హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్‌ బూస్ట్‌ | Kamala Harris Strong Political Counter To Donald Trump | Sakshi
Sakshi News home page

హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్‌ బూస్ట్‌

Published Thu, Oct 24 2024 10:28 AM | Last Updated on Thu, Oct 24 2024 10:44 AM

Kamala Harris Strong Political Counter To Donald Trump

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నాయకులు స్పీడ్‌ పెంచారు. తాజగా రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌పై డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారీస్‌ సంచలన విమర్శలు చేశారు. క్రమంగా ట్రంప్‌ మతి తప్పుతోందని ఆమె కామెంట్స్‌ చేశారు.

డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారీస్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆరు మిలియన్ల మంది యూదులు, వందల వేల మంది అమెరికన్ల మరణాలకు కారణమైన వ్యక్తి హిట్లర్‌. అటువంటి వ్యక్తిని ట్రంప్‌ పొడుగుతున్నారు. హిట్లర్‌ కొన్ని మంచి పనులు చేశారని ట్రంప్‌ అంటున్నారు. అమెరికాకు మిలటరీ బదులుగా హిట్లర్‌ వంటి జనరల్స్‌ ఉండాలని ట్రంప్‌ భావిస్తున్నారు. హిట్లర్‌ వంటి వ్యక్తిని ప్రశంసించడం ఆందోళన కలిగిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ట్రంప్‌ ఎలాంటి వారో ఆయన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి. అమెరికా ప్రజలు ట్రంప్‌ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి’ అని కోరారు.

ఇదిలా ఉండగా.. అమెరికాలో నవంబర్‌ ఐదో తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 29న కమలా హరీస్‌ ప్రచార ముగింపు సభ ఉండనుంది. 29న తన చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇక, ఇప్పటికే ట్రంప్‌ కూడా వినూత్నంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement