒబామాను నియమించే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు తెలిపారు. -
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్‌కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్‌లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్‌ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్‌కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్‌కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్‌పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
USA Presidential Election 2024: ఒకే వేదికపైకి బైడెన్, క్లింటన్, ఒబామా!
న్యూయార్క్: డెమోక్రాటిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిధుల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. గురువారం రాత్రి న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాల్లో జరిగిన ఈ కార్యమానికి మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ హాజరయ్యారు. బైడెన్‌కు ఏకంగా 26 మిలియన్ డాలర్ల (సుమారు రూ.216 కోట్లు) పైచిలుకు నిధులు సమకూరాయి. అమెరికా అధ్యక్ష ప్రచారంలో ఒక్క కార్యక్రమంలో ఇంత భారీ విరాళాలు రావడం ఇదే తొలిసారి! -
USA presidential election 2024: మళ్లీ ఆ ఇద్దరే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో చివరకు మళ్లీ బైడెన్, ట్రంప్‌లే నిలిచారు. అధ్యక్ష పీఠం కోసం తమ తమ పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్ధిత్వాలను బైడెన్, ట్రంప్ గెల్చుకున్నారు. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సాధించడం ద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ తరఫున 81 ఏళ్ల జో బైడెన్లు తమ అభ్యర్దిత్వాన్ని ఖరారుచేసుకున్నారు. తాజాగా జార్జియాలో జరిగిన డెమొక్రటిక్ ప్రైమరీలో గెలిచి ఇప్పటిదాకా బైడెన్ 2,099 డెలిగేట్ల ఓట్లను సాధించారు. మొత్తం 3,933 ఓట్లలో 1,968 ఓట్లు వచ్చినా అభ్యర్ధిత్వం ఖరారు అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఆ సంఖ్యను దాటేయడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ తరఫున బైడెన్ అభ్యర్ధిత్వాన్ని ఆగస్ట్‌లో చికాగోలో జరిగే పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్ధిత్వం సాధించాలంటే కనీసం 1,215 ఓట్లు గెలవాలి. ట్రంప్ ఇప్పటిదాకా మొత్తంగా 1,228 ఓట్లను గెల్చుకున్నారు. జూలైలో మిల్వాకీలో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ అభ్యర్ధిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. మంగళవారం నాటి ప్రైమరీలో గెలవడం ద్వారా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున వరసగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2020 నాటి ప్రత్యర్థులే మళ్లీ అధ్యక్ష సమరంలో గెలుపు కోసం పోరాడుతున్నా ఈసారి ఎన్నికల్లో ప్రధాన అంశాలు, ప్రచార అస్త్రాలు మారాయి. ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి కేసులు లేవు. కానీ ఇప్పుడు ట్రంప్ మెడకు 91 కేసులు చుట్టుకున్నాయి. ఎవరికి ఓటేస్తారు?: బైడెన్ మంగళవారం నాటి ప్రైమరీ గెలుపు తర్వాత బైడెన్ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారా? లేదంటే కూలదోస్తారా?. స్వేచ్ఛ, ఎన్నుకునే హక్కులను పునరుద్దరించుకుందామా? లేదంటే వాటిని అతివాదులకు అప్పగిద్దామా?’’ అని పరోక్షంగా ట్రంప్‌ను విమర్శిస్తూ బైడెన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. చరిత్రలో చెత్త అధ్యక్షుడు బైడెన్‌ను గద్దె దించాల్సిన సమయమొచ్చింది అని ట్రంప్ సైతం ఒక వీడియో సందేశంలో రిపబ్లికన్ ఓటర్లకు పిలుపునిచ్చారు. డెమొక్రటిక్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు జో బైడెన్ 2,099 ఇతరులు 20 జేసన్ పామర్ 3 రిపబ్లికన్ పార్టీలో అభ్యర్థులు గెల్చిన డెలిగేట్ల ఓట్లు ట్రంప్ 1,228 నిక్కీ హేలీ 91 రాన్ డీశాంటిస్ 9 వివేక్ రామస్వామి 3 -
దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్!
సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఆసక్తికర ఘట్టానికి అగ్రరాజ్యపు అధ్యక్ష ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. వరుసగా రెండోసారి కూడా.. అధ్యక్ష ఎన్నికల్లో అదే ఇద్దరు అభ్యర్థులు తలపడబోతున్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్.. నవంబర్ 5వ తేదీన జరగబోయే 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది!. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థితత్వం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నిలబడబోతున్నారు. నామినేషన్‌కు అర్హత సాధించాలంటే బైడెన్‌కు 1,968 డెలిగేట్స్ మద్దతు అవసరంకాగా.. ఆ ఫిగర్‌ను ఆయన దాటేశారని సమాచారం. తాజాగా వెలువడుతున్న ప్రైమరీ ఫలితాల్లో.. జార్జియా విజయంతో బైడెన్ ఆ ప్రతినిధుల సంఖ్యను అధిగమించేశారని తెలుస్తోంది. మరోవైపు మిసిస్సిప్పి, వాషింగ్టన్, నార్తన్ మరియానా ఐల్యాండ్స్ ఫలితాల్లోనూ బైడెన్ పైచేయి సాధించవచ్చని అమెరికా మీడియా అంచనా వేస్తోంది. 1952, 1956 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి డ్వైట్ D. ఐసెన్‌హోవర్.. మాజీ ఇల్లినాయిస్ గవర్నర్(డెమొక్రటిక్) అడ్లై స్టీవెన్సన్ను రెండుసార్లూ ఓడించారు. తొలిసారి కంటే కంటే రెండో దఫా అధ్యక్ష ఎన్నికల్లో ఐసెన్‌హోవర్ మెరుగైన ఫలితంతో ఘన విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు డొనాల్డ్ ట్రంప్‌నకు 1,215 మంది ప్రతినిధులు అవసరం. అయితే ఎడిసన్ రీసెర్చ్ ప్రకారం.. సోమవారం నాటికి ట్రంప్‌కు 139 మంది అదనపు ప్రతినిధులు అవసరం. అయితే జార్జియా, హవాయి, మిస్సిస్సిప్పి వాషింగ్టన్ రాష్ట్రాల్లో 161 మంది ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్ట్ ట్రంప్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. వరుసగా రాష్ట్రాల్లో ప్రైమరీ ఫలితాల్లో విజయం సాధిస్తూ సమీప పత్యర్థి నిక్కీ హేలీపై ట్రంప్ పైచేయి సాధించారు. 15 రాష్ట్రాల్లో 14లో ఆయన విజయం సాధించగా.. గత మంగళవారం నాటి ఫలితాల తర్వాత హేలీ తన ప్రచారాన్ని ముగించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవడానికి, పరోక్ష ఎన్నికలు(ప్రైమరీ) నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. ఇక్కడ ఓటర్లు ప్రతి పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధుల్ని నిర్ణయిస్తారు. ఆపై ఈ ప్రతినిధులు తమ తమ పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్రైమరీలలో.. పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను గెలవడానికి అభ్యర్థులకు సమావేశంలో ప్రతినిధుల ఓట్లలో మెజారిటీ అవసరం. అయితే.. నాలుగేళ్లకొకసారి అమెరికాలో జరిగేవి ప్రత్యక్ష ఎన్నికలే. అంతిమంగా బరిలో నిలిచే ఇరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసేది మాత్రం ప్రజలే. -
కొరకరాని కొయ్య ట్రంప్!
ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎలాంటి ప్రసంగాలు చేస్తున్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొదట రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్నీ, ఆ తర్వాత అధ్యక్ష స్థానాన్నీ డోనాల్డ్ ట్రంప్ గెల్చుకోవటం ఖాయమని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. కొలరాడోలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగే ఎన్నికలో బ్యాలెట్ పత్రంపై ట్రంప్ పేరు తొలగించాలన్న ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా తోసిపుచ్చటం ఆయనకు కొత్త శక్తినిస్తుందనటంలో సందేహం లేదు. ‘సూపర్ ట్యూజ్‌డే’ కింద మంగళవారం ఒకేసారి పదిహేను రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ఎన్నికలు జరగనుండగా ఒకరోజు ముందు ఈ తీర్పు వెలువడింది. ట్రంప్ ఇప్పటికే అయోవా, న్యూహాంప్‌షైర్, నెవడా ప్రైమరీలను గెల్చుకోవటంతోపాటు తన ప్రత్యర్థి హేలీకి బలం వుంటుందని భావించిన ఆమె స్వస్థలం సౌత్ కరోలినాలో సైతం సత్తా నిరూపించుకున్నారు. ‘సూపర్ ట్యూజ్‌డే’ పోలింగ్‌లో సైతం ఆయనదే పైచేయి అని ప్రాథమిక సమాచారం చెబుతోంది. అయితే రకరకాల కేసుల్లో చిక్కుకుని వాటినుంచి బయటపడటానికి అనుసరించాల్సిన వ్యూహంపై న్యాయవాదులతో నిరంతరం సంప్రదింపులు జరపాల్సిరావటం, న్యాయస్థానాలకు హాజరుకావటం ట్రంప్ ప్రచారాన్ని దెబ్బతీస్తోందనే చెప్పాలి. న్యాయస్థానాలకు సెలవు దినాలైన శని, ఆదివారాల్లో మాత్రమే ఆయన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో సైతం సరిగా దృష్టి సారించలేకపోతున్నారు. ప్రసంగాలకు బదులు కరచాలనాలతో సరిపెడుతున్నారు. అయితే ఇదంతా ట్రంప్ స్వయంకృతం. దేశాధ్యక్ష ఎన్నికల్లో తనకు లభించిన విజయాన్ని డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందని ఆరోపిస్తూ కాపిటల్ హిల్‌పైకి మద్దతుదార్లను ఉసిగొల్పి విధ్వంసానికి కారకులయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఆ భవన సముదాయాన్ని మూకలు చేజిక్కించుకున్నాయి. ఆయన ప్రత్యర్థి, డెమాక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించటానికి 2021 జనవరిలో అమెరికా సెనేట్, ప్రతినిధుల సభ సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఆ దాడి దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా అందరినీ నివ్వెరపరిచింది. నిజానికి ఈ కేసులోనే కొలరాడో సుప్రీంకోర్టు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడే అర్హతను ట్రంప్ కోల్పో యారని తీర్పునిచ్చింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన ఎవరైనా అందుకు భిన్నంగా తిరుగుబాట్లను రెచ్చగొడితే భవిష్యత్తులో పదవులు చేపట్టటానికి అనర్హులవుతారని చెప్పే రాజ్యాంగం 14వ సవరణలోని సెక్షన్ 3కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. మెయిన్, ఇల్లి నాయీ సుప్రీంకోర్టులు సైతం ఇలాగే నిర్ణయం తీసుకునే అవకాశం వున్నదని అందరూ అనుకున్నారు. కానీ దేశ సుప్రీంకోర్టు తీర్పుతో అవి నిలిచిపోయాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులపై ఇలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయాలు తీసుకుంటే... అవి పరస్పర విరుద్ధంగా వుంటే ఒకరకమైన అరాచకానికి దారితీస్తుందని ధర్మాసనంలోని తొమ్మిదిమంది న్యాయ మూర్తులూ భావించారు. వీరిలో ఆరుగురు మితవాద న్యాయమూర్తులైతే మరో ముగ్గురు ఉదార వాదులు. దేశమంతటికీ వర్తించేలా పార్లమెంటు మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది వారి ఉద్దేశం. అయితే పార్లమెంటు ఉభయసభలైన సెనేట్, ప్రతినిధుల సభల్లో అధికార విపక్షాలిద్దరికీ చెరోచోటా ఆధిక్యత వున్నప్పుడు సమస్య మరింత జటిలంగా మారుతుంది. ట్రంప్ అధ్యక్ష పదవి గెల్చుకున్నాక దాన్ని ధ్రువీకరించటానికి నిర్వహించే పార్లమెంటు సమావేశం కాస్తా ఆయన ఎన్నికను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయన్నది ఊహాతీతం. కాపిటల్ హిల్‌పై దాడికి సంబంధించి ట్రంప్‌పై నాలుగు వేర్వేరు కేసులు విచారణలో వున్నాయి. వాటిల్లోని దాదాపు 93 ఆరోపణలనూ ఆయన తోసిపుచ్చారు. ఆ నేరాలు తాను చేయలేదనటం మాత్రమే కాదు... ఇవన్నీ పదవిలో వుండగా వచ్చిన ఆరోపణలు కనుక అధ్యక్షుడిగా తనకు రక్షణ వుంటుందంటున్నారు. అధ్యక్ష పదవిలో వున్న నాయకుడిపై క్రిమినల్ నేరారోపణలు రావటం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. కాపిటల్ హిల్‌పై దాడికి ఆయన పిలుపు ఇచ్చివుండొచ్చుగానీ, ఆయన స్వయంగా ఈ దాడిలో పాల్గొనలేదన్నది ట్రంప్ న్యాయవాదుల వాదన. ఈ విషయంలో దేశ సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. వాస్తవానికి వచ్చే నెల 22న సుప్రీంకోర్టు దీనిపై విచారణను ప్రారంభించాలి. కానీ ప్రతి దశలోనూ ఏదో ఒక అభ్యంతరంతో అడ్డుకుంటున్న ట్రంప్ న్యాయవాదులు దాన్ని సజావుగా సాగనిస్తారా అన్నది చూడాల్సివుంది. అయితే ట్రంప్ కష్టాలు ఈ కేసుతో తీరిపోతాయనడానికి లేదు. ఆయన చుట్టూ మరిన్ని కేసులున్నాయి. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ తనపై ఆరోపణలు చేయకుండా వుండటానికి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారన్న అభియోగం అందులో ఒకటి. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మోసం కేసులో ఆయన 50 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువడింది. ప్రస్తుతం ఆ మొత్తాన్ని సమీకరించటానికి ఆయన పాట్లు పడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలు సేకరించటం సరేసరి. ఇదిగాక ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కాలమిస్టు జీన్ కరోల్ ఆరోపించారు. అందులో 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించగా, ఆమె పరువు ప్రతిష్ఠలు దెబ్బతీశారన్న ఆరోపణకు సంబంధించి 8 కోట్ల 30 లక్షల డాలర్లు ఇవ్వాలని మరో కోర్టు నిర్ణయించింది. వీటిపై అప్పీళ్లకు వెళ్లదల్చుకున్నారు. జనంలో వరస విజయాలు సాధిస్తున్న ట్రంప్‌ను న్యాయస్థానాల ద్వారా నిరోధించే డెమాక్రాటిక్ పార్టీ వ్యూహం వారికి ఏమేరకు లాభిస్తుందో వేచిచూడాలి. -
అమెరికా రాజకీయాల్లో భారతీయులు
సిద్ధాంతపరంగా అమెరికా రెండు పార్టీల రాజకీయ వ్యవస్థను కలిగి ఉంది. కానీ ఆచరణలో, రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండూ తమలో తామే సంకీ ర్ణాలుగా ఉంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ దాని ఆధిపత్య స్థానంలోని కరడుగట్టిన మితవాదులకూ, పార్టీ లోపలే తమ వాణిని అట్టిపెట్టుకోవడానికి ఘర్షణ పడుతున్న గతకాలపు సంప్రదాయవాదులకూ మధ్య గొప్ప అంతర్యుద్ధానికి సాక్షీభూతంగా ఉంది. ఇక డెమోక్రటిక్ పార్టీ శిబిరం...సెంట్రిస్టులు, సెంటర్– లెఫ్టిస్టులు, లెఫ్టిస్టులకు నిలయంగా ఉంటోంది. అయితే, మితవాద పక్షం నుంచి ప్రగతిశీల వామపక్షాల వరకు, అమెరికాకు చేతనత్వం కలిగిస్తున్న ఐదు రాజకీయ పక్షాలలోనూ భారతీయ అమెరికన్ నాయకులు ప్రధాన పాత్రధారులుగా ఉండటమే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. కరుడుగట్టిన మితవాదం (ఫార్–రైట్)తో ప్రారంభిద్దాం. ఈ రాజకీయ ధోరణి, కింది విధానాలను కలిగివుంది. 1.కార్పొరేట్ పన్ను తగ్గింపుల ద్వారా ఆర్థిక స్థితిస్థాపకతను నిర్మించడంపై అమెరికా దృష్టి కేంద్రీకరించాలి. ఇంధన వాడకాన్ని ఎంతకైనా పెంచాలి. ఇప్పటికే ఉన్న ట్రేడింగ్ ఏర్పాట్లపై పూర్తిగా తిరోగమించాలి. 2. అమెరికా తన అంతర్జాతీయ కట్టుబాట్లను తగ్గించుకోవాలి. ఐరోపా నుండి వెనక్కి తగ్గాలి. ఎక్కువగా చైనాపై దృష్టి పెట్టాలి. 3. అమెరికా తన సరిహద్దులను పటిష్టంగా కాపాడు కోవాలి. సామాజిక జనాభా మార్పులు సంఘర్షణలను ఆహ్వానిస్తున్నాయి. వలసదారులు శ్వేత క్రైస్తవ జనాభా రాజకీయ ఆధిపత్యానికి కలగబోయే ముప్పును సూచిస్తున్నారు. 4. అమెరికా ‘మేలుకొలుపు’ (వోకిజం) రాజకీయాలను తిప్పికొట్టాలి. అవి లైంగికత లేదా జాత్య హంకారంపై విద్యా బోధన లేదా నిశ్చయాత్మక చర్య లేదా యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు వంటివి ఏవైనా కావచ్చు. 5. అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వం, నిఘా సంస్థలు రాజకీయంగా రాజీ పడ్డాయి. వీటి సిబ్బందిని తగ్గించడంతో సహా నాటకీయంగా రీబూట్ చేయడం అవసరం. డోనాల్డ్ ట్రంప్ ఈ ధోరణికి నిజమైన మార్గదర్శకుడు, ముఖ చిత్రం కూడా. అయితే, ఈ రోజు ఈ ఉద్యమం తదుపరి తరం ముఖా లలో వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. నిజానికి, వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ సమావేశంలో, ట్రంప్ ఉపాద్యక్షుడి ఎంపికగా రామస్వామి కూడా ఫేవరెట్లలో ఒకరుగా ఉద్భ వించారు. మధ్యేవాద–సంప్రదాయవాద ధోరణిని పరిశీలిద్దాం. ఈ అంతరి స్తున్న మితవాద రిపబ్లికన్ ల తరం మూడు కీలక అంశాలలో, కరుడు గట్టిన మితవాదం నుండి భిన్నంగా ఉంటుంది. 1. అంతర్జాతీయ కట్టు బాట్ల పరంగా, అమెరికా బలం... పొత్తులపై, ‘నాటో’ కూటమి పట్ల నిబద్ధతపై, భాగస్వామ్యాలపై ఆధారపడి ఉంటుందని ఈ స్కూల్ విశ్వసిస్తుంది. ఐరోపాలో రష్యా సవాలును, ఇండో–పసిఫిక్‌లో చైనా సవాలును, పశ్చిమాసియాలో ఇరాన్‌ను అమెరికా కలిసి ఎదుర్కోవాలని నమ్ముతుంది. 2. సంస్కృతీ యుద్ధాల పరంగా – మితవాద రిప బ్లికన్ లు అబార్షన్, తుపాకీ హక్కులు, విద్యపై పార్టీ ఎజెండాతో సరిపెట్టుకుంటారు. అన్నింటికీ మరీ ఎక్కువ ఆందోళన చెందకుండా విభిన్న దృక్కోణాల పట్ల అంగీకారంగా ఉంటారు. 3. మితవాద రిప బ్లికన్ లు అమెరికన్ సంస్థలపై విశ్వాసం కలిగి ఉంటారు. అలాగే ప్రజా స్వామ్య నియమాలకు కట్టుబడి ఉంటారు. ఇది యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ మీద జనవరి 6న జరిగిన మూక దాడి సమర్థకుల నుండి వైరుధ్యాన్ని సూచిస్తుంది. సెనేట్‌లో మిచ్ మెక్కానెల్ ఈ విభాగానికి నాయకత్వం వహిస్తుండగా, నిక్కీ హేలీ ఇప్పుడు మితవాద రిపబ్లికన్ పార్శా్వనికి ప్రజా ముఖంగా ఉన్నారు. ఆమె అయోవా, న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలలో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. తన సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలోనూ ఓడారు. నెవాడాలో అయితే ‘ఈ అభ్యర్థులు ఎవరూ కారు’ విభాగంలో పోల్ అయిన ఓట్ల కంటే తక్కువ ఓట్లను పొందడం అనేది ఈ భావజాలం ఈరోజు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉందో చూపి స్తుంది. కానీ మొత్తంగా నియోజకవర్గాల పరంగా ఈ వర్గం ప్రభావం చూపుతుంది. న్యూ హాంప్‌షైర్‌లో హేలీకి వచ్చిన 43 శాతం ఓట్లు, సౌత్ కరోలినాలో వచ్చిన 39 శాతం ఓట్లలో ఇది కనిపిస్తుంది. గెలవడానికి సరిపోదు కానీ, ఈ వర్గాలు ఇంటిలోనే ఉంటే మాత్రం సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ అవకాశాలు నాటకీయంగా మసక బారుతాయి. డెమోక్రాట్లలో సెంట్రిస్టులు, సెంటర్ లెఫ్టులు, లెఫ్టులు... ఇక మనం డెమోక్రటిక్ పార్టీ శిబిరానికి మరలుదాం. డెమోక్రటిక్ సెంట్రిస్ట్లకు, సెంటర్–లెఫ్ట్‌కు అధ్యక్షుడు జో బైడెన్ నాయకత్వం వహిస్తున్నారు. వివిధ ప్రపంచ రంగాల్లో అమెరికా పాత్రకు సంబంధించి మధ్యేవాద రిపబ్లికన్ల నిబద్ధతను ఈ స్కూల్ కూడా పంచుకుంటుంది. ఇది కరుడుగట్టిన మితవాద, ప్రగతిశీల భావజాలాలు రెండింటినీ కలుపుకొని, అమెరికాలో పెట్టుబడి వికాసంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని నడిపించింది. ఇది అబార్షన్ హక్కులపై ప్రగతిశీల దృక్ప థాన్ని కనబరుస్తుంది. అయితే దీనిని ప్రజారోగ్య సమస్యగా, మహిళల హక్కుల సమస్యగా చూస్తుంది. ఇది నిర్మాణాత్మక జాతి వివక్షను గుర్తిస్తుంది కానీ పెరుగుతున్న సంస్కరణలను కూడా విశ్వసిస్తుంది. అధిక లోటును దృష్టిలో ఉంచుకుని సామాజిక భద్రతా వలయాన్ని విస్తరించేందుకు ఇది కట్టుబడి ఉంది. వలసలపై, మరింత కఠినమైన చట్ట అమలు, మరింత మానవీయ విధానం రెండింటి మధ్య సమ తుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తుంది. భారతీయ అమెరికన్లలో, ఇల్లినాయికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మధ్యేవాది(సెంట్రిస్ట్). కానీ సిలికాన్ వ్యాలీ నుండి హౌస్ రిప్రజెంటేటివ్‌గా ఉన్న రో ఖన్నా మాత్రం సెంటర్–లెఫ్ట్ వర్గా నికి చెందిన అత్యంత ప్రముఖ హక్కుదారు. ఆయన మధ్యేవాదులకు, అభ్యుదయవాదులకు కుడివైపున ఉన్న స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. పైగా 2028లో అధ్యక్ష ఎన్నికల కోసం తానూ ఒక రాయి విసరాలని భావిస్తున్నారు. మార్కెట్‌కు సాంకేతిక పరిజ్ఞానం, మధ్య అమెరికాలో శ్రామిక వర్గానికి ఆర్థిక దేశభక్తి గురించి ఈయన మాట్లాడతారు. బహుళవాదం, మైనారిటీలకు ప్రాతినిధ్యం గురించి మాట్లాడతారు. చైనాపై కఠినమైన జాతీయ భద్రతా చర్యలు, గాజాలో కాల్పుల విరమణ, కార్పొరేట్ దోపిడీ, ప్రచార సంస్కరణల భాష గురించి కూడా మాట్లాడతారు. చివరగా, ప్రగతిశీల ధోరణిలోకి వెళ్లి చూడండి. వారు తమ సొంత అంతర్గత వైరుధ్యాలను కలిగి ఉన్నప్పటికీ, విస్తృతంగా చెప్పా లంటే, ప్రగతిశీలురు స్వేచ్ఛా వాణిజ్యంపై సందేహాస్పదంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ చర్యలను సైనిక–పారిశ్రా మిక సముదాయం నడపడాన్ని వ్యతిరేకిస్తారు. అసమానత, దాన్ని ఎదుర్కొనే విధానపరమైన నిర్ణయాల్లో జాతి, లింగవివక్షలను ప్రాథమిక అంశాలుగా తీసుకుంటారు. కార్పొరేట్ అధికారానికి బలమైన ప్రత్యర్థులు. అధిక పన్నుల ప్రతిపాదకులకు వ్యతిరేకులు. తీవ్రమైన వాతావరణ విధాన రక్షకులు. ప్రపంచంలోని మానవ హక్కుల వంటి సమస్యలపై మరింత చురుకైన అమెరికన్ జోక్యానికి లాబీయిస్టులు. ఈ విభాగంలోని ప్రముఖ ముఖాలు దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, హౌస్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్ ప్రమీలా జయపాల్. పురోగామి విశ్వాసాలను కమలా హారిస్ పంచుకుంటున్నప్పటికీ, విదేశాంగ విధా నాల విషయంలో మాత్రం ఆమె సెంట్రిస్ట్ వైఖరికి మారినట్టు కనిపిస్తోంది. ఈ ఐదు రకాల ధోరణులు... అమెరికా రాజకీయాలు ఈరోజు ఎందుకు సందడిగా విభజించబడి ఉన్నాయో, పైగా మునుపెన్నడూ లేనంత సంక్లిష్టంగా ఎందుకు ఉన్నాయో వివరించడంలో సహాయ పడవచ్చు. పైగా భారతీయ అమెరికన్లు అక్కడ తమ కొత్త నేల భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యబద్ధంగా, తరచుగా ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రైమరీలను వేడెక్కిస్తున్న భారతీయులు
నార్త్ కరొలైనా మాజీ గవర్నరు నిక్కీ హేలీ, 38 ఏళ్ల పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడటం! రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీకి నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమెరికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకిది ముందరి ఏడాది కావడంతో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ‘ప్రైమరీ’లు (ప్రాథమిక ఎన్నికలు) రాజకీయ వాతావర ణాన్ని వేడెక్కిస్తున్నాయి. యూఎస్‌లో 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. యూఎస్ మొత్తం జనాభాలో ఇది దాదాపుగా 1.3 శాతం. యూఎస్ కాంగ్రెస్‌లో గత దశాబ్ద కాలంలో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నార్త్ కరొలైనా మాజీ గవర్నరు, ఐక్యరాజ్యసమితిలో యూఎస్ శాశ్వత ప్రతినిధి అయిన నిక్కీ రణ్‌ధవా హేలీ... రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ఆమె పాలనా సామర్థ్యానికి ఇప్పటికే అనేక నిరూపణలు ఉన్నాయి. బయోటెక్స్ స్టార్టప్‌ను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తున్న 38 ఏళ్ల భారతీయ సంతతి పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి కూడా ప్రస్తుతం వెలుగులో ఉన్నారు. అతడు డబ్బు వరదలో కొట్టుకుని పోతున్నవాడు. అమెరికా గుండెకాయగా పేర్గాంచిన మిడ్వెస్ట్ ప్రాంతంలో పెరిగి పెద్దవాడైనవాడు. ఐవీ లీగ్ ప్రావీణ్యాలతో పరిపుష్ట మైనవాడు. ప్రఖ్యాత మీడియా సంస్థలు ఆయన గురించి రాశాయి. ఆయన కథనాల్లో అతిశయోక్తి కనిపించవచ్చు. కానీ ఓటర్లు ఏం కోరు కుంటున్నారన్న విషయమై ఆయనకు చక్కటి అంచనా ఉంది. అత్యధిక సంఖ్యలో డెమోక్రాట్ల వైపున ఉన్న యూఎస్‌లోని ప్రవాస భారతీయులకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ రామ స్వామి ఆలోచనలు గిట్టనివే కావచ్చు. పని ప్రదేశాలలో వైవిధ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. అదే సమయంలో వైవిధ్యభరిత మైన ఆలోచనలను ఇష్టపడతానని చెబుతుంటారు. వైవిధ్య వ్యతిరేక తకు ‘తెలివి’ని జోడించడం ఇది. రామస్వామి ఒక రాజ్యాంగ సవర ణను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం 18–24 ఏళ్ల మధ్య వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే యూఎస్ ప్రభుత్వ స్వరూప స్వభావాలలోని ప్రాథమిక అంశాలపై వారెంత అవగాహ నను కలిగి ఉన్నారో నిర్ణయించే ‘సివిక్స్ టెస్ట్’ను ఉత్తీర్ణులై ఉండాలి. మళ్లీ ఇదొక పైకి మంచిగా కనిపించే కపటపూరితమైన ఆలోచన. ఈ వయఃపరిమితిలో ఉన్న జనాభాలో ఎక్కువమంది డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుంటారు. రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చేవారిలో మధ్య వయస్కులు అత్యధికం. ‘సివిక్స్ టెస్ట్’ నిర్వహణ ద్వారా యువజనుల ఓటర్లలో తగ్గించగలిగినంత మందిని తగ్గిస్తే రిపబ్లికన్లకు ప్రయో జనం చేకూర్చవచ్చన్నది రామస్వామిలోని మరో ఆలోచనా వైవిధ్యం. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీగా నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమె రికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణంగా డెమోక్రాట్లకు ఓటు వేస్తుండే భారతీయ అమెరికన్లు ఎందుకని రిపబ్లికన్ పార్టీ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు? అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, పర్యవసాన వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తర ఫున పోటీ పడటం! ఈ సందర్భంలో ఎవరైనా యూఎస్‌కు భారతీ యుల వలస వెనుక ఉన్న ప్రత్యేక అంశాల మీద, వారు ఏ సామాజిక స్థాయుల నుంచి వలస వచ్చారనే దాని మీద దృష్టిపెట్టడం అవసరం. భారతీయుల వలసల్లోని మొదటి దశ ప్రధానంగా 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో శాన్ఫ్రాన్సిస్కోలోని ఆధునిక టెక్ హబ్ ద్వారా మొదలైంది. ఆసియా సంతతి వారిపై ఉన్న చట్టపరమైన పరి మితుల కారణంగా నాటి వలసదారులు సంఖ్యాపరంగా స్వల్పంగా ఉన్నారు. రైలు–రోడ్లు పనులు, కలప డిపోలు, వ్యవసాయ పొలాల్లో ఉపాధిని వెతుక్కున్నారు. ఆఖరికి కాంగ్రెస్ సభ్యుడు దలీప్ సింగ్ సౌంద్ కూడా 1924లో బర్కిలీలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందినప్పటికీ, యూఎస్ ప్రభుత్వం పౌరసత్వాన్ని నిరాకరించిన కారణంగా 1949 వరకు రైతుగా పని చేయవలసి వచ్చింది. అమృత్‌సర్‌లో జన్మించిన దలీప్ 1956లో డెమోక్రాటిక్ పార్టీ టికెట్‌పై క్యాలిఫోర్నియా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన మొదటి ఆసియా – అమెరికన్, మొదటి భారతీయ– అమెరికన్, మొదటి సిక్కు మతస్థుడు దలీప్. 1965 అక్టోబర్ 3న అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇమిగ్రేషన్ బిల్లుపై సంతకం చేయడంతో ఆసియా దేశాల నుండి వచ్చే వలసలపై ఉన్న నిబంధనలు తొలగిపోయాయి. ఆ తర్వాత వలస వచ్చి తమ విజయాలతో గుర్తింపు పొందిన అనేక ఆసియా సమూ హాల పిల్లల్లో భారతీయ అమెరికన్ల సమూహంలోని పిల్లలు అధికంగా ఉన్నారు. ఇది భారతీయులలోని ఉన్నత విద్యావంతులు యూఎస్‌లో చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి తోడ్పడింది. వారిలో చాలామంది స్కాలర్‌షిప్‌లపై అక్కడికి వెళ్లారు. వారిని జర్న లిస్ట్ అనితా రాఘవన్ తన పుస్తకం ‘ది బిలియనీర్స్ అప్రెంటిస్: ది రైజ్ ఆఫ్ ది ఇండియన్ – అమెరికన్ ఎలీట్ అండ్ ది ఫాల్ ఆఫ్ గాలియన్ హెజ్ ఫండ్’లో ‘రెండుసార్లు ఆశీర్వదించబడిన తరం’గా చేసిన అభివర్ణన ఎంతో ప్రసిద్ధి చెందినది. యూఎస్ వలస చట్టాల సడలింపు వల్లా, స్వాతంత్య్రానంతరం విద్యారంగంపై భారత్ అపారంగా పెట్టు బడులు పెట్టడం వల్లా రెండు రకాలుగా లబ్ధి పొందిన తరం అది. 1995 తర్వాతి కాలంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏర్పడిన డిమాండు, ఆ తర్వాత వై2కె మైగ్రేషన్ ప్రాజెక్టుతో... వలసలు అకస్మాత్తుగా విస్ఫోట స్థాయిలో పెరిగాయి. దాంతో పాటుగా భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై యూఎస్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇది చాలామంది ఆర్థిక నిపుణులకు ద్వారాలను తెరిచింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత అంశాలలో బలమైన నేపథ్యం, ఆంగ్ల భాషపై క్రియాత్మక అనర్గళత ఉండి హెచ్–1బి నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకుని అమెరికా వెళ్లినవారిలో దాదాపు 75 శాతం మంది భారతీయులే. వారిలో అనేకమంది దశాబ్ద కాల వ్యవధిలో అమెరికన్ పౌరులుగా మారారు. 2000 తర్వాత, లేదా గత 10 సంవత్సరాలలో వలసవెళ్లినవారు యూఎస్‌లో శాశ్వత నివా సులుగా ఉంటూ, ప్రస్తుతం పౌరసత్వం పొందే దారిలో ఉన్నారు. వలసల విశిష్టతల దృష్ట్యా భారతీయ అమెరికన్లు రెండు పార్టీల లోనూ ప్రాతినిధ్యం వహించే ధోరణి ఎంత ఎక్కువ మంది పౌరసత్వం పొందితే అంతగా పటిష్ఠం అవుతుంది. ఇతర మైనారిటీ సమూహాల పోరాటం చాలామంది యువ భారతీయ అమెరికన్ల జీవితాలలో ప్రతిబింబించదు. ఎందుకంటే వీరంతా ఉన్నత విద్యావంతులైన మొదటి తరం భారతీయ అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించినవారు. నాణ్యమైన విద్య, సమయపాలన, అందుబాటులో ఉన్న పర్యావరణ వ్యవస్థల మద్దతుతో ఈ యువ బృందం ఆర్థికంగా లాభదాయకమైన అనేక వృత్తిపరమైన రంగాలలో విజయం సాధించింది. జెనరేషన్ జడ్, లేదా మిలీనియల్ జనరేషన్ నుంచి కొందరు తక్కువ ఆదాయ పన్ను, ప్రైవేట్ హెల్త్ కేర్ వంటి విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఇతర మైనారిటీ సమూహాలకు భిన్నంగా సంక్షేమ పథ కాల పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండవచ్చు. భారతీయ అమెరికన్ల రాజకీయ పొత్తులు యూఎస్‌లోని ఇతర మైనారిటీ సమూహాల రాజ కీయాలపై మన అవగాహన నుండి ఉత్పన్నం అయినవైతే కాదు. లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ట్రంప్ ప్రాభవం మళ్లీ పెరిగేనా?
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మీద పోటీకి దిగే రిపబ్లికన్ అభ్యర్థి ఎవరు? పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే ఉంటుందా? వారం రోజుల్లో రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక డిబేట్ మొదలవుతుంది. ఒక పోల్ ప్రకారం, 52.7 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ను సమర్థిస్తుండగా, ఆయన సమీప పోటీదారు డసాంటస్కు 14 శాతం మందే మద్దతిచ్చారు. పైగా 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో తెచ్చినవని నమ్ముతున్నారు. ఏమైనా రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను తనకు అనుకూలంగా మలుచుకోగలిగే శక్తిమంతుడు ట్రంప్! 2022 నవంబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, ప్రతినిధుల సభకు మొత్తం సభ్యు లనూ, సెనేట్‌లో మూడింట ఒక వంతు సభ్యులనూ అమెరికన్లు ఎన్ను కున్నప్పుడు– పాత రిపబ్లికన్ వ్యవస్థకు చెందినవారితోపాటు కొందరు డెమొక్రాటిక్ పండితులు డోనాల్డ్ ట్రంప్ రాజకీయాలకు ‘నివాళులు’ అర్పించారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ బలపరిచిన అభ్యర్థులు ఓడి పోయారు. 2020 ఎన్నికలు ‘దొంగిలించబడ్డాయని’ ట్రంప్ చేసిన ప్రక టనను బలపర్చినవారినీ, జో బైడెన్ చేతిలో ఓడిపోయినా అధికారంలో కొనసాగడానికి ట్రంప్ చేసిన దుస్సాహసిక ప్రయత్నానికి మద్దతు ఇచ్చినవారినీ ఓటర్లు స్పష్టంగా తిరస్కరించారు. ట్రంప్ తన పదవీ కాలంలో తన నామినీలతో నింపిన సుప్రీంకోర్టు గర్భస్రావాలపై ఇచ్చిన తీర్పు మీద మహిళా ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురైంది. రిపబ్లికన్ పార్టీ నుంచి మరో అధ్యక్ష అభ్యర్థి, ట్రంప్ అత్యంత సమీప పోటీదారు అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డసాంటస్ తాజాగా రెండోసారి కూడా గవర్నర్‌గా విజయం సాధించారు. పైగా రిపబ్లికన్ దాతలు, ఆయన ప్రభావవంతమైన మీడియా ఛాంపియన్లు ఇద్దరూ ట్రంప్‌కు దూరమయ్యారు. మరి ఈ కొన్ని నెలలు రాజకీయాల్లో ఎలాంటి తేడాను చూపగలవన్నది ప్రశ్న. రిపబ్లికన్ అభ్యర్థులు వచ్చే వారం అయోవాలో తమ మొదటి ప్రాథమిక డిబేట్‌కు వెళుతుండగా, ఈ రేసులో ట్రంప్ ఎంత సౌకర్య వంతమైన స్థానంలో ఉన్నారంటే, బహుశా ఆయన ఆ చర్చకు కూడా వెళ్లకపోవచ్చు. ‘ఫైవ్థర్టీయైట్.కామ్’ రిపబ్లికన్ అభ్యర్థుల ప్రాథమిక పోటీల తాజా పోల్స్‌లో, 52.7 శాతం మంది ఓటర్లు ట్రంప్‌ను సమ ర్థించారు. 14 శాతం మంది మాత్రమే డసాంటస్కు మద్దతుగా నిలిచారు. ఇద్దరి మధ్యా ఆశ్చర్యకరంగా 38 శాతం తేడా ఉంది. వచ్చే వారం డిబేట్లో కనిపించే మిగతా వారందరూ – ప్రముఖంగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, మైక్ పెన్స్, క్రిస్ క్రిస్టీ, టిమ్ స్కాట్‌లకు ఈ పోల్‌లో 10 శాతం కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. చాలామందికి 5 శాతం కంటే తక్కువ వచ్చాయి. అయితే, ఏ రాజకీయ నేపథ్యం లేకుండా మొదటిసారి పోటీకి దిగుతున్న వివేక్ రామస్వామికి పెరుగు తున్న ఓటర్ల మద్దతు మాత్రం చెప్పుకోదగ్గది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రతి నేరారోపణ ఆయన పునాదిని బలోపేతం చేయడంలో సహాయపడింది. దాంతోపాటు బైడెన్ పరిపా లనకు వ్యతిరేకంగా రిపబ్లికన్లను ఇది సమైక్యపర్చింది. అయితే ఆయనపై ఆరోపించిన ప్రతి నేరాన్ని నిశితంగా చూస్తే, ట్రంప్ ఎంత ప్రమాదకరంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది. ఒక శృంగార తారకు డబ్బు చెల్లించాలంటే తన వ్యాపార రికార్డులను తప్పుగా చూపడమే కాకుండా, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఆర్థిక చట్టాలను ఉల్లంఘించాల్సి ఉంటుందని ట్రంప్‌కు తెలుసు. ఆయినా ఆ మార్గంలోనే ముందుకు సాగారు. వైట్ హౌస్ నుండి జాతీయ భద్రతా రహస్యాలను దొంగిలించడం, వాటిని తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం, వాటిని దాచమని తన వ్యక్తిగత సహాయకుడికి చెబుతూనే, ఆ పత్రాలు తన వద్ద లేవని అబద్ధం చెప్పడం కూడా చట్టవిరుద్ధమని ఆయనకు తెలుసు. దానిక్కూడా సిద్ధపడ్డారు. 2020 ఎన్నికల ఫలితా లను తారుమారు చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సొంత కార్యాలయ సిబ్బందితోపాటు ప్రచార విభాగంలోని చాలామంది విశ్వసనీయమైన వ్యక్తులు ఆయన్ని హెచ్చరించారు. అయినా ఏడు రాష్ట్రాల నుండి మోసపూరిత ఓటర్ల జాబితాను సృష్టించారు, తన ఆదేశాలను పాటించని రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తెచ్చారు, ఫలితాల ధృవీకరణను నిరోధించడానికి క్యాపిటల్‌పై దాడి చేయవలసిందని ఒక గుంపును ప్రేరేపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రాజ్యాంగం, చట్టపరమైన నిర్మాణం, సంస్థాగత నిబంధనలు, పార్టీ సిద్ధాంతాలు, రాజకీయ నియమాలే కాకుండా, ఎలాంటి మంచీ చెడూ నియంత్రణలలో లేని వ్యక్తి ట్రంప్. అయినప్పటికీ ట్రంప్ తనపై చేసిన మూడు నేరారోపణలను (ఈ వారంలో నాలుగవది ఎదుర్కొన్నారు) కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గొప్ప విజయం సాధించారు. అమెరికన్ డీప్ స్టేట్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న హీరోలా, ఉదారవాదుల కుట్ర ఎదుర్కొంటున్న బాధితుడిలా ఆయన పాత్రలు మార్చుకుంటున్నారు. మరింతగా విరాళాలను సేకరించడం ప్రారంభించారు (ఈ డబ్బులో చాలా మొత్తం కేసుల ఫీజులకే పోతుంది). పైగా పార్టీలో క్షేత్రస్థాయి వర్గాలు ఆయన వెనుక సంఘటితమవుతున్నాయి. ఇటీవలి సీబీఎస్ న్యూస్ పోల్ ప్రకారం, 86 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో వచ్చినవని నమ్ముతున్నారు. బైడెన్ చట్టబద్ధంగా ఎన్నిక య్యారని 92 శాతం మంది డెమొక్రాట్లు విశ్వసిస్తున్నప్పటికీ, 68 శాతం మంది రిపబ్లికన్లు బైడెన్ ఎన్నికను విశ్వసించడం లేదు. అంటే వీళ్లు ట్రంప్ అబద్ధాన్ని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఒహాయో రాష్ట్ర శాసనసభ్యుడు, ట్రంప్ మద్దతుదారు అయిన నీరాజ్ అంటాని ఈ వ్యాసకర్తతో ట్రంప్ పునరుత్థానం గురించి చెప్పిన దానిని కూడా గమనించాలి: ‘‘ఇది ట్రంప్ పార్టీ. మాజీ దేశాధ్యక్షుడు దానిని నిర్వచిస్తున్నారు.’’ చివరకు, డసాంటస్ చేస్తున్న ప్రచారంలోని వైఫల్య శకలాలే ట్రంప్ పునరుత్థానాన్ని నిర్దేశిస్తున్నాయి. సాంఘిక సంప్రదాయవాదు లను గెలవడం కోసం... జాత్యహంకారం, బానిసత్వం, లైంగికత చుట్టూ ఉన్న బోధనలపై గవర్నర్ డసాంటస్ దాడి చేస్తూ, సాంస్కృతిక మితవాద తీవ్రవాదం ప్రాతిపదికన తన రాజకీయాలను నిర్వచించుకుంటున్నారు. అయితే ఇది ఆయనకు మద్దతు పెరగడంలో సహా యపడలేదు. పూర్వాశ్రమంలో యూఎస్ కాంగ్రెస్‌లో డసాంటస్తో కలిసి పనిచేసినవారు ఆయనకు ప్రజాకర్షణ కానీ, సహజమైన రాజ కీయ అనుసంధానం కానీ లేవని చెబుతున్నారు. తన ప్రచారాన్ని కూడా పేలవంగా నిర్వహిస్తున్నారు. సిబ్బందిని తరచుగా మార్చడంలో ఇది ప్రతిఫలిస్తోంది. ఇటీవలి ఒక ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ఎత్తి చూపినట్లుగా, ఫ్లోరిడా గవర్నర్‌ను కనికరం లేకుండా ట్రంప్ ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా, ట్రంప్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలి యక డసాంటస్ తికమక పడుతున్నారు. రిపబ్లికన్లు వచ్చే జూలైలో మాత్రమే తమ అధ్యక్ష అభ్యర్థి ఎవర నేది నిర్ణయిస్తారు. ట్రంప్ చేస్తున్న న్యాయ పోరాటాలు ఆయన శక్తిని బాగా హరించవచ్చు. అయినా కూడా 2024లో అమెరికాలో జరిగే రాజకీయ పోరాటం తిరిగి బైడెన్, ట్రంప్ మధ్యనే సాగేట్టుగా కనిపిస్తోంది. అయితే అభ్యర్థిగా ట్రంప్ పోటీలో ఉండటం తమకు కలిసొస్తుందని బైడెన్ బృందం నమ్ముతోంది. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ ఉనికి చాలు... స్వతంత్రులు, మితవాద రిపబ్లికన్లు, సబర్బన్ మహిళలు ఆయనకు దూరం జరగడానికి అన్నది ఈ వర్గం మాట. ట్రంప్ పట్ల వారి అపనమ్మకం, అయిష్టత చాలా తీవ్రస్థాయిలో ఉన్నందున... బైడెన్‌కు రెండవసారి పదవి దక్కడంపై ఉత్సాహం చూపని యువతతో సహా డెమొక్రాటిక్ పార్టీ పునాదిని ఏకీకృతం చేయడంలో ఇవి సహాయపడతాయి. తన పునాదిపై ఇప్పటికీ బలమైన పట్టున్న ట్రంప్‌ను తక్కువగా అంచనా వేయడం పొరపాటు అని వాదించే డెమొక్రాట్లు కూడా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి, అర డజను ఊగిసలాడే రాష్ట్రాల్లో మరోసారి మెజారిటీ కొన్ని వేల ఓట్లకు తగ్గుతుందని వీరి భయం. నిరుత్సాహకరమైన దేశ ఆర్థిక స్థితితో పాటు రాజకీయ వినోదం కోసం అర్రులు చాచే ప్రజారాశుల కోరికను కూడా తనకు అనుకూలంగా ట్రంప్ మలుచు కోగలరు. మొత్తం మీద, వచ్చే నవంబర్‌లో ఏమి జరిగినా, ట్రంప్ కరిష్మా ఇప్పటికీ సజీవంగానే ఉంది. అది అమెరికన్ రాజకీయాలను నిర్దేశిస్తూనే ఉంది. ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ట్రంప్ ముందున్న మార్గం క్లిష్టమే!
రిపబ్లికన్ పార్టీ తమ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ విధానం ఒకటే... ఆయన నేరాలనూ, దుష్ప్రవర్తనలనూ విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్లపై ఉందని వాదించడం! అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి నీలిచిత్రాల తారలతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. మరోవైపు, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. అమెరికాలో 2023 వేసవికాలం క్రూరంగా ఉండబోతోంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న రాజకీయ సాంస్కృతిక జ్వరాలకు ఇది ఒక సూచన. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ దూరమే ఉంది. ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి అమెరికాను తనవైపు తిప్పుకుంది. రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయబోతున్న అభ్యర్థి, తిరిగి భవిష్యత్ అమెరికన్ అధ్యక్షుడిగా భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వ్యవహారాన్నే తీసుకోండి... రహస్య పత్రాలను దుర్వినియోగం చేసిన కేసులో ఆయన వచ్చే ఏడాది మేలో విచారణను ఎదుర్కోనున్నారు. కానీ 2024లో ఆయన ఎదుర్కొనే అనేక కేసుల్లో ఇది ఒకటి మాత్రమే. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జరిగిన లైంగిక కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ట్రంప్ ఇచ్చిన నగదు చెల్లింపుపై క్రిమినల్ విచార ణను మార్చిలో మొదలెట్టాలని నిర్ణయించారు. జార్జియాలో గత ఎన్నికల్లో పొందిన ఓటమిని తిప్పికొట్టేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నా లపై కూడా విచారణ కొనసాగుతోంది. చివరగా, ఆయన నకిలీ ఓటర్లతో కూడిన కుట్ర ద్వారా 2020 ఎన్నికల తీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నించాడనే అభియోగంపై కూడా దర్యాప్తు పూర్తి కావస్తోంది. ఈ కుట్రపూరిత ప్రయత్నం 2021 జనవరి 6న క్యాపి టల్‌పై దాడితో ముగియడం తెలిసిందే. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే రిపబ్లికన్ పార్టీ ప్రక్రియ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. ట్రంప్‌పై వివిధ నేరవిచారణలు ముగియడానికి ముందుగానే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ విషయంలో ప్రస్తుత రిపబ్లికన్ విధానం ఆయన నేరాలను, దుష్ప్రవర్తన లను విస్మరించడం, ఈ ఫలితానికి బాధ్యత డెమోక్రాట్లపై ఉందని వాదించడంగా కనిపిస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఈ అభిప్రాయానికి ఎలా వచ్చిందో, ఎలా చేరుకుందో స్పష్టం కావడం లేదు. కానీ ‘లా అండ్ ఆర్డర్’గా తనను తాను చెప్పుకొనే ఈ పార్టీ... 2021 జనవరిలో జరిగిన అల్లర్లలో అసాధారణమైనది ఏమీ కనిపించలేదని భావించే స్థాయికి చేరుకుంది. పైగా ఆ పార్టీ ఇప్పుడు ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)ని కూడా రద్దు చేయాలనుకుంటోంది. అబార్షన్ ను సహించలేని ఉన్నత నైతికత ఉన్న రిపబ్లికన్ పార్టీ, అదే సమయంలో తమ అధ్యక్ష అభ్యర్థి పోర్న్ స్టార్లతో సహవాసం చేసినా పట్టించుకోని పార్టీగా మారిపోయింది. వారి పూర్వ నాయకుడు రొనాల్డ్ రీగన్ సోవియట్ ‘దుష్ట సామ్రాజ్యం’కు వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించిన చోట, వారి ప్రస్తుత నాయకుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గొప్ప ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. మరోవైపున డెమొక్రాట్లకు వారి సమస్యలు వారికి ఉన్నాయి. కనీస జనాదరణ కూడా లేని జో బైడెన్ రెండోసారి పదవిని కోరు తున్నారు. అయితే కాగితంపై విషయాలు బాగానే కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది, ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి, పైగా, రాబోయే ఆరు నెలల్లో పరిస్థితులు మరింత మెరుగు పడతాయన్న అంచనాలున్నాయి. అధ్యక్షుడిని అభిశంసిస్తామంటూ బెదిరించడం ద్వారా బైడెన్‌ను అణగదొక్కాలని రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారు. బైడెన్, ఆయన కుమారుడు హంటర్ చర్యలు అవినీతితో ముడిపడి ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు, అయినప్పటికీ అధ్య క్షుడు స్వయంగా తప్పు చేసినట్లు చెప్పే సాక్ష్యాలు పెద్దగా లేవు. దేశాన్ని పట్టి పీడిస్తున్న సంస్కృతీ యుద్ధాలు కూడా అంతే నాట కీయంగా ఉన్నాయి. అమెరికా సమకాలీన చరిత్రలో అతిపెద్ద విభజన, వాస్తవానికి గర్భస్రావ అంశమే. అమెరికన్ సుప్రీంకోర్ట్ అబార్షన్ హక్కుల కోసం రాజ్యాంగ పరమైన రక్షణను తీసివేసిన తర్వాత, అనేక రిపబ్లికన్ రాష్ట్రాలు అబార్షన్ ను నిషేధించడమే కాకుండా, అబార్షన్ చేసేవారి చర్యను నేరంగా పరిగణిస్తూ కఠినమైన చట్టాలను ఆమోదించాయి. అయితే, గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆయా సర్వేలు చూపిస్తున్నట్లుగా, అమెరికన్లలో ఎక్కువ మంది కొన్ని పరిమితులతో అబార్షన్ హక్కుకు మొగ్గు చూపుతున్నారు. 1955లో మిసిసిపిలో, శ్వేతజాతి మహిళపై ఈల వేసినందుకు అపహరణకు గురై, చిత్రహింసలపాలై హత్యకు గురైన 14 ఏళ్ల నల్ల జాతి బాలుడు ఎమ్మెట్ టిల్ స్మారక చిహ్నాన్ని గత వారం అధ్యక్షుడు బైడెన్ ప్రారంభించారు. ఆ హత్య, అతని హంతకులను నిర్దోషులుగా విడుదల చేయడం అనేది 1960లలో పౌర హక్కుల ఉప్పెనను ప్రేరే పించింది. పైగా గత దశాబ్దంలో, ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ (నల్లజాతి జీవి తాలూ విలువైనవే) ఉద్యమ పెరుగుదలను చూశాం. ఈ పరిణామం అమెరికాలో నిలకడగా కొనసాగుతున్న జాత్యహంకార ఫలితమే. సమకాలీన అమెరికన్ జాత్యహంకారం ఎలా పని చేస్తున్నదో చూడాలంటే... ఫ్లోరిడా గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆశా జనకంగా ఉన్న రాన్ డిసాంటిస్ ఉదాహరణ చూడాలి. బానిసత్వాన్ని కొట్టివేసేలా ఆయన చర్యలు ఉంటున్నాయి. ఈ రాష్ట్రంలో సవరించిన పాఠ్య పుస్తకాలు... పని చేస్తూ బానిసలు కొన్ని నైపుణ్యాలను సంపా దించుకున్నందున వారు తమ బానిసత్వ స్థితి నుండి ప్రయోజనం పొందారని పేర్కొన్నాయి. లైంగిక విద్య, లైంగిక ధోరణి, లింగ గుర్తింపుపై యుద్ధాలు జరుగుతున్నాయి. స్వలింగ సంపర్కుల హక్కులను స్థాపించడానికి విజయవంతమైన ప్రయత్నాలపై ఆధారపడి, ద్విలింగ, లింగ మార్పిడి వ్యక్తులు ప్రస్తుతం తమ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం, దాదాపు 21 శాతం జెన రేషన్ జెడ్ – అంటే 1990ల మధ్య నుంచి 2010 మధ్య జన్మించిన వారు– తమను తాము లెస్బియన్, గే, బైసెక్సువల్ లేదా ట్రాన్్సజెండర్ (ఎల్జీబీటీ)గా గుర్తించుకుంటున్నారు. 1980ల ప్రారంభంలో, 1990ల మధ్యకాలంలో జన్మించిన ‘మిలీనియల్స్’లో ఎల్జీబీటీ సంఖ్య 10 శాతమే. జెనరేషన్ జెడ్ రాక దేశాన్ని ఇతర మార్గాల్లో కూడా ప్రభావితం చేస్తోంది. అమెరికన్లుగా ఉన్నందుకు ‘అత్యంత గర్వంగా’ భావిస్తున్నా మని చెప్పుకొనే యువకుల (18–34 ఏళ్లు) వాటా 2013లో దాదాపు 40 శాతం ఉండగా, ఇప్పుడది 18 శాతానికి పడిపోయిందని గాలప్ పోల్ వెల్లడించింది. ఈ ఏడాది, ఎల్జీబీటీ హక్కులను పరిమితం చేయడానికి ఉద్దేశించిన 75 బిల్లులు అమెరికా అంతటా చట్టసభలలో ఆమోదించబడ్డాయి. లైంగిక ధోరణి ఆధారంగా ద్వేషపూరిత నేరాలు పెరిగాయి. పైగా ప్రదర్శనలు, ప్రతి– ప్రదర్శనలు ఒక సాధారణ లక్షణంగా మారాయి. పాఠశాల, విశ్వ విద్యాలయ పాఠ్యాంశాలు కూడా రణరంగంలో చేరిపోయాయి. ‘సంస్కృతి యుద్ధాలు’ అని పిలిచే ఇవి నిజానికి మార్పుపై పోరాడటానికి సంప్రదాయవాదులు చేసిన ప్రయత్నం. వలస దారులు, స్వలింగ సంపర్కులు, మహిళలు, పేదలు, నల్లజాతీయులు, ఇతర సమూహాలకు తమ ఖర్చుతో అన్యాయమైన అధికారాలు ఇస్తు న్నందున, ఉదారవాదం యొక్క బాధితులుగా సంప్రదాయవాదులు తమను తాము అభివర్ణించుకుంటున్నారు. సందడి ఎలా ఉన్నప్పటికీ, ట్రంప్‌కు మాత్రం రహదారి క్లిష్టంగానే ఉంది. ఒక ఎన్నికల సర్వే ప్రకారం, 2016–2024 మధ్యకాలంలోని 5.2 కోట్ల మంది అదనపు ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలుస్తోంది. స్పష్టంగా, అమెరికా మార్పునకు గురవుతోంది. ఇదేమీ అసాధారణ మైనది కూడా కాదు. మితవాదుల ఆధిపత్యంలోని సుప్రీంకోర్టు వంటి సంస్థల సహాయంతో, రిపబ్లికన్లు ‘శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని’ కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. మనోజ్ జోషి వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ది ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
ప్రతినిధుల సభలో అమెరికా పౌరసత్వ చట్టం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడంతోపాటు హెచ్–1బీ వీసాల జారీలో మార్పుల కోసం ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ చట్టం–2023ను అధికార డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం 1 కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం కల్పించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, ధ్రువ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించనుంది. గ్రీన్‌కార్డ్ జారీ సులభం కానుంది. దేశాలవారీ కోటా రద్దు చేస్తారు. తక్కువ వేతనం ఇచ్చే పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా గ్రీన్‌కార్డులు సులువుగా పొందవచ్చు. హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. -
మళ్లీ ఎన్నికల బరిలోకి
వాషింగ్టన్: అసంపూర్తిగా ఉన్న బాధ్యతలను పూర్తి చేసేందుకు తనకు మరో అవకాశమివ్వాలని అమెరికా ప్రజలను అధ్యక్షుడు జో బైడెన్ (80) కోరారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన మూడు నిమిషాల వీడియోతో ఎన్నికల ప్రచారానికి ఆయన అధికారికంగా శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌నే మరోసారి తన రన్నింగ్ మేట్‌గా ఎంచుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ కి చెందిన బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత ఎక్కువ వయసున్న అధ్యక్షుడు. ఇక కమల దేశ తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్గారికార్డు సృష్టించారు. బైడెన్‌పై ట్రంప్ ధ్వజం: బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడని ట్రంప్ ఆరోపించారు. ‘‘ప్రపంచ వేదికపై దేశ పరువు ప్రతిష్టలను ఆయన పూర్తిగా మంటగలిపారు. తన చేతగానితనంతో అమెరికాను మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారు’’ అంటూ నిప్పులు చెరిగారు. బైడెన్ అధికార ప్రకటనకు కాస్త ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అఫ్గానిస్తాన్ నుంచి వైదొలగడాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించారు. రిపబ్లికన్ల అతివాదంపై పోరు 2024 ఎన్నిలను రిపబ్లికన్ల అతివాదంపై పోరుగా బైడెన్ అభివర్ణించారు. అబార్షన్ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక భద్రత చట్రం వంటివి ఎన్నికల్లో ప్రధానాంశాలన్నారు. ‘‘గత అధ్యక్ష ఎన్నికలను అమెరికా ఆత్మను పరిరక్షించేందుకు జరిగిన పోరు. అదింకా కొనసాగుతూనే ఉంది. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, హక్కులు మున్ముందు మరింత వికసిస్తాయా, కుదించుకుపోతాయా అన్నది ఇప్పుడు మనందరి ముందున్న పెద్ద ప్రశ్న. రానున్న ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిడికిలి బిగించేందుకు తరానికి ఒక్కసారే వచ్చే అవకాశం. రండి అందరమూ కలిసికట్టుగా పని పూర్తి చేద్దాం’’ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో కలసి రావాల్సిందిగా అనంతరం కమల కూడా ఒక ప్రకటనలో అమెరికన్లకు పిలుపునిచ్చారు. ‘‘దేశ చరిత్రలో ఇది అత్యంత కీలక సమయం. స్వేచ్ఛ తదితర మౌలిక హక్కులపై రిపబ్లికన్ అతివాదుల దాడి నానాటికీ పెరిగిపోతోంది. మహిళకు తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలపై హక్కులను హరించజూస్తున్నారు. ఓటు హక్కునూ వదల్లేదు. ప్రజల గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు దేశాన్ని తిరోగమనంలోకి నెట్టజూస్తున్నారు’’ అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్ ముందున్న విషయం తెలిసిందే. భారత అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి తదితరులు ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
బైడెన్ మళ్లీ పోటీ చేస్తారు: జిల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్‌లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
కన్సాస్ సెనేటర్‌గా ఉషా రెడ్డి
హూస్టన్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్ర సెనేటర్‌గా భారతీయ అమెరికన్, విద్యావేత్త ఉషా రెడ్డి (57)బాధ్యతలు చేపట్టారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఆమె 2013 నుంచి మన్çహాటన్ సిటీ కమిషన్‌గా కొనసాగుతున్నారు. మేయర్‌గా రెండుసార్లు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ చాప్టర్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. ఉషారెడ్డి 8 ఏళ్లప్పుడు ఆమె కుటుంబం ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి అమెరికా వెళ్లింది. -
US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే
ఎస్.రాజమహేంద్రారెడ్డి అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పాలకపక్షం తన ఎజెండాను బలవంతంగా తమపై రుద్దే ప్రమాదం నుంచి ప్రజలు ఒకరకంగా బయట పడ్డారనే చెప్పుకోవాలి. రాష్ట్రానికి ఇద్దరు చొప్పున వంద మంది సభ్యులుండే సెనేట్‌పై అధికార డెమొక్రాట్ పార్టీ ఒకే ఒక్క సీటు ఆధిక్యంతో పట్టు నిలబెట్టుకుంది. 435 మంది సభ్యులుండే ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్ పార్టీ 221 సీట్లలో నెగ్గి ఆధిక్యం ప్రదర్శించింది. డెమొక్రాట్లు 213 సీట్లతో సరిపెట్టుకున్నారు. అంటే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు జో బైడెన్ ఇకపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదు. ప్రజలకు నచ్చని ఏ నిర్ణయాన్నైనా రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో అడ్డుకుని తీరతారు. ఇకపై ప్రజలకు అనుకూలంగా ఉండే, వారికి లబ్ధి చేకూర్చే నిర్ణయాలే చట్టాలవుతాయి. అమలవుతాయి. కాదు, కూడదు అంటే రిపబ్లికన్ల నుంచి బైడెన్‌కు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవడం ఖాయం. నెత్తిన పాలు పోసిన ట్రంప్ ఈ మధ్యంతర ఎన్నికలకు ముందు ఎర్ర (రిపబ్లికన్ పార్టీ) గాలి కాస్త గట్టిగానే వీచింది. అది తుఫాన్‌లా మారి డెమొక్రాట్లను తుడిచిపెట్టడం ఖాయమనుకున్నారు. డెమొక్రాట్లకు సెనేట్‌లో పరాభవం తప్పదని, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోతారని పరిశీలకులు అంచనా వేశారు. బైడెన్ ఇరకాటంలో పడతారని భావించారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. డెమొక్రాట్లు ఫర్వాలేదనిపించారు. బైడెన్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదంతా బైడెన్‌పై సానుకూలత కాదని, రిపబ్లికన్లను ఇప్పటికీ శాసిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకత అని రాజకీయ పండితులు తేల్చారు. ‘అమెరికా ఫస్ట్’ అంటూ గొప్పలకు పోయిన ట్రంప్ అధ్యక్షునిగా ఉండగా ప్రదర్శించిన దూకుడు, నాలుగేళ్ల పాలనలో తీసుకున్న ఒంటెత్తు నిర్ణయాలు 2020లో ఆయన ఓటమికి దారితీయడం తెలిసిందే. ఇప్పుడు మధ్యంతరంలోనూ ట్రంప్ నీడ ఓటర్లను బాగా భయపెట్టింది. అందుకే, భారీ మెజార్టీ ఖాయమనుకున్న రిపబ్లికన్ పార్టీ కాస్తా ప్రతినిధుల సభను కేవలం అత్తెసరు ఆధిక్యంతో మాత్రమే గెలుచుకోగలిగింది. సెనేట్‌పై పట్టు బిగించడంలో విఫలమైంది. ట్రంప్‌కు రిపబ్లికన్లు ఇక స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నది పరిశీలకుల అభిప్రాయం. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిని తానేనని ఇప్పట్నుంచే బాహాటంగా చెప్పుకుంటున్న ఆయనను నిలువరిస్తేనే పార్టీ పరిస్థితి బాగుపడుతుందన్న చర్చ కూడా ఊపందుకుంది. అధికార పక్షాలకు ఎదురుగాలే...! అధికార పార్టీ మధ్యంతర ఎన్నికల్లో భారీగా సీట్లను కోల్పోయినట్టు గత రెండు ఫలితాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక మధ్యంతరంపై ప్రభావం చూపడం ఆనవాయితీగా వస్తోంది. 2014 మధ్యంతరంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో డెమొక్రాట్ పార్టీ సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ భారీగా సీట్లు కోల్పోయింది. 2018లో ట్రంప్ హయాంలో అధికార పార్టీగా రిపబ్లికన్లు సెనేట్‌లో కాస్త పర్వాలేదనిపించినా సభలో మాత్రం ఏకంగా 42 సీట్లు కోల్పోయి ఘోరంగా దెబ్బ తిన్నారు! తాజా మధ్యంతరంలోనూ రిపబ్లికన్ పార్టీ విపక్షంలో ఉండి కూడా జనాల్లో ఉన్న ట్రంప్ వ్యతిరేకత పుణ్యమా అని ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేకపోయింది!! సెనేట్ను చేజార్చుకోవడమే గాక ప్రతినిధుల సభలోనూ అత్తెసరు ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది! మన మాదిరిగా కాదు... మన దగ్గర మధ్యంతర ఎన్నికలంటే అదేదో అరుదైన విశేషంగా కనిపిస్తుంది. అంచనాలు, లెక్కలు వేగంగా మారిపోతుంటాయి. అధికార పక్షం మళ్లీ అధికారంలోకి వస్తుందా, లేక ప్రతిపక్షానికి దాసోహమంటుందా అన్నదే చర్చనీయాంశమవుతుంది. ఫలితాలను బట్టి పాలకపక్షంతో పాటు పాలకుడూ మారవచ్చు, మారకపోనూ వచ్చు. కానీ చట్టసభలో సభ్యులు మాత్రం కచ్చితంగా మారతారు. మళ్లీ గెలిచే సిట్టింగులు తప్ప మొత్తమ్మీద కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గం... ఇలా కొద్దిరోజులు హంగామా, హడావుడి ఉంటాయి. కానీ అమెరికా మధ్యంతరం మరో విధంగా ఉంటుంది. ప్రత్యక్ష విధానంలో నాలుగేళ్ల పదవీకాలానికి అధ్యక్ష ఎన్నిక జరిగిన రెండేళ్లకు వచ్చే ఎన్నికలు గనుక వీటిని మధ్యంతరం (మిడ్ టర్మ్) అంటారు. ఇందులో ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లకు, సెనేట్‌లో మొత్తం వంద స్థానాలకు గాను 35 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. మధ్యంతర ఫలితమెలా ఉన్నా ప్రత్యక్ష విధానంలో ఎన్నికైన అధ్యక్షుడు మారడు. మిగతా రెండేళ్లూ పదవిలో కొనసాగుతాడు. పాలక పక్షమూ మారదు. మంత్రివర్గమూ యథాతథంగా కొనసాగుతుంది. అధికారమైతే ఉంటుంది. కానీ చట్టసభల్లో ఆధిక్యం కోల్పోతే ఆ ప్రభావం అధికార నిర్ణయాల అమలుపై పడుతుంది. 2020లో బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టి ఈ నవంబర్‌తో రెండేళ్లవడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఒకరకంగా అధ్యక్షుని రెండేళ్ల పాలనకు రెఫరెండం వంటివి. అలాగే మిగతా రెండేళ్ల పదవీకాలంలో పనితీరు మార్చుకోవడానికి ఓ మంచి అవకాశం కూడా. అధ్యక్షునికి మరోసారి పోటీ చేసే అవకాశముంటే ఈ అనుభవం చక్కని పెట్టుబడి అవుతుంది. అమెరికాలో ఒక వ్యక్తి గరిష్టంగా రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టవచ్చన్నది తెలిసిందే. -
స్త్రీ శక్తి: మడమ తిప్పలేదు... అడుగు ఆపలేదు
పౌరహక్కుల నుంచి పర్యావరణం వరకు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. జాత్యహంకార బెదిరింపులు ఎన్ని ఎదురైనా ధైర్యమే వజ్రాయుధంగా ముందుకు కదిలారు. కొత్త అడుగుతో చరిత్ర సృష్టించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మన వాళ్ల గురించి.. అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గెలిచిన అరుణా మిల్లర్ హైదరాబాద్‌లో పుట్టింది. భారత సంతతికి చెందిన వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే మొదటిసారి. ఈ విషయంలో అరుణ చరిత్ర సృష్టించింది. మేరీలాండ్కు తొలి భారతీయ–అమెరికన్ డెలిగేట్‌గా తన ప్రత్యేకత చాటుకుంది. మిస్సోరీ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ప్లానర్‌గా, ట్రాఫిక్ ఇంజనీర్‌గా వివిధ ప్రాంతాలలో పనిచేసింది. మిస్సోరీ ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరుణ ఆరోగ్య సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ఎన్నో కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించింది. పరిమళా జయపాల్ పరిమళా జయపాల్ యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎంపికైన తొలి భారతీయ–అమెరికన్ మహిళ. తాజాగా 7వ డిస్ట్రిక్ట్(వాషింగ్టన్) నుంచి ప్రతినిధుల సభకు ఎంపికైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి క్లిఫ్‌మూన్‌పై విజయం సాధించింది. చెన్నైలో పుట్టిన పరిమళా జయపాల్ ఇండోనేషియా, మలేసియాలో పెరిగింది. తల్లి రచయిత్రి. తండ్రి మార్కెటింగ్ రంగంలో పనిచేశారు. పదహారు సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్లింది పరిమళ. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి బీఏ, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టాలు పుచ్చుకుంది. చదువు పూర్తయిన తరువాత ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌గా పనిచేసింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ముందు పౌరహక్కుల ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసింది. ‘హేట్ ఫ్రీ జోన్’ అనే సంస్థను ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. పరిమళ మంచి రచయిత్రి కూడా. ‘పిల్గ్రిమేజ్: వన్ వుమెన్స్ రిటర్న్ టు ఏ ఛేంజింగ్ ఇండియా’ అనే పుస్తకం రాసింది. ‘నువ్వు మీ దేశానికి వెళ్లి పో’ అంటూ ఆమెకు ఎన్నోసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఆమె వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. వెనక్కి తగ్గలేదు. నబీలా సయ్యద్ అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో ఇల్లినాయి జనరల్ అసెంబ్లీకి ఎన్నిక కావడం ద్వారా 23 ఏళ్ల ఇండియన్–అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన నబీలా 51వ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్పై ఘన విజయం సాధించింది. ఇల్లినాయి రాష్ట్రంలోని పాలై్టన్ విలేజ్‌లో పుట్దింది నబీలా. హైస్కూల్ రోజుల నుంచి ఉపన్యాస పోటీల్లో చురుగ్గా పాల్గొనేది. వాటి ద్వారా రకరకాల సామాజిక విషయాలను లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. కాలేజిలో ఎన్నో చర్చావేదికల్లో పాల్గొనేది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పొలిటికల్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా పుచ్చుకుంది. స్త్రీ సాధికారత, హక్కులకు సంబంధించి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనే నబీలా ఉద్యోగం కంటే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇచ్చేది. ఈ క్రమంలోనే రాజకీయాలకు దగ్గరైంది. ‘ఎమిలీస్ లిస్ట్’తో కలిసి పనిచేసింది. ఎమిలీస్ లిస్ట్ అనేది డెమోక్రటిక్ మహిళా అభ్యర్థులు చట్ట సభకు ఎన్నిక కావడానికి ఉపకరించే పొలిటికల్ యాక్షన్ కమిటీ.‘నా విజయానికి ప్రధాన కారణం తమ తరపున పోరాడే, బలంగా గొంతు వినిపించే వ్యక్తిని ప్రజలు తమ ప్రతినిధిగా చట్టసభకు పంపాలనుకోవడం. వారి నమ్మకాన్ని నిలబెడతాను’ అంటోంది నబీలా.ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టిన నబీలా తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మళ్లీ ఇంటింటికీ వెళ్లనుంది. -
తప్పిన అంచనాలు
‘డెమోక్రసీకి ఇది శుభదినం!’ అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల సరళిని చూసి, ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ చేసిన తాజా వ్యాఖ్య ఇది. అమెరికాలోని డెమోక్రసీ మాటెలా ఉన్నా, బైడెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాటిక్ పార్టీకి మాత్రం దాదాపు సార్వత్రిక ఎన్నికల లాంటి ఈ పోల్స్ కొంత శుభప్రదంగా పరిణమించాయి. భారీ ద్రవ్యోల్బణం, ప్రజల్లో బైడెన్‌పై పెరిగిన అసంతృప్తి ఆసరాగా రిపబ్లికన్ల జెండా రంగైన ‘ఎర్ర గాలి’ దేశమంతటా వీస్తుందన్న అంచనా తప్పింది. అమెరికన్ కాంగ్రెస్‌లో ఇటు ప్రతినిధుల సభలోనూ, అటు ఎగువ సభ సెనేట్‌లోనూ తిరుగులేని ఆధిక్యం తమదే అవుతుందన్న రిపబ్లికన్ పార్టీ అంచనాలను మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలు నీరుగార్చాయి. 435 మంది సభ్యుల ప్రతినిధుల సభలో 218 స్థానాల మెజారిటీకి రిపబ్లికన్లు మెల్లగా దగ్గరవుతున్నారు. సెనేట్‌లో నువ్వానేనా పోటీ నడుస్తోంది. అయితే, నేవడా, అరిజోనా రాష్ట్రాల ఫలితాల్లో తప్పని జాప్యం – డిసెంబర్ 6న జరిగే జార్జియా ఎన్నిక వల్ల పార్లమెంట్లో అంతిమ బలాబలాలు తెలియడానికి మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పోలిస్తే మధ్యంతర ఎన్నికలపై అంతర్జాతీయంగా ఏమంత ఆసక్తి వ్యక్తం కాదు. ఏ రాష్ట్రానికి ఎవరు గవర్నర్ అయ్యారు, ఎవరు సెనేటర్ అయ్యారనేది ప్రపంచానికి పెద్దగా పట్టని వ్యవహారం. కానీ, ట్రంప్ హయాం నుంచి పరిస్థితి మారింది. అయితే, మంగళవారం నాటి మధ్యంతర ఎన్నికలంతగా అందరి దృష్టినీ ఆకర్షించినవి చాలాకాలంగా మరేవీ లేవనే చెప్పాలి. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. ఆ ఎన్నికల ఫలితాలను మసిపూసి మారేడుకాయ చేశారన్న అప్పటి ట్రంప్ తప్పుడు వాదననే ఇప్పుడీ నవంబర్ 8 నాటి మధ్యంతర ఎన్నికల్లోనూ రిపబ్లికన్లు తెగ ఊదరగొట్టడం గమనార్హం. అలా చివరకు ఈ ఎన్నికలు ట్రంప్వాదపు దీర్ఘకాల మన్నికకు అగ్నిపరీక్షగా, అమెరికన్ ప్రజాస్వామ్యం ఏ మేరకు ఒత్తిడిని తట్టుకుంటుందో పరీక్షించే గీటురాయిగా మారాయి. ప్రపంచం ఆసక్తిగా చూసేలా చేశాయి. అభ్యర్థుల ఎంపికలో దూకుడు చూపిన ఎర్రరంగు రిపబ్లికన్లకూ, అధికార పీఠంపై అస్తుబిస్తు అవుతున్న నీలిరంగు డెమోక్రాట్లకూ ఈ ఎన్నికలు పాఠాలు నేర్పాయి. నిజానికి, అమెరికాలో అధ్యక్షుడి నాలుగేళ్ళ పదవీకాలంలో దాదాపు మధ్యలో జరిగే మధ్యంతర ఎన్నికలు అధికార పార్టీ, దేశాధ్యక్షుల పనితీరుపై రిఫరెండమ్ లాంటివి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన ప్రతి మిడ్‌టర్మ్ పోల్స్‌లోనూ అధికార పార్టీ సగటున 26 స్థానాలు సర్వప్రతినిధి సభలో, 4 సీట్లు సెనేట్‌లో కోల్పోతుందని లెక్క. ఆ లెక్కన అధికార డెమోక్రాట్ పార్టీకీ ఎదురు దెబ్బలు అనూహ్యమేమీ కాదు. కానీ, దిగువసభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తున్నా అంచనాలకు తగ్గట్టు భారీ సంఖ్యలో విజయాలు రాలేదు. భయపడినంత గట్టిదెబ్బ డెమోక్రాట్లకు తగలలేదు. ఇది సర్వేలు సైతం అంచనా వేయని ఆశ్చర్యకర పరిణామం. పెన్సిల్వేనియా లాంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్ల గెలుపుతో, ఫలితాలు తాము అనుకున్నదాని కన్నా మెరుగ్గా ఉన్నాయని బైడెనే ఒప్పుకున్నారు. ఇక, ట్రంప్ గట్టిగా బలపరిచిన పలువురు మితవాదులు వివిధ రాష్ట్రాల్లో ఓటమి పాలవడం విడ్డూరం. మిగిలిన బైడెన్ పదవీకాలం ఎలా గడుస్తుంది, అమెరికా రాజకీయాలపై ట్రంప్ నీడ ఏ మేరకు పరుచుకుంటుంది లాంటివన్నీ ఇక ఆసక్తికరం. మునుపెన్నడూ లేని విధంగా దేశం నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిన నేపథ్యంలో, దిగువసభలో రిపబ్లికన్ల ఆధిక్యం బైడెన్‌కు కష్టాలు తేనుంది. ఒకప్పుడు ఎరుపు, నీలం పార్టీలు రెంటికీ సమాన బలాబలాలుండి, అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచిన ఫ్లోరిడా రాష్టంలో ఇప్పుడు దాదాపు 20 శాతం పాయింట్ల పైగా భారీ తేడాతో రిపబ్లికన్ అభ్యర్థి డీశాంటిస్ గెలవడం గమనార్హం. ఆ రాష్ట్రం అంతకంతకూ ఎరుపుమయం అవుతోందనడానికి ఇది నిదర్శనం. వచ్చే అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వంలో ట్రంప్‌కు గట్టి సవాలు ఆయన నుంచే ఎదురుకావచ్చు. ఏమైనా, ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలను బట్టి ఒకటి స్పష్టమవుతోంది. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ శకం అస్వాభావికమేమీ కాదు. ఆ సంగతి గ్రహించిన అమెరికా మిత్రపక్షాలు రానున్న రోజుల్లో నాటో, ఉక్రెయిన్లకు మద్దతు లాంటి వాటిపై ఎలా వ్యవహరిస్తాయన్నదీ ఆసక్తికరమే. ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన పలువురి నేపథ్యాలు వైవిధ్యానికి ప్రతీకగా నిలవడం చెప్పుకోదగ్గ అంశం. భారత అమెరికన్లు అయిదుగురు ప్రతినిధుల సభకు ఎన్నికైతే, మేరీల్యాండ్‌కు గవర్నర్‌గా నల్లజాతీయుడు, లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు మహిళ అరుణా మిల్లర్, ఇతర రాష్ట్రాల్లో ఒక స్వలింగ సంపర్క మహిళ, ఒక ట్రాన్స్‌జెండర్ గవర్నర్లుగా గెలవడం విశేషం. వీరందరూ డెమో క్రాట్ అభ్యర్థులే కావడం గమనార్హం. ఇలాంటి పరిణామాలు బాగున్నా, అమెరికా రాజకీయాలు అంతకంతకూ రెండు విరుద్ధ వర్గాల విద్వేషంగా మారుతున్నాయనే బెంగ పుట్టిస్తోంది. ఇప్పటి దాకా దిగువ, ఎగువ సభలు రెంటిలోనూ ఆధిక్యం డెమోక్రాట్లదే. ఎన్నికల తుది ఫలితాలతో రేపు బలాబలాల్లో తేడా వస్తే బైడెన్ అజెండా భవితవ్యం ప్రశ్నార్థకమే. ప్రతినిధుల సభ పూర్తిగా రిపబ్లికన్ల చేతిలోకి వెళితే, మిగిలినవన్నీ పక్కకు పోయి బైడెన్, ఆయన కుటుంబంపై దర్యాప్తుల పరంపర మొదలవుతుంది. సెనేట్ గనక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కైవసమైతే న్యాయ నియామకాల్లోనూ అధ్యక్షుడు బైడెన్ సత్తా కుంటుపడుతుంది. వెరసి, అమెరికన్ రాజకీయాల్లో మరిన్ని మలుపులు ఖాయం. -
సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. అయితే అనుకున్న మేర ఫలితం సాధించలేకపోవడం గమనార్హం. ఈ తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేత, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచి రోజు అంటూ వ్యాఖ్యానించారాయన. ఓటర్లలో పేరుకుపోయిన నిరాశను అంగీకరించిన బైడెన్.. అధిక మెజారిటీ ద్వారా అమెరికన్లు తన ఆర్థిక ఎజెండాకు మద్దతు ఇచ్చారని చెప్పారు. ‘‘ఇది ఒక శుభదినం. బహుశా ప్రజాస్వామ్యానికి, అమెరికాకు మంచి రోజని భావిస్తున్న. రిపబికన్లదే పూర్తి హవా ఉంటుందని కొందరు అంచనా వేశారు. అది జరగలేదు’’ అంటూ వైట్ హౌజ్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారాయన. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ ఫలితాలు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 250 స్థానాలు ఆశించింది ఆ పార్టీ. పైగా ట్రంప్ వ్యక్తిగతంగా ప్రచారం చేసిన ప్రముఖులు ఓటమి చెందడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణంతో పాటు బైడెన్ ఎన్నిక చట్టబద్ధతను ప్రశ్నిస్తూ.. రిపబ్లికన్లు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. 2018 తర్వాత మొదటిసారిగా 435 మందితో కూడిన యూఎస్ హౌజ్‌ను అతిస్వల్ఫ ఆధిక్యంతో తిరిగి కైవసం చేసుకునేందుకు ట్రాక్ ఎక్కింది. వంద మంది సభ్యున్న యూఎస్ సెనేట్‌లో ఇరు పార్టీలు 48 స్థానాలు దక్కించుకున్నాయి. ఇక హౌజ్ ఆఫ్ రెప్రజెంటివ్స్లో రిపబ్లికన్ పార్టీ 207 సీట్లు, డెమోక్రటిక్ పార్టీ 183 స్థానాలు దక్కించుకున్నాయి(స్పష్టమైన ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది). గత 40 ఏళ్లలో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు అత్యుత్తమమని బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
బైడెన్ ఇజ్జత్‌కా సవాల్.. ట్రంప్‌కి తాడేపేడో!
అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలు ప్రస్తుత అధ్యక్షుడి మిగిలిన రెండేళ్ల పదవీ కాలంపై ప్రభావం చూపనున్నాయి. దేశ రాజకీయాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోకపోలేదు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్టకు పరీక్షగా మారాయి. బైడెన్‌తోపాటు మాజీ అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రచారం హోరెత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యంతర ఎన్నికలంటే? అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. కాంగ్రెస్‌లో రెండు సభలుంటాయి. అవి హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్. అధ్యక్షుడి పదవీ కాలం నాలుగేళ్లు. కాంగ్రెస్‌కు ప్రతి రెండేళ్లకోసారి.. అధ్యక్షుడి పదవీ కాలం మధ్యలో(సగం ముగిసినప్పుడు) ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర ఎన్నికలు అంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే మొత్తం సెనేటర్లు 100 మంది. వారి పదవీ కాలం ఆరేళ్లు. మొత్తం 435 మంది ప్రతినిధులు ఉంటారు. ఇక జనాభాను బట్టి రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సంఖ్య మారుతుంది. వారి పదవీ కాలం రెండేళ్లు. ప్రతినిధుల సభలోని అన్ని స్థానాలతోపాటు సెనేట్‌లో మూడొంతుల్లో ఒక వంతు స్థానాలకు (35 సీట్లు) ఎన్నికలు నిర్వహిస్తారు. అంతేకాకుండా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా ఎన్నుకుంటారు. గెలిచేదెవరో? అధికార డెమొక్రటిక్ పార్టీకి కాంగ్రెస్ ఉభయ సభల్లో గత రెండేళ్లుగా మెజారిటీ ఉంది. అందుకే జో బైడెన్ మదిలోని ఆలోచనలు సులభంగా చట్టాలుగా మారుతున్నాయి. కానీ, ప్రతిపక్ష రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్ల ఆధిక్యం స్వల్పమే. కాబట్టి మధ్యంతర ఎన్నికల్లో ఇరుపక్షాల నడుమ ఉత్కంఠభరితమైన పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు, సెనేట్‌లో డెమొక్రాట్లు పాగా వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఉండగా, కేవలం 30 స్థానాల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇక సెనేట్‌లో 35 సీట్లలో హోరాహోరీ పోరు సాగనుంది. దేశవ్యాప్తంగా అమలయ్యే చట్టాలను కాంగ్రెస్ రూపొందిస్తుంది. ఏయే చట్టాలను తీసుకురావాలో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ) నిర్ణయిస్తుంది. ఆ చట్టాలను సెనేట్ అడ్డుకోవచ్చు లేదా ఆమోదించవచ్చు. అధ్యక్షుడు తీసుకున్న నిర్ణ యాలకు సెనేట్ ఆమోద ముద్ర వేస్తుంది. అత్యంత అరుదుగా వాటిపై విచారణ కూడా జరపవచ్చు. ప్రభావితం చేసే అంశాలేమిటి? దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసలు, పెరిగిపోతున్న నేరాలు, జీవన వ్యయం వంటివి మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఉపకరించనున్నాయి. ఆగస్టులో నిర్వహించిన సర్వేలో అధ్యక్షుడు బైడెన్ పట్ల 50 శాతం కంటే తక్కువ ప్రజామోదం ఉన్నట్లు తేలింది. ఇది ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధ్యక్షుడి పనితీరును ప్రతిబింబిస్తాయి. ఈ ఫలితాలను ఆయన పాలనపై ప్రజాతీర్పుగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల పట్టు సాధిస్తే.. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంరక్షణ పథకాలు, గర్భస్రావ హక్కుల పరిరక్షణ, తుపాకీ సంస్కృతిని కట్టడి చేయడం వంటి అంశాల్లో బైడెన్ మరింత దూకుడుగా ముందుకెళ్లొచ్చు. ఏదో ఒక సభలో రిపబ్లికన్లు పైచేయి సాధిస్తే మాత్రం బైడెన్ అజెండాకు అడ్డుకట్ట తప్పదు. అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేస్తుందా? మధ్యంతర ఎన్నికల ఫలితాల ఆధారంగా.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారో ఒక అంచనాకు రావొచ్చు. రిపబ్లికన్ పార్టీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో నెగ్గకపోతే ఆయనకు అవకాశాలు తగ్గిపోతాయి. మిషిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి పెద్ద రాష్ట్రాలను డెమొక్రాట్లు నిలబెట్టుకుంటే బైడెన్ మళ్లీ అధ్యక్షుడు అయ్యే చాన్సుది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తుల్సీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు తుల్సీ(తులసి) గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. తుల్సీ గబ్బార్డ్.. అమెరికా చట్ట సభకు ఎన్నికైన తొలి హిందూ-అమెరికన్. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ కోసం యత్నించిన తొలి హిందువుగా(అత్యంత చిన్నవయస్కురాలిగా కూడా) తుల్సీ గబ్బార్డ్ చరిత్రకెక్కారు. అయితే ఆ తర్వాత వైదొలిగి జో బైడెన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఇరవై ఏళ్లుగా డెమొక్రటిక్ పార్టీతో అనుబంధం ఉన్న ఆమె.. శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా డెమొక్రటిక్ పార్టీ జాత్యహంకారం ప్రదర్శిస్తోందని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో 30 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేశారామె. Click the link to watch my full statement on why I'm leaving the Democratic Party: https://t.co/pH58rEFpmS — Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) October 11, 2022 దేశ ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను డెమొక్రటిక్ పార్టీ అణగదొక్కుతోందని, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం అనే సిద్ధాంతాన్నే తాను నమ్ముతున్నానని, కానీ, ఇప్పుడున్న డెమొక్రటిక్ పార్టీ ఈ విలువలకు కట్టుబడి లేదని ఆమె విమర్శించారు. ప్రజల విశ్వాసం, ఆధ్యాత్మికతకు డెమొక్రటిక్ పార్టీ శత్రువుగా మారింది. అమెరికా అణు యుద్ధంలోకి లాగుతోందని ఆరోపించారు. పార్టీ అవలంభిస్తున్న యాంటీ వైట్ రేసిజంను ఖండిస్తూ.. ఇకపై పార్టీలో సభ్యురాలిగా కొనసాగబోనని ఆమె ప్రకటించారు. ప్రస్తుతానికి తాను స్వతంత్రురాలినని ప్రకటించుకున్న ఆమె.. రిపబ్లికన్ పార్టీలో చేరతారా? మరేదైనా రాజకీయ వేదికను ఆశ్రయిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 41 ఏళ్ల వయసున్న తుల్సీ గబ్బార్డ్.. హవాయ్ స్టేట్హౌజ్కు ప్రతినిధిగా తన 21 ఏళ్ల వయసులోనే ఎంపికయ్యారు. హవాయ్ ఆర్మీ నేషనల్ గార్డు తరపున మెడికల్ యూనిట్లో ఇరాక్‌లో 2004-05 మధ్య, కువైట్‌లో 2008-09 మధ్య ఆమె విధులు నిర్వహించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనూ ఆమె పని చేశారు. అమెరికన్ సమోవాన్ ద్వీపమైన టుటులియాలో పుట్టి పెరిగిన గబ్బార్డ్.. సమోవాన్-యూరోపియన్ మూలాలు ఉన్న వ్యక్తి. యుక్తవయసులోనే ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. అందుకు గబ్బార్డ్ ముందర సంస్కృత పదం తులసి(తుల్సీ)ని చేర్చుకున్నారు. 2013 నుంచి 2021 మధ్య.. నాలుగు సార్లు యునైటెడ్ స్టేట్స్ హౌజ్ ఆఫ్ రెప్రెజెంటేటివ్‌గా ఆమె ఎన్నికయ్యారు. View this post on Instagram A post shared by Tulsi Gabbard (@tulsigabbard) హిందుతత్వాన్ని పుణికిపుచ్చుకున్న తుల్సీ గబ్బార్డ్.. గౌడియ వైష్ణవాన్ని అనుసరిస్తున్నారు. తనను తాను కర్మ యోగిగా అభివర్ణించుకుంటారు. భగవద్గీతను నమ్మే ఆమె.. 2013లో ప్రమాణ సమయంలో భగవద్గీత మీద ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆ భగవద్గీత కాపీనే 2014లో అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె అందించారు. 2002లో ఎడురాడో టమాయో అనే వ్యక్తిని వివాహమాడిన ఆమె.. 2006లో విడాకులిచ్చారు. ఆపై 2015లో ఫ్రీలాన్స్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ అబ్రహం విలియమ్స్‌ను శాస్త్రోతంగా వివాహం చేసుకున్నారు. గతంలో సొంత పార్టీకి చెందిన బరాక్ ఒబామా పైనా విమర్శలు గుప్పించిన ఆమె.. రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాలను కొన్నింటికి మద్దతు ప్రకటించడం గమనార్హం. -
USA: ఏడేళ్లు నివాసముంటే గ్రీన్‌కార్డు!
వాషింగ్టన్: అమెరికాలో ఉంటూ ఏళ్ల తరబడి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న 80 లక్షల మందికి శుభవార్త ఇది. వీరికి శాశ్వత నివాస హోదా కల్పించే కార్డును మంజూరు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నలుగురు సభ్యుల బృందం సెనేట్‌లో ప్రవేశపెట్టింది. ఇమిగ్రేషన్ చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ సెనేటర్లు అలెక్స్ పడిల్లా, ఎలిజబెత్ వారెన్, బెన్ రే లుజాన్, సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బన్ బుధవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని ప్రకారం.. అమెరికాలో వరుసగా కనీసం ఏడేళ్లపాటు నివాసం ఉన్న వలసదారు చట్టబద్ధమైన శాశ్వత నివాస అర్హత పొందవచ్చు. ‘గతంలో సవరించిన ఇమిగ్రేషన్ విధానం ఎందరికో ఇబ్బందికరంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. మా బిల్లులో గత 35 ఏళ్లలోనే మొదటిసారిగా రిజిస్ట్రీ కటాఫ్ తేదీని సవరించాం. దీనితో మరింతమంది వలసదారులు చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’అని సెనేటర్ పడిల్లా చెప్పారు. ‘దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉండి పనులు చేసుకుంటూ అభివృద్ధిలో తమ వంతు తోడ్పాటునందిస్తున్న లక్షలాది మంది వలసదారులు అనిశ్చితితో భయపడాల్సిన అవసరం లేకుండా ఇకపై స్వేచ్ఛగా జీవించవచ్చు’అని ఆయన అన్నారు. ‘‘ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే డ్రీమర్లు, లాంగ్ టర్మ్ వీసాదారుల సంతానం, అత్యవసర సిబ్బంది, హెచ్–1బీ వీసాలు కలిగిన అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తదితర 80 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది’’ అని వలసదారుల తరఫున పనిచేసే ఎఫ్‌డబ్ల్యూడీ డాట్ యుఎస్ అంచనావేసింది. ‘చట్టపరమైన అడ్డంకి వల్ల వలసదారులు గ్రీన్‌కార్డుకు నోచుకోలేకపోతున్నారని హౌస్ సబ్ కమిటీ సారథి లోఫ్గ్రెన్ అన్నారు. ఈ పరిణామాన్ని ఆశావహులు స్వాగతించారు. -
బైడెనే మన శత్రువు.. అమెరికా అధ్యక్షుడిపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శనివారం పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల ర్యాలీలో మాట్లాడుతూ బైడెనే మన శత్రువు అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 8న ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి ప్రజలు ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించారు. ఈ ఘటనను న్యాయానికి అపహాస్యంగా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనను లక్ష్యంగా చేసుకున్నందుకు బైడెన్ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో బైడెన్లా ఏ అధ్యక్షుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ధ్వజమెత్తారు. ఇటీవల తనను విమర్శిస్తూ బైడెన్ చేసిన ప్రసంగంపైనా ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ భాష ప్రజాస్యామ్య పునాదులను బెదిరించేలా అతివాదాన్ని ప్రతిబింబిస్తుందని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు ఇలాంటి అత్యంత దుర్మార్గపు, విద్వేషపూరిత, విభజన ప్రసంగం చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని, రాడికల్ లెఫ్టే ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు అని చెప్పారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా! -
తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం
తైపీ: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనతో రేగిన ఉద్రిక్తతలు చల్లారకమునుపే మరికొందరు అమెరికా ప్రజాప్రతినిధులు ఆదివారం అక్కడ పర్యటించారు. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరింది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా–తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరుపనుంది. ఈ బృందం ఈనెల 2వ తేదీన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ సందర్శనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గత 12 రోజులుగా తైవాన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో యుద్ధ విమానాలు, క్షిపణులు, యుద్ధ నౌకలతో విన్యాసాలు జరుపుతోంది. -
అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు గురైయ్యారు. క్యాపిటల్ హిల్ ముట్టడిని ప్రోత్సహించారంటూ అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌పై పెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. చదవండి: ట్రంప్ అభిశంసన దిశగా..! అమెరికా సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, మెజార్టీ సభ్యుల ఆమోదం తెలిపారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ అభిశంసన తీర్మానాన్ని సభ్యులు .. సెనెట్‌కు పంపనున్నారు. ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డొనాల్డ్ ట్రంప్‌పై విచారణ జరగనుంది. చదవండి: ట్రంప్ యూట్యూబ్ చానెల్ నిలిపివేత -
ట్రంప్‌పై అభిశంసన తీర్మానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ప్రతినిధుల సభలో ప్రారంభమైంది. ప్రతినిధుల సభలో 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు తీర్మానం చేశారు. అభిశంసన తీర్మానానికి 215 మందికిపైగా మద్దతు కావల్సి ఉంది. ఇక కేపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ ఉసిగొలిపారంటూ అభియోగం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను తొలగించాలని డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హౌజ్‌లో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజార్టీ ఉండగా, ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం పాసైనా సెనేట్ ఆమోదం తప్పనిసరి. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ ఉండటం గమనార్హం. చదవండి: ట్రంప్‌కు షాక్ మీద షాక్ : యూట్యూబ్ కొరడా -
అమెరికా 46వ అధ్యక్షుడు బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది. 538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బైడెన్ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ విజయం మరోమారు నిర్ధారణ అయ్యింది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు నిర్ధారణ అయితే తప్ప వైట్ హౌస్‌ని ఖాళీచేయనని కరాఖండీగా చెప్పిన ట్రంప్ శ్వేత సౌధాన్ని వీడే రోజొచ్చింది. దీంతో జోబైడెన్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు అత్యంత కీలకమైన అడుగు ముందుకు పడినట్లయ్యింది. ఫలితాలు తారుమారవుతాయని భావించిన ట్రంప్ అభిప్రాయం తల్లకిందులయ్యింది. రాజ్యాంగం, రూల్ ఆఫ్ లా, ప్రజాభీష్టం మరోమారు రుజువయ్యిందని జోబైడెన్ తన నివాసం నుంచి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే ప్రజాస్వామ్యమనే దీపాన్ని వెలిగించారు. ప్రతి అమెరికా పౌరుల హృదయాల్లోకి ప్రజాస్వామ్యం అనే పదం చేరిపోయింది. ఏ మహమ్మారీ, ఎంతటి అధికార దుర్వినియోగం ఆ దీపాన్ని ఆర్పలేవు. ఈ యుద్ధంలో అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది. అమెరికా ఐక్యత కోçసం ఇక పేజీ తిప్పేయాల్సిందే’’ అని జో బైడెన్ అన్నారు. 8.1 కోట్ల మంది వోటర్లు ఓట్లు వేశారు. ఈ స్థాయిలో ఓట్లు రావడం అమెరికా చరిత్రలో తొలిసారి. తాను అమెరికా ప్రజలందరికీ అధ్యక్షుడిగా ఉంటానని, ఓట్లు వేయని వారికోసం మరింత శ్రమిస్తానని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే 2016లో డొనాల్డ్ ట్రంప్, పెన్స్‌లకు కూడా బైడెన్‌కి, కమలా హారిస్‌కి వచ్చిన 306 ఓట్లే వచ్చాయి. మహమ్మారి విజృంభిస్తోన్న ఈ విషాద శీతాకాలాన నా హృదయం మీ అందరి కోసం తపిస్తోంది. మీకు అత్యంత ఆప్తులైన వారు లేకుండా, నూతన సంవత్సరాన్నీ జరుపుకోబోతున్నారు’’ అని కోవిడ్ మృతుల కుటుంబాలకు బైడెన్ సంతాపాన్ని వ్యక్తం ప్రకటించారు. -
‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!
యూఎస్‌కు అధ్యక్షుడిగా... విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నా. దేశాన్ని రెడ్ స్టేట్స్ (రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్ (డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యత రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిగా ఉంటా. ట్రంప్‌ను ఉద్దేశించి... మీ నిరుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓటమి బాధ నాకు కూడా అనుభవమే. ఇప్పుడు అమెరికాకు అయిన గాయాన్ని కలసి మాన్పుదాం. అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం. కరోనాపై యుద్ధం... కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, ఆరోగ్యాన్ని, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే, జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని నన్ను ఎన్నుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. వాషింగ్టన్: అమెరికాలో కొనసాగుతున్న రాక్షస పాలనకు తక్షణమే అంతం పలకాలనుకుంటున్నానని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షుడు, తాజా ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా ఎదుర్కొంటున్న బాధాకరమైన చీకటి సమయం అంతం కావడం ప్రారంభమైందని పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం శనివారం డెలావర్‌లోని సొంత పట్టణం విల్మింగ్టన్లో అభిమానులను ఉద్దేశించి బైడెన్ విజయోత్సవ ప్రసంగం చేశారు. ‘విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాను. దేశాన్ని రెడ్ స్టేట్స్(రిపబ్లికన్ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్(డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిగా ఉంటాను’ అని బైడెన్ దేశ పౌరులకు హామీ ఇచ్చారు. దేశంలో కోవిడ్–19ను నియంత్రించడమే అధ్యక్షుడిగా తన తొలి లక్ష్యమని పేర్కొన్నారు. అందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తానన్నారు. ‘ఈ బైడెన్–హ్యారిస్ కోవిడ్ ప్లాన్‌ను రూపొందించి, అమలు చేసేందుకు సోమవారం శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాను’ అని వివరించారు. పూర్తి శాస్త్రీయతతో ఆ ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను అత్యంత విస్తృతమైన, విభిన్నమైన వర్గాల నుంచి ఓట్లను పొందానన్నారు. ‘నాపై మీరు చూపిన విశ్వాసానికి రుణపడి ఉంటాన’న్నారు. ‘ఈ దేశ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తమ ఆకాంక్షలను నిర్ద్వంద్వంగా తమ తీర్పు ద్వారా వెలిబుచ్చారు. ఒక ఘన విజయాన్ని అందించారు’ అని బైడెన్ పేర్కొన్నారు. 1988, 2008 సంవత్సరాల్లో కూడా బైడెన్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. ‘అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. కానీ, అమెరికా అధ్యక్షుడిగా నేను నాకు ఓటు వేసిన వారికోసం, ఓటు వేయని వారి కోసం కూడా పని చేస్తాను’ అని స్పష్టం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించలేదు. పెన్సిల్వేనియా సహా కీలక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు వేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పెన్సిల్వేనియాలో గెలుపుతో సాధించిన 20 ఎలక్టోరల్ ఓట్ల కారణంగానే బైడెన్ మెజారిటీకి అవసరమైన 270 ఓట్ల మేజిక్ మార్క్‌ను చేరుకున్న విషయం తెలిసిందే. ట్రంప్, ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ నిరుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓటమి బాధ నాకు కూడా అనుభవమే. ఇప్పుడు అమెరికాకు అయిన గాయాన్ని కలిసి మాన్పుదాం’ అని బైడెన్ పేర్కొన్నారు. ‘అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘మనం శత్రువులం కాదు.. ఒకే దేశస్తులం. అమెరికన్లం’ అని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, మీ కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, ప్రజలందరికీ సమన్యాయం లభించే, వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని కోరుతూ నన్ను ఎన్నుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను’ అని బైడెన్ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రపంచమంతా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోందని, ప్రపంచానికి అమెరికా దిక్సూచి అని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తనయుడికి ఇష్టమైన కేథలిక్ గీతంతో.. తన విజయోత్సవ ప్రసంగాన్ని చనిపోయిన తన కుమారుడు ‘బ్యూ’కు ఇష్టమైన కేథలిక్ గీతంతో బైడెన్ ముగించారు. ‘ఆన్ ఈగిల్స్ వింగ్స్’ అనే ఈ గీతం కోవిడ్–19 కారణంగా తమవారిని కోల్పోయిన ఎందరో అమెరికన్లను ఓదారుస్తుందని భావిస్తున్నానన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో ఈ గీతం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని వివరించారు. జాన్ ఎఫ్ కెనెడీ తరువాత అమెరికా అధ్యక్షుడు అవుతున్న కేథలిక్.. బైడెనే కావడం విశేషం. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా బ్యూ 2015లో చనిపోయారు. గాయాలను బైడెన్ మాన్పగలరు అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నిౖకైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కమల హ్యారిస్ మాట్లాడుతూ.. ‘మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అన్నారు. సమర్థ నాయకురాలు కమల హ్యారిస్ వంటి సమర్ధురాలు ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై తాను గర్విస్తున్నట్లు బైడెన్ తెలిపారు. ‘కమల హ్యారిస్‌తో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. ఆమె ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన.. తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళగా, దక్షిణాసియాకు చెందిన మూలాలున్న తొలి వ్యక్తిగా, వలసదారుల కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు’ అని ప్రశంసించారు. ఇప్పుడు బైడెన్ కుటుంబంలో కమల కూడా భాగమయ్యారన్నారు. త్వరలో రంగంలోకి బైడెన్ టీమ్స్ బైడెన్ ప్రమాణ స్వీకారం ముందే పని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పనితీరును సమీక్షించేందుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన బడ్జెట్, ఉద్యోగులు, వివాదాలు, ఇతర నిర్ణయాలను ఈ బృందాలు సమీక్షిస్తాయి. అధికార మార్పిడి సమయంలో పాలనావ్యవహారాలు కుంటుపడకుండా, సజావుగా మార్పిడి జరిగేలా చూస్తాయి. కీలక స్థానాల్లో ఉద్యోగుల బదిలీలతో పాటు, అవసరమైన చోట కొత్త ఉద్యోగుల నియామకాలను పర్యవేక్షిస్తాయి. అలాగే, ఈ విధుల పర్యవేక్షణకు ‘బిల్డ్బ్యాక్బెటర్.కామ్’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. బైడెన్ కమిటీలో భారతీయుడు! కొత్త అధ్యక్షుడు బైడెన్ ఏర్పాటు చేయనున్న కరోనా నియంత్రణ కమిటీలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తికి చోటు లభించే చాన్సుంది. కర్ణాటకకు చెందిన వివేక్త్ కుటుంబం చాలా ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడింది. ఒబామా హయాంలో సర్జన్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. విల్మింగ్టన్ విజయోత్సవ వేడుకలో వేదికపై కమలా హ్యారిస్ దంపతులు, బైడెన్ దంపతులు విల్మింగ్టన్లో డెమొక్రటిక్ పార్టీ విజయోత్సవ వేడుకల దృశ్యం -
బైడెన్‌కే పట్టాభిషేకం
-
చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: చాలామంది భారతీయుల ఎదురు చూపులు ఫలించాయి. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంటే కమలా హ్యారిస్ కొత్త చరిత్ర సృష్టించినట్లే. ఆమె ఇంతకుముందే ఎన్నో ఘనతలు సాధించారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ► కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఒక్లాండ్‌లో జన్మించారు. ► ఆమె తల్లి తమిళనాడులోని సంప్రదా య కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. ► వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. ► యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. ► అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. ► కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్ర టిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. -
యువ సెనేటర్ నుంచి వృద్ధ ప్రెసిడెంట్ దాకా..
వాషింగ్టన్: ఐదు దశాబ్దాలుగా అమెరికా రాజకీయాల్లో కొనసాగుతున్న జో బైడెన్(77) కల ఎట్టకేలకు నెరవేరింది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డొనాల్డ్ ట్రంప్‌పై ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్నారు. అమెరికా చరిత్రలో పిన్నవయస్కులైన సెనేటర్లలో ఒకడిగా రికార్డు సృష్టించిన బైడెన్ ఇప్పుడు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మరో రికార్డు నెలకొల్పబోతున్నారు. ఆయన గతంలో ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1988, 2008లో అధ్యక్ష పదవి కోసం పోటీపడినప్పటికీ డెమొక్రటిక్ పార్టీలోనే విజయం సాధించలేకపోయారు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ► జో బైడెన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన అసలు పేరు జో రాబినెట్ బైడెన్ జూనియర్. ► యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు. ► 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. ► మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. ► దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు. ► సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా ఆయన అప్పట్లో పేరుగాంచారు. ► 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్ మొదటి భార్య, 13 నెలల వారి కుమార్తె నవోమీ మరణించారు. ► బైడెన్ 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ► వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. ఒక కుమారుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించాడు. -
అమెరికా: బైడెన్‌కే పట్టాభిషేకం
వాషింగ్టన్: అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్(77)నే చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డుసృష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలోని 538ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ ఖాతాలో జమయ్యాయి. జార్జియా(16,) నార్త్ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి. ‘జోసెఫ్ ఆర్.బైడెన్ జూనియర్ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆరి్థక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ హయాంలో వైట్ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు జో బైడెన్ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గోల్ఫ్ క్లబ్‌కు ట్రంప్ ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలంటూ పలు ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కథ ముగిసిట్లేనని భావిస్తున్నారు. శనివారం ట్రంప్..వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లిపోయారు. ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్. బుష్ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే. బోసిపోయిన వైట్‌హౌస్ ఎన్నికల ఫలితాల ప్రభావం అధ్యక్షభవనంపై పడింది. సాధారణంగా అక్కడ కనిపించే హడావుడి ఒక్కసారిగా మాయమైంది. శ్వేతసౌధం లాన్లలో మాత్రమే కొద్దిపాటి మీడియా సిబ్బంది కనిపించారు. బైడెన్ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్‌తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తదితరులు బైడెన్, కమలాహ్యారిస్లను అభినందించారు. ఎన్నికల్లో అక్రమాలంటూ మరోసారి ట్రంప్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శనివారం మరోసారి ట్రంప్ ఆరోపణలు చేశారు. ‘పెన్సిల్వేనియా లాంటి చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి మా పరిశీలకులను రానివ్వలేదు. లోపల ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీల్లేకుండా చేశారు. జరక్కూడనివి జరిగిపోయాయి. చట్టబద్ధమైన పారదర్శకత కనిపించలేదు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు’అని పేర్కొన్నారు. వాస్తవానికి భారీ మెజారిటీతో మేమే ఈ ఎన్నికల్లో గెలిచాం అంటూ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్ష పదవి తనదే నంటూ జోబైడెన్ చెప్పుకోవడం తప్పు. అలా నేను కూడా చెప్పుకోగలను. ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో వేసిన పిటిషన్లపై ఇప్పుడిప్పుడే ప్రొసీడింగ్ మొదలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లను స్వీకరించారన్నారు. ట్రంప్ ట్వీట్లను ట్విట్టర్ సంస్థ ఫ్లాగ్ చేసి చూపింది. వాషింగ్టన్లో వైట్‌హౌస్ వద్ద సంబరాలు -
అడుగు దూరం.. దూసుకెళ్తున్న బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ (77) మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన గెలుపు ఇక లాంఛనమే కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రవారం వెలువడిన ఫలితాలను బట్టి ఇక్కడ బైడెన్‌ది పైచేయిగా ఉంది. జార్జియాలో 50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ట్రంప్ ఉండగా, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక్కడ బైడెన్ 1,579 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అదేవిధంగా, పెన్సిల్వేనియాలో ట్రంప్ కంటే బైడెన్ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా బుధవారం వరకు ట్రంప్ 70 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉండటం గమనార్హం. నెవడాల్లోనూ బైడెన్ హవానే కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాలను బట్టి బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను 270 ఓట్లు సాధించిన వారికే అధ్యక్ష పీఠం దక్కనుంది. జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఓటమి పాలైతే మళ్లీ ఎన్నికయ్యేందుకు ట్రంప్‌కు దారులు మూసుకుపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు 41 లక్షల ఓట్లు అంటే 1.3 శాతం ఓట్లు అధికంగా పడ్డాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో ఇంకా 60 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున బైడెన్ ఆధిక్యం మరింతగా పెరిగేందుకు అవకాశాలున్నాయని వాషింగ్టన్ పోస్ట్ అంచనా వేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని, వాటిని తట్టుకునేందుకు కొంచెం ఓపిక అవసరమవుతుందని విజయానికి చేరువలో ఉన్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. బైడెన్‌కు సీక్రెట్ సర్వీస్ రక్షణ ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్ సర్వీస్ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుంచే బైడెన్ వెంట సీక్రెట్ సర్వీస్ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా అంటోంది. ఎన్నికల రోజున బైడెన్ వాహన కాన్వాయ్కి కూడా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రతా విభాగం స్పందించడం కాస్త ఆలస్యమైనా ఈ పరిణామాన్ని తాము ముందుగానే ఊహించామని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నప్పటికీ వెంటనే ట్రంప్ ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. కాగా, పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నెవడాల్లో పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ అనుచరులు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ పరిణామాలపై బైడెన్ ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జూలై 19న మేం చెప్పిన విధంగానే, అమెరికా ప్రజలు ఈ ఎన్నికల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్ష భవనంలో దొంగచాటుగా తిష్ట వేసే వారిని అడ్డుకునే సమర్థత అమెరికా ప్రభుత్వానికి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. 120 ఏళ్లలో అత్యధిక ఓటింగ్ ఈ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత 120 ఏళ్ల రికార్డులన్నీ తిరగరాసేలా ఓటర్లు తమ ఓటు హక్కు విని యోగించుకున్నట్టు అమెరికా ఎలక్షన్ ప్రా జెక్టు వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 16 కోట్ల మంది ఓటు వేశారు. 1900 ఎన్నికల తర్వా త ఈ స్థాయిలో ఓటర్లు తమ హక్కుని విని యోగించుకోవడంఇదే తొలిసారి. జార్జియాలో రీకౌంటింగ్ ట్రంప్, బైడెన్ల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో జార్జియాలో రీకౌంటింగ్ చేపట్టనున్నారు. ఇక్కడ బైడెన్‌కు 1,579 ఓట్ల స్వల్ప మెజారిటీ లభించినా ఇద్దరు అభ్యర్థులకు చెరో 49.4 శాతం ఓట్లు పడ్డాయి. మరో 4,169 ఓట్లను లెక్కించాల్సి ఉంది. జార్జియా చట్టాల ప్రకారం ఇద్దరు అభ్యర్థుల ఓట్లలో 0.5 శాతం ఓట్ల తేడా ఉంటే వారి కోరిక మేరకు రీకౌంటింగ్ జరపొచ్చు. రిపబ్లికన్ పార్టీ కంచుకోటగా ఉన్న జార్జియాలో సైనిక సిబ్బంది, ఇతరుల ఓట్లు మరో 9వేల వరకు రావాల్సి ఉన్నందున ఫలితాలపై ప్రభావం చూపొచ్చు. గతంలో ఇక్కడ జరిగిన రీ కౌంటింగ్‌తో ఫలితాలు మారలేదనీ, తాజా రీకౌంటింగ్తో కొత్త పరిణామాలకు తావుండదని భావిస్తున్నారు. అంతా గందరగోళం అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు ఏ రాష్ట్రంలో ముందంజలో ఉన్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అక్కడ మీడియా సంస్థలే. ఒక్కో చానెల్ ఒక్కో అంకెలు చూపిస్తూ ప్రపంచ దేశాల ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. అసోసియేట్ ప్రెస్, ఫాక్స్ న్యూస్ బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారని, మేజిక్ ఫిగర్ 270కి ఆరు ఓట్లు దూరంలో ఉన్నారని చెబుతున్నాయి. ఇక మిగిలిన మీడియా బైడెన్‌కి 253 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్టుగా చెబుతున్నాయి. 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా రాష్ట్రం విషయంలో ఏర్పడిన గందరగోళం ఎన్నికల తీరుతెన్నుల్ని అర్థం చేసుకోలేనట్టుగా మారింది. అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంçస్థ లేదు. అమెరికాలో ఏ ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ఎన్నికల నిర్వహణ బాధ్యతని తీసుకుంటాయి. ఈ సారి కరోనా ప్రభావంతో 68% ఓట్లు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ రూపంలో వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలంటే ఓటరు సంతకం, సాక్షి సంతకాలు, చిరునామా కచ్చితంగా పరిశీలించాలి. ఆ తర్వాత కౌంటింగ్ మిషన్లలో సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతోంది. ఫీనిక్స్‌లో ట్రంప్, బైడెన్ మద్దతుదారుల వాగ్వాదం పొమోనాలో ఇంకా లెక్కించాల్సిన సంచులకొద్దీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు -
అడుగు దూరంలో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. దేశాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని స్పష్టంగా తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది. అయితే, మేజిక్ మార్క్ 270కి అత్యంత చేరువలోకి వచ్చిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం లాంఛనమేనని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు, కౌంటింగ్ కొనసాగుతున్న పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నందున తుది ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బృందం ఆశాభావంతో ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 264 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అడుగు దూరంలో నిలిచారు. మేజిక్ మార్క్ 270 కి ఆయన కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమైన విస్కాన్సిన్, మిషిగాన్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బైడెన్‌కు అనుకూలించింది. మరోవైపు, ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఫినిషింగ్ లైన్‌కు చాలా దూరంలో ఉన్నారు. కానీ, ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాలు తన ఖాతాలోనే పడుతాయని, దాంతో విజయం తనకే దక్కుతుందని ట్రంప్ నమ్మకంతో ఉన్నారు. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరొలినా, నెవడా, అలస్కాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. 11 అరిజోనా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా ఫలితాన్ని పలు మీడియా సంస్థలు ఇంకా నిర్ధారించలేదు. ‘సీఎన్ఎన్’ సంస్థ అరిజోనాను మినహాయించి బైడెన్ సాధించిన ఎలక్టోరల్ ఓట్లు 255 అని పేర్కొంది. అరిజోనాలో కౌంటింగ్ ముగియలేదని, 86% కౌంటింగ్ అనంతరం, బైడెన్ 68 వేల మెజారిటీతో ఉన్నారని పేర్కొంది. కానీ, మెజారిటీ మీడియా సంస్థలు మాత్రం అరిజోనాను బైడెన్ ఖాతాలో వేసి, ఆయన గెల్చుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 264 అని పేర్కొన్నాయి. పెన్సిల్వేనియా.. జార్జియాలో.. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో 91% ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ట్రంప్ 1,35,671 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ 71% పోస్టల్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇంకా, 7.63 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలాగే, నార్త్ కరోలినాలో 95% కౌంటింగ్ ముగిసిన తరువాత ట్రంప్‌నకు 77,337 ఓట్ల మెజారిటీ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 15. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో 96% కౌంటింగ్ అనంతరం ట్రంప్ మెజారిటీ 18,586కి తగ్గింది. ఇక్కడ ఇంకా 90, 735 ఓట్లను లెక్కించాల్సి ఉంది. 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవడాలో 86% కౌంటింగ్ తరువాత బైడెన్ 8వేల స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. తాను ఆధిక్యతలో ఉన్న రాష్ట్రాలతో పాటు, బైడెన్ ఆధిక్యతలో ఉన్నవాటిలో ఒక్క రాష్ట్రాన్నైనా చేజిక్కించుకుంటే.. ట్రంప్‌నకు విజయం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం దక్కని పక్షంలో.. కోర్టులో తన పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగానే, ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఆయన కేసులు వేశారు. కౌంటింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థించారు. ఈ దిశగా సుప్రీంకోర్టులోనూ ఆయన కేసు వేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, తాము రేసులోనే ఉన్నామని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రొన్నా మెక్‌డేనియల్ చెప్పారు. ‘ఈ వారాంతానికి ఈ దేశానికి అధ్యక్షుడుగా మరో నాలుగేళ్లు ట్రంపే ఉంటారని స్పష్టమవుతుంది’ అని ట్రంప్ ప్రచార బృందంలోని జేసన్ మిల్లర్ వ్యాఖ్యానించారు. ‘కౌంటింగ్ మొత్తం ముగిసి, పూర్తి ఫలితాలు వెలువడిన తరువాతనే నేను విజేతగా భావిస్తాను. అమెరికా అధ్యక్షుడిగా నిష్పక్షపాతంగా నేను వ్యవహరిస్తాను’ అని బుధవారం బైడెన్ వ్యాఖ్యానించారు. విస్కాన్సిన్లో ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో తేడా 1 శాతం లోపే ఉంది. అందువల్ల రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసే చట్టబద్ధ అవకాశం ట్రంప్‌నకు ఉంది. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశం తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. మిషిగన్‌లో కౌంటింగ్ నిలిపేయాలని ట్రంప్ ప్రచార బృందం స్థానిక కోర్టులో కేసు వేసింది. కోర్టులో తొలి విజయం ఎన్నికల వివాదాల్లో ట్రంప్ తొలి విజయం సాధించారు. ‘పరిశీలకులను ఆరు అడుగుల లోపు నుంచి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు అనుమతించాలి’ అని పెన్సిల్వేనియాలోని కామన్వెల్త్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పు వచ్చిన వెంటనే.. ‘పెన్సిల్వేనియాలో న్యాయపరంగా భారీ విజయం’ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ను కూడా పరిశీలిస్తామని పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార మేనేజర్ స్టెపిన్ తెలిపారు. షికాగోలో బైడెన్ మద్దతుదారుల నిరసన -
చరిత్ర సృష్టించిన జో బైడెన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. కేవలం విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్. విజయంపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికి బైడెన్ ఓ రికార్డు నెలకొల్పారు. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సంపాదించిన అధ్యక్ష అభ్యర్థిగా అగ్ర స్థానంలో నిలిచారు. ( యూఎస్ ఎలక్షన్స్: గెలిచిన కరోనా మృతుడు ) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నెలకొల్పిన రికార్డును తిరగరాశారు. 2008 ఎన్నికల్లో ఒబామా 66,862,039 సాధించగా.. ప్రస్తుతం బైడెన్ 72,048,770 సాధించారు. అయితే ఓటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కానీ నేపథ్యంలో ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ( అమెరికా ఎన్నికలు: మేయర్‌గా ఎన్నికైన కుక్క..) పలువురు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు, వారు సాధించిన ఓట్లు : -
ఆ విజయం నా ఒక్కడిదే కాదు: బైడెన్
వాషింగ్టన్ : ‘‘మనం విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది. ఆ విజయం నా ఒక్కడిదే కాదు. అది అమెరికా ప్రజల విజయం’’ అని డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అన్నారు. తన విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. అనంతరం మరో ట్వీట్ చేశారు ‘‘ ఎన్నికల ఫలితాలను డొనాల్డ్ ట్రంప్ కానీ.. నేను కానీ, నిర్ణయించలేము. అమెరికా ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు. అందుకే మేము బైడెన్ ఫైట్ ఫండ్‌ను తీసుకొచ్చాం. ప్రతీ ఓటు పరిగణలోకి వస్తుంది. ఫండ్‌ను దేశవ్యాప్తంగా ఎన్నికల పరిరక్షణ చర్యలకోసం వినియోగిస్తాం ’’ అని పేర్కొన్నారు. ( విజయానికి ఆరు ఓట్ల దూరంలో..) కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్ ఓట్లను బైడెన్ సొంతం చేసుకున్నారు. మరో 6 ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే ఆయన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంటారు. ట్రంప్ అధ్యక్ష పదవి రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్నారు. 214 ఓట్ల వద్దే ఆగిపోయారు. కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తవడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో బైడెన్ విజయంపై స్పష్టత రావటానికి మరింత సమయం పట్టనుంది. -
విజయానికి ఆరు ఓట్ల దూరంలో..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరుకు తెరపడింది. విజయ బావుటా ఎగరవేయటానికి జో బైడెన్ అత్యంత సమీపంలో ఉన్నారు. ఆరు ఎలక్టోరల్ ఓట్లు సొంతమైతే మ్యాజిక్ ఫిగర్‌ను ఆయన చేరుకుంటారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడవుతారు. ఇప్పటివరకు బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. ట్రంప్ 214 ఓట్లు సాధించారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో గెలుపెవరిదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ( బైడెన్ వైపే ముస్లింలు..) అయితే జార్జియాలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును అడ్డుకోవటానికి ట్రంప్ న్యాయపోరాటానికి దిగుతున్నట్లు సమాచారం. ఎన్నికల రోజు రాత్రి 7 గంటల లోపు అందుకున్న బ్యాలెట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిందిగా జార్జియా చట్టాలు చెబుతున్నాయని రిపబ్లికన్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు కోర్టులో కేసు వేస్తున్నారట. దీనిపై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో చెప్పలేం. జార్జియా చట్టాల్లో మార్పు చేసి, బ్యాలెట్ ఓట్ల అనుమతి గడవును పెంచాలని గతంలో డెమొక్రాటిక్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో రిపబ్లికన్ పార్టీ గెలుపు సాధించింది. -
యూఎస్ ఎలక్షన్స్: చరిత్ర సృష్టించిన నల్లజాతి గే
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్‌ను ఓడించాడు. నేటి నుంచి కొత్త శకం మొదలవుతుందని టోరెస్ వ్యాఖ్యానించాడు. తన గెలుపు పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తాను ఆఫ్రో–లాటినో అని టోరెస్ తరచూ చెబుతుంటాడు. ( భారత సంతతి విజేతలు ) 2013 నుంచి సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. అలా మాండెయిర్ జోన్స్(33) అనే మరో నల్లజాతి గే కూడా వెస్ట్చెస్టర్ కౌంటీ నుంచి పోటీ చేశాడు. ఫలితాన్ని ఇంకా వెల్లడించకపోవడంతో అతడు గెలిచాడా లేదా అనే తెలియరాలేదు. ఒకవేళ గెలిస్తే అమెరికా కాంగ్రెస్‌లో ఇద్దరు నల్లజాతి స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అవుతుంది. సామాజిక వివక్షను తట్టుకొని, ప్రజల మద్దతు పొంది, నల్లజాతి స్వలింగ సంపర్కులు పార్లమెంట్లో అడుగుపెడుతుండడం శుభపరిణామమని ప్రజాస్వామ్య ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భారత సంతతి విజేతలు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ సంతతి అభ్యర్థులు నలుగురు మళ్లీ విజయం సాధించారు. డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తిలు డెమొక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ పడిన విషయం తెలిసిందే. అమెరికా ఎన్నికల చరిత్రలో భారతీయ అమెరికన్ల ప్రభావం అత్యధికంగా కనిపించిన ఈ ఎన్నికలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ నిపుణుల అభిప్రాయం. ఈ కారణం గానే అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్లు కూడా ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ అమెరికన్లను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డారనడం అతిశయోక్తి కాదు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల ప్లారిడా, జార్జియా, మిషిగన్, నార్త్ కారొలీనా, పెన్సిల్వేనియా,టెక్సాస్లతోపాటు అమెరికా మొత్తమ్మీద సుమారు 18 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. భారతీయ అమెరికన్ ప్రజా ప్రతినిధుల సమూహానికి ‘సమోసా కాకస్’అని సెనేటర్ రాజా కృష్ణమూర్తి పేరుపెట్టగా ఈ సారి ఈ సమూహం బలం మరికొంత పెరిగే అవకాశం ఉంది. అరిజోనాలోని ఆరవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత సభ్యుడు డేవిడ్ ష్కెవెకెర్ట్పై భారతీయ సంతతి వైద్యురాలు డాక్టర్ హీరల్ టిపిమేని ఆధిక్యంలో ఉండటం ఇందుకు కారణం. టిపిమేని (52) ఎన్నికైతే ప్రమీలా జయపాల్ తరువాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నిౖకైన రెండవ భారతీయ సంతతి మహిళా ప్రతినిధి అవుతారు. సమోసా కాకస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు ఉండగా వీరిలో నలుగురు హౌస్ ఆప్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధు లు కాగా... మిగిలిన ఒక్కరు డెమొక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సెనేటర్ కమలా హ్యారిస్. ఇల్లినాయిలోని ఎనిమిదవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 47 ఏళ్ల రాజా కృష్ణమూర్తి 1973లో న్యూఢిల్లీలో జన్మించారు. 2020 ఎన్నికల్లో లిబరిటేరియన్ పార్టీ అభ్యర్థి ప్రెస్టన్ నెల్సన్‌ను సులువుగా ఓటమిపాలు చేశారు. కడపటి వార్తలు అందే సమయానికి రాజా కృష్ణమూర్తి మొత్తం పోలైన ఓట్లలో 71 శాతం సాధించారు. రోహిత్ ఖన్నా లేదా సంక్షిప్తంగా రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్‌కు 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో 1976లో జన్మించిన రోహిత్ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, భారతీయ సంతతికి చెందిన రితేశ్ టాండన్‌పై విజయం సాధించారు. సమోసా కాకస్‌లో సీనియర్ అయిన 55 ఏళ్ల డాక్టర్ అమిరేష్ బాబులాల్ బేరా కాలిఫోర్నియాలోని ఏడవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుస్తూ వస్తున్నారు. 2013, 2014, 2016, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన అమీ బేరా తాజాగా రిపబ్లికన్ అభ్యర్థి బజ్ పాటెర్సన్పై 25 శాతం కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. టెక్సాస్‌లోని ఇరవై రెండవ కాంగ్రెగేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన శ్రీ ప్రెస్టన్ కుల్కర్ణి డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రిపబ్లికన్ల అభ్యర్థి ట్రాయ్ నెల్స్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. రిపబ్లికన్ల అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన మంగ అనంతాత్ముల (వర్జీనియా) కూడా డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కానొలీ చేతుల్లో పరాజయం పాలయ్యారు. వీరే కాకుండా రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన మరో భారతీయ సంతతి అభ్యర్థి నిశా శర్మ కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి మార్క్ డిసాల్నీర్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. అమెరికా పార్లమెంటరీ వ్యవస్థలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనేది దిగువ సభ కాగా.. సెనేట్ ఎగువ సభ అన్నది తెలిసిందే. -
ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం : జో బైడెన్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తోంది. మరి కొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో మేం గెలుస్తాం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఇప్పటికే గెలిచారని తెలిపారు. మిషిగాన్, విస్కాన్సిన్‌లోనూ తామే గెలుస్తామన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆధిక్యతలు తగ్గిపోతాయన్నారు. మెట్రోలు, పట్టణాల్లో తమకు భారీగా ఓట్లున్నాయన్నారు. ప్రచారానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. డెమొక్రాట్లు ఆశాభావంతో ఉండాలని, తామే గెలువబోతున్నామని పేర్కొన్నారు. ( అమెరికా ఎన్నికలు; జూనియర్ ట్రంప్ కలకలం ) కాగా, ఇప్పటివరకు బైడెన్ 237, ట్రంప్ 210 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. బైడెన్ ఆధిక్యంలో ఉన్నప్పటికి పెద్ద రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ కొనసాగితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువ. 288 ఎలక్టోరల్ ఓట్లు సాధించే దిశగా ట్రంప్ అడుగులు ముందుకు వేస్తున్నారు. ( అమెరికా ఎన్నికలు: మరోసారి అధ్యక్ష పీఠం దిశగా ట్రంప్ ) -
అమెరికా ఎన్నికలు: మారుతున్న ఓటర్ల మూడ్
ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారో తేలే సమయం ఆసన్నమైంది. ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే నిర్ణయాధికారం ఎవరికి అప్పగించాలో తేల్చి చెప్పే అతి పెద్ద ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తోంది. అమెరికా అధ్యక్ష బరిలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, మాజీ ఉపాధ్యక్షుడు డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఢీ అంటే ఢీ అంటున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కోట్లాది మంది ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ అసలు సిసలు సంగ్రామానికి తెరలేచే సమయం ఆసన్నమైంది. మంగళవారం నాడు జరిగే ఎన్నికల్లో ఎవరిది పై చేయి కాబోతోంది ? అమెరికన్ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అందరిలోనూ అదే ఉత్కంఠ... స్వింగ్ భళా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల్లో ఓటరు ఎటు వైపు మొగ్గుతారన్నదే అత్యంత కీలకం. 2016 ఎన్నికల తరహాలో పాపులర్ ఓట్లు సాధించలేకపోయినా, స్వింగ్ రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లతో గట్టెక్కగలనన్న ధీమా అధ్యక్షుడు ట్రంప్‌లో కనిపిస్తోంది. ఎన్నో కీలక రాష్ట్రాల్లో బైడెన్‌కి స్వల్పంగానే ఆధిక్యమున్నట్టుగా పోల్ సర్వేలు చెబుతూ ఉండడంతో ఆఖరి నిముషంలో ఫలితం ఎలాగైనా మారే అవకాశం ఉంది. అందుకే ట్రంప్, బైడెన్లు స్వింగ్ రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నారు. నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆఖరి నిముషంలో ప్రచారం చేస్తున్నారు. ఇక బైడెన్ పెన్సిల్వేనియా రాష్ట్రంపై అత్యధికంగా దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ రోజు రాత్రి ట్రంప్ మాత్రం శ్వేతసౌధంలోనే ఉంటూ ఎన్నికల ఫలితాల సరళి సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్‌ను సవాల్ చేస్తాం: ట్రంప్ ఫెయేట్‌విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తప్పదనుకున్నాడో ఏమోగానీ.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి పోలింగ్ తరువాత ఓట్ల లెక్కింపును సవాలు చేయనున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. మంగళవారం పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది అంతకుముందే మెయిల్ ఇన్ బ్యాలెట్ల ద్వారా ఓట్లేశారు. 9కోట్ల 20 లక్షల మంది ఈ పద్ధతిలో ఓట్లు వేసేసిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని లెక్కబెట్టేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని అంచనా. ఫలితంగా కొత్త అధ్యక్షుడు ఎవరన్నది స్పష్టమయ్యేందుకు మరింత సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపులో జరుగుతున్న జాప్యాన్ని తాము సవాలు చేసే అవకాశం ఉందని ట్రంప్ చెబుతున్నారు. కంప్యూటర్ల యుగంలోనూ ఎన్నికలు జరిగిన రోజు రాత్రికల్లా ఫలితాలు తేలకపోవడం ఘోరమైన విషయమన్నారు. మెయిల్–ఇన్ బ్యాలెట్ల పద్ధతిలో మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికన్లు ఓట్లు వేయాలని అనుకుని ఉంటే చాలా ముందుగానే ఆ పని చేసి ఉండాల్సిందని అన్నారు. ‘అందరూ ఒకే రోజు ఓటేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల క్రితం ఓటేసి ఉండవచ్చు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్వింగ్ ఎలక్టోరల్ రాష్ట్రాలు కాలేజీ ఓట్లు అరిజోనా 11 విస్కాన్సిన్ 10 మిషిగాన్ 16 పెన్సిల్వేనియా 20 ఓహియో 18 నార్త్ కరోలినా 15 జార్జియా 16 ఫ్లోరిడా 29 -
‘ట్రంప్ ఎన్నికల’తో చరిత్ర తిరగబడేనా?
అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న జరగనున్న ఎన్నికల్లో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినట్లయితే అమెరికా ఎన్నికల చరిత్ర తిరగబడినట్లే. దేశాధ్యక్షుడు రెండో సారి ఓడిపోవడం గత 28 ఏళ్లలో ఇదే మొదటి సారి అవుతుంది. 28 ఏళ్ల క్రితం అంటే, 1992లో బిల్ క్లింటన్ చేతుల్లో నాటి అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్లూ బుష్ ఓడిపోయారు. ఆ మాటకొస్లే 231 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 45 మంది దేశాధ్యక్షుల్లో కేవలం పది మంది మాత్రమే రెండోసారి విజయం సాధించకుండా పరాజయం పాలయింది. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర పోషించేదిదే..!) ప్రపంచంలోని పలు ప్రజాస్వామ్య దేశాల్లోలాగానే అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అసమ్మతి ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎక్కువగానే ఉంటుంది. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని, ఆయన నిర్లక్ష్యమే అందుకు కారణమని అమెరికా ఓటర్లు భావిస్తున్నారు. అమెరికా వందేళ్ల చరిత్రలో 25 సార్లు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగ్గా 11 సార్లు పాలకపక్ష పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. అందులో ఆరుసార్లు డెమోక్రట్లు, ఐదుసార్లు రిపబ్లికన్లు గెలిచారు. ఇక భారత్‌లో 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా, అందులో ఏడు ఎన్నికల్లో పాలకపక్ష పార్టీ లేదా సంయుక్త కూటములు ఓడి పోయాయి. అలాగే బ్రిటన్‌కు జరిగిన ఎన్నికల్లో 27 సార్లకుగాను పది సార్లు పాలకపక్షం ఓడిపోయింది. (మరో వివాదంలో ట్రంప్ : ఎవరా మహిళ?) అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 78 శాతం మంది పాలకపక్షం అభ్యర్థులే విజయం సాధించారు. అదే ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్‌కు కలసొచ్చే అంశం అని విశ్లేషకులు భావిస్తుండగా, అసమ్మతి పవనాలు బలంగా వీస్తున్నప్పుడు పాలకపక్ష అభ్యర్థులు ఓడి పోవడం కూడా అంతే సహజమని వారు భావిస్తున్నారు. ట్రంప్ ఇటీల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అమీ కోని నియమించడం ఆయనకు కలసొచ్చే అంశం. నియామకంతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో రిపబ్లికన్లు–డెమోక్రట్ల బలం 6–3 నిష్పత్తికి చేరుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లోరిడా విషయంలో ‘బుష్ వర్సెస్ గోర్’ వివాదం ఎలా చెలరేగిందో ట్రంప్, బైడెన్ విషయంలో అలాంటి వివాదమే ఏర్పడుతోందని, అప్పుడు సుప్రీం కోర్టు సానుకూల వైఖరి కారణంగా ట్రంప్ విజయం సాధిస్తారని విశ్లేషిస్తున్న వారు కూడా లేకపోలేదు. (పెద్దన్న ఎన్నిక ఇలా..) -
పెద్దన్న ఎన్నిక ఇలా..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఆ దేశానికి అధ్యక్షుడు తీసుకునే ప్రతీ నిర్ణయం అన్ని దేశాలపై ఏదో ఒక రకంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంత శక్తిమంతమైన పదవి రావడం అంత సులభం కాదు. ఈ ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగే ప్రక్రియ. అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉండే రెండే రెండు పార్టీలు రిపబ్లికన్, డెమొక్రాట్లు. ఈ రెండు పార్టీలు అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేయడం దగ్గర్నుంచి అగ్రరాజ్యాధీశుడు శ్వేతసౌధం చేరుకునేవరకు ప్రతీ దశ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. ఎన్నికలు ఎప్పుడు? నాలుగేళ్లకి ఒకసారి జరిగే అధ్యక్ష ఎన్నికలు నవంబర్ నెలలో మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ద్వారా ఎన్నిక అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ట్రంప్ వర్సెస్ బైడెన్ అంటూ అభ్యర్థుల పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి కానీ అధ్యక్షుడి ఎన్నిక పరోక్ష విధానంలోనే జరుగుతుంది. అమెరికాలో రాష్ట్రాలే ఎక్కువ శక్తిమంతమైనవి. వాస్తవానికి ప్రజలు అధ్యక్షుడిగా నేరుగా ఓటు వెయ్యరు. వారు నివసించే రాష్ట్రంలో రిపబ్లికన్ లేదంటే డెమొక్రాటిక్ పార్టీ ఎలక్టోరల్‌కు ఓటు వేస్తా రు. రాష్ట్రాల జనాభాకి అనుగుణంగా ఒక్కో రాష్ట్రానికి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను కేటాయించారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. దేశానికి అధ్యక్షుడు కావల్సిన వ్యక్తికి 270 అంతకంటే ఎక్కువ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావాలి. అప్పుడే ఆ వ్యక్తి అధ్యక్ష పీఠం అధిరోహిస్తారు. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ అ«భ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ అభ్యర్థికే కేటాయిస్తారు. అలా అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు వచ్చిన అభ్యర్థి అగ్రరాజ్యాధీశుడు అవుతారు. అధ్యక్షుడిగా ఎక్కువ ఓట్లు వచ్చినా.. అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే పాపులర్ ఓట్లు ఎక్కువ వచ్చినా లాభం లేదు. ఎలక్టోరల్ ఓట్లు ఎక్కువ ఎవరికి వస్తే వారే ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవిని చేపడతారు. గత ఏడాది ఎన్నికలే దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. వాస్తవానికి ట్రంప్ కంటే డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి 28 లక్షల పాపులర్ ఓట్లు ఎక్కువ పోలయ్యాయి. కానీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అధికంగా ఉండే కీలక రాష్ట్రాల్లో హిల్లరీ కంటే ట్రంప్‌కి ఎక్కువ ఓట్లు రావడంతో ఆయనకే అధ్యక్ష పీఠం దక్కింది. ట్రంప్ 306 ఎలక్టోరల్ ఓట్లతో విజయదుందుభి మోగిస్తే, హిల్లరీ 232 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వింగ్ రాష్ట్రాలు కీలకం అధ్యక్ష ఎన్నికల ట్రెండ్ క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అత్యంత ముఖ్యం కావడంతో తటస్థంగా ఉండే రాష్ట్రాలనే రెండు పార్టీలు సవాల్‌గా తీసుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్లకి మద్దతు ఇస్తే, మరికొన్ని రాష్ట్రాలు డెమొక్రాట్ల వైపు ఉంటారు. అందువల్ల ఆఖరి నిమిషంలో ఓటుపై నిర్ణయం తీసుకునే స్వింగ్ రాష్ట్రాలు అత్యంత కీలకం. అరిజోనా (11 ఎలక్టోరల్ ఓట్లు), నార్త్ కరోలినా (15), ఫ్లోరిడా (29) పెన్సిల్వేనియా (20), మిషిగావ్ (16), విస్కాన్సిన్ (10) లను ఈసారి ఎన్నికల్లో స్వింగ్ స్టేట్స్‌గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే 101 ఎలక్టోరల్ ఓట్లు ఎటు వైపు వస్తాయో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్‌కి కూడా ఎన్నికలు అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయసభలకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 435 మంది సభ్యులుండే సర్వ ప్రతినిధి సభకి రెండేళ్లకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఓ సారి, ఆ తర్వాత రెండేళ్లకి మరోసారి జరుగుతాయి. ఇక కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్‌లో 100 స్థానాలున్నా యి. వీటిలో 33 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. వీరి పదవీకాలం ఆరేళ్లు. విజేత గద్దెనెక్కేది ఎప్పుడు ? అమెరికా అధ్యక్ష ఫలితాలు వచ్చిన వెంటనే అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్వీకరించరు. తన కేబినెట్ కూర్పు, పరిపాలన కోసం ప్రణాళిక సిద్ధం చేయడానికి గడువు ఇస్తారు. ఆ కసరత్తు పూర్తయ్యాక జనవరి 20న వాషింగ్టన్‌లోని కేపిటల్ హిల్ (అమెరికా కాంగ్రెస్) భవనం మెట్లపై నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. అక్కడ్నుంచి కొత్త అధ్యక్షుడు వైట్‌హౌ స్ (అధికారిక నివాస భవనం)కి వెళతారు. ఫలితాలు ఎప్పుడు? ప్రస్తుత సంవత్సరం కరో నా సంక్షోభంతో ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తున్నారు. అందుకే ఈ సారి ఎన్నికల ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. అయితే ఎన్నికలు జరిగిన మర్నాడే ప్రజా నాడి తెలిసిపోతుంది. ట్రంప్ అనే వ్యక్తికి ఓటేశా ట్రంప్ శనివారం ఉదయం ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్‌బీచ్ లైబ్రరీలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. ‘ట్రంప్ అనే వ్యక్తికి ఓటేశాం. బ్యాలెట్ ఓటు కంటే స్వయంగా వచ్చి ఓటు వేయడమే ఎక్కువ సురక్షితం’ అని ఓటేశాక ట్రంప్ అన్నారు. గతంలో ఆయన న్యూయార్క్‌లో ఓటు వేసేవారు. డెమొక్రాట్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఇంకా ఓటుహక్కు వినియోగించుకోలేదు. నవంబర్ 3వ తేదీన డెలావెర్‌లో ఆయన ఓటేస్తారు. -
బైడెన్ కోసం బరాక్ ప్రచారం
మకాన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చేవారం డెమొక్రాట్ అభ్యర్థి జోబైడెన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. పెన్సిల్వేనియా, ఫిలిడెల్ఫియాల్లో ఈనెల 21న బైడెన్, కమలా హారిస్ తరఫున ఒబామా ప్రచారం సాగిస్తారని బైడెన్ ప్రచార బృందం ప్రకటించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు మార్లు బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఒబామా నేరుగా ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ర్యాలీల్లో ప్రజలను పెద్దపెట్టున ఆకర్షించే సత్తా డెమొక్రాట్లలో ఒబామాకే ఉందని పరిశీలకుల అంచనా. తన కారణంగా బైడెన్‌కు బ్లాక్ అమెరికన్లు, తటస్థుల మద్దతు పెరగవచ్చని భావిస్తున్నారు. అమెరికన్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఒబామా ఇటీవల పిలుపునిచ్చారు. కరోనాపై ట్రంప్ నిర్లక్ష్యాన్ని ఒబామా గతంలో నిశితంగా విమర్శించారు. -
కమలా గెలిచినట్టే.. తమిళనాడులో పోస్టర్లు
వాషింగ్టన్ : అమెరికాలో నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్య పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్(55) విజయం సాధించినట్టేనని తమిళనాడులో ఓ పోస్టర్ వెలిసింది. దీన్ని ఆమె మేనకోడలు, కాలిఫోర్నియాకు చెందిన న్యాయవాది మీనా హారిస్(35) ట్వీటర్లో షేర్ చేశారు. తనకు తమిళనాడు నుంచి ఈ పోస్టర్ అందిందని, ‘పీవీ గోపాలన్ మనవరాలు విజయం సాధించింది’ అని దీని కింద తమిళంలో రాసి ఉందని ఆమె వెల్లడించారు. ‘నా చిన్నప్పుడు చెన్నైకి మా కుటుంబంతో వెళ్ళినప్పుడల్లా మా ముత్తాత గురించి తెలుసుకువాళ్లం. మా బామ్మకు ఆయన కొండంత అండగా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ ఉంటారనుకుంటా’అని మీనా పేర్కొన్నారు. (చదవండి : అగ్రరాజ్యంలో ‘కమల’ వికాసం!) కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలోనే జన్మించారు. ప్రభుత్వ అధికారి అయిన పీవీ గోపాలన్ కూతురే ఆమె. కమలా తండ్రి జమైకాకు చెందిన నల్లజాతీయుడు డొనాల్డ్ హారిస్. కమలకు ఏడేండ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.కమల హోవర్డ్ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. 2010, 2014లో రెండుసార్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేశారు. కమలా హారిస్ అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో తమిళనాడులోని ఈమె కుటుంబం సంతోషంతో తలమునకలవుతోంది. (చదవండి : డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు) I was sent this from Tamil Nadu where our Indian family is from. It says “PV Gopalan’s granddaughter is victorious.” I knew my great grandfather from our family trips to Chennai when I was young—he was a big figure for my grandma and I know they’re together somewhere smiling now. pic.twitter.com/WuZiKimmqj — Meena Harris (@meenaharris) August 16, 2020 -
అమెరికాలో ‘కమల’ వికాసం
జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, వాదనా పటిమతో ప్రత్యర్థుల్ని తికమకపెట్టే సామర్థ్యం, అద్భుతమైన నాయకత్వ లక్షణం.. ఇవే కమలా హ్యారిస్ రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల తీరకపోయినా, ఎప్పటికైనా అనుకున్నది సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఆమెలో నిండిపోయింది. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్ర తిరగరాయడానికి బాటలు కూడా వేస్తోంది. భారత సంతతి మహిళకు గొప్ప గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవిని అలంకరించే అవకాశం తలుపు తట్టింది. డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. విశేష రాజకీయ అనుభవం, గొప్ప పాలనా చాతుర్యం, అద్భుతమైన వాదనాపటిమ ఉన్న కమలా హ్యారిస్‌ను తన లెఫ్ట్‌నెంట్‌గా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎంచుకున్నారు. కమలా హ్యారిస్ తండ్రి డొనాల్డ్ హ్యారిస్‌ది జమైకా. తల్లి శ్యామల గోపాలన్ ఇండియన్(చెన్నై). అలా ఆఫ్రో, ఆసియన్ మూలాలున్న కమల ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. జో బైడెన్ ప్రచార వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిని, పాలనా తీరును, వలస విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక వ్యూహాత్మకంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికా ఓటర్లలో కీలకమైన భారతీయులు సహా ఆసియన్లు, ఆఫ్రికన్ల ఓట్లను ఆమె కచ్చితంగా ప్రభావితం చేయగలరన్న అభిప్రాయం యూఎస్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయంతో బైడెన్ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముందని భావిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపిక అత్యుత్తమం అని మాజీ అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా.. మేమిద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నాం అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన కమలాదేవి హ్యారిస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ల అభ్యర్థిగా కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలు, నల్లజాతీయులు, ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టే వ్యూహంలో భాగంగానే కమలా హ్యారిస్ ఎంపిక జరిగింది. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్ మంగళవారం నాడు కమలా హ్యారిస్‌ను ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తూ డెమొక్రాట్ సహచరులందరికీ మెసేజ్‌లు పంపించారు. ఒక నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా తొలిసారి ఎంపిక చేసి బైడెన్ చరిత్ర సృషించారు. 55 ఏళ్ల కమలా హ్యారిస్ ఎన్నికల్లో నెగ్గితే అమెరికా ఉపాధ్యక్ష పదవికి మొట్టమొదటి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ప్రవాస భారతీయురాలిగా. మొదటి ఆసియా అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. భారతీయ– జమైకా మూలాలున్న కమల ప్రస్తుతం బైడెన్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. భయం లేని పోరాటయోధురాలు: బైడెన్ కమలా హ్యారిస్‌ను భయం బెరుకు లేని పోరాటయోధురాలిగా, దేశంలో అత్యద్భుతమైన ప్రజాసేవకురాలిగా బైడెన్ అభివర్ణించారు. ‘‘కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేశాను. ఎన్నికల ప్రక్రియలో ఆమె నాకు అత్యుత్తమ భాగస్వామి. మేమిద్దరం కలిసి ట్రంప్‌ని ఓడించబోతున్నాం. హ్యారిస్‌కు పార్టీ సహచరు లందరూ ఘనంగా స్వాగతం పలకండి’’అని తన సందేశంలో బైడెన్∙పేర్కొన్నారు. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం తనకు దక్కిన అత్యంత గౌరవం అని కమలా హ్యారిస్ అన్నారు. ఒబామా సలహా మేరకే ! కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయడానికి జో బైడెన్ పార్టీలో అందరితోనూ విస్తృతంగా సంప్రదించారు. ఉపాధ్యక్ష పదవికి మహిళనే ఎంపిక చేస్తానని గతంలోనే ఆయన ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మరికొందరు పార్టీ ప్రతినిధులతో కూడిన బోర్డు కమలా హ్యారిస్‌ను ఎంపిక చేయాలని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ‘‘దేశానికి ఇవాళ ఎంతో శుభ దినం. ఒక సెనేటర్‌గా కమలా హ్యారిస్ నాకు చాలా కాలంగా తెలుసు. మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ఆమె జీవితాన్నే ధారపోస్తున్నారు. కమలా హ్యారిస్‌ను గెలిపించుకుందాం‘‘అని ట్వీట్ చేశారు. కాగా, కమలా హ్యారిస్ ఎంపికపై అధ్యక్షుడు ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక సెనేటర్‌గా హ్యారిస్ అత్యంత భయంకరమైన వ్యక్తి అని తీవ్రంగా విమర్శించారు. కమలా ఎంపికకి కారణాలివే ! అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఒక మహిళను అందులోనూ నల్లజాతీయురాలిని, ప్రవాస భారతీయురాలిని ఎంపిక చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ఆఫ్రికన్ అమెరికన్లు, ఎన్నారైలు, ఏ పార్టీకి చెందని తటస్థుల ఓట్లు కొల్లగొట్టాలంటే హ్యారిసే సరైన ఎంపికన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కమలా దేవి హ్యారిస్ మాటలు తూటాల్లా పేలతాయి. ఒక అటార్నీ జనరల్‌గా, ప్రజాప్రతినిధిగా ఆమె వాదనా పటిమకి ప్రత్యర్థి ఎంతటివాడైనా చిత్తయిపోవాల్సిందే. జాతి వివక్ష పోరాటాల్లో, వలసదారులకి అండగా నిలవడంలో కమలా హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. అన్నింటికి మించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని సమర్థంగా ఢీ కొనే సత్తా కలిగిన నాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ వైఫల్యాలను, సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లైంగిక వివాదాల్లో చిక్కుకున్న బ్రెట్ని నియమించిన సమయంలోనూ కమలా హ్యారిస్ కాంగ్రెస్ సమావేశాల్లో తన వాక్పటిమతో అందరినీ ఆకర్షించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రిలిమినరీ స్థాయి ఎన్నికల్లో కమలా పోటీ పడినప్పుడు ఆమెలోని నాయకత్వ లక్షణాలు బయటకు వచ్చాయి. బైడెన్ వయసు 77 ఏళ్లు కావడంతో చురుగ్గా ఉంటూ, ప్రగతిశీల భావాలు కలిగిన వారినే ఎంపిక చేయాలని ఆయన భావించారు. ఇవన్నీ కమలకి కలిసొచ్చాయి. వారి ఓట్లే కీలకం అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ ఓట్లు 13శాతం ఉన్నాయి. ఒకే పార్టీకి మద్దతుగా నిలవని రాష్ట్రాల్లో వీరి ఓట్లు అత్యంత కీలకం. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అధ్యక్ష ప్రిలిమినరీ ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాల్లో ఆఫ్రికన్ అమెరికన్లు జో బైడెన్‌కే మద్దతు పలికారు. అప్పట్నుంచి నల్లజాతికి చెందిన వారినే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా పోలీసు అధికారి దాష్టీకానికి బలైపోయిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనల్లో హ్యారిస్ చురుకైన పాత్ర పోషించారు. ఇక కమలా దేవికున్న భారతీయ మూలాలు కూడా ఆమెను ఎంపిక చేయడానికి కారణమే. ఈసారి ఎన్నికల్లో 13 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని ఒక అంచనా. పెన్సిల్వేనియాలో 2 లక్షలు, మిషిగావ్లో లక్షా 25 వేల ఎన్నారై ఓట్లు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకం. 2016లో 77% మంది ఇండియన్ అమెరికన్లు డెమోక్రట్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కి ఓటు వేశారని అంచనాలున్నాయి. ఇవన్నీ కమలా రాజకీయ జీవితాన్నే మలుపు తిప్పాయి. అమ్మ చెప్పిన మాట ‘ఊరకే కూర్చొని ఫిర్యాదులు చేయడం మానెయ్. ఏదో ఒకటి చేయడం ప్రారంభించు’’. తల్లి శ్యామల గోపాలన్ ఉపదేశించిన ఈ మంత్రాన్ని ఇప్పటికీ తు.చ. తప్పకుండా పాటిస్తోంది డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్. అవే ఆమెను ఇప్పుడీ స్థాయిలో నిలబెట్టాయి. ప్రతీ రోజూ ఆ మాటలే గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉంటానని కమల గర్వంగా చెప్పుకుంటారు. ఆమె తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. ఆరు దశాబ్దాల క్రితమే శ్యామల అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడే డేవిడ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి కమల, మాయ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కమల చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. దీంతో ఆమె బాల్యమంతా హిందూ తల్లి సంరక్షణలోనే గడిచింది. అందుకే భారతీయ తత్వాన్ని ఆకళింపు చేసుకున్నారు. నల్లజాతీయుల కష్టాలను అర్థం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని బ్లాక్ గర్ల్స్‌గానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే మమ్మల్ని ఆత్మవిశ్వాసంతో పెంచింది. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరూ వీరితోనే ఉంటారు. ఎలా, కోల్ అనే ఆ ఇద్దరు పిల్లల ప్రేమ తనకెంతో శక్తినిస్తుందని కమల చెప్తారు. నేను అమెరికన్నే కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఓక్లాండ్లో జన్మించారు. బెర్కెలేలో పెరిగారు. కెనడాలో పాఠశాల విద్యనభ్యసించారు. వాషింగ్టన్ హోవార్డ్ యూనివర్సిటీలో డిగ్రీ, కాలిఫోర్నియా వర్సిటీలో లా చదివారు. శానిఫ్రాన్సిస్కోలో పెద్ద ప్రాసిక్యూటర్‌గా ఎదిగారు. 2010లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్‌గా ఆమె ప్రదర్శించిన వాక్పటిమ రాజకీయ జీవితానికి పునాదిగా మారింది. 2017లో జరిగిన ఎన్నికల్లో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. సెనేట్‌లో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి మహిళ ఆమె. ఇద్దరు వలసదారులకు పుట్టినప్పటికీ తనని తాను అమెరికన్గానే హ్యారిస్ చెప్పుకుంటారు. అధ్యక్షురాలు కావాలని కలలు సెనేటర్‌గా పేరు తెచ్చుకున్న కమలా అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తోనే పోటీపడ్డారు. తనవాదనా పటిమతో బైడెన్‌ను ఇరుకున పెట్టారు. ఆయన్ను జాతి విద్వేషిఅంటూ తిట్టిపోశారు. కానీ బైడెన్ ధాటికి నిలబడలేక రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడె గెలుపునకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈసారి ఉపాధ్యక్షురాలిగా కమలా నెగ్గితే 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మూడో మహిళ కమల. ఇడ్లీ సాంబార్ అంటే ప్రాణం కమలాకు భారతీయ రుచులు అంటే అమితమైన ఇష్టం. ఇడ్లీ సాంబారు ఇష్టంగా లాగించేస్తారు. చిన్నతనంలో పప్పు, బంగాళదుంపల వేపుడు, పెరుగన్నం తింటూనే ఆమె పెరిగారు. తల్లితో కలిసి తరచూ చెన్నైకి వస్తూ ఉండేవారు. తాత పీవీ గోపాలన్ ప్రభావం తనపై ఉందని బయోగ్రఫీలో హ్యారిస్ రాసుకున్నారు. తల్లి శ్యామలతో కమల (ఫైల్) -
ట్రంప్ కోసం రష్యా ప్రయత్నాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా రష్యా కుట్ర చేస్తోందని అమెరికా నిఘా అధికారులు పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా రష్యాతో సన్నిహిత సంబంధాలున్న కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. అయితే, చైనా మాత్రం ట్రంప్ మరోసారి ఎన్నిక కాకూడదని కోరుకుంటోందని తెలిపారు. ఆ దిశగా ప్రజాభిప్రాయం మార్చేందుకు చైనా ట్రంప్‌పై విమర్శల పదును పెంచిందని వివరించారు. -
హెచ్1 బీ వీసాదారులకు బిడెన్ తీపి కబురు
వాషింగ్టన్: అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్1 బీ వీసాలపై ట్రంప్ సర్కార్ విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని ప్రకటించారు. అధ్యక్ష పదవిలో మొదటి 100 రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై ప్రశ్నించినపుడు బిడెన్ ఈ ప్రకటన చేయడం విశేషం. ఆసియా అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల సమస్యలపై డిజిటల్ టౌన్ హాల్ సమావేశంలో బిడెన్ ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఈ దేశాన్ని నిర్మించారంటూ హెచ్1 బీ వీసాదారుల సేవలను ఆయన ప్రశంసించారు. ఈ నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, మొదటి రోజే ఈ దేశానికి ఎంతో సహకారం అందించే 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి కాంగ్రెస్‌కు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల రోడ్‌మ్యాప్ బిల్లును పంపబోతున్నానన్నారు. తమ ఇమ్మిగ్రేషన్ విధానం వైవిధ్యంగా ఉండబోతోందని వివరించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవనీ, క్రూరమైనవని ఆయన ఆరోపించారు. కాగా కరోనా వైరస్, దేశంలో ఆర్థిక మాంద్యం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం రేటు కారణాల రీత్యా, హెచ్1 బీ వీసా జారీ ప్రక్రియను ‘సంస్కరించే యత్నం’లో భాగంగా హెచ్ 1 బీ సహా, ఇతర వర్క్ వీసాల జారీని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల 23న ప్రకటించారు. హెచ్1 బీ, హెచ్ 4, హెచ్ 2 బీ వీసా, జె అండ్ ఎల్ వీసాలతో బాటు పలు నాన్-ఇమ్మిగ్రేషన్ వీసాలను ఈ ఏడాది ఆఖరువరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే.