అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న దాదాపు 40 లక్షల మంది విదేశీయులకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న దాదాపు 40 లక్షల మంది విదేశీయులకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని సమీక్షించేందుకు యూఎస్ సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో వలస వచ్చిన వారే కీలకం కావటంతో.. దీనిపై దుమారం రేగుతోంది. అక్రమంగా నివాసం ఉంటున్న వారందరినీ చట్టబద్ధం చేసేందుకు ఒబామా తన ఎగ్జిక్యూటివ్ అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించటంపై దిగువ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎన్నికల సంవత్సరం కావటంతో.. తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థనతో దీనిపై సమీక్షించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. ఏప్రిల్‌లో ఈ కేసు విచారణ జరగనుండగా.. జూన్ చివరికల్లా తీర్పు వెలువడనుంది.