వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డెమోక్రటికల్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారం రిపబ్లిక్ పార్టీదే అని చెప్పుకొచ్చారు.
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పోటీ చేస్తే ప్రచారానికి నిధులు నిలిపివేస్తామని డెమోక్రటిక్ పార్టీ దాతలు బెదిరించడంతో కమలా హారీస్ రంగంలోకి దిగారు. తాజాగా ఆమె నిధుల సేకరణ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలా హారీస్.. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలవబోతుందన్నారు. బైడెన్ తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికా ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే, ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా.. తొమ్మిది మంది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్‌ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కమలా హారీస్‌లో పోటీలో ఉండాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీసే కరెక్ట్ పోటీదారు అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో, ట్రంపే గెలుస్తారనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment