అమెరికన్లకు ఇదే నా హామీ.. కమల ఎమోషనల్‌ కామెంట్స్‌ | Kamala Harris Accepts USA Presidential Nomination | Sakshi
Sakshi News home page

అమెరికన్లకు ఇదే నా హామీ.. కమల ఎమోషనల్‌ కామెంట్స్‌

Published Fri, Aug 23 2024 9:07 AM | Last Updated on Fri, Aug 23 2024 9:26 AM

Kamala Harris Accepts USA Presidential Nomination

చికాగో: అమెరికాలో అ‍ధ్యక్ష ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్‌ను కమలా హారీస్ అధికారికంగా ఆమోదించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా, కమలా హారీస్‌ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు. ఈ సమావేశం చికాగో యునైటెడ్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కమలా హారీస్‌ మాట్లాడుతూ..‘అమెరికన్ ప్రజల తరపున అధ్యక్షుడిగా మీ నామినేషన్‌ను నేను అంగీకరిస్తున్నాను. ఈ ఎన్నికలతో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. మన దేశంలో ద్వేషం, విభజన పోరాటాలను అధిగమించడానికి మంచి అవకాశం వచ్చింది. ఒక కొత్త మార్గంలో అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. దేశాన్ని పార్టీలకు, స్వయం ప్రతిపత్తికి అతీతంగా ఉంచుతాను. పవిత్రమైన అమెరికా ప్రాథమిక సూత్రాలను శాంతియుత బదిలీకి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనుకుంటున్నాను’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇక, ఇదే సమయంలో తన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. 

తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆమె విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్‌ తన స​్వార్థం కోసమే రాజకీయాలు చేస్తారు. ఆయనకు విశ్వసనీయత ఉండదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

 


మన ప్రత్యర్థులు ప్రతీరోజూ అమెరికాను కించపరుస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. నాటోను విడిచిపెడతానని ట్రంప్ బెదిరించారు. అతను పుతిన్‌ను మా మిత్రదేశాలపై దాడి చేయమని ప్రోత్సహించాడు. రష్యా-ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ఐదు రోజుల ముందు నేను జెలెన్‌స్కీని కలిశాను. నాటో మిత్ర దేశాలకు నేను అండగా ఉంటాను. అలాగే, గాజా-ఇజ్రాయెల్‌ అంశంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
హమాస్ అనే ఉగ్రవాద సంస్థ కలిగించిన భయానక స్థితిని ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ ఎదుర్కోకూడదు. తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కు కోసం ఎల్లప్పుడూ నిలబడుతాను. గాజాలో జరిగినది వినాశకరమైనది అని అన్నారు.


ఇక, ప్రపంచంలోనే అత్యంత బలమైన పోరాట శక్తిని అమెరికా ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూస్తాను. దేశ దళాలను, వారి కుటుంబాలను సంరక్షించే మా పవిత్ర బాధ్యతను నేను నెరవేరుస్తాను. కమాండర్‌ ఇన్‌ చీఫ్‌గా వారిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారి సేవ మరియు త్యాగాన్ని ఎప్పుడూ కించపరచను అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

 

ఇక, నాలుగు రోజుల డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె అంగీకార ప్రసంగంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అధ్యక్షుడిగా ఆయన పాత్ర స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక, కమలా హరీస్‌ ప్రసంగం కొనసాగుతుండగా పార్టీ కార్యకర్తలు కమల.. కమల, అమెరికా.. అమెరికా అంటూ నినాదాలు చేశారు.

 

మరోవైపు.. కమలా హారీస్‌కు జో బైడెన్‌ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా బైడెన్‌..‘ కమలా హారిస్ అధ్యక్ష పదవికి  నామినేషన్‌ను అంగీకరించడం చూసి నేను గర్వపడుతున్నాను. ఆమె మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నందున ఆమె అత్యుత్తమ అధ్యక్షురాలు అవుతుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement