
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మంగళవారం నాయీబ్రాహ్మణ కృతజ్ఙతాసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమానికి బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు హాజరయ్యారు.
సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందించడం, ఆలయాలలో పనిచేసే వారికి రూ, 20 వేల వేతనం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాల పాలకమండలిలో స్థానం కల్పించడంపై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ మంత్రులు మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అన్ని విధాల అండగా నిలిచారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాల చూశారని గుర్తు చేశారు. ఆలయాల పాలక మండలిలో నాయీబ్రాహ్మణులు సభ్యులయ్యారని, త్వరలోనే నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభల్లో అడుగుపెడతారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఆయనకు బీసీలంటే చిన్నచూపని దుయ్యబట్టారు.
చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం.. వాతావరణ శాఖ హెచ్చరికలు