Thanksgiving
-
Thanksgiving Movie: వయొలెన్స్.. వయొలెన్స్.. ధైర్యం ఉంటే చూసేయండి!
ఆఫర్.. ఆఫర్.. ఈ పేరు వినిపిస్తే చాలు జనాలు చేతిలో డబ్బులున్నాయా? లేవా? అని కూడా చూసుకోరు. ఆఫర్లో వస్తున్నాయంటూ ఎగబడి మరీ కొనేస్తారు. అలాగే అమెరికాలో బ్లాక్ ఫ్రైడే సేల్స్ కోసం ఓ షాపింగ్ స్టోర్ సిద్ధమైంది. మొదట వచ్చిన 100 మంది కస్టమర్ల కోసం ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. ఇంకేముంది.. జనాలు షాపు చుట్టూ గుమిగూడారు. వారిని ఆపడం అక్కడి సెక్యూరిటీ వల్ల కూడా కావడం లేదు.కథఇంతలో ఆ షాపు యజమాని కూతురు జెస్సికా (నెల్ వర్లఖ్) తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో అక్కడికి వస్తుంది. ఆమె ప్రియుడు కొత్త ఫోన్ తీసుకోవాలంటూ దర్జాగా షాపులోకి వెళ్తాడు. ఇది చూసిన జనాలు ఆగ్రహానికి లోనవుతారు. వారిని ఎందుకు లోనికి వెళ్లనిచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అని మండిపడ్డారు. ఇంతలో జనం సునామీలా ముందుకు వచ్చారు. స్టోర్ తలుపు తెరిచేవరకు ఆగకుండా దూసుకొచ్చేయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో బ్లాక్ ఫ్రైడే విషాదంగా మారిపోయింది. సరిగ్గా ఏడాదికి..అయితే దీన్ని హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ లైవ్‌లో వీడియో తీడయంతో అది వైరల్‌గా మారుతుంది. ఏడాది తర్వాత మరోసారి అదే స్టోర్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ పెట్టాలని షాపు యజమాని డిసైడ్ అవుతాడు. అంతలోనే గతేడాది విషాదానికి కారణమైన ఒక్కొక్కరూ అత్యంత దారుణంగా చనిపోతారు. ఈ హత్యల వెనుక ఉన్నదెవరు? ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అందరూ చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బతికి బట్టకట్టారా? మళ్లీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ జరిగాయా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఆ సీన్ హైలైట్సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే బ్లాక్ ఫ్రైడే సేల్స్.. ఎంత విధ్వంసంగా మారిందో చూపించారు. ఆ దారుణాన్ని చూస్తున్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. సినిమా మొత్తంలో ఈ సీనే హైలైట్‌గా ఉంటుంది. తర్వాత విలన్ చేసే హత్యలు కొన్ని కామెడీగా ఉంటే, మరికొన్ని సీరియస్‌గా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. సెకండాఫ్‌లో అదుర్స్ అని చెప్పుకునేలా ఏ సన్నివేశమూ ఉండదు. కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న ఉత్సుకత మాత్రం మనలో కలగక మానదు.ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ఎలి రోత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాట్రిక్ డింప్సే, జీనా జెర్షన్, టై ఒల్సన్, నెల్ వెర్లాక్.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎలి రోత్‌తో పాటు జెఫ్ రెండల్ డైలాగ్స్ రాశాడు. జనాలకు షాపింగ్, ఆఫర్స్ మీద ఉన్న పిచ్చిని.. అలాగే సోషల్ మీడియాలో వైరలవ్వాలన్న తాపత్రయాన్ని సినిమాలో సెటైరికల్‌గా చూపించారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు. మిస్టరీ థ్రిల్లర్స్ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు -
రూ.7250 కోట్లు విరాళం ప్రకటించిన వారెన్ బఫెట్ - ఎవరికో తెలుసా?
ప్రపంచ ధనవంతుల జాబితాలో ఒకరైన 'వారెన్ బఫెట్' (Warren Buffett) గతంలోనే తన సంపదలో 99 శాతాన్ని ఛారిటీకి అందిస్తానని వెల్లడించారు. అన్నమాట ప్రకారమే చేస్తున్న బఫెట్ తాజాగా స్వచ్ఛంద సంస్థలకు 876 మిలియన్ డాలర్ల విలువైన బెర్క్‌షైర్ హాత్వే షేర్లను అందించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వారెన్ బఫెట్ బిలియనీర్ అయినప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతూ తమ పిల్లలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు వేలకోట్లు విరాళాలు అందిస్తుంటాడు. ఇందులో భాగంగానే గత మంగళవారం 876 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 7250 కోట్లు) షేర్లను గిఫ్ట్‌గా ప్రకటించారు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. వారెన్ బఫెట్ భార్య పేరు మీద ఉన్న 'సుసాన్ థాంప్సన్ బఫ్ఫెట్ ఫౌండేషన్'కు 1.5 మిలియన్ క్లాస్ B షేర్లను ప్రకటించారు. తమ పిల్లలు నిర్వహిస్తున్న మూడు ఫౌండేషన్లకు (షేర్వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫ్ఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్) ఒక్కొక్క దానికి 3,00,000 బెర్క్‌షైర్ హాత్వే షేర్లను విరాళంగా ఇచ్చేసారు. గత ఏడాది కూడా భారీ షేర్లను విరాళంగా అందించారు. -
బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారు: మంత్రులు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మంగళవారం నాయీబ్రాహ్మణ కృతజ్ఙతాసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమానికి బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు హాజరయ్యారు. సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందించడం, ఆలయాలలో పనిచేసే వారికి రూ, 20 వేల వేతనం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాల పాలకమండలిలో స్థానం కల్పించడంపై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ మంత్రులు మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అన్ని విధాల అండగా నిలిచారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాల చూశారని గుర్తు చేశారు. ఆలయాల పాలక మండలిలో నాయీబ్రాహ్మణులు సభ్యులయ్యారని, త్వరలోనే నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభల్లో అడుగుపెడతారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఆయనకు బీసీలంటే చిన్నచూపని దుయ్యబట్టారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం.. వాతావరణ శాఖ హెచ్చరికలు -
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి... నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా... నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం... నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్... నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్బటన్... నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాన్నా... నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు. ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు. నువ్వే కదా నా ఫస్ట్ సూపర్‌స్టార్. నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది. నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది. నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు. నాన్నా... నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. నాన్నా... ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్. నన్ను సైకిల్ మీద కూచోబెట్టుకుని స్వీట్స్టాల్కు తీసుకెళ్లి గులాబ్ జామూన్ తినిపించావ్. ‘చాలా బాగా చదువుతున్నావ్’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్ జామూన్ తినాలని ఉంది. బయట కారులో వెయిట్ చేస్తున్నా. షర్ట్ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ... నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్ చూసి ‘ఇదా... లవ్ లెటర్’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్. అమ్మ నాకు అన్నింటిలో గైడ్ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్బాక్స్లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా... నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్ చేసే మార్గం అని. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట. ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ అబ్బా. నాన్నా... ‘ఒరేయ్.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి. నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది. నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా. -
Thanks Giving Day : ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారా?
సాక్షి, హైదరాబాద్: మనిషిగా పుట్టింది మొదలు గిట్టే వరకు ఆ ‘నలుగురి’ సాయం లేకుండా సాగదు. ప్రస్తుతం ఒక స్థాయికి చేరుకోగలిగాము అంటే కచ్చితంగా ఎందరో తోడ్పాటు ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు,స్నేహితులు ఈ కోవలో ముందు వరుసలో నిలుస్తారు. చాలా సందర్భాల్లో చాలా క్లిష్టసమయాల్లో మన జీవితంలో చాలామంది పరోక్షంగానో ప్రత్యక్షంగా సాయపడతారు. మన కరియర్లో కీలక మలుపు తిరగడానికి దోహద పడతారు. ఫలానా వారి వల్లే నేను జీవితంలో ఇంత స్థాయికి చేరుకున్నాను అనుకుంటాం కదాం. అలాంటి వారి వద్దకు వెళ్లి ఒకసారి కలిసి, మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పందుకే ఈ థ్యాంక్స్ గివింగ్ డే. క్షణం తీరిక లేకుండా జీవితాల నుంచి కాస్త సమయం తీసుకుని అలాంటి చక్కగా ఆలింగనం చేసుకోవడం కోసమే ఈ రోజు. వారు చేసిన సేవ, సాయంగాని, ముఖ్యమైన సలహా గానీ, చేసిన మేలు, త్యాగం ఇలా ఏదైనా గుర్తు చేసుకోవడం. మన అభివృద్ధి కోసం పాటుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం. ప్రపంచవ్యాప్తంగా ఈ థ్యాంక్స్ గివింగ్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని మొట్టమొదటి సారిగా అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ 1789 నవంబర్ 26న నిర్ణయించారు. అయితే తరువాత మరో అధ్యక్షుడు భారత సంతతికి చెందిన ప్రముఖుడు అబ్రహం లింకన్ ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగో గురువారం రోజు ఈ కృతజ్ఞతా దినోత్సవంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమెరికాలో నేషనల్ హాలిడే కూడా. సాంప్రదాయం ప్రకారం స్నేహితులు, హితులందరితో చక్కటి విందు భోజనం చేయడంతోపాటు ఉత్సాహంగా అందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటారు. భారతదేశంలో ఇది పెద్దగా ప్రాచుర్యంలో లేనప్పటికీ, అమెరికా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్‌తో సహా ఇతర దేశాలలో కూడా థాంక్స్ గివింగ్ జరుపు కుంటారు. పండుగ తర్వాత మరుసటి రోజు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులతో మెగా షాపింగ్ మేలా ఉంటుంది. ఆసక్తికరంగా, కెనడాలో అక్టోబర్ రెండవ సోమవారం థ్యాంక్స్ గివింగ్ డే వేడుక ఉంటుంది. జీవితంలో తెలిసో తెలియకో, పాజిటివ్‌గానో, నెగిటివ్‌గానో ఎంతో కొంత మేలు చేసే ఉంటారు. వారిని ఏడాదికి ఒకసారైనా గుర్తు చేసుకోవడానికే ఈ కృతజ్ఞతా దినోత్సవం అన్నమాట. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సెకండ్‌వేవ్‌తో జనం అల్లాడిపోయారు. తీరని కష్టాల్లో ఉన్న అలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది ముందుకు వచ్చారు. 24 గంటలూ నిద్రాహారాలు మాని, బాధితులకు ఎనలేని సేవలందించారు. వారి త్యాగాలు, సేవలకు విలువ కట్టడం అసాధ్యం. అలాంటి వారిందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. సో... ఇంకెందుకు ఆలస్యం...అలాంటి గొప్ప వ్యక్తులు అందరికీ థ్యాంక్స్ చెప్పేయండి! -
ఒకే రోజు 3 వేలకు పైగా మరణాలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే 2001 సెప్టెంబర్ 11 నాటి దాడిలో కంటే, ఇప్పుడు 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. బుధవారం ఒక్క రోజే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాటి దాడిలో 2,977 మంది మరణిస్తే, ఇప్పుడు ఒకే రోజు కరోనా 3,054 మంది అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా మే 7న 2,769 మంది మరణించడం ఒక రికార్డు అయితే ఇప్పుడు ఒక్కసారిగా 3 వేలు దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య సైతం లక్షా 6 వేల 688కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే 2,26,533 కేసులు నమోదయ్యాయి. థ్యాంక్స్ గివింగ్ కొంప ముంచిందా? శీతాకాలం కావడం, ప్రజలు మాస్కులు ధరించకపోవడం, థ్యాంక్స్ గివింగ్ వీక్ కావడంతో ప్రజలంతా పార్టీల్లో మునిగితేలడంతో కరోనా మరింతగా విజృంభిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ సంబరాలకి కూడా సన్నాహాలు చేస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఇళ్లకే పరిమితం కావాలంటూ అధికారులు కోరుతున్నారు. కరోనా రికవరీ రేటు 94.74% న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో మరో 31,521 కరోనా కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,371కు చేరుకుంది. అదే సమయంలో కరోనా కారణంగా 412 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,41,772కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారానికి కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 92,53,306 అయ్యింది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.74 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,72,293గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.81%గా ఉన్నాయి. మరణాల రేటు 1.45%గా ఉంది. -
రోజుకు 6 లక్షలు
వాషింగ్టన్, లండన్: ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత వారం పది రోజులుగా సగటున రోజుకి 5 లక్షల 80 వేల కేసులు నమోదవుతున్నాయి. కేవలం 17 రోజుల్లోనే కరోనా కేసులు 5 కోట్ల నుంచి ఆరు కోట్లకి చేరుకున్నాయి. అంతకు ముందు 4 కోట్ల నుంచి 5 కోట్లకి చేరుకోవడానికి 21 రోజులు పడితే ఈ సారి రికార్డు స్థాయిలో రెండు వారాల్లోనే మరో కోటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. థాంక్స్ గివింగ్ ఆందోళన అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిపోతోంది. గత వారంలోనే అమెరికాలో ఏకంగా 10లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో థాంక్స్ గివింగ్ వారం కావడంతో అందరికీ సెలవులు ప్రకటించారు. దీంతో ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దంటూ ప్రభుత్వం సూచించింది. థాంక్స్ గివింగ్ వారంలో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేస్తారు. మార్కెట్లు కిటకిటలాడిపోతాయి. దీంతో కేసులు పెరిగిపోతాయన్న ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు అమెరికాలో కోటి 30 లక్షల వరకు కేసులు నమోదైతే 2 లక్షల 60 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వణుకుతున్న యూరప్ యూరప్‌లో కేవలం అయిదు రోజుల్లో 10 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 60 లక్షలు దాటేసింది. 3 లక్షల 65 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాలు కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో యూరప్ నుంచి 44%, కొత్తగా సంభవించిన మరణాల్లో 49% యూరప్ నుంచి వస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక ప్రపంచంలోనే లాటిన్ అమెరికాలో అత్యధికంగా మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచ మరణాల్లో 31శాతం అక్కడే సంభవిస్తున్నాయి. పాక్‌లో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు పాకిస్తాన్‌నూ సెకండ్ వేవ్ వణికిస్తోంది. కోవిడ్ రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా 3 వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో రోగులకు చికిత్స నందించడం పాక్ ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తోంది. భారత్‌లో 93 లక్షలకి చేరువలో మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 92.66 లక్షలకి చేరుకుంది.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 86.79 లక్షలకి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా మరో 44,489 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 92,66,705కి చేరుకోగా, 24 గంటల్లో 524 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,35, 223కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య వరసగా పదహారో రోజు 5 లక్షల లోపు ఉండడం అత్యంత ఊరటనిచ్చే అంశం. క్రిస్మస్ వేడుకలకి సన్నాహాలు వచ్చే నెలలో క్రిస్మస్ వేడుకలకి ప్రపంచ దేశాలు సిద్ధమవుతూ ఉండడంతో కేసుల సంఖ్య మరింత తీవ్ర రూపం దాల్చవచ్చునన్న ఆందోళనలు నెలకొన్నాయి. సెలవు దినాల్లో ప్రజలెవరూ బయటకి రాకుండా జర్మనీ, స్పెయిన్, ఇటలీలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలు మూడేసి ఇళ్లవారు కలిసి చేసుకోవచ్చునని యూకే ప్రభుత్వం సూచించింది. డిసెంబర్ 23 నుంచి 28 వరకు ప్రయాణాలపై ఆంక్షలు ఉండవంది. -
అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోదర సోదరీమణులారా చేతులు బాగా కడుక్కోండి, దూరాన్ని పాటించండి. ఇంట్లోనే ఉండండి. ‘కోవిడ్’లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వస్తే డాక్టర్‌ను సంప్రదించండి. అప్రమత్తంగా ఉండండి. కానీ ఆందోళన పడకండి. ప్రభుత్వం మీతో ఉంది’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. కోవిడ్ –19 ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించాలని గవర్నర్ కోరారు. కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం కూడా ఈ భయంకర పరిస్థితిని ఎదుర్కుంటోందన్నారు. గతంలో మన పెద్దలు యుద్ధాలను చూశారని, ప్రస్తుత తరం వైరస్ రూపంలో ‘బయో వార్’ను ఎదుర్కొంటున్నదని గవర్నర్ వ్యాఖ్యానించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా, నైతిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని గవర్నర్ తమిళి సై సూచించారు. ‘కోవిడ్’పై పోరులో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా రవాణా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది చూపుతున్న చిత్తశుద్ధిని గవర్నర్ ప్రశంసించారు. ‘కోవిడ్’కు నివారణే చికిత్స అని, ఇళ్లలోనే ఉండి ఇంటి వద్ద నుంచే పనులు చేయాలని, విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 22న రాజ్‌భవన్‌లో థ్యాంక్స్ గివింగ్ ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ‘కోవిడ్’ను అరికట్టేందుకు పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమిళిసై వెల్లడించారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగులకు రోజూ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నామని, చేతులు శుభ్రం చేసుకోవడంపై తమ సిబ్బందికి అవగాహన కల్పించినట్లు గవర్నర్ వెల్లడించారు. 65ఏళ్లు పైబడిన వారిని బయటకు పంపకుండా చూసుకోవాలని, మురికివాడల్లో ఉండే వారు కూడా సబ్బుతో చేతులు కడుక్కునేలా అవగాహన కల్పించాలని గవర్నర్ సూచించారు. మీడియా సమావేశానికి వచ్చిన గవర్నర్‌కు రాజ్‌భవన్ వైద్య బృందం థర్మల్ స్క్రీనింగ్ చేశారు. -
కృతజ్ఞత
కథ రామయ్య రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని తీసుకువచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అతని జీవితం గడిచేది. రామయ్య ప్రతిరోజూ పెందలాడే అడవికి బయలుదేరేవాడు. ఆతని భార్య చీకటితోనే లేచి భోజనం సిద్ధం చేసి ఇచ్చేది. మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టి రామయ్య ఒక నీటి కాలువ ఒడ్డున ఉన్న ఒక చెట్టు నీడ పట్టున భోజనానికి కూర్చునే వాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక రామచిలుక అక్కడికి వచ్చేది. రామయ్యకు కొద్ది దూరంలో నేల మీద వాలేది. అతను తన ఆహారంలోంచి కొంత చిలుకకు పెట్టేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఒకరోజు అడవికి వెళ్ళి రామయ్య కొద్దిసేపు కట్టెలు కొట్టాడు. దాహం వేయడం తో దగ్గరలోనే ఉన్న నీటి కుంటలో మర్రి ఆకులతో చేసిన దోనెతో నీళ్ళు ముంచుకు న్నాడు. అతను అవి తాగబోయేంతలో చిలుక రివ్వున వచ్చి దోనెను తన్నింది. దోనె చిరిగి పోయింది. రామయ్య దోసిలితో నీళ్ళు తాగబోయాడు. చిలుక మళ్లీ వచ్చి అతని చేతి మీద కొట్టింది. ఇలా రెండు మూడుసార్లు జరిగేసరికి నీరు తాగకుండా చేసినందుకు చిలుకపై రామయ్యకు చాలా కోపం వచ్చింది. ఒక మట్టిబెడ్డ తీసుకుని దాని మీదకు విసిరాడు. మట్టిబెడ్డ చిలుక కాలికి తాకడంతో దానికి గాయమైంది. రామయ్య తిరిగి నీళ్ళు తాగాలనుకు న్నాడు. ఎందుకో అతనికి త్రాగాలనిపించక వెనుకకు మరిలాడు. అలా వస్తుండగా కొద్ది దూరంలో కొన్ని జంతువులు చనిపోయి కనిపించాయి. కుంటలోని నీరు తాగి జంతువులు చనిపోయి ఉంటాయని గ్రహించాడు. నీటికుంటలో ఏదో విషం కలిసి ఉంటుంది. ఆ విషయం గ్రహించిన చిలుక తనను నీళ్ళు త్రాగకుండా అడ్డుపడిందని అర్థం అయ్యింది రామయ్యకు. వెనకకు తిరిగి వెళ్ళాడు. గాయంతో నేల మీద పడున్న చిలుకను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు. ‘ఈ మూగప్రాణులు ఎంత కృతజ్ఞతగా ఉంటాయి! చిలుకకు కొన్నిరోజులు పిడికెడు మెతుకులు పెట్టాడు. ఆ మాత్రానికే అది తన ప్రాణాలను కాపాడింది’ అని ఆర్ద్రంగా అనుకున్నాడు రామయ్య.