పెరిగిపోతున్న మద్దతు.. కమలా హారిస్‌ సరికొత్త రికార్డ్‌లు | Kamala Harris fundraiser breaks Zoom record, raises over $2 million | Sakshi
Sakshi News home page

పెరిగిపోతున్న మద్దతు.. కమలా హారిస్‌ సరికొత్త రికార్డ్‌లు

Published Fri, Jul 26 2024 1:09 PM | Last Updated on Fri, Jul 26 2024 3:21 PM

Kamala Harris fundraiser breaks Zoom record, raises over $2 million

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్‌ కమలా హారిస్‌ దూసుకుపోతున్నారు. అన్నీ వర్గాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నవారి గెలుపు ఓటములపై పలు సంస్థలు ప్రీపోల్‌ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేల్లో కమలా హారిస్‌కు అనుకూలంగా 44 పాయింట్ల లభించగా.. డొనాల్డ్‌ ట్రంప్‌కు 42 పాయింట్లు లభించాయి.

ఈ తరుణంలో కమలా హారిస్‌ అధ్యక్ష ఎన్నికల కోసం ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ‘వైట్‌ ఉమెన్‌: ఆన్సర్‌ ది కాల్‌’ పేరిట ఆన్‌లైన్‌లో జూమ్‌ మీటింగ్‌ వేదికగా జరిగిన 90 నిమిషాల ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌లో సుమారు 2 మిలియన్‌ డాలర్లు..భారత కరెన్సీలో 16.48 కోట్లను నిధులు సమకూరినట్లు తెలుస్తోంది.

ఒక లక్షా 64 వేల మంది పాల్గొన్న ఆ జూమ్‌ మీటింగ్‌లో యూజర్ల తాకిడికి అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు ఔత్సాహికులు యూట్యూబ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించేందుకు వెళ్లారు. స్ట్రీమింగ్‌లో పింక్, కొన్నీ బ్రిటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం.

 ఈ జూమ్‌ మీటింగ్‌ ఉద్దేశ్యం అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు నిర్వహించినట్లు కమలా హారిస్‌ ప్రతినిధులు వెల్లడించారు. 

ఈ సందర్భంగా జూమ్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఎరిన్ గల్లఘర్ మాట్లాడుతూ..నేను జోక్‌ చేయడం లేదు. కమలా నిర్వహించిన లైవ్‌ స్ట్రీమ్‌కి యూజర్ల తాకిడి ఎక్కువై.. లైవ్‌ స్ట్రీమ్‌లో అంతరాయం ఏర్పడింది. మీరే అర్ధం చేసుకోండి కమలా హారిస్‌కు ఏ స్థాయిలో అమెరికన్ల నుంచి మద్దతు లభిస్తుందోనని అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement