Thanksgiving Movie: వయొలెన్స్‌.. వయొలెన్స్‌.. ధైర్యం ఉంటే చూసేయండి! | Hollywood Movie Thanks Giving Movie Review In Telugu, Story Explained Inside | Sakshi
Sakshi News home page

Thanksgiving Movie Review: బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌.. ఒకటే చంపుడు.. థాంక్స్‌గివింగ్‌ రివ్యూ

Published Sun, Jul 14 2024 10:56 AM | Last Updated on Sun, Jul 14 2024 1:09 PM

Hollywood Movie Thanksgiving Review in Telugu

ఆఫర్‌.. ఆఫర్‌.. ఈ పేరు వినిపిస్తే చాలు జనాలు చేతిలో డబ్బులున్నాయా? లేవా? అని కూడా చూసుకోరు. ఆఫర్‌లో వస్తున్నాయంటూ ఎగబడి మరీ కొనేస్తారు. అలాగే అమెరికాలో బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ కోసం ఓ షాపింగ్‌ స్టోర్‌ సిద్ధమైంది. మొదట వచ్చిన 100 మంది కస్టమర్ల కోసం ప్రత్యేక బహుమతులు కూడా ప్రకటించింది. ఇంకేముంది.. జనాలు షాపు చుట్టూ గుమిగూడారు. వారిని ఆపడం అక్కడి సెక్యూరిటీ వల్ల కూడా కావడం లేదు.

కథ
ఇంతలో ఆ షాపు యజమాని కూతురు జెస్సికా (నెల్‌ వర్లఖ్‌) తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో అక్కడికి వస్తుంది. ఆమె ప్రియుడు కొత్త ఫోన్‌ తీసుకోవాలంటూ దర్జాగా షాపులోకి వెళ్తాడు. ఇది చూసిన జనాలు ఆగ్రహానికి లోనవుతారు. వారిని ఎందుకు లోనికి వెళ్లనిచ్చారు? మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అని మండిపడ్డారు. ఇంతలో జనం సునామీలా ముందుకు వచ్చారు. స్టోర్‌ తలుపు తెరిచేవరకు ఆగకుండా దూసుకొచ్చేయడంతో తొక్కిసలాట జరిగింది. పలువురూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో బ్లాక్‌ ఫ్రైడే విషాదంగా మారిపోయింది. 

సరిగ్గా ఏడాదికి..
అయితే దీన్ని హీరోయిన్‌ బాయ్‌ఫ్రెండ్‌ లైవ్‌లో వీడియో తీడయంతో అది వైరల్‌గా మారుతుంది. ఏడాది తర్వాత మరోసారి అదే స్టోర్‌లో బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ పెట్టాలని షాపు యజమాని డిసైడ్‌ అవుతాడు. అంతలోనే గతేడాది విషాదానికి కారణమైన ఒక్కొక్కరూ అత్యంత దారుణంగా చనిపోతారు. ఈ హత్యల వెనుక ఉన్నదెవరు? ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో అందరూ చనిపోయారా? ఎవరైనా ప్రాణాలతో బతికి బట్టకట్టారా? మళ్లీ బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌ జరిగాయా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఆ సీన్‌ హైలైట్‌
సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే బ్లాక్‌ ఫ్రైడే సేల్స్‌.. ఎంత విధ్వంసంగా మారిందో చూపించారు. ఆ దారుణాన్ని చూస్తున్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. సినిమా మొత్తంలో ఈ సీనే హైలైట్‌గా ఉంటుంది. తర్వాత విలన్‌ చేసే హత్యలు కొన్ని కామెడీగా ఉంటే, మరికొన్ని సీరియస్‌గా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. సెకండాఫ్‌లో అదుర్స్‌ అని చెప్పుకునేలా ఏ సన్నివేశమూ ఉండదు. కిల్లర్‌ నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరన్న ఉత్సుకత మాత్రం మనలో కలగక మానదు.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌
ఎలి రోత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాట్రిక్‌ డింప్సే, జీనా జెర్షన్‌, టై ఒల్సన్‌, నెల్‌ వెర్లాక్‌.. తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎలి రోత్‌తో పాటు జెఫ్‌ రెండల్‌  డైలాగ్స్‌ రాశాడు. జనాలకు షాపింగ్‌, ఆఫర్స్‌ మీద ఉన్న పిచ్చిని.. అలాగే సోషల్‌ మీడియాలో వైరలవ్వాలన్న తాపత్రయాన్ని సినిమాలో సెటైరికల్‌గా చూపించారు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా చూపించారు. మిస్టరీ థ్రిల్లర్స్‌ సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో అందుబాటులో ఉంది.

 

చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement