అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు | Anant Ambani Gifts Luxury Watches To His Bollywood Celebrities Friends Ranveer, Shah Rukh Etc, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Anant Ambani Marriage: అంబానీల పెళ్లి.. వాళ్లకు బహుమతిగా కోట్ల రూపాయల వాచీలు

Published Sun, Jul 14 2024 8:12 AM | Last Updated on Sun, Jul 14 2024 10:48 AM

Anant Ambani Gifts Luxury Watches His Friends Ranveer Singh Etc

అంబానీల ఇంట్లో పెళ్లి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు అన్నట్లు ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఏదో ఓ పేరుతో ఫంక్షన్ నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమైన పెళ్లి వేడుక కూడా జరిపించారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్, టీమిండియా క్రికెటర్లతో పాటు ప్రధానమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రులు వరకు చాలామంది హాజరై, హాట్ టాపిక్ అయిపోయారు. ఇదంతా పక్కనబెడితే అనంత్.. తన స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)

ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లి వేడుక కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే అనంత్‌కి బాలీవుడ్‌లో బోలెడంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు వీళ్లకే తన పెళ్లి సందర్భంగా అనంత్ అంబానీ ఖరీదైన వాచీలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

లగ్జరీ వాచీలకు పెట్టింది పేరైన 'అడెమార్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ పెర్పుట్యల్ కాలండెర్' అనే వాచీనీ అనంత్ బహుమతులుగా ఇచ్చాడు. మార్కెట్‌లో ఒక్క వాచీ ధర రూ.2 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. వీటితో షారుక్, రణ్‍‌వీర్ పోజులిచ్చిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో స్పెషల్ ఎట్రాక్షన్ వీళ్లదే.. పిక్ అదిరిపోయింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement