వాషింగ్టన్: ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్ తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమొ క్రటిక్ నేషనల్ కమిటీ ఆదివారం నిర్వహించిన హాలిడే పార్టిలో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది’’అని అతిథులుతో బైడెన్, హారిస్ అన్నా రు. ‘‘కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే.. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టికైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు’’అని బైడెన్ అన్నారు. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే.
హారిస్ భవితవ్యం ఏమిటి?
హారిస్ తన సొంత రాష్ట్రమైన కాలిఫోరి్నయా గవర్నర్ పదవికి పోటీ చేయాలని కొందరు డెమొక్రాట్లు కోరుతున్నారు. ఆమె మాత్రం తన భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బైడెన్ జనవరి 20న అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుండటం తెలిసిందే. అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అమెరికా సమాజంలో నెలకొన్న లోతైన విభేదాలను చక్కదిద్దేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకందరికీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నా’’అని నవ్వుతూ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment