అగ్రరాజ్యంలో ఎన్నికలపై మనోళ్ల ఉత్కంఠ | The opinion of the people of Nalgonda on the American elections | Sakshi
Sakshi News home page

USA Presidential Elections 2024: అగ్రరాజ్యంలో ఎన్నికలపై మనోళ్ల ఉత్కంఠ

Published Tue, Nov 5 2024 9:44 AM | Last Updated on Tue, Nov 5 2024 10:45 AM

The opinion of the people of Nalgonda on the American elections

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకు మనదేశం నుంచి ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వేలాది మంది వెళ్తుంటారు. ఇప్పటికే చాలామంది అక్కడి వెళ్లి స్థిరపడ్డారు.ఆ దేశంలో ఈనెల 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్‌ బరిలో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారోనని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు వారి మాటల్లో..

కమలా హారిస్‌కే విజయావకాశాలు ఎక్కువ 
కోదాడ: మాది కోదాడ. మేము ఉద్యోగ రీత్యా అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కే ఎక్కువ విజయావకాలున్నాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడ స్థిరపడిన వారిలో 80 శాతం మంది కమలకే మద్దతుగా నిలుస్తున్నారు. భారతీయులు దాదాపు కమలాహారిస్‌ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వారి అంచనాల ప్రకారం 2శాతం మెజార్టీతో కమల గెలుపొంది అమెరికా అధ్యక్షురాలు అవుతుంది.  
– కందిబండ ప్రియాంక, నార్త్‌ కరోలినా

ట్రంప్‌ గెలవకూడదని కోరుకుంటున్నారు
కోదాడ: మా స్వస్థలం కోదాడ పట్టణం. అమెరికాలోని నార్త్‌ కరోలినాలో స్థిరపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిస్తే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతుంది. అమెరికన్‌లకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ట్రంప్‌కు మద్దతిచ్చేవారు తగ్గిపోయారు. ట్రంప్‌ గెలవకూడదని ఎక్కువ శాతం ప్రజలు కోరుతున్నారు. నార్త్‌ కరోలినాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కమలా హారిస్‌కే మద్దతు ఎక్కువగా ఉంది.    
– శరాబు కృష్ణకాంత్, నార్త్‌ కరోలినా

డెమోక్రటిక్‌ పార్టీ వైపే మొగ్గు
కోదాడ: మాది కోదాడ పట్టణం. అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడ్డాం. అధ్యక్ష్య ఎన్నికల్లో ఈ సారి ఇండియన్స్‌ డెమోక్రాట్స్‌ అభ్యర్థి కమలాహారిస్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. స్వల్ప మెజార్టీతోనైనా కమల గెలుస్తుందనే చర్చ జరుగుతుంది. వలస చట్టాలపై ట్రంప్‌ కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారు భయపడుతున్నారు. ట్రంప్‌ కూడా తన ప్రసంగాలలో ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికన్‌ల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ప్రచారం చేసూ్తన్నారు.       
– బొగ్గారపు మణిదీప్, గుడుగుంట్ల నాగలక్ష్మి, చికాగో

బలమైన నాయకత్వం అవసరం
ఆత్మకూర్‌ (ఎస్‌): మాది ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామం. అమెరికాలోని నార్త్‌ కేరోలినాలో కెమికల్‌ ఎనావిుస్ట్‌గా స్థిరపడ్డాను. అమెరికా దేశం ముందు ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కొంటోంది. ధరలు పెరగడం, పెరుగుతున్న నేరాలు, సరిహద్దు భద్రత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన నాయకత్వం అవసరం. వైఫల్యంతో నిండిన బైడెన్‌ ఆర్థిక, వలస, విదేశీ విధానాల నుంచి పునరుద్ధరించడానికి ట్రంప్‌ గెలుపు చాలా అవసరం.     
– దండ నీరజ, కెమికల్‌ ఎనావిుస్ట్, నార్త్‌ కేరోలినా

డోనాల్డ్‌ ట్రంపే గెలుస్తారు 
సూర్యాపేట: మాది సూర్యాపేట పట్టణం. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ సిన్సినాటి, ఒహాయో రాష్ట్రంలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌కే విజయావకాశాలు ఉన్నాయి. నేను కూడా అదే పార్టీకి ఓటేయాలనుకుంటున్నా. ఈ సారి ట్రంప్‌ గెలిస్తే ఉక్రెయిన్, ఇజ్రాయిల్‌ యుద్ధాలు ఆగిపోతాయని భావిస్తున్నాం. ట్రంప్‌ గెలిస్తే వ్యాపార వర్గాలకు పన్నుల్లో రాయితీ ఇస్తారని, దీంతో ద్రవ్యోల్భణం నియంత్రణ అవుతుంది.   
– విజయశంకర్‌ కోణం, సిన్సినాటి, ఒహాయో

ట్రంప్‌ గెలిస్తేనే బాగుంటుంది
ఆత్మకూర్‌(ఎం) : మాది ఆత్మకూర్‌(ఎం) మండలం సిద్ధాపురం. మేము 27 సంవత్సరాల నుంచి అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో నివాసం ఉంటున్నాం. మంగళవారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ఉంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రటికన్‌ పార్టీ నుంచి కమల హారిష్‌ పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ట్రంప్‌ ముక్కుసూటి మనిషి అయినా ఆయన గెలిస్తేనే భద్రత అనే ఉంటుందని నా అభిప్రాయం. కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్నా పాలన పరంగా పెద్దగా అనుభవం లేదు. ఆమె విధి విధానాలు ట్రంప్‌కు లాభం కలిగేలా ఉన్నాయి.   
– ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి, న్యూయార్క్‌

హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
అర్వపల్లి: మాస్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అమెరికాలోని టెన్నెసి రాష్ట్రంలో ఉంటున్నాం. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఈసారి అక్కడి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నాను. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. కమలాహారిస్, ట్రంప్‌ మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా ఉంది. భారతదేశ అభివృద్ధికి కృషిచేసే వారికే ఓటేయాలి. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది.        
 – జన్నపు శ్రీదేవి, టెన్నెసి

ట్రంప్‌ గెలిస్తేనే భారతీయులకు భద్రత
తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం కొంపల్లి గ్రామం. నేను, నా భర్త బొలిగోర్ల శ్రీనివాస్, ఆలియాస్‌ కొంపల్లి శ్రీనివాస్‌ 2010లోనే ఆమెరికాలోని కొలంబస్‌కు వచ్చాం. అప్పటి నుంచి కొలంబస్‌లో ఉంటున్నాం. భారతీయుల భద్రత విషయంలో ట్రంప్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రంప్‌ గెలుస్తేనే భారతదేశానికి గానీ, అమెరికాలో ఉంటున్న భారతీయులకు గానీ లాభం చేకూరుతుంది. కమలాహారిస్‌భారత సంతతికి చెందినప్పటికీ ఎక్కువ మంది భారతీయులు ట్రంప్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.  – దివ్య, కొలంబస్‌

ట్రంప్‌ గెలిచే అవకాశం ఉంది
భువనగిరి: మాది భువనగిరి పట్టణం. అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డాం. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలో ఉన్న అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ గెలిచే అవకాశం ఉంది. గతంలో దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ట్రంప్‌ మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకురాగలరు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉంటే అమెరికా–ఇండియా మధ్య సత్సంబంధా లు మెరుగుపడతాయి. రిపబ్లిక్‌ పార్టీకి చెందిన అభ్యర్థి కమలాహ్యారీస్‌ భారత సంతితికి చెందిన వారు అయినప్పుటికీ ఇండియాకు చెందిన వారు ఆమెకు మద్దతు తెలపడం లేదు.  
–  జి.సంతోష్, కాలిఫోరి్నయా

ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్‌ గెలవాలి 
భువనగిరి: మాది వలిగొండ మండలం టేకులసోమారం గ్రామం. అమెరికాలోని నార్త్‌ కరోలినాలో 23 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్, డెమోక్రటిక్‌ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఆరు నుంచి 7 వరకు స్వింగ్‌ స్టేట్స్‌ వీరి గెలుపును నిర్థారిస్తాయి. ఎవరు గెలిచిన స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ఇండియన్స్‌ ఎక్కువ శాతం ట్రంప్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. నేడు మాత్రం ట్రంప్‌కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను.  
– పడమటి శ్యాంసుందర్‌రెడ్డి, నార్త్‌ కరోలినా

భారతదేశ అభివృద్ధికి సహకరించే వారికే ఓటేయాలి
అర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామం. అమెరికాలోని అట్లాంటా ఉంటున్నాం. ఇప్పటికే రెండు సార్లు అమెరికా ఎన్నికల్లో ఓటు వేశాను. భారతదేశ అభివృద్ధికి సహకరించే వారికి అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఓటేయాలి. సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు, భారత విదేశాంగ విధానం, ఎగుమతి, దిగుమతికి మద్దతు తెలిపే వాళ్లకే మా ఓటు. కులాలను చూసి ఓటు వేయవద్దు. 
– జూలకంటి లక్ష్మారెడ్డి, అట్లాంటా

భారతీయులు ట్రంప్‌ వైపే.. 
అర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం. అమెరికాలోని హూస్టన్‌లో స్థిరపడ్డాం. 30 ఏళ్ల పైనుంచి అక్కడే ఉంటున్నాం. ఇప్పటికే 20 సార్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాను. అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ట్రంప్‌వైపే ఉన్నారు. నాది రిపబ్లికన్‌ పార్టీ. నేను ఎన్నికల్లో ట్రంప్‌కే ఓటేస్తాను.         
– ఆలూరి బంగార్‌రెడ్డి, హూస్టన్‌

ట్రంప్‌ గెలవాలనుకుంటున్నారు
నల్లగొండ: మాది నల్లగొండ. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కమలా హ్యారిస్‌కు అంతగా అనుభవం లేదని ప్రజల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ట్రంప్‌ వైపే అమెరికన్‌ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్, కమలాహారిస్‌ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నా అమెరికా ప్రజలు ట్రంప్‌ గెలవాలనుకుంటున్నారు.  
– కంచరకుంట్ల వెంకటరాంరెడ్డి, లాస్‌ ఏంజెల్స్‌

ట్రంప్‌తోనే ఉద్యోగావకాశాలు
నేరేడుచర్ల: మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేడు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రంఫ్‌ గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సురక్షితంగా ఉంటాయి.  మేము ఉన్న ప్రాంతంలో మాతో పాటుగా చాలా మంది ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయి.         
– దొంతిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, బేబికాన్‌ 

నా మద్దతు కమలాహారిస్‌కే..
శాలిగౌరారం: మాది శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామం. అమెరికాలోని మిజోరి స్టేట్‌లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబంలో ముగ్గురం ఓటు హక్కును వినియోగించుకోనున్నాం. నేను ఓటు వేయడం ఇది మూడవసారి. నా మద్ధతు కమలాహారిస్‌కే.          
– పాదూరి రామమోహన్‌రెడ్డి, మిజోరి స్టేట్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement